-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: పుస్తక సమీక్షలు
భావచిత్రాల భోషాణం – ‘జొన్నకంకి’ -చక్రవర్తి వేనంక
మనుషులనీ, మనుగడలనీ లోతుగా అధ్యయనం చేస్తూ… వస్తువుల ఆత్మల్నీ వాస్తవాల గమ్యాల్నీ కూలంకషంగా తెలుసుకున్న వారే ఆయా భావాలని అందమైన కవితా వాక్యాలతో అలంకరించగలరు. తమదైన విలక్షణ శైలి ప్రదర్శించి వారి కవిత్వ లోకంలోకి తీసుకెళ్ళి అలరించగలరు. అట్టి అనుభూతికి సాక్షీభూతంగా చెప్పదగినది ”జొన్నకంకి”.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
గణన పాత్ర మీ గణిక – చందనాల సుమిత్రాదేవి
ఇందులోని కథలన్నీ దాదాపు వాస్తవిక సంఘటనల ఆధార ఇతివృత్తాలతో రచింపబడ్డప్పటికీ రచయిత్రి భండారు విజయ గారు ఈ కథనంలో ఎక్కడా వినిపించరు, కనిపించరు. కానీ, ఆ వాస్తవ ఘటనల తాలూకు గాఢతను, ముద్రలను మనపై వేస్తూ భారమైన, ఛిద్రమైన, వేదనాభరితమైన మన హృదయాలపై తాను ఎంచుకొన్న లక్ష్యాలను ఆవిష్కరింపచేస్తూ అప్రతిహతంగా విజయ పథంలో సాగిపోతూ ఉంటారు. … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
Whither Ganga? (గంగ ఎక్కడికెళ్తోంది?) – ఉమా నూతక్కి
పదిహేనేళ్ళ ఒక అమ్మాయి ఒకరోజు కాలేజి నుంచి ఇంటికి వస్తూ వర్షంలో చిక్కుకుపోతుంది. బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ఆమెకు కారులో వెళ్తున్న ఒక యువకుడు లిఫ్ట్ ఇస్తాడు. ఆధునికమైన ఆ కార్‌ని, అందులో హంగులను విభ్రాంతిగా చూస్తున్న ఆమెపై అందులోంచి తేరుకోకముందే అఘాయిత్యం జరుగుతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి భోరుమంటుంది. కానీ కాసేపే… … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఆరో ఆడపిల్ల – ఉమా నూతక్కి
చిన్న పుస్తకం. చాలా చిన్న కథ. సమాజంలో పురుషాధిక్యత ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో చెప్పే కథ. కానీ చదివాక మామూలుగా ఉండదు. పిల్లలు లేని శంకర్ రామన్ గుడి ప్రాంగణంలో దొరికిన పాపను తెచ్చుకుని ”కాదంబరి” అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటాడు. పూల వ్యాపారి అయిన శంకర్ రామన్ దగ్గర ఇంకో అయిదుగురు … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
విరాట్ -ఉమా నూతక్కి
మనిషిగా పుట్టాక.. వివేకం నేర్చాక అడుగడుగునా సమస్యలన్నవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. మరి సమస్య ఎదురయినప్పుడల్లా పారిపోతే ఏమవుతుంది. ఏమవుతుందో చదివితే ఒక్కసారి మనసు జలదరిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అలా పారిపోయిన వ్యక్తి కథ ఉన్న పుస్తకం గురించే.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఒక అచ్చమైన అన్వరీయం – రొంపిచెర్ల భార్గవి
ఇది ఒక అచ్చమైన అన్వరీయం. పసుపు పచ్చగా కాంతులీనే ‘అనగనగా ఒక చిత్రకారుడు’ అనే ఈ పుస్తకం నా చేతిలో పడి పదిహేను రోజులకు పైనే అయింది. ఫేస్‌బుక్‌లో చాలావరకూ చదివిన వ్యాసాలే అయినా పుస్తకంగా చూసినపుడు కలిగే అనుభూతి వేరు. అదే అక్షరానికున్న అధికారత.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
కతలొకటే… మన వెతలొకటే – ఎస్.రాజ్యలక్ష్మి
ఈ మధ్య ఆవిష్కరించిన ”మీ టూ” కథల సంకలనం చదివాక నా వంతు అభిప్రాయం రాయాలనిపించింది. స్త్రీలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు ఎన్నాళ్ళ నుంచో సాగుతున్నాయి. వారు అవన్నీ మౌనంగా భరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే, నాకు అవమానం జరిగింది, నా
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
తథాగతుని అడుగుజాడలు – ఒక పరిచయం – రామవరపు గణేశ్వరరావు
బుద్ధుడు తనకు తాను ‘తథాగతుడు’ అని సంబోధిస్తాడు. తథాగతుడు అంటే ఆది, అంతం లేనివాడని అర్థం. అభయముద్రతో ధ్యానముద్రలో చెట్టు కింద కూర్చున్న బుద్ధుడి బొమ్మ ఎవరికైనా గుర్తుకొస్తుంది. చరిత్ర పాఠాలలో క్రీ.పూ.563లో గౌతమబుద్ధుడు జన్మించాడని, యజ్ఞయాగాదులు, యుద్ధాల వల్ల జరుగుతున్న హింసను నివారించడానికి బౌద్ధ మతాన్ని,
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
Beloved -ఉమా నూతక్కి
కన్నబిడ్డ సమాధి రాయి మీద ”Beloved” అన్న ఏడు అక్షరాల పదాన్ని చెక్కడానికి, పది నిమిషాల పాటు స్మశానంలోనే తన మానాన్ని ఖరీదు చేసుకున్న అమ్మ కథని ఎప్పుడైనా చదివారా?
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
Tuesday’s with Morrie – ఉమా నూతక్కి
“Death ends a life, not a relationship. All the love you created is still there. All the memories are still there. You live on in the hearts of everyone you have touched and nurtured while you were here.” Morrie … … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మానవి – నవలా సమీక్ష -శ్రీలత అలువాల
భారతదేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే అంశం కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు అని మాత్రమే అనుకుంటారు. కానీ వారి మధ్య ప్రేమ కూడా ఉండాలి. ప్రేమతో కూడిన బంధాలే కుటుంబాలుగా నిలుస్తాయి అని
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
అసమర్ధుని జీవయాత్ర – గోపీచంద్ – ఉమా నూతక్కి
ఆర్జన వేరు… ఆచరణ వేరు. చదువుతో అంతవరకూ సముపార్జించిన జ్ఞానానికి అనుగుణంగా మనసుని సిద్ధపరచకపోతే మనిషి ఏమవుతాడు, ఏ తీరాలకి చేరతాడో…
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
జీవితాదర్శం – ఉమా నూతక్కి
”ఎవరినైనా అడిగి చూడండి మీ జీవితాదర్శం ఏమిటి?” అని, లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క సమాధానం వస్తుంది… మీ మీ సమాధానాలని అలాగే గుర్తుపెట్టుకోండి.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
ఎద ఆరిపోయి, తడిదేరిన చితికిన బతుకులు – శిలాలోలిత
ఆ రోజు… సత్య నా చేతికీ పుస్తకాన్నిచ్చి అద్భుతమైన పుస్తకమోయ్! చదువు. వీలైతే సమీక్ష రాయి అని ఏ క్షణంలో ఇచ్చిందో కానీ, నా వెంటే నడుస్తోందీ పుస్తకం. పల్లె గంపనిండా కతల్ని ఎత్తుకొచ్చింది భారతి. నిజానికివి కతలు కావు.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
పున్నాగ పూలు – ఉమా నూతక్కి
ఈ రోజుల్లో ఒక మంచి పుస్తకం చదవాలంటే బాగా పాతవో లేదా ఇంగ్లీష్ నుండి అనువదించినవో అయి ఉండాలేమో అన్న ఆలోచనని పటాపంచలు చేస్తూ అప్పుడప్పుడూ అచ్చమైన తెలుగు పుస్తకం ఒకటి మన కళ్ళని పరుగులు పెట్టించడం
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
