న్యాయదేవత ఆక్రోశం

ములుగు లక్ష్మీమైథిలి
నా కళ్ళకు గంతలు కట్టారు, …..
కానీ…. నా చెవులకు కట్టలేదు…..
భారతావనిలో జరిగే అకృత్యాలను,…..
చూసి న్యాయం చెయ్యలేకపోయినా,…..
విని, విని…. నావీనులు వ్యధచెందినవి…..
అబల మానప్రాణాలు హరించిన,…..
మృగాల వికటాహాసాలు వింటున్నా,…..
కట్నం తేలేని కన్నెలను…..
మంటల్లో మసిచేస్తే, వారి హా హా కారాలు వింటున్నా…..
ప్రేమపేరుతో వంచించిన అతివల ఆర్తనాదాలు,
ప్రేమించలేదని, యాసిడ్‌లతో, కత్తులతో,
ఆకృత్యాలకు బలైన అబలల పొలికేకలు వింటున్నా,…..
విద్యాలయాల్లో కీచక ఉపాధ్యాయులు,
విద్యార్ధులకు చెప్పే కామసూత్రాలు వింటున్నా…..
అతివల ఆక్రోశాలు,
చెత్తకుండీల పాలైన పసికందుల ఆక్రందనలు,
సగటు మనుషుల ఆత్మహత్య ఘోషలు,
ఆడే వయసులో, పూటగడవలేని,
బాల కార్మికుల ఆవేదనలు,
నేరాలు, ఘోరాలు, హింసాకాండలు,
బంద్‌లతో, సమ్మెలతో రాజకీయ చట్రంలో,
నలిగిపోతున్న యువత నినాదాలు,
ఇంకా ఎన్నో మరెన్నో సంఘటనలు,
నామనసును కలిచివేస్తున్నా,…..
నా కన్నీటిపొరలు, నాకళ్ళగంతల,
మాటున నిలిచినవి,
న్యాయానికి….. న్యాయం చెయ్యలేక.

Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చాగంటి తులసి

పి. సత్యవతి
”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు. Continue reading →

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

బాబాని చూపించవా?

అబ్బూరి ఛాయాదేవి
(మరికొన్ని కథలు, వ్యాసాలు)
మద్దాలి సుధాదేవి.
సంకలనం : ఆచార్య ఎం.జి.కె. మూర్తి
సూర్య ప్రచురణలు – హైదరాబాద్‌. 2011/224 పే. వెల : అమూల్యం Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

రొచ్చుల్ని రచ్చ రచ్చ జెయ్యాలె

జూపాక సుభద్ర
నాలుగు రోజులకింద ఒక టీవి ఛానల్‌ వాళ్లు ఫోను జేసి ‘మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు’ అనే అంశం మీద చర్చ వుంది Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎల్లాప్రగడ సీతాకుమారి

అధ్యక్షురాలి ఉపన్యాసం
సోదరీమణులారా!

నేటి యీమహాసభకు నన్నగ్రసనాధిపురాలినిగ నొనరించుట నాస్థితికిమించిన గౌరవమైనది. Continue reading →

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

గీటురాయికి అటూ ఇటూ…

కొండేపూడి నిర్మల
పనిలేని క్షురకుడు పిల్లితలక్షవరం చేశాడనే సామెతలో ఎంత దుర్మార్గమైన అపవాదు వుందో తెలుసా..? Continue reading →

Share
Posted in మృదంగం | Leave a comment

మా పెద్దమ్మ

హిందీమూలం: సూర్యబాల
అనువాదం. ఆర్‌ శాంతసుందరి

మా పెద్దమ్మ చనిపోయి ఇప్పటికి ముఫ్ఫె ఐదేళ్ళు. పోయేటప్పుడు ఆవిడ వయసు ఏ డెబ్భై ఐదో ఎనభైయో ఉండి ఉంటాయనుకుంటా. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అభివృద్ధి వెలుగునీడల్ని ఆనాడే చూపించిన ఆర్‌ఎస్‌రావు

హేమ
అణగారిన వర్గాలకోసం అహర్నిశం పట్టించుకొనేవారు ఒక్కరొక్కరుగా రాలిపోతున్న సందర్భం ఇది. కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, Continue reading →

Share
Posted in ఆమె @ సమానత్వం | Leave a comment

అభివృద్ధి – వెలుగు నీడలు

( ఇటీవల మరణించిన ఆర్‌.ఎస్‌.రావుగారికి భూమిక నివాళి)

ఆర్‌.ఎస్‌.రావు
మా యూనివర్సిటీ పక్కనే  హీరాకుడ్‌ డ్యాము వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్య్రా నంతర భారతదేశంలో Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -27

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అదేం కాదండీ, ఎప్పుడూ పిల్లల్ని వదిలి ఉండలేదు, అందుకే వాళ్ళు దగ్గరలేకపోతే ఆయనకి ఏమీ తోచదు, Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

సమాజంలో స్త్రీ-హోదా ఒక విశ్లేషణ

యం. శ్వేత, ఓ. మాధవి, కె. జగన్‌మోహన్‌
కొన్నితరాలుగా భారత సమాజంలో స్త్రీలకు పురుషులతో సమానమయిన అంతస్తు, హక్కులు లభించడం లేదు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమెరికాలోను మన ఆడపిల్లకి ప్రాణగండమే!

భారత దేశం సరే వెనుకబడిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఆడపిల్లల్ని తల్లిదండ్రులే చంపి పాతేస్తున్నారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 2 Comments

నిర్బంధ వైద్యమందిరం కథ

అబ్బూరి ఛాయాదేవి
సత్యసాయిబాబా నుంచి సామాన్య పౌరుడి వరకూ అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు!
1991లో మా ఆత్మీయ బంధువు – Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

ప్రశ్నిస్తే…..

పూసపాటి రాజ్యలక్ష్మి
తెల్లవారింది. ఎప్పటిలా సూర్యోదయం, చల్లని గాలి, ప్రకృతిలో ఏ మార్పు లేదు, తన పని తాను చేసుకుపోతుంది. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

తురగా జానకీరాణి

పి. సత్యవతి
స్వాతంత్య్రానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీరాణి, గాయని, నర్తకి, వక్త కూడా. Continue reading →

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

చెప్పిన కథలో చెప్పనిదేమిటి..?

కొండేపూడి నిర్మల
అత్తాపూర్‌లో వుండగా మా పక్కవాటాలో ముసలి దంపతులు వుండేవారు. ఆయనకి మధుమేహం, Continue reading →

Share
Posted in మృదంగం | 1 Comment