కృతి (కె. కృష్ణకుమారి)
బీటలు వారిన నేల గుండెను
ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా
నీ మాటలోని మానవీయ స్పర్శ
ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే
వెలుగుదారులు పరిచినట్లయ్యింది
కృతి (కె. కృష్ణకుమారి)
బీటలు వారిన నేల గుండెను
ఆర్తిగా హత్తుకున్న చినుకు చుక్కలా
నీ మాటలోని మానవీయ స్పర్శ
ఆత్మీయంగా నన్ను అల్లుకుంటే
వెలుగుదారులు పరిచినట్లయ్యింది
సరికొండ నరసింహ రాజు
రాలిన ఆకుల గూర్చి
చింతంచదు చెట్టు
రేపటి చిగురుకై
రేయింబవళ్ళు శ్రమిస్తుంది!
మరలి పోయిన అలకై
నీరసించదు సందం!
పోటెత్తే అలలతో
పొంగి పొంగి పొర్లుతుంది!
వేలూరి సుధారాణి
నాలుగేళ్ళనుంచి ప్రేమిస్తున్నానన్నాడని
నాలుగు లక్షలు కట్నం ఇచ్చి కట్టుకున్నాను వాడ్ని
పెళ్ళికి ముందు “సీతాకోకచిలుక “ అన్నవాడు
ఏడాది గడిచేసరికి “గొంగళి” పురుగు అన్నాడు
రాజేశ్వరి దివాకర్ల
కన్నడంలోని సుప్రసిద్ధ ముస్లిం రచయిత్రి శ్రీమతి సారా అబూబక్కర్. ఈమె కథలు, నవల, వ్యాసం, అనువాదం ఇత్యాది అనేక రచనలను కావించారు. వీరికి ఈ నడుమ నంజనగూడు తిరుమలాంబ గారి పేరిట శాశ్వతి మహిళా అధ్యయన కేంద్రం వారిచ్చిన పురస్కారం లభించింది. శ్రీమతి నంజన గూడు తిరుమలాంబ కన్నడంలోని మొట్టమొదటి లేఖకి, సంపాదకురాలు, పుస్తక ముద్రణకర్త. సారా అబూబక్కర్ గారు ఇతర రచనలనెన్ని కావించినా, కథా, నవలా రచయిత్రిగా విశేషమైన ఖ్యాతిని గడించారు. వీరికి సాహిత్య అకాడమీ, అత్తిమబ్బె, అనుపమా, నాడోజు మొదలైన ఘన పురస్కారాలు ఇదివరలో లభించాయి. ఈ ‘శాశ్వతి’ పురస్కారం వీరి కీర్తిని మరింత ఉన్నతం కావించింది.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి,
కాకతీయ విశ్వవిద్యాలయం
నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు భూభాగంనుంచి, 3 శాతం సముద్రం నుంచి, 6 శాతం ఇతరత్రా, నీటివనరుల నుంచి లభిస్తుంది. దేశపురోభివృద్ధికి, ఆర్థిక స్థోమతకు వ్యవసాయమొక్కటే ఆయువుపట్టు లాంటిది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ఏర్పరచుకొన్న అభివృద్ధి ప్రణాళికలోని ప్రధానాంశం.
వై. విజయలక్ష్మి
మా అత్తగారు వారి హయాంలో 40, 50 సం||ల క్రింది విషయాలు, సంఘటనలు చెబుతుంటే మనుషుల్లో ఇలాంటివారు కూడా ఉంటారా! అని అనిపించేది. అదొక చతుర్శాల భవంతి. సనాతనమైన హైందవ సంస్కృతికి ఆచారాలకు ప్రతీక ఆ ఇల్లు. ఉదయం మగవారు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే వారికంటే ముందే లేచి అన్ని పనులు చకచకా ముగించుకొని ఒక పొడవైన కంచుగ్లాసులో దానిలో 3 వంతులు ఉండేట్లుగా చిక్కని టీ చేసి మావగారికి మంచం దగ్గరికీ తీసుకొని వెళ్ళి అందించాలి ఆ ఇంటి కోడలు. “కోడలు అంటే దానికొక భాష్యం (వివరణ) ఉంది. అందరికంటే ముందులేచి కళాపి చల్లి అందరు నిద్ర లేచేసరికే తలస్నానం పూజాపునస్కారాలు ముగించుకొని ఇతర పనులకు సిద్ధం కావాలి. ఎవరేమన్నా పట్టించుకోరాదు. అభిమానం చంపుకోవాలి. అందరూ తిన్నాకే తినాలి. అత్తగారికి అన్ని సమకూర్చి, వంట చేయాలి. మగవారు, ఇంటిపెద్దలు అందరి భోజనం ముగిశాకే ఇంటికోడలు చివరికి తినాలి.”
ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు ఎన్నో విడుదలవుతుంటాయి. ఇంతకు ముందు వాటిని కొనుక్కోవడానికి అందరం పుస్తకాల షాపులకి వెళ్ళేవాళ్ళం. మనకి కావలసిన పుస్తకాలను కొనుక్కునే వాళ్ళం. పుస్తకాల షాపులకెళ్ళడం, ఓ చక్కటి అనుభవం. గంటల తరబడి కాళ్ళు పీకుతున్నా ఒక్కో పుస్తకాన్ని ఎంతో ప్రేమగా తడుముతూ, పేజీలు తిరగేస్తూ పరవశించిన వాళ్ళమే అందరం. క్రమంగా చాలావరకు మనం పుస్తకాల షాపుల సందర్శనానందాన్ని కోల్పోతూ వచ్చాం. వేగవంతమైన జీవిత విధానం, భిన్నమైన పనుల్లో బిజీగా వుండడం, నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్ దీనికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.
సునీతా విలయమ్స్. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం అంటూ సునీత స్ఫూర్తిని గర్వంగా స్వీకరిస్తుంది. Continue reading
జూన్ సంచికలో కల్పనా శర్మ మీద రాసిన సంపాదకీయం చాలా బావుంది. హిందూ పేపర్‌లో ఆమె కాలమ్ నేను రెగ్యులర్‌గా చదువుతాను. ఇక ముందు ఆ కాలమ్ వుండదంటే (తను రిటైర్ అవుతోంది కాబట్టి) బాధగా వుంది. ఆమె గురించి సంపాదకీయం రాసినందుకు అభినందనలు. Continue reading
– డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు గుర్తించి, చర్చించి పరిష్కారమార్గాలు వెతికే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. Continue reading
– సుధా ఆరోరా
అనువాదం: ఆర్.శాంతా సుందరి (హిందీ మూలం)
ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు.
స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది. Continue reading
– తమ్మెర రాధిక
జానకమ్మ జానమ్మ కాబోతోంది. పెండ్లి సూపులైనయి. పిలగాడు నల్లగ బక్కపలచగ ఓ మోస్తరుగా వున్నాడు. ప్యాంటు చొక్కా మీదంగ ఎర్ర తువ్వాల ఏస్కోని వచ్చిండు. పొల్లగాడే! జానకి మేనత్త చిద్రగాళ పైలమ్మ తెచ్చిందీ సంబంధం. ”పిలగాడు ఒక్కడు. ముగ్గురు ఆడిబిల్లలు… పెండ్లీలు గాలె. తల్లి వున్నది. Continue reading
– పోడూరి కృష్ణకుమారి
కళ్యాణమండపం గేటు దగ్గర నిలబడి పూలతో ఏర్పాటైన ఆర్చి, దానిమీద అందంగా తీర్చిన వధూవరుల పేర్లు చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడింది లత. కళాత్మకంగా తీర్చిదిద్దబడి, ఆహూతులతో కళకళలాడి పోతున్న ఆ హాలు అందాలు, సందడి చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది. Continue reading
– కత్తి పద్మారావు
దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా ముద్ర వేయబడ్డారు. Continue reading
– సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద (రీసెర్చ్ స్కాలర్స్)
ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా కుటుంబ యజమానురాలిగా పూర్తి భాద్యతలు స్త్రీలే వహించేవారు. Continue reading
– శారదా మురళి
చిన్నప్పటినుంచీ వినయ్‌కి ఆడవాళ్ళంటే చాలా జాలి. ఆడవాళ్ళ బ్రతుకు చాలా దుర్భరమనీ, వాళ్ళకీ ఏ మాత్రం ఆత్మగౌరవం లేకుండా చేయటమే కుటుంబ వ్యవస్థ ధ్యేయమనీ అతను నమ్మేవాడు. తన తల్లినీ, నానమ్మనీ, ఇంకా అత్తయ్యల్నీ, పిన్నమల్నీ చూసి అతనా అభిప్రాయాని కొచ్చాడు. Continue reading