పుస్తక సమీక్షలు

“నాలోని స్తీ” కవితా సమీక్ష

భూమిక జూన్ 2007

- ఆర్‌.శాంతసుందరి

ఎలా చెప్పనమ్మా
మనిద్దరికీ ఇక అక్కడ చోటే లేదని!
మనసులో గాని ఇంట్లోగాని
మన జ్ఞాపకాలేవీ లేవనీ!
పూర్తిగా చదవండి »

రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

వి. ప్రతిమ ఫిబ్రవరి 2007

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో విస్తరించడానికీ, వేరుచుకొనడానికీ చేసిన పోరాటం, ఆ క్రమంలో సాహిత్యంలో వివిధ కోణాలనుండి బహుముఖీనంగా… పూర్తిగా చదవండి »

కరుణ కాదు - కర్తవ్యం ముఖ్యం

భూమిక ఫిబ్రవరి 2007

-డా. మానేపల్లి

స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి - భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. అంత జరిగినా సంకల్ప బలంతో, పట్టుదలతో కృషి - తనవంటి వికలాంగుల కోసం ఒక సంస్థ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తుండటం చాలా అరుదయిన విషయం. పూర్తిగా చదవండి »

ఇప్పుడు వీస్తోన్న పైరుగాలి “పుప్పొడి”

ఎస్. జయ జనవరి 2007

రచయిత్రులం మా గోదావరి ప్రయాణం ముగించుకొని, ‘గోదావరి’ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరుతుండగా సుజాత పట్వారి “పుప్పొడి”ని నా చేతికిచ్చింది. పుప్పొడిలాగే కనిపించిన పుస్తకాన్ని ఉషోదయం చల్లగాలికి ఎక్కడ రాలిపోతుందోనని సుతారంగా పట్టుకొని పేజీలు తిప్పుతూ కవితా శీర్షికలు చదివాను. పూర్తిగా చదవండి »

వాస్తవ చిత్రీకరణకు అద్దం పట్టిన నవల ‘తూర్పుగాలి’

డా|| ముక్తేవి భారతి నవంబర్ 2006

తూర్పుగాలి పీలుస్తూ, ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడిపేవారంతా, ఏదో కారణంతో పడమటిగాలి ప్రేరణకి లొంగిపోయినా, అంతరంగ తరంగంలో మాత్రం తూర్పుగాలి స్పర్శ పోగొట్టుకున్న వెలితిని అనుభవిస్తూనే వుంటారనే సత్యాన్ని భార్గవీరావ్ గారు కళ్ళకు కట్టించిన నవల ‘తూర్పుగాలి’.

తల్లితండ్రులందరి భావంలోనూ, అమెరికాలో ఇంజనీరుకి అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తే, ఆ అమ్మాయీ గొప్ప అదృష్టవంతురాలు, తామూ అదృష్టవంతులమే అనీ! - ఇది ఒక ఇంటి ఆలోచన కాదు. ఇంటింటి ఆలోచన. పూర్తిగా చదవండి »

‘‘ఎంతకీ తెగని ఏర్లు…’’

వి. ప్రతిమ నవంబర్ 2006

ఎంతోకాలంగా కవిత్వం వ్రాస్తూ అనేక పుస్తకాలను ప్రచురించి తెలుగు కవితా జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్న అనిశెట్టి రజిత కథలు కూడా వ్రాయడం అభినందించదగిన విషయం…

రజితకు సాహిత్యమూ, జీవితమూ వేరు వేరు కావు… పూర్తిగా చదవండి »

« Prev -