భూమిక మే 2007
- డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను స్త్రీవాదంతో పూర్తిగా ఒకతరం స్త్రీలను ప్రభావితం చేసిన గ్లోరియా స్టీనమ్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఢిల్లీకి కూడా వచ్చారు. ఇక్కడ కొన్ని సంస్థలను, వారి ద్వారా జరిగే పనులను కూడా చూశారు. మురికివాడల్లో స్త్రీలతో ముఖాముఖీ మాట్లాడారు.
ఇండియన్ ఉమెన్స్ ప్రెస్కోర్లో మహిళా జర్నలిస్టులతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలు చర్చించారు. స్త్రీలతో కొనసాగించే వ్యాపారాన్ని నిరసిస్తూ, ‘’బానిసలకాలంలో ఉన్నదానికంటే ఎక్కువగా ప్రపంచంలో మనుషుల వ్యాపారం జరుగుతోంద'’ని అన్నారు. న్యూయార్క్‌లో ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా ఏ చట్టాలూ లేవన్నారు. వ్యభిచారంలో ఉన్నవారిని ‘’సెక్స్ వర్కర్స్'’ అంటూ గ్లామరైజ్ చేస్తూ అదేదో మంచిపని అన్నభావన కల్పిస్తున్నారన్నారు. ‘’గర్భనిరోధక పద్ధతులు, కండోమ్లు అంటూ ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చు పెడ్తోంది. అదే డబ్బుతో వీరికి విద్య, వృత్తి శిక్షణ కల్పిస్తే ఇటువంటి పరిస్థితేరాదు.'’
పూర్తిగా చదవండి »
భూమిక మే 2007
- బంగార్రాజు
నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది వింటుంటే నాకు దిమ్మ తిరిగినట్టయింది. ఒక స్త్రీ తన రోజు వారీ జీవితంలో ఎన్ని రకరకాలైన హింసల్ని భరిస్తోందో వివరంగా అందులో వుంది. పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు)
ఓల్గా విమెన్స్ వరల్డ్ (ఇండియా)
మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు.
ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, దేశ బహిష్కారాలు, బెదిరింపులవంటి బహిరంగ నిషేధాలను ఎదుర్కునేవారు కొందరైతే, కుటుంబం, సమాజం, ప్రచురణరంగాలు సాహిత్య పీఠాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధించే నిషేధాలకు గురవుతున్నవారు మరి కొందరు.
పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- మంజుల
భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు. పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2007
2006 సంవత్సరానికి సంబంధించి రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట కథానికా పురస్కార సభ 31 డిశంబరు 2006 న నగర కేంద్ర గ్రంధాలయం, చిక్కడపల్లిలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ,చలమేశ్వర్ పురస్కారాల ప్రదానం చేసారు. పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2007
- నాయని కృష్ణకుమారి
చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి. పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2007
భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది. పూర్తిగా చదవండి »