రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారసభ

2006 సంవత్సరానికి సంబంధించి రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం, విశిష్ట కథానికా పురస్కార సభ 31 డిశంబరు 2006 న నగర కేంద్ర గ్రంధాలయం, చిక్కడపల్లిలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ,చలమేశ్వర్ పురస్కారాల ప్రదానం చేసారు. Continue reading →

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ – ఒక పరిశీలన

– జి.చంద్రమౌళి, కె.రాధిక

నేడు భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలలో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మన సమాజంలో నేటికి బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చుననీ యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాల కార్మిక వ్యవస్థ పుట్టడానికి దోహదం చేస్తున్నాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కథాసదస్సు

– నాయని కృష్ణకుమారి

చాలా రోజుల తర్వాత ఈ మధ్య (13.11.06) ఒక కథా సమ్మేళనానికి హాజరయ్యాను. ‘సఖ్యసాహితి’ నిర్వహించిన ఆ సభకు అధ్యక్షురాలు శ్రీమతి ఆనందా రామంగారు. ప్రారంభకులు శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవిగారు. ఆమె ప్రారంభ వచనాలు కథా హృదయాన్ని ఆవిష్కరించాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు | Leave a comment

కథ, వ్యాసాల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

భూమిక ఆధ్వర్యంలో జరిగిన కథ, వ్యాసాల పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం 18-10.06 వ తేదీన సుందరయ్య కళా నిలయంలో జరిగింది.రచయిత్రి శిలాలోలిత ప్రముఖులను వేదికపైకి ఆహ్వానించారు. భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ “భూమిక విజయవంతంగా నిర్వహంచిన కథ, వ్యాసాల పోటీలలో ఇది రెండవది. Continue reading →

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

కొడవటిగంటి కుటుంబరావు కథలలోని “స్త్రీ పాత్రలు”

– ఎలసాని వేదవతి

ఆధునిక సాహిత్య రచనలో 19 వ శతాబ్దంలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందరో రచయితలు తమ రచనల ద్వారా ఒక నూతన శకాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అటువంటి ఆధునిక సాహిత్య రచయితలలో “కొడవటిగంటి కుటుంబరావు” అగ్రశ్రేణికి చెందినవారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుటుంబహింస నుండి మహిళలకు రక్షణ కల్పించే రక్షణాధికారుల జాబితా

జిల్లా – అధికారి పేరు – ఆఫీసు ఫోన్ నెం. – సెల్ ఫోన్ .నెం
శ్రీకాకుళం – బి. కనకదుర్గ – 08942-221276 – 9440814582
విజయనగరం – ఉషారాణి – 08922-777985 – 9440814584
విశాఖపట్నం – ఎ.ఇ.రాబర్ట్స్ – 0891-2706156 – 9440814575 Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్ ప్రత్యేక సంచిక

మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…

ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, ఆంధ్రదేశాన్ని మరింత అతలాకుతలం చేస్తున్న ఈ సమస్యమీద మేము తెచ్చిన ప్రత్యేక సంచిక మీ చేతుల్లో వుంది.
Continue reading →

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్

ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మగవాడి మనోప్రపంచం

-(హెర్బ్ గోల్డ్‌బర్గ్ ఆంగ్ల వ్యాసం నుంచి కొంతభాగం) అనువాదం: మన్మధరావు

మనిషిగా నాకు కొన్ని అనుభూతులున్నాయి. కానీ వాటిని బైటపెట్టినప్పుడల్లా నా పుట్టుక ప్రశ్నార్థకమైపోతుంది. ఉదాహరణకి నాకు పూలజడంటే యిష్టం. రంగురంగుల గౌన్లంటే యిష్టం. బిడ్డకి పాలిచ్చే అనుభవం యిష్టం. చిన్నప్పుడు మా అమ్మ నాకు కృష్ణుడి జడవేసి మల్లెపూలు చుట్టేది. అక్క గౌను తొడిగి బుగ్గన చుక్కపెట్టి ‘అచ్చం ఆడపిల్లలా వున్నాడమ్మా’ అనేది. మగపిల్లాడెవడూ అంత అందంగా వుండటానికి వీల్లేనట్టు గొంగళి పురుగుకీ, సీతాకోకచిలకకీ ప్రాణం ఒకటే. అమరికలోనే తేడా. మగాడినై పుట్టినందుకు అలంకరణ, ఆకర్షణా లేని ప్రాణిలా వుండటానికి మానసిక సంఘర్షణ చాలా పడ్డాను.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పెళ్ళి చేసేముందు పెద్దలు ఆలోచించాలి

-రమణి

నేను నల్గొండ జిల్లాలో పల్లెటూర్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. ఒక అక్క, నేను ఇద్దరే అమ్మాయిలం. మా ఫాదర్ ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు. మా ఫ్యామిలీ అంతా అక్కడే సెటిల్ అయింది. అంతకుముందు అన్ని స్టేట్స్ తిరిగినాం. మా నాన్న ఎక్కడికి వెళ్ళితే అక్కడికి పోయాం. ఆరు ఏళ్ళనుంచి అక్కడే సెటిల్ అయ్యాం. నాకు 17 ఏళ్ళపుడు ఇంటర్ చేస్తున్నపుడు ఒకతను కాలేజీలో చూసి మా మామయ్యతో వచ్చాడు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదు

-రాజ్యలక్ష్మి

నా పేరు రాజ్యలక్ష్మి, మాది తెనాలి. మాకు అయిదుగురు అన్నయ్యలు. నేను ఒకతినే అమ్మాయిని. చిన్నప్పటినుంచి నన్ను అందరూ బాగా చూసుకున్నారు ఒక్కదాన్ని అని. నాకు 17 ఏళ్ళలో పెళ్ళి చేశారు. పెళ్ళయిన 6 నెలలకు హెచ్ఐవి వుందని తెలిసింది. మా హస్బెండ్‌కి పెళ్ళయిన కొత్తలో బాగా జ్వరం వస్తుంటే అనుమానం వచ్చి హాస్పిటల్‌కి తీసికెళ్ళి టెస్ట్ చేయిస్తే పాజిటివ్ అని వచ్చింది. తర్వాత నేను కూడా చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నూరుశాతం విజయాల్లో నూటొక్క సందేహాలు

సెక్స్ వర్కర్ అనగానే మనకు స్త్రీలే గుర్తొస్తారు. కాబట్టి నీతులు, జాగ్రత్తలు, బాధ్యతలు, మందులు, ఆకస్మిక మరణాలు అన్నీ త్రేతాయుగం నాటి దృక్పధంతోనే నడుస్తాయి.

సెక్స్ అంటే కనీసం ఇద్దరు ఇంకా ఎక్కువమంది పురుషులు భాగస్వాములుగా వుంటారని, రాకెట్ ఆధిపత్యం మొత్తం మెజారిటీ పురుషుల చేతిలోనే వుందని అలవాటుగా మర్చిపోతాం. కాబట్టి రబ్బరు తొడుగులతో సమస్య తీరడం లేదు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పనిలోనే నాకు మనశ్శాంతి

-వరూధిని

నా పేరు వరూధిని, నా వయస్సు 27 సంవత్సరాలు. నేనూ, మా ఆయన (38) హెచ్ఐవితో జీవిస్తున్నాము. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు 4 సంవత్సరాలు, బాబుకు 6 సంవత్సరాలు.

అందరు ఆడవాళ్ళ మాదిరే నాకు పెళ్ళయితే నా భర్త నన్ను చాలా బాగా చూసుకోవాలని అనుకునేదాన్ని. మందు తాగకూడదు, నన్ను కొట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇంటినుండి కట్నం తెమ్మని వేధించకుండా, ఇచ్చిన కట్నంతో సర్దుకుని బాధ్యతగా నడుచుకునే భర్తగా వుండాలి అనుకుని కలలు కనేదాన్ని. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కుప్పకూలిన కలల సౌధం

-అనువాదం – కె.మాధురి

శ్రుతికి మూడు సంవత్సరాలు నిండేసరికి, తరచు జ్వరాలతో, అతిసారంతో ఆస్పత్రి పాలయ్యేది. ఒక్క శ్రుతి అన్న పేరులోని మాధుర్యం తప్ప పిల్ల జీవితంలో ఏమాత్రం సంతోషం లేకుండాపోయింది. ఆమె బయటకి అంటూ వెళ్ళడం జరిగితే అది ఆస్పత్రికే.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి వున్న గర్భిణీ తెలుసుకోవలసినవి

ఉమ్మనీరు సంచి ముందుగానే పగిలిపోతే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ ఎక్కువగా వుంటుంది. తల్లికి గనేరియా, సిఫిలిస్, షాంక్రాయిడ్స్, హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధులు ఉన్నట్లయితే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది.

హెచ్ఐవి తల్లికి చుట్ట, సిగరెట్ తాగే అలవాటు ఉన్నా, మద్యం తీసుకునే అలవాటు ఉన్నా పుట్టే బిడ్డకి హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుంటుంది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సూదులతో పాటు హెచ్ఐవిని పంచుకున్నాను

-ఆనంద్

నా పేరు ఆనంద్. నాకు 22 సంవత్స రాలు. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారిది సొంత వ్యాపారం. అమ్మ మాస్ మీడియాలో పనిచేస్తోంది. ఒక చెల్లెలు. ఇంకా కాలేజీలో వుంది. మాది మద్రాసుకు 400 కి.మీ. దూరంలో వున్న ఒక పట్టణం.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment