-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: September 2026
పోటెత్తిన కెరటం – కొండవీటి సత్యవతి
గీతా హరిహరన్ ఇంగ్లీషులో రాసిన “I ష్ట్రaఙవ bవcశీఎవ tష్ట్రవ Tఱdవ” నవలని “పోటెత్తిన కెరటాన్ని” పేరుతో ఓల్గా తెలుగులోకి అనువాదం చేసారు. మలుపు బాల్‌రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నవలలో ‘టైడ’ ఒక శక్తివంతమైన ప్రతీక.
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్ మందార తమపై జరిగిన అత్యాచార ఘటనలను కూడా దళితులు మా సంఘం దృష్టికి తీసుకురావడం మొదలుపెట్టారు. చెర్లపటేల్‌గూడెంలో చిన్న ఎండిపోయిన కుంట… అంటే ప్రభుత్వ ‘శిఖం భూమి’ విషయంలో దళితులకూ భూస్వామికీ మధ్య వివాదం వుంది. భూస్వామ్య వర్గాలు దళితులను కొట్టి వారి గుడిసెలను తగులబెట్టాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
చిన్నారి తల్లి – షేక్ కాశింబి
రామయ్య ఒక రైతు. జానకమ్మ అతని భార్య. వాళ్లకి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. రామయ్యకి కొడుకులంటే వల్లమాలిన ప్రేమ. వారిని తలచుకుని మురిసిపోతూ ఎన్నో కలలు కనేవాడు.
Posted in కథలు
Leave a comment
జెన్ జీ అమ్మాయిల నిరసన: సంఘ పరివార్ ప్రతీకార స్పందన – ఎ. సునీత
జంతర్ మంతర్ నిరసనలు దేశ రాజకీయాలని కుదిపాయి. దీర్ఘ కాలికంగా ఇవి ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేకపోయినా, అనేక విశ్లేషణల్లో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంఘ పరివార్ భావజాల, భౌతిక అధిపత్యానికి దెబ్బ తగిలింది.
Posted in ఇంకు పెన్ను
Leave a comment
బిభా చౌదురి ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్
అణుకేంద్రకంలో ఉండే ‘మెసాన’ (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో ‘హై ఎనర్జీ ఫిజిక్స’ (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
నాశరీరం.. నా ఆరోగ్యం.. నా నిర్ణయం.. – పి. ప్రశాంతి
స్నేహితురాలి కోసం ఎదురు చూస్తూ గత పది నిమిషాల నుండి బస్స్టాప్‌లో నిలబడుంది కావేరీ. ఆ పదినిమిషాల్లో కనీసం పదిసార్లైనా తిట్టుకుని ఉంటుంది వాళ్ళ ఊరి సర్పంచిని, బస్టాప్‌లో కనీసం ఒక్క బెంచీ అయినా వేయించనందుకు. కాళ్ళు గుంజుతున్నాయి, నీరసం ఆవరిస్తోంది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
తెలంగాణా ఉద్యమకారిణి దేవకీదేవి – గిరిజ పైడిమర్రి
ఆమె ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తొలిదశ తెలంగాణ ఉద్యమ కెరటం. ఉద్యమానికి ఊపిరి. సీమాంధ్రుల అరాచకాలను తట్టుకొని నిలబడ్డ ధీరవనిత. ఆ కసితో మలిదశ తెలంగాణా ఉద్యమంలో అరవై ఏళ్ల వయసులో ఇరవ ఏళ్ల యువతరానికి దన్నుగా నిలబడ్డది. ఏ పని చేసినా మమేకమై చేయడం ఆమె నైజం.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
జర్నలిస్టులుగా సత్యాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి – విమల మోర్తల
స్త్రీలుగా మీ స్పేస్‌ను క్లైయిం చేయండి… జెండర్ గ్లాస్ సీలింగ్స్ బద్దలు కొట్టండి సంగీత బరోహ్ 70 ఏళ్ల ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చరిత్రను తిరగరాసిన ప్రసిద్ధ సీనియర్ జర్నలిస్ట్. 2025-26 ఎన్నికల్లో పోటీపడి, వెయ్యికి పైగా ఓట్లతో అధ్యక్షురాలిగా గెలుపొందిన మొట్టమొదటి మహిళా జర్నలిస్ట్, నార్త్ ఈస్ట్ ప్రాంతమైన అస్సాం నుంచి తొలిసారిగా … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
స్వాతంత్య్ర సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ.. – వైర్ తెలుగు టీమ్
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పురుషుల త్యాగాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అయినప్పటికీ, అదే ఉద్యమంలో తమ జీవితాలను అర్పించిన అనేక మంది మహిళల పాత్ర తగినంతగా వెలుగులోకి రాలేదు. అలాంటి మరుగున పడిన మహనీయురాళ్లలో తల్లాప్రగడ విశ్వసుందరమ్మ ఒకరు. వారి వర్ధంతి ఆగస్టు 30.
Posted in వ్యాసాలు
Leave a comment
ఇటుక బట్టీలు, అప్పుల గోడల మధ్య చిక్కుకుపోయిన జీవితాలు – మీనాక్షి అంబేడ్కర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: వై. కృష్ణ జ్యోతి, గుజరాత్‌లోని ఇటుక బట్టీలలో కుటుంబాలన్నీ కలిసి పనిచేస్తాయి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పనిచేసే ఈ మహిళలకు తమ సంపాదనపై ఎటువంటి అధికారం ఉండదు. తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఇటుక బట్టీలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు రజని కురే వయసు కేవలం 12 ఏళ్ళే.
Posted in వ్యాసాలు
Leave a comment
వందేళ్ళ క్రితం, వైశ్యుల్లో సాంఘిక చైతన్యం: ప్రథమ ఆర్యవైశ్య యువజన మహాసభలో దరిశి చెంచయ్య అధ్యక్షోపన్యాసం – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
ఆర్యవైశ్య యువజన సోదరీ సోదర మణులారా! ప్రస్తుతము ప్రపంచమున గొప్ప సంఘర్షణ మేర్పడినది. ధనవంతులతో దరిద్రులకును, బలవంతులతో బలహీనులకును, పాలకులతో పాలితులకును పోరాటమేర్పడినది. ఒక దేశమును మరియొక దేశము, ఒక జాతిని మరియొక జాతి, నమ్ముట లేదు. ప్రజా స్వాతంత్య్రమునకై ప్రభుత్వ విధానములు తారుమారు జేయబడుచున్నవి.
Posted in వ్యాసాలు
Leave a comment
అడవిలోని కథలను ప్రపంచానికి ఎందుకు చెప్పాలి ? – శ్యాంమోహన్
కొండలు దాటుతాం… వాగులు దాటుతాం… మట్టి దారుల్లో నడుస్తాం. మారుమూల గిరిజన తండాలు,గూడేలకు వెళ్తాం. అక్కడి మనుషులను కలుస్తాం. వారి జీవితాలను వింటాం. వారి కష్టాలను చూస్తాం. వారి విజయాలను రికార్డు చేస్తాం.
Posted in వ్యాసాలు
Leave a comment
ఒక మోకాళ్ళ పద్యం – పాటిబండ్ల రజని
చిన్నప్పుడు లెక్కల మాస్టారు మెదడు మోకాల్లో ఉందంటే రోషం వచ్చేది కానీ ఇప్పుడు నా మెదడు అంతా మోకాళ్ళే ఆక్రమించాయి కలుక్ కలుక్కుమంటూ మొలకల మొదలై నా జీవనావరణం అంతా పాకి పందిరేసాయి !!
Posted in కవితలు
Leave a comment
ఆకు చెప్పిన ఆడపిల్ల కథ – రామిశెట్టి కావ్య
చెట్టు ప్రసవ వేదన పడి ఆకుకు జన్మనిచ్చింది… చిగురాకును తొడిగిన ఆ క్షణం చెట్టుకు కొత్త ఉత్సాహం కలిగింది,
Posted in కవితలు
Leave a comment
“ఇకపై నేనూ ర్యాంప్ వాక్ చేస్తా!” – గిరిధర్
నా చుట్టూ ఉన్న ప్రకృతిని వికృత పరిచి, విధ్వంసపు అత్యాచారం చేసి వికటాట్టహాసం చేస్తుంటే.. నేను ర్యాంప్ వాక్ చేస్తా!
Posted in కవితలు
Leave a comment
