భూమిక ఏప్రిల్ 2007
- చల్లపల్లి స్వరూపరాణి
సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్ ఎక్కింది. పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
- ఎల్. మల్లిక్
(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)
పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?
పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
- పంతం సుజాత
ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.
మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
- దీప్తి
సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్ చూస్తోంది.
ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ మాటలు చెవులోంచి మెదడుకు చేరుతున్నాయి.
పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- నంబూరి పరిపూర్ణ
బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు.
అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే.
తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు. పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి)
“అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది.
“ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది. పూర్తిగా చదవండి »
భూమిక ఫిబ్రవరి 2007
-డి.విజయకుమారి
(భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది. పూర్తిగా చదవండి »
కొండవీటి సత్యవతి ఫిబ్రవరి 2007
గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక కూడా అలాగే వున్నాయి.
పూర్తిగా చదవండి »
భూమిక ఫిబ్రవరి 2007
-కరుణ
నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో టైపు కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడు ఖాళీగా వున్నానూ అంటే నా కాలివేళ్లూ, చేతివేళ్లూ నాకు తెలియకుండానే ‘ఎ, ఎస్,డి,ఎఫ్’లను కొడుతుండేవి. ‘నాకు’ అంటే ‘ఎన్ ఏ ఏ కె యు’ అని ఇలా ఏ పదం గుర్తొస్తే (అది తెలుగైనా, ఇంగ్లీషైనా) ఆ పదాన్ని నా కాలి, చేతి వేళ్లు టైపు చేస్తున్నట్టుగా కదిలేవి. పూర్తిగా చదవండి »
భూమిక ఫిబ్రవరి 2007
-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు)
మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది.
ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం మంద్ర స్థాయిలో వినిపిస్తోంది. పూర్తిగా చదవండి »
రేణుక అయోల జనవరి 2007
(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ)
టైము ఉదయం ఏడు గంటలు అవుతున్నా, నిద్రపట్టక మంచంమీదే దొర్లుతున్నాను. పనిమనిషి వచ్చేదాక ఇదే కాలక్షేపం. భాస్కర్ ఊర్లో లేడు, పనిమీద బెంగుళూరు వెళ్ళాడు. భాస్కర్ ఉంటే ఇలా బద్ధకంగా పడుకోనిచ్చేవాడు కాదు, యోగ చెయ్యని, లేక నడవమనీ, నావంటిని నేను సరిగ్గా పట్టించుకోవటం లేదనీ సాగిపోతూనే ఉంటుంది. పూర్తిగా చదవండి »
భూమిక డిసంబర్ 2006
- మమత, (ఏక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం - మాధురి.కె
మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ. మా నాన్నగారు వ్యవసాయ కూలి, మా అమ్మ గృహిణి, ఒక అక్క. నాకు 10 సంవత్సరాల వయసులో మా అమ్మ గుండెజబ్బుతో మరణించింది. నన్ను, మా అక్కని పాఠశాల్లోంచి తీసేసి, ఇంటిపని మొదలుపెట్టించారు. కొన్ని సంవత్సరాల తరువాత నేను పెద్ద మనిషినయ్యాను. నాకు 15 సంవత్సరాలొచ్చేసరికి మా పక్క గ్రామంలో ఒకతనితో నా వివాహం జరిగింది.
పూర్తిగా చదవండి »
ఖాదర్ నవంబర్ 2006
యవ్వనంలో వున్న ఆ తల్లి తన జీవిత పధం మీద తన తొలిపాదం మోపింది.
‘‘ఈ దారి చాలా సుదీర్ఘమైందా?’’ అడిగింది. గైడ్ ఇలా అన్నాడు. ‘‘అవును ఈ దారంతా చాలా కష్టతరమైంది. అవతలి వేపు చేరేటప్పటికి నువ్వు ముసలిదానివైపోతావు. అయితే అవతలివేపు ఈ ప్రారంభం కన్నా బావుంటుంది.’’ చిన్నతల్లి సంతోషంగానే వుంది. దీనికన్నా మెరుగైందేదో వుందంటే ఆమె నమ్మలేదు. ఈ సంవత్సరాలే ఆమెకు బావున్నాయి. పూర్తిగా చదవండి »