కథలు

పట్టపగటి చీకటి

భూమిక ఆగస్టు 2007

- ఓల్గా

పరిశుభ్రమైన నీటి మడుగులో చిక్కగా చేరుతున్న కల్మశం, కుంచించుకుపోతున్న నీళ్ళు - విస్తరిస్తున్న మురికి చేస్తున్న విజయహాసం. మడుగు చుట్టూ చేరిన వారందరూ ఆ మురికిని చూసి సంతోషిస్తున్నారు.
ఇష్టంగా ఒంటికి రాసుకుంటున్నారు. తనకూ రాయబోతున్నారు.

పూర్తిగా చదవండి »

తొవ్వ

భూమిక ఆగస్టు 2007

జయప్రకాష్ మాటేటి

గాలికి కిటికీలు టపటప కొట్టు కుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న. దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్ఫార్మర్ పేలి కరంట్ పోయింది. దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే.

పూర్తిగా చదవండి »

అదొక చతుర్శాల భవంతి - రోదన కూడ వ్యక్తీకరించలేని స్త్రీ

భూమిక ఆగస్టు 2007

వై. విజయలక్ష్మి

మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా ముగించుకొని ఒక పొడవైన కంచుగ్లాసులో దానిలో 3 వంతులు ఉండేట్లుగా చిక్కని టీ చేసి మావగారికి మంచం దగ్గరికీ తీసుకొని వెళ్ళి అందించాలి ఆ ఇంటి కోడలు. “కోడలు అంటే దానికొక భాష్యం (వివరణ) ఉంది. అందరికంటే ముందులేచి కళాపి చల్లి అందరు నిద్ర లేచేసరికే తలస్నానం పూజాపునస్కారాలు ముగించుకొని ఇతర పనులకు సిద్ధం కావాలి. ఎవరేమన్నా పట్టించుకోరాదు. అభిమానం చంపుకోవాలి. అందరూ తిన్నాకే తినాలి. అత్తగారికి అన్ని సమకూర్చి, వంట చేయాలి. మగవారు, ఇంటిపెద్దలు అందరి భోజనం ముగిశాకే ఇంటికోడలు చివరికి తినాలి.”

పూర్తిగా చదవండి »

ఆవృతం

భూమిక జులై 2007

- శారదా మురళి

చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు. పూర్తిగా చదవండి »

మ…నం?!

భూమిక జులై 2007

- వత్సల

‘బచ్చీని’ చూడాలి…

ఎలాగయినా చూడాలి….. ఎలాగయినా సరే… తనని చూడాలి…. .

తనను చూడకుండా మాత్రం వెళ్ళకూడదు - ఎందుకంటే?… నేను మళ్ళీ ఈ ఊరు వస్తానో? రానో?… పూర్తిగా చదవండి »

లచ్చువమ్మ కత

భూమిక జులై 2007

- వేములపల్లి సత్యవతి

లచ్చువమ్మ కత కణ్వమహర్షి ఆశ్రమంలో పెరిగిన అమాయకపు మునికన్య శకుంతల కథకాదు. హంస రాయబారం నడిపిన రాజకుమారి దమయంతి కథ కాదు. పురూరవుని వెనుకనే అదృశ్యంగా వుండి అతని ముందు ప్రేమలేఖను జారవిడిచిన అప్సరస ఊర్వశి కథలాంటిది కాదు. సలీమ్‌ని ప్రేమించి అక్బర్‌ చక్రవర్తిచేత జీవసమాధి చేయబడిన అనార్కలి కథలాంటిది కూడ కాదు. పూర్తిగా చదవండి »

కంచె

భూమిక జూన్ 2007

- శీలా సుభద్రాదేవి

“నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను.
పూర్తిగా చదవండి »

యాక్సిడెంట్‌

భూమిక జూన్ 2007

అత్తలూరి విజయలక్ష్మి

మంచు కురుస్తొంది… అయినా లోపలికి వెళ్లాలనిపించడంలేదు..

నాగుండెల్లో రగులుతున్న మంట చలిని కాచుకున్నట్టు వెచ్చగానే అనిపిస్తొంది.

జరిగిన సంఘటన తాలూకు షాక్‌ నుంచి నేను బైటపడలేదు.. పడలేను కూడా. ఆ షాక్‌తో నా కాళ్లు చచ్చుబడినట్టు ఐనాయి. సర్వశక్తులు నన్ను అసహించుకుని వదిలేసి వెళ్లినట్టు నిస్సత్తువగా మారిపోయాను..
పూర్తిగా చదవండి »

చెల్లెలు రాసిన కథలకు అన్న చెప్పిన ఆమె కథ

భూమిక జూన్ 2007

- డి. రాజేశ్వరి

కన్నడ కథా సాహిత్యంలో, ప్రత్యేకించి ముస్లిం కథా రచయితలలో శ్రీమతి రజియా, ఎస్‌.జె.బి మెరిసి మాయమై పోయిన గగన తార. ఆమె నిజ జీవితం కూడా కథలాంటిది. కథకంటే ఆమె బతుకు గొప్పది, అంటారు ఆమె రాసిన కథలకు ‘మీతో’ అన్న ముందు మాటను రాసిన ఆమె సోదరుడు శ్రీహనీఫ్‌.
పూర్తిగా చదవండి »

ఊబి

భూమిక జూన్ 2007

- తురగా జానకీరాణి

చిత్ర పరుగెత్తుతోంది. భుజాన పుస్తకాల సంచీ బరువుగా ఉంది. వగరుస్తూ పరుగెడు తోంది. ‘అమ్మో, టీచరు చంపేస్తుంది? అనుకుంటోంది. అల్లా పరుగెత్తి రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగింది. అది వూరికి చివర. రైలు ఆగివుంది. మెట్లు ఎత్తుగా వున్నాయి రైలు పెట్టెకి. ఐనా, సంచీ గట్టిగా పట్టుకొని ఎక్కేసింది. ఎంతో కష్టమైంది. అయాసం వచ్చింది. ఆ తలుపుమూల నక్కి కూచుంది. రైలు కదిలింది. పూర్తిగా చదవండి »

దోపిడీ

భూమిక మే 2007

- టి. సంపత్ కుమార్

‘’ఏంటీ?… ఈ సంబంధంకూడా క్యాన్సలయ్యిందా?…'’ ఆదుర్దాగా, ఆశ్చర్యంగా అడిగాను.

ఆఫీసునుండి వస్తూనే నేను మొదట చేసేపని నా బ్రీఫ్కేస్ని స్టడీరూములో దానికి కేటాయించిన చోటపెట్టి, కారు తాళం చేతుల్ని కీబోర్డుకి తగిలించి, డ్రాయింగ్ రూములో ఉన్న సోఫాలో కూచోని నెమ్మదిగా షూస్ విప్పి ర్యాక్లో పెడతాను. ఆరోజువచ్చిన పోస్టును ఓసారి గమనిస్తాను. విషయం ప్రాముఖ్యతని బట్టి కొన్నింటిని విప్పిచూస్తాను. ఆ తరువాత బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని లుంగీ-అంగీలోకి మారేలోపల మా ఆవిడ నేను పొద్దున ఆఫీసు వెళ్ళివచ్చాక-అంటే సమారుగా పదుకొండుగంటల్లో జరిగిన విషయాలన్నింటిని క్లుప్తంగా ‘ఆన్’ చేస్తుంది. అవి కొత్త సినిమాల రిలీజుకు ముందు ఊహించే సీనుల మాదిరిగా ఉంటాయి. ఒక్కొక్కసారి వార్తల ముందటి మఖ్యాంశాల మాదిరిగానో ఉంటాయి. పూర్తిగా చదవండి »

పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర

కొండేపూడి నిర్మల మే 2007

- కొండేపూడి నిర్మల

‘’మొగుడు'’ కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….'’ అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం వుండదన్నారు. అబ్బాయి అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. మేడ మీదికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఇంకా కొనసాగించడం కోసం మొబైలు నంబరు అడిగి తీసుకున్నాడు. మిత్రులకి చూపించడం కోసం ఫోటో సి.డి. అడిగి పుచ్చుకున్నాడు. హమ్మయ్య! మన రాజీ ఒక ఇంటిదయిపోతోంది. అనుకుని అయిన వాళ్ళంతా ఆనందబాష్పాలు కార్చారు.
పూర్తిగా చదవండి »

పునరుజ్జీవనం

భూమిక ఏప్రిల్ 2007

- చల్లపల్లి స్వరూపరాణి

సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్‌ ఎక్కింది. పూర్తిగా చదవండి »

చిలుక జోస్యం

భూమిక ఏప్రిల్ 2007

- ఎల్‌. మల్లిక్‌

(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)

పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?

పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!
పూర్తిగా చదవండి »

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

భూమిక ఏప్రిల్ 2007

- పంతం సుజాత

ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.

మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
పూర్తిగా చదవండి »

సన్నజీవాల సణుగుడు

భూమిక ఏప్రిల్ 2007

- దీప్తి

సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్‌ చూస్తోంది.

ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ మాటలు చెవులోంచి మెదడుకు చేరుతున్నాయి.
పూర్తిగా చదవండి »

« Prev - Next »