Comments on: మానవీయ భాష నేటి అవసరం

By: సంధ్య
భూమిక సంపాదకులు సత్యవతి గారికి,

ఆగస్ట్ 6వ తారీకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో వరవరరావు గారి సి.డి ల ఆవిష్కరణ సభలో పాడిన ఒక పాట గురించి మీరు స్పందించిన తీరును భూమికలో చదివిన.

సభ ప్రారంభంలోనే ‘అమ్మా తెలంగాణమా! ఆకలి కేకల గానమా!’ అని ఒక మిత్రుడు పాట ఎత్తుకునే వరకు ఆ పాట పాడుతడని మాకు తెలియదు. వరవరరావు గారి సి.డి లోని పాట పాడుతడని కోరస్ ఇవ్వడానికి వేదికనెక్కినం. పాడే పాటని మధ్యలో ఆపలేం కాబట్టి మీరు చెప్పిన అభ్యంతరకర మాటలను మేము ఉచ్ఛరించలేదు. స్త్రీలను కించపరిచే పదాలను వాడడం నాకూ అభ్యంతరమే.

మీరు నన్ను ఈ పాట ఎవరిది అని అడిగితే గద్దర్ పాట అని చెప్పడం జరిగింది. మీరు రచయిత ప్రస్తావన అయినా లేకుండా పాడినవారి మీద, విన్నవారి మీద విమర్శ చేయడం న్యాయంగా అనిపించలేదు. పాట పాడిన మిత్రుడికి ఆ పాటలోని పదాలని మార్చుకొని పాడమని చెప్పడం జరిగింది.

By: CheLa
మీ సంపాదకీయం చదివిన తర్వాత రాసినవారికి లేకున్నా పాడేవాళ్లకి, వినేవాళ్లకి లేదా అని అనిపించింది. అయితే మనం ఇంకా పితృస్వామ్య, భూస్వామ్య వ్యవస్థలోనే ఉన్నాం. చైనాలో భావజాల మార్పుకే సాంస్కృతిక విప్లవం కొనసాగిందని మీకు వేరే చెప్పనక్కర్లేదు.

By: వరవరరావు
ఆగస్ట్ 6న హైదరాబదులో నా ప్రత్యేక తెలంగాణ పాటల సి.డి లు (పాలపిట్టల పాటలు, తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట) విడుదల సందర్భంగా పాడిన ఒక పాట గురించి భూమికలో సంపాదక వ్యాఖ్య చదివిన.

ఆ పాట పాడిన సమయంలో నేను సభలో లేను. చుండూరు అమరుల స్మారక సభలో పాల్గొనడానికి ప్రెస్ క్లబ్ కు వెళ్లిన. సంపాదక వ్యాఖ్య చదివిన పాఠకులు ఆ పాట నా పాటల సి.డి లో ఉన్నదని భావించే అవకాశం ఉంది. అది నా పాట కాదని సంపాదకులకు తెలుసు. “చివరి దాకా సమావేశంలో వుండి పాటలన్నింటిని వినాలని కూర్చున్న నేను, ఆ ఒక్క పాట అవ్వగానే లేచి హాలు బయటకి వచ్చేసాను” అంటే ఆ ఒక్క పాట నేను రాసినదని పాఠకులకు అపోహ కలిగించడమే కదా! తెలిసి కూడా అది నా పాట అని పాఠకులు భావించే విధంగా అస్పష్టంగా వ్రాయడం అభ్యంతరకరం. ఆ రోజు సి.డి ల విడుదల సభకు విమల రాలేదు.

స్త్రీని ఆకాశంలో సగంగా గుర్తించి గౌరవించడం నేను మొదట నగ్జల్బరీ రాజకీయాలతోనే నేర్చుకున్నాను. అయినా 1978లో నా కవితా సంకలనం ‘స్వేచ్ఛ’ లో ఒక అభ్యంతరకర మాట వాడినపుడు రంగనాయకమ్మ గారు ‘ప్రజాసాహితి’లో సమీక్షిస్తూ నా తప్పును గుర్తింపజేసింరు. నేను ‘సృజన’ ముఖంగా అప్పుడే క్షమాపణ చెప్పుకున్నాను.

తెలంగాణ అస్థిత్వ ఉద్యమమైనా, స్త్రీవాద అస్థిత్వ ఉద్యమమైనా, మరే అస్థిత్వ ఉద్యమాలైనా, విప్లవోద్యమమైనా ఉమ్మడిగా ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించి ప్రజాస్వామ్య సంస్కృతిని పెంపొందించి కృషి చేయాలని భావించే వారిలో నేను ఒకన్ని.

By: Seela SubhadraDevi
సత్యవతి గారు

మీ సంపాదకీయం చాలా బాగుంది.అందరూ ఆలొచించాల్సిన విషయం.

By: satyanarayana Tirunagiri
భూమిక సంపాదకులకు,

ఈ పాట రాసింది గద్దర్. పైగా చాల రోజుల్నించీ ఈ పాట ప్రచారం లో ఉన్నది. ఈ పాట ఒక సి. డీ లో వచ్చింది కూడానూ. ఈ విషయం గద్దర్

కు తెలియజేసే ప్రయత్నం జరిగిందా? జరగక పోతే వెంటనే జరగాలని నా మనవి. ఇటువంటి పోలికలు, అభ్యంతరకరమైన భాష ఉన్న

పాటలు వాటిని రాసిన రచయితల దృష్టికి తీసుకు వచ్చి ఆయా రచయితలచే ఇవి ఎందుకు అభ్యంతరకరమో గుర్తింపజేసే

ప్రయత్నం జరగాలి.  వారిచే తమ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయించాలి.  నాకు తెలిసి ఒక పాట గద్దర్ లాంటి పేరున్న కవి

రాసినప్పుడు అందులో ఇటువంటి అంశాలేవైనా ఉంటే వెంటనే ఆయన దృష్టికి తీసుకు రావడం జరగదు. అది మొహమాటం వల్లనో,

లేదా ఆయనకున్న పేరు చూసి జంకడం వల్లనో లేదా ఆయన సరిదిద్దుకోడేమో అన్న అపనమ్మకం వల్లనో జరగొచ్చు. ఆయన పాటలు

పాడే వాళ్ళు కూడా ఇటువంటి విషయాల పట్ల అంత సీరియస్ నెస్ చూపకపోవడం కలదు. కాబట్టి ఇటువంటి స్త్రీలను కించపరిచే భాషా

సాంస్కృతిక అంశాలు పాటల్లో కానీ, సాహిత్యంలో కానీ కనబడితే ముందుగా ఆ రచయితల (వాళ్ళు అందుబాటులోనే ఉన్నారు

గనక ) దృష్టికి - వారెంత పేరున్న వారైనా సరే - తీసుకువచ్చి మార్పించే ప్రయత్నం మార్పించే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి.

తర్వాత వాటిని పాడే  వారి దృష్టికి తీసుకు వచ్చి పాడకుండా ఆపే ప్రయత్నం చేయాలి.  ఈ ప్రయత్నం సమిష్టిగా జరగాలని నా అభిప్రాయం.

అంతే గానీ ఒక వేదిక మీద నుండి ఈ పాట పాడడం జరిగింది కాబట్టి ఆ వేదిక పైనున్న వాళ్ళందరికీ  అవగాహన లేదనో, లేదా స్త్రీల పట్ల

మొత్తంగా విప్లవ శిబిరం లో ఉన్న వారికి గౌరవం లేదనో వారింకా స్త్రీలను అవమాన పరిచే భాషను వదులుకోలేకపోతున్నారనో అనుకోవడం

సరి అయింది కాదేమో!