భూమికకి అభినందనలు
ప్రియమైన భూమిక సత్యవతిగారు మరియు టీమ్‌కి శుభాకాంక్షలతో అభినందిస్తూ…
1995 నుండి నాకు భూమిక పత్రిక గురించి తెలుసు. అప్పటినుండి నేను, నా కుటుంబ సభ్యులు భూమికతో అనుసంధానమై ఉన్నాము. అదేవిధంగా ూఔARణ సంస్థ సిబ్బంది మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భూమిక పత్రికకు అభిమానులుగానే ఉన్నారు.
భూమిక స్త్రీ వాద పత్రికలో ప్రచురణ అయ్యే కథలు, వ్యాసాలు, కవితలు, పాటలు మొదలైనవి అన్నీ ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా అందరికీ అర్థమైన యాస, భాషలలో ఉండటం వలన ప్రతి ఒక్కరికీ చదవాలి అనే ఆసక్తి కలుగుతుంది. వాస్తవాలకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇష్యూస్ పట్ల వెంటనే స్పందిస్తూ వివిధ కోణాల్లో… అంటే స్త్రీలు, మానవ హక్కులతో కూడిన స్త్రీ వాద దృక్పథంతో చూపించగలగడంలో భూమికకి భూమికే సాటి అనిపిస్తుంది.
అంతేకాకుండా మహిళలు, బాలల గురించి ఉన్న చట్టాల గురించి వ్రాయడం, చిన్న చిన్న పుస్తకాలు తీసుకొని రావడం వలన అందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగించడం ద్వారా ప్రజలు చైతన్యవంతులుగా కావడానికి కృషి చేస్తున్నారు. భూమిక పత్రిక చదవడం ఒక అలవాటుగా మారింది. భూమిక ఎన్జీఓగా మారిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ సంస్థలలో మార్పుల కోసం ప్రయత్నించడం… ముఖ్యంగా పోలీసు డిపార్టుమెంట్ లాంటి వ్యవస్థలకి జెండర్ సెన్సిటివిటీపై అవగాహన కోసం వివిధ స్థాయిలలో ట్రెయినింగ్స్, మీటింగ్స్ ఏర్పాటు చేయడం బాగుంది. సూచన: స్త్రీలు, బాలికల హక్కులు మరియు సాధికారత కోసం కృషి చేస్తున్న సంస్థల గురించి మరియు వారు చేస్తున్న కార్యక్రమాల గురించి భూమిక పత్రికలో ప్రచురించాలి.
30 సంవత్సరాల మీ ఆగని, అలుపెరగని ప్రయాణంలో ూఔARణ కూడా అప్పుడప్పుడూ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. భూమిక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ భూమిక సత్యవతి గారికి మరియు సిబ్బందికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటున్నాను.
షషష ` కోట శివకుమారి,SWARD
-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
