భూమిక
బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భార్గవి రావ్
		<dc:creator>భూమిక</dc:creator>
		<category>సంపాదకీయం</category>
		<description><![CDATA[వారం రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. అండమాన్‌యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్‌.
ఈ సారి మన ట్రిప్‌ అండ మాన్‌కి వెయ్యి’ అంటూ ఎంతో అభి మానంగా  మాట్లాడతూండగానే ఆవిడకు విపరీతంగా దగ్గొచ్చింది. నాకు చాలా భయమేసి ఫోన్‌ కట్‌ చేసేసాను. మళ్ళీ చెయ్యాలంటే కూడా భయమన్పించింది. ఇబ్బంది పెడతానేమో! అనే బెరుకుతో [...]]]></description>
ఎడిటర్ కి ఉత్తరాలు
		<dc:creator>భూమిక</dc:creator>
		<category>ఎడిటర్ కి ఉత్తరాలు</category>
		<description><![CDATA[జోలెపాలెం మంగమ్మ, మదనపల్లి
భూమిక మే సంచిక అందింది. ఎప్పటిలాగే ఎవరెవరు ఏమేమి రాశారని పత్రిక అందుకోగానే విహంగ వీక్షణం చేశాను.
కొమ్మూరి పద్మావతిగారి పేరు ఆకర్షించింది. ఎందుకంటే వారి అమ్మాయి ఉషారాణి భాటియా, మేమంతా ఢిల్లీలో చాలా సంవత్సరాలు ఒకే చోట నివశించాం. ‘పెద్దమ్మ’ కథను నాకు నేను అన్వయించుకున్నాను. పెద్దమ్మకు సాయాప్యం కనబడింది. మా చెల్లెలి పిల్లలు, తమ్ముని పిల్లలు వాళ్ళ అమ్మను ‘అమ్మ’ అని పిలుస్తారు. నన్ను అంటే పెద్దమ్మను ‘మమ్మీ’ అంటారు. ఇప్పుడు వారి [...]]]></description>
నిర్వాసితత్వం -స్త్రీలపై రాజ్యహింస
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[యం.రత్నమాల
(నిర్వాసితత్వం - స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌, మరియు కలకత్తా రిసెర్చ్‌ గ్రూప్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేసిన ప్రసంగ పాఠం.)
నిర్వాసితులు అవుతున్న ప్రజల గురించి అయినా, నిర్వాసిత ప్రాంతాల గురించి అయినా మాట్లాడాలి అంటే - ముందు వలసల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వలసలకు, నిర్వాసితత్వంకు చాలా సంబంధం వుంది. ప్రజలు ఒకచోట నిర్వాసితులు అయినపుడు మరోచోటుకు వలస వెళ్తుంటారు. ఒక ప్రాంతాన్ని [...]]]></description>
కొండవీటి సత్యవతికి జాతీయ మీడియా అవార్డు
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[డా. జె. భాగ్యలక్ష్మి
భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతికి ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటు మీడియాలో ‘జాతీయ అవార్డు’ లభించింది.
భూమిక సంపాదకురాలు, భూమిక సంపాదకవర్గం, భూమిక పాఠకులు ఆ మాటకొస్తే తెలుగు ప్రజలు గర్వించదగిన విషయమిది, మాములుగా అభినందించి పండుగలా జరుపుకోవటానికి ఇది ఏదో ఒక అవార్డు కాదు. ఇది దేశం హర్షించే విషయం. ఆధునిక సమాజపు తీరుతెన్నులు తెలిసిన వారెవరయినా తీవ్రంగా ఆలోచించదగ్గ విషయం. అంతర్జాతీయంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం. ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలన్నీ ఏదో [...]]]></description>
రేపటి ప్రశ్న
		<dc:creator>భూమిక</dc:creator>
		<category>కథలు</category>
		<description><![CDATA[వారణాసి నాగలక్ష్మి
రాజారాం ఈ మాత్రం సంతోషంగా ఉండి ఎన్నాళ్ళైందో.  రిటైరయినప్పటి నుంచి జీవితం చాలా నిరాసక్తంగా అయిపోయిందతనికి.
ఉద్యోగంలో  ఉన్న న్నాళ్ళూ రిటైరవగానే చెయ్యాల్సిన పనుల గురించి ప్రణాళికలు వేసేవాడు!  చివరికి ఎదురుచూసిన సమయం వచ్చేసరికి జీవితమే తల్లక్రిందులైనట్టనిపిస్తోంది.  జానకిలో ఎందుకింత మార్పు వచ్చింది?  ఎప్పుడు గతం తవ్వుకుంటూ, దుఃఖ పడుతూ, ఆవేశపడుతూ అనారోగ్యం కొనితెచ్చు కుంటోంది.  కష్టాలెవరికి లేవు?
‘అందరికీ ఉంటాయి.  కానీ కోరి కష్టాలెవరు కొనితెచ్చుకోరు.  మీరలా చేసి మనింటికి అరిష్టాన్ని తెచ్చారు’ అంటుంది.  ఉద్రేకపడి బి.పి., [...]]]></description>
హర్‌ కదమ్‌ పర్‌
		<dc:creator>భూమిక</dc:creator>
		<category>కవితలు</category>
		<description><![CDATA[అనిశెట్టి రజిత
ఎప్పుడైతే నేను ఆడపిల్లనన్న
భావన నాకు కలిగించారో.
క్రమక్రమంగా నాలోకి నేను
కుంచించుకపోవడం ప్రారంభమయింది.
మెలకువలో నిద్రలో స్వప్నాల్లో
నాపై అఘాయిత్యమేదో జరగబోతుందని
అత్యాచారం జరుగుతున్నట్లుగానో
అంతులేని అవమానాలు అమానుషమైన
గుర్తులు తేలినట్లుగా కంపించిపోతుంటాను
మృగాల నడుమ లేడిపిల్లలా
ఒక ఆడపిల్లను…
నేను రోజూ మరణించి
మళ్లీ బలిపశువుగా జన్మిస్తున్నట్లుగా
నాకీ ఆడబతుకెందుకనిపిస్తుంది
మొదట ఏడ్చాను గింజుకున్నాను
ప్రతిఘటించాను ఎలుగెత్తి అరిచాను
గొంతెత్తి నినదించాను
న్యాయం కావాలని సమానత్వం రావాలని
విసిగి విసిగి మళ్లీ మూగనై
ముడుచుకపోయాను నెత్తురు ముద్దలా…
ఎంతకాలం గడిచినా
ఈ పరిస్థితి మారదని
స్త్రీజాతికి శాంతి అందని సుఖమని
తెలిసిన తరవాత నన్ను తొలుచుకుంటూ
నా మనస్థితిని కమ్ముకుంటూ
ఒక్కటే ఆలోచన! ఒక్కటే భావన!
ఒక్కటే మార్గం! ఒక్కటే [...]]]></description>
ఇవాల్టి అవసరం భగత్‌సింగ్
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[వి. ప్రతిమ
భగత్‌సింగ్ అంటే ఒక ఉత్సాహం
భగత్‌సింగ్ అంటే ఒక ఉత్తేజం
భగత్‌సింగ్ అంటే ఒక ఉద్వేగం
కులం, మతం, ప్రాంతం, భాష అన్న భేదం లేకుండా మొత్తం భరతఖండమంతా ప్రశంసించే గొప్ప వీరుడు, నిరుపమాన యెధుడు భగత్‌సింగ్…
అసలు భగత్‌సింగ్ రాజకీయ జీవితాన్నీ, అకుంఠిత దీక్షనీ, నిబద్ధతనీ, కార్యాచరణనీ మనం నిశితంగా పరిశీలించినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది… ఇటువంటి వ్యక్తి నిజంగా జీవించాడా లేక ఒక కాల్పనిక కథానాయకుడా అని విస్తుపోతాం మనం.
దేశమాత దాస్యశృంఖలాలు త్రెంచడం కోసం గుండెలెదురొడ్డి నిలబడ్డ సాహసి [...]]]></description>
యాలీస్‌ వాకర్‌
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[పి. సత్యవతి
దాదాపు పదిహేను సంవత్స రాల కిందట వసంతలక్ష్మి నాకు ‘’కలర్‌ పర్పుల్‌'’ అనే నవలని నేను అడక్కుండానే ఇచ్చి ‘’చదవండి బావుంటుంది'’ అని చాలా మామూలుగా చెప్పారు.
అప్పటికి ఆ పుస్తకానికి పులిట్జర్‌ బహుమతి వచ్చిందని తెలుసుకానీ అది నాకు దొరకలేదు. కలర్‌ పర్పుల్‌ చదివాక నాకు ఆఫ్రికన్‌, అమెరికన్‌ రచయిత్రుల మీద ప్రేమ కలిగి పెరిగింది. యాలీస్‌ వాకర్‌ తరువాత నేను అంతగా ప్రేమించిన మరో రచయిత్రి టోనీ మారిసన్‌. ఆమె వ్రాసిన బిలవ్డ్‌. నాకు [...]]]></description>
భూమిక హెల్ప్‌లైన్‌ -2వ సం. సమీక్షా సమావేశం
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[హిమజ
భూమిక ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది - ఎల్లుండి ఏప్రిల్‌ 19న భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు వుంది రమ్మని.  పోయిన సంవత్సరం వెళ్ళడానికి కుదరలేదు.  ఈసారి వస్తాననే చెప్పాను.
19 ఏప్రిల్‌ ఉదయం తొమ్మిది గంటలకల్లా భూమిక ఆఫీసుకి రచయిత్రులు, భూమికని అభిమానించే రైటర్స్‌ కానివారు అందరూ చేరుకున్నారు.  ఒక పెద్ద బస్సే మాట్లాడారు భూమిక బృందం - తొమ్మిదిన్నరకల్లా బస్సు కదిలింది.  ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి రిసార్ట్స్‌లో మీటింగు.  హబ్సిగూడాలో, ఉప్పల్‌లో మరికొంత మంది ఎక్కారు.  బస్సు [...]]]></description>
తెలంగాణా బతుకు చెలమలో చలనశీలత్వపు తండ్లాటే ఆమె కవిత్వం
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[డా. శిలాలోలిత
తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.
 గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.
 ఒక మంచి కవిత్వాన్ని చదివిన అనుభూతిని, ఒక జీవన సారాన్ని, పరివేదనను అనుభవించిన స్థితిని ఏకకాలంలో కలిగించింది.
చాలాకాలంనుంచి ‘కొలిపాక శోభారాణి’ కవిత్వతీరం వెంట ప్రయణిస్తున్న బాటసారే. ఈ ‘చలనం’ అనే కవిత్వ సంపుటి కూడా 2004 లోనే వచ్చింది. మానేరు తీర ప్రభావం, సిరిసిల్లా రాజకీయనుభావం, కరీంనగర్‌ ప్రజల కడగండ్లు, వలసవాదం, పేదరికాల మధ్య బతుకులనీడుస్తున్న మట్టి బతుకుల చిత్రాలు, [...]]]></description>
స్వేచ్ఛాగీతిక-షాజహానా ‘నఖాబ్‌’ కవిత
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[ముంగర జాషువ  
స్త్రీ ఒక అలంకార వస్తువు
పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం
పిల్లల్ని కనే యంత్రం
స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం
లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.
- ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్‌’ కవిత ఒక అక్షరాస్త్రం.
 పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, షాజహానా కవితలు.  అటువంటి కొన్ని కవితలను పరామర్శించడమే యీ వ్యాసోద్దేశ్యము.
సమాజం వైరుధ్యాల కూడలి.  భిన్న సంస్కృతులు ఇక్కడ సంఘర్షించుకుంటున్నాయి.  మతాలు, మతాచారాలు మనుషుల మధ్య గోడల్ని కట్టడంలో నిపుణత్వం సాధించి, [...]]]></description>
సవాళ్ళను ఎదుర్కొంటున్నా అడుగు ముందుకే!
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనర్‌ మండలం నేరేడుగావ్‌ గ్రామంలో 30 మంది సభ్యులతో ఎల్లమ్మ మహిళా సంఘం 1996లో ఏర్పడింది.
 షెడ్యల్డు కులాలు, వెనకబడిన తరగతులు (కురువ) మరియు ముస్లిం స్త్రీలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.
 బాలకార్మికులు, ఆడపిల్లల చదువు, స్త్రీల ఆరోగ్యం వంటి అంశాలపైన పనిచేయుటకు సంఘం వారు మొదటి నుండి ఉత్సాహం కనబరిచారు. గ్రామానికి ఎ.ఎన్‌.ఎం సక్రమంగా వచ్చేవిధంగా మరియు అక్షరాస్యతా నైపుణ్యాలను పొందుటకుగాను పెద్దవారి చదువు కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు.
ఎల్లమ్మ మహిళా సంఘంలో ఎల్లలింగమ్మ సభ్యురాలిగా [...]]]></description>
‘’మిస్సింగ్…'’
		<dc:creator>కొండవీటి  సత్యవతి</dc:creator>
		<category>సంపాదకీయం</category>
2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్‌. అంటే వందకోట్లు.
ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది  పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్‌ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.
చైనా ప్రపంచం మొత్తం మీద అత్యధిక జనాభా కల్గిన దేశంగా మొదటి స్థానం దక్కించుకుంది. మన దేశంలో 1991-2001 మధ్యకాలంలో జనాభా 21.34% పెరిగింది. అయితే విషాదమేమిటంటే ఈ పెరుగుదల అనేది ఆడపిల్లలకు సంబంధించి దిగజారడం. అంటే దేశంలో  ఛైల్డ్‌ సెక్స్‌ రేషియో [...]]]></description>
లాడ్లీ (గారాలపట్టి) మీడియా అవార్డ్‌
		<dc:creator>భూమిక</dc:creator>
		<description><![CDATA[యునైటెడ్‌ నేషన్స్‌ పాఫ్యులేషన్‌ ఫండ్‌, ముంబైలో పనిచేసే పాప్యులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన లాడ్లీ (గారాలపట్టి) మీడియా అవార్డ్‌ ఫర్‌ జండర్‌ సెన్సిటివిటీ 2007 ఫర్‌ సదరన్‌ రీజియన్‌ అవార్డును భూమిక సంపాదకురాలు అందుకొన్నారు.
‘’సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌'’ (ఆడ పిల్లల్ని రక్షించండి) కార్యక్రమంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, కర్నా టక, కేరళ, పుదు చ్చేరిల్లో జండర్‌ సెన్సిటివీ తో కథనాలు రాస్తున్న జర్నలిస్ట్‌ లకు ఈ అవార్డును ప్రక [...]]]></description>
అండమాన్‌ -ఓ మహా ఆకర్షణ
		<dc:creator>కొండవీటి  సత్యవతి</dc:creator>
		<description><![CDATA[అండమాన్‌ దీవుల ప్రయాణం గురించి రాద్దామనుకున్నపుడుడల్లా ఏవో పనుల హడావుడి అడ్డం పడుతూనే వుంది.
 జీవితం ఎంత వేగవంతమైపోయిందో! అనుభవాలు వ్యక్తీకరించకుండానే ఒక దానిమీద ఒకటి పేరుకుపోతున్నాయి.
అండమాన్‌ వెళ్ళి వచ్చిన తరువాత జైపూర్‌ కూడా వెళ్ళాను. అయినా అండమాన్‌ సందర్శనానుభవాలు ఇంకా అలా ఫ్రెష్‌గా గుండెల్లో వుండిపోయాయి. రాయమనే పోరు లోపల జరుగుతూనే వుంది. ఆ అనుభవాలను మిత్రులతో పంచుకోవాలని నాకు చాలా అన్పిస్తోంది. అందుకే రాయడానికి కూర్చున్నాను.
అండమాన్‌  ఒక గాయం. సునామీ మిగిల్చి వెళ్ళిన గాయం గురించి [...]]]></description>
ప్రతిస్పందన
		<dc:creator>భూమిక</dc:creator>
		<category>ప్రతిస్పందన</category>
		<description><![CDATA[ఏప్రిల్‌ సంచికలో అన్ని కథలు హృదయాన్ని కుదిపేవిగా వున్నవి.
వాటిలో నాకు కనిపించింది వినిపించింది స్త్రీ వాదమూ కాదు, దళిత వాదమూ కాదు. నేను చదువుకొన్నవాడిని కాదు గదా!..మానవతా వాదము.అన్నింటినీ మించిన వాదము.
    దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌లో వుండిన అకుంఠిత కార్యదీక్ష నాకు ముక్తా జోడియాలోన ప్రకాశిస్తున్నది. వారి పాదధూళి నావంటివారికి శిరోధార్యము. మీకు, భూమికకు నా ఆశీస్సులు. ఆ కధల రచయిత్రులకు అభినందనలు.
విఏకె.రంగారావు, మద్రాస్‌
అమ్మా! మార్చి 2008 పత్రికలో మీ ఆవేదనను చదివినంక..మనస్సంతా కలి…కలి అయితుండగా..ఇది రాస్తున్నాను. నా [...]]]></description>