మే, 2007 సంచిక

పెదవుల తాకిడి

భూమిక మే 2007

- బి. బాలాదేవి

సింధూరపు ఎరుపూ
నీలాకాశాన్నావరించిన నీలమూ
ఎరగ్రులాబీ ఎరుపు దనమూ
పచ్చని ఆకుల పచ్చదనమూ
నీ పెదవుల తాకిడిని గుర్తుకు తెస్తాయి నాలో!
పూర్తిగా చదవండి »

విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

భూమిక మే 2007

- అబ్బూరి ఛాయాదేవి

డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి జరిగింది. సీతాదేవి గారు 60ల నాటికే పేరు పొందిన రచయిత్రి. కథలూ, నవలలూ రాయడంతో పాటు ఆమెకి నాటక రంగంలో కూడా అభిరుచి ఉండేది. హైదరాబాద్లో 1959లో నాట్య విద్యాలయ స్థాపన జరిగిన కొంతకాలం తరువాత సీతాదేవిగారు నాట్య విద్యాలయంలో శిక్షణ పొందటానికి చేరారు. ఆ విధంగా నాట్య విద్యాలయం డైరెక్టర్గా ఉన్న అబ్బూరి రామకృష్ణరావుగారికి శిష్యురాలయారు. మా మరిది అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం అయింది. ‘కన్యాశుల్కం’, ‘మృచ్ఛకటిక’ నాటకాలను ప్రదర్శించడానికి నాట్య విద్యాలయ బృందం ఢిల్లీకి వచ్చినప్పుడు, వారితో పాటు సీతాదేవిగారు కూడా వచ్చారు. అప్పుడు నాకు ఆమెతో ముఖ పరిచయం మాత్రమే. ఆమె రచనలు చదివే అవకాశం కూడా నాకు అప్పట్లో కలగలేదు.
పూర్తిగా చదవండి »

హైదరాబాదీ సంస్కృతికి అద్దం పడతాయి

భూమిక మే 2007

- వారణాసి నాగలక్ష్మి

డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. అది అక్షర శక్తి. అక్షయమైన ఊహాశక్తి. ఏ భావాన్నైనా మనోరంజకంగా, వినూత్నంగా చెప్పగలిగేలా అక్షరాలను పదసమూహాలుగా కూర్చగలిగే శక్తి! పూర్తిగా చదవండి »

శభాష్! ఫరా అజీజ్

భూమిక మే 2007

- వేములపల్లి సత్యవతి

ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో నడిచి క్లాసులకు వెళ్లేది. ఒకరోజు మోటార్బైక్ మీద వెళుతున్న యిద్దరు యువకులు నడిచి వెడుతున్న ఫరాదుపట్టా (ఓణీలాంటిది)ను లాగివేశారు. దానికి ఫరా అవమానభారంతో కుతకుత లాడింది. ఆ సంగతిని విధ్యార్థి సంఘానికి ఫిర్యాదుచేసింది. ఆ సంఘంవారు ఆ దురాగతాన్ని ఖండించకపోగా, ‘’నీకు తగిన శాస్తి బాగానే జరిగిందని'’ ఎగతాళి చేశారట. పూర్తిగా చదవండి »

స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు

భూమిక మే 2007

- శివలక్ష్మి

2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ‘’యాత్ర'’ చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు సినిమాలచొప్పున నాలుగు ధియేటర్లలో ఒకే టైముకి ప్రదర్శించారు. సినిమా ప్రేమికులు తమ సమయాన్ని ఎంతగా మానేజ్ చేసుకుని ఇటూ అటూ ఎంత హడావిడి పడి పరుగులు పెట్టినప్పటికీ కొన్ని మంచి సినిమాలను మిస్కాక తప్పలేదు. మొత్తానికి సినీప్రియులందరికీ ఇష్టమైన స్నేహితులతో కలిసి సినిమా చూడడం గొప్ప అనుభూతి నిచ్చింది.
పూర్తిగా చదవండి »

కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

భూమిక మే 2007

- ఇంటర్వ్యూ: శాంతసుందరి

హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ

ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా?
సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో ఎమ్.ఏ. చదువుకున్న మొదటి ఆడపిల్లని. మొదట్నించీ (మంచి మార్కులు తెచ్చుకుంటూ) చదువులో ఫస్ట్గా ఉంటూ (ఉండటం గమనించి) డిగ్రీలో యూనియర్శిటీ టాపర్గా వచ్చిన నన్ను ఎమ్.ఏ. చదివించాలని పోట్లాడి సాధించిన వ్యక్తి మా అమ్మ. మా అమ్మ లాహోర్లోనే పుట్టి పెరిగింది. సాహిత్యరత్న పట్టం పుచ్చుకుంది (అది ఈనాటి ఎమ్.ఏ.తో సమానం) కవిత్వం రాసేది (కానీ ఎక్కడా ప్రచురించలేదు-అలాంటి పరిస్థితులు ఆకాలంలో లేవు)
పూర్తిగా చదవండి »

రచయిత/రచయిత్రులకు విజ్ఞప్తి

భూమిక మే 2007

కొంతమంది రచయిత్రులు, పాఠకులు అర్ధం కాని చేతిరాతతో తమ రచనలు, ఉత్తరాలు పంపుతున్నారు. దీనివల్ల తప్పులు దొర్లడమే కాక టైపు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచి తమ రచనలనుగాని, ప్రతిస్పందన శీర్షికకు పంపే ఉత్తరాలు, స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా కాగితానికి ఒక వైపునే రాసి పంపించాల్సిందిగా కోరుతున్నాం.

పూర్తిగా చదవండి »

వాల్‌మార్ట్ - కొన్ని వాస్తవాలు !

భూమిక మే 2007

- డా. చైతన్య

వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు.

  • Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. 2001లో అమెరికా Poverty guidelines ప్రకారం ముగ్గురు సభ్యులున్న కుటుంబానికి $14,630 సంవత్సర ఆదాయం దారిద్ర రేఖగా పరిగణించబడింది. అంటే Walmart లో పనిచేసే ఎక్కువ శాతం ఉద్యోగులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇక సంఖ్యలో సేల్స్ అసోసియేట్స్ తర్వాత వచ్చే కాషియర్ల సంవత్సర ఆదాయం 2003 wage analysis ప్రకారం $11,948 మాత్రమే.
  • పూర్తిగా చదవండి »

‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు

భూమిక మే 2007

- డా. సుహాసిని

M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది.

1937లో ఈ క్లబ్ని P.V.G. రాజుగారి తల్లిగారు (అశోక గజపతిరాజ్గారి నాయనమ్మ గారు) స్థాపించారు. అప్పటి ఎస్టేట్ కలెక్టర్ సత్యనాధన్ గారి తల్లిగారు సెక్రటరీగా ఉండేవారట.
పూర్తిగా చదవండి »

చేనేత కార్మికులుగా మారిన బాలికలు

భూమిక మే 2007

- యస్.వి. శివరంజని, పరిశోధనా సహాయకురాలు

చేనేత విజ్ఞాన విధాన కేంద్రం (చిప్)
పధ్నాలుగు సంవత్సరాలు నిండని వారిని ‘’బాలలు'’ అంటారు. ఈ వయసులో పనిచేస్తున్న వారిని బాలకార్మికులంటారు. సాధారణంగా బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీ పనుల్లో మెకానిక్ పనుల్లో, హోటళ్లలో, బట్టల షాపుల్లో, వ్యవసాయ కూలీలలో కనిపిస్తారు. చేనేతరంగంలో బాలకార్మికులు (బాలికలు) ఉన్నారు.

ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలా? ఊర్లేలాలా?’ అనే ఒక నానుడి సాంప్రదాయపరంగా పెద్దల్లో నాటుకుంది. విద్య, వైద్య, న్యాయ అన్ని రంగాల్లోను మహిళలు తమకు ధీటులేదంటూ ప్రతిభను చాటుతుంటే, ఆడపిల్ల అంటే కేవలం ఇంటిపనికే పరిమితం కావాలి. సాంప్రదాయ కట్టుబాట్లకు విలువ ఇవ్వాలంటూ, చదువుకు దూరం చేసి పనిలో చేర్పిస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రుల్లో మారని వైఖరే కారణమని చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి »

విరబూయని జీవితాలు-విసిరేసిన మందారాలు

భూమిక మే 2007

- డా. కె. పద్మ, ఎన్. అలివేలుమంగ

ఆడపిల్లే ఇంటికి వెలుగు-వీధిబాలికల జీవితాలలో వెన్నెల విరబూయిద్దాం

కాజీపేట్ రైల్వేజంక్షన్లో ఉదయం 8.30 ని||కు కృష్ణా ఎక్స్ప్రెస్ భాగ్యనగరం నుండి వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణీకులతోపాటు కొంతమంది బాలికలు చేతిలో వేరుశెనగకాయలు అమ్మే బుట్టలతో రైలు నుండి గుంపుగా క్రిందికి దిగి నడిచివస్తున్నారు.

వీరంతా ఎవరు? ఎటువైపు వెళ్తున్నారు? ఏమి చేస్తారు? గమనించాలి అనే ఆసక్తి మాకు పెరిగింది. మెల్లగా రైలుకూతవేస్తూ కదిలి వెళ్ళిపోయిన తరువాత వారిదగ్గరకు వెళ్ళి వారి పేర్లు అడిగి తెలుసుకొన్నాము. రమణి, రజిత, సరిత, అమ్మణ్ణి అనే పేర్లు గల నలుగురు బాలికల (వీధిపిల్లలు)ను అనుసరించి వారిని సంభాషణలోకి దింపి అనేక విషయాలను తెలుసుకొన్నాము. పూర్తిగా చదవండి »

ఈ హిపోకస్రీని వదిలేద్దాం

భూమిక మే 2007

- బంగార్రాజు

నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది వింటుంటే నాకు దిమ్మ తిరిగినట్టయింది. ఒక స్త్రీ తన రోజు వారీ జీవితంలో ఎన్ని రకరకాలైన హింసల్ని భరిస్తోందో వివరంగా అందులో వుంది. పూర్తిగా చదవండి »

« Prev -