మా వాళ్ళే నన్ను సెక్స్ వర్కర్‌ని చేసారు

-శ్రీదేవి

వయస్సు 25 సం. మాది నెల్లూరు జిల్లా. నా చిన్నతనం అంతా లేమితనంతోనూ, సంఘర్షణతోనూ, మా అమ్మపై జరిగే హింస చూస్తూ గడిచింది. నా సవతి తండ్రి ఆమెను చాలా శారీరకంగా బాధపెట్టి, ఆమె సంపాదన అంతా లాక్కునేవాడు. నా తల్లి పనిమనిషిగా పనిచేసేది. నేను ఎప్పుడూ పాఠశాలకి వెళ్ళకుండా ఆమెతోపాటు పనిలోకి వెళ్ళేదాన్ని. నా 12 సంవత్సరాల వయసులో, నా తల్లితండ్రులు నన్ను తెనాలిలోని ఒక ఇంటిలో పనిమనిషిగా పెట్టారు. అది ఒక వేశ్యాగృహం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 5 Comments

పాజిటివ్ జీవితాలు

-కల్పనా జైన్, అనువాదం: సీతారాం

(హెల్త్ జర్నలిజంలో దిట్టగా కల్పనా జైన్ అనేక వార్తా కథనాలను అందించారు. 1994 మహారాష్టల్రో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆమె అందించిన వార్తా కథనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టైమ్ రిసెర్చి పౌండేషన్‌లో, సామాజిక జర్నలిజంలో డిప్లొమా పొందిన తరువాత 1986లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లల్లో ఎయిడ్స్

ఈనాడు ప్రపంచంలో 23 లక్షల మంది పిల్లలు హెచ్ఐవికి గురై వున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులకి తల్లినుండి బిడ్డకు వ్యాధి సంక్రమించడమే కారణం. ఏటా 7 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే తల్లినుంచి ఎయిడ్స్ వ్యాధిని పొందుతున్నారు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కష్టాల్ని కవిత్వంతో అధిగమిస్తాను

-కనకదుర్గ (ఇంటర్‌వ్యూ: కె.సత్యవతి, ప్రసన్న)

నా పేరు కనకదుర్గ. మాది విజయవాడ. కాని ఇక్కడే పుట్టి పెరిగాను. నాకు 1997 లో పెళ్ళయింది. అపుడు నా వయస్సు 19 సంవత్సరాలు. 2000 లో బాబు, డెలివరీ టైములో నేను పాజిటివ్ అని వచ్చింది. బాబుకి టెస్ట్ చేయించాను, కాని రాలేదు. చెస్ట్ హాస్పిటల్‌లో కౌన్సిలర్స్ ఫలానా ఆర్గనైజేషన్ వుంది, అక్కడకు వెళ్ళి చెప్పితే సమస్యలు తీరుస్తారు అంటే మేం అక్కడికి వెళ్ళి చెప్పాం. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తల్లిదండ్రుల నుంచి బిడ్డకు హెచ్ఐవి రాకుండా నిరోధించడం ఎలా?

ఒకానొకప్పుడు తల్లికి హెచ్ఐవి వుంటే బిడ్డకి హెచ్ఐవి సోకకుండా నివారించడం అసాధ్యం అనుకునేవారు. కాని వైద్యశాస్త్ర ప్రగతితో హెచ్ఐవి తల్లినుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమించకుండా నివారంచడం సాధ్యమవుతోంది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నా తప్పుకి నా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు

-సైలేష్

నిజం చెప్పాలంటే నేను ఇదివరకు ఇలా లేను. ఒకవేళ మీరు నా గతంలోకి చూడగలిగితే, ఆరు సంవత్సరాల క్రితం మీరు సైలేష్ అనే ఒక ఆత్మవిశ్వాసం వున్న, చలాకీతనం వుట్టిపడుతున్న ఒక ప్రభుత్వ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువకుణ్ణి చూసివుండేవారు. నేను తిరగడానికి చాలా ఇష్టపడేవాడిని, అదీగాక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకోవడాన్కి సిద్ధంగా వుండేవాణ్ణి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లలకు/ శిశువులకు హెచ్ఐవి వైద్యం అందించే పద్ధతి

భారతదేశంలో మొదటిసారిగా 2000 మంది బాధిత పిల్లలకు వారికోసం తయారు చేయబడ్డ, ప్రాణాన్ని రక్షించే మందుల ప్రవేశం ఇటీవలే జరిగింది.

న్యూఢిల్లీః మొత్తానికి హెచ్ఐవి వాత పడ్డ పిల్లలకి వైద్యాన్ని అందించే పద్ధతి క్రియారూపం దాల్చగా, భారతదేశంలో మొట్టమొదటి సారిగా 15 సంవత్సరాలలోపున్న 2000 మంది పిల్లల హెచ్ఐవి వైరస్ నయం చెయ్యడానికి, ప్రాణరక్షణ మందులు ఇవ్వడం ప్రారంభమైంది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆశ ప్రోగ్రాం మారు మూల గ్రామాల్లోకి చొచ్చుకు పోవాలి

-రాగిణి (ఇంటర్‌వ్యూ: ప్రసన్న)

నా పేరు రాగిణి. మా గ్రామం పచ్చల తాడిపర్రు. మా అమ్మ నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. వారిలో చివరి అమ్మాయిని. పెద్దక్కను 10వ తరగతి వరకు చదివించారు. యింక చదివించలేక ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండవ అమ్మాయిని కూడా ఎక్కువ చదివించలేక కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికే ఇచ్చి పెళ్ళి జరిపించారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఎర్రుపాలెం మండలం(ఖమ్మం) సంపూర్ణ హెచ్.ఐ.వి / ఎయిడ్స్ అవగాహన, చైతన్యయాత్ర ఒక అనుభవం

-సీతారాం

‘ఆశ’ కార్యక్రమం ఉమ్మడి ప్రయత్నానికి ఉద్యమ రూపం’ అని రాష్టమ్రంతటా నినదించింది. గ్రామీణ ఎయిడ్స్ అవగాహనా క్లబ్ సభ్యులు ఈ స్ఫూర్తిని అందుకున్నారు. ఆశలోని sustain అన్న పదానికి ఉదాహరణగా ఎర్రుపాలెం మండలాన్ని నిలపాలని భావించారు. నిజానికి ‘ఆశ’ ఒకరోజుకు, ఒక నెలకో పరిమితమైంది కాదు. క్లబ్ సభ్యులతో ఏం చేద్దాం అనే చర్చ వచ్చినప్పుడు ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో మండలంలో ఏదో ఒక గ్రామంలో ఎప్పుడూ చైతన్య కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యాలి

-వి. రాజేశ్వరి (ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి)

నేను వనితా మహా విద్యాలయలో రీడర్‌గా పనిచేస్తున్నాను. మా కాలేజిలో చదివే పిల్లలకి హెచ్ఐవి గురించి అవగాహన వుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజిలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ వుంది. దీని తరఫున విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో ర్యాలీల్లో పాల్గొంటుంటారు. ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొంటారు. మా కాలేజీలో రెడ్ రిబ్బన్ క్లబ్ వుంది. ఇటీవలే మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంటువాళ్ళు మూడురోజుల ఎగ్జిబిషన్ నిర్వహించి హెచ్ఐవి వైరస్ గురించి తెలియచెప్పారు. పిల్లలంతా ఆ ఎగ్జిబిషన్ చూసారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నేనూ పాజిటివ్‌నే-పాజిటివ్‌ల కోసమే ఈ నెట్‌వర్క్

-స్వప్న

మా నెట్‌వర్క్ 2003 లో మొదలయి,24 మంది సభ్యులతో 2004 లో రిజిస్టర్ అయింది. 2004 నుంచి ఇప్పచిజీవరకు మేము 2500 సభ్యులను చేర్చుకోగలిగాం.

ప్రధానంగా కుటుంబం అంగీకరిస్తేనే సమాజం కూడా పాజిటివ్స్‌ని అంగీకరిస్తుంది. దానివల్ల వాళ్ళకు మంచి జీవితం వుంటుంది. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

గ్రామ సభల్లో హెచ్ఐవి గురించి చర్చించాలి

-ఎన్.గీత (ఎం.ఆర్.ఓ చెన్నారావుపేట)

గ్రామాల్లో ‘ఆశ’ ప్రోగ్రాం వల్ల ఇప్పుడిప్పుడే హెచ్ఐవి గురించి తెలుస్తోంది. అది చాలా తీవ్రమైన వ్యాధి అని వారికి తెలియదు. గ్రామంలో చనిపోయిన వారందరూ తాగడం వల్ల, పోషకాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారని అనుకుంటారు. రక్త పరీక్షలు జరగడం లేదు. ఇప్పుడిప్పుడే అంగన్‌వాడీ వర్కర్లు గర్భిణీలకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది

– డా. వహీదా, హైదరాబాద్

వైరల్ వ్యాధుల్లో ఇది ప్రాణాంతకమైంది. ప్రకృతి నియమాలను పాటించని కారణంగానే మనిషి దీని బారిన పడుతున్నాడు. మొట్ట మొదట ఈ వెరస్ 1981 లో అమెరికాలో ఆరోగ్యంగా వున్న హోమో సెక్సువల్ శరీరంలో కన్పడింది. ఇదే ఎయిడ్స్ ప్రారంభ సన్నివేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో 30 మిలియన్‌ల వ్యక్తులు ఎయిడ్స్ బారిన పడనుండగా, వీరిలో 90% శాతం Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ రాత్రి నీకోసమొక దీపం వెలిగిస్తాను

– మూలం: సుజానాముర్ని, అనువాదం: సీతారాం

ఈ రాత్రి
నీకోసం ఒక దీపాన్ని వెలిగిస్తాను
అనుభూతుల్ని కలిసి పంచుకున్న మిత్రులకోసం
మమ్ముల్ని ఈపాటికే దాటిపోయిన వారి కోసం
మా కన్నా ముందే ఓ ఉదాహరణై నిలిచిన వారి కోసం
నేనో దీపాన్ని వెలిగిస్తాను
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

జీవితాశ…

– మూలం: మౌరా ఎలారిమె
(అనువాదం: నాగలక్ష్మి, ఇంటర్ ద్వితీయ; చైతన్య, ఇంటర్ ద్వితీయ)

మా యింటిముదున్న
అరుగుమీద కూర్చుని
నన్ను నేనే ప్రశ్నించుకుంటాను…
ఎటు వెళుతున్నాను నేను
జీవించే ఆశ నాకేమైనా వుందా?
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

జీవితానికి స్వాగతం…

– సి. హెచ్. పభ్రాకర్

నాలాగా నీలాగా వారూ వుండాలంటే ఎలాగ?
కాంక్షల కాశ్మీరాంబరాల్లోంచి
ఆంక్షల ముసుగుదుప్పట్లదాకా
ప్రయాణించినవాళ్ళు
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment