నందినికేమైంది…?

– సీతారాం

నాకేమైంది
మీకేమైంది
మనకేమైంది
నందినికేమైంది
ముందే వెళ్ళిపోయిన అమ్మానాన్నలు
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నందిని ఓ జీవిత ఆశ

– ఉషా రేవల్లి

కొంతమందికి తాము కారణ జన్ములమని తెలియదు
తాము అనాలోచితంగా వేసే అడుగుల జాడల్లో
మరెందరో గమ్యాలు వెతుక్కుంటారని వారికి తెలియదు
వెనుతిరిగి చూడకుండా, తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను లెక్కపెట్టుకుంటూ
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి…

ఆంగ్లమూలం: ఎవరో! , అనుసృజనః సీతారాం

నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ నా పుట్టినరోజేమీ కాదు
మరే ప్రత్యేకతా లేదు.
గతరాత్రి మేమిద్దరం తొలిసారి తగవులాడాం. నన్ను గాయపెట్టే
మాటలెన్నో అన్నాడతను
Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

చీకటి సమాధులు

– రేణుక అయోల

చీకటి గుట్టుగా
సరదాగా హాయిగా వుంటుంది
వెలుతురు రానంతవరకూ..
చీకటి పరదాలు దింపుకొని
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పాజిటివ్స్ పట్ల సానుభూతితో మెలగాలి

– భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి

వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

హెచ్ఐవిలోనూ లింగవివక్ష

(అనువాదం- వనజ)

పాజిటివ్ మహిళల దీనస్థితి

హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా? Continue reading →

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

సత్యం పౌండేషన్ అధ్యయనం

(సెప్టెంబరు 2006 లో సత్యం పౌండేషన్ “ఆంధ్రప్రదేశ్‌లో యువత – హెచ్ఐవి” అనే అంశం మీద ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెళ్ళి కాని యువత జీవన శైలుల గురించి ప్రధానంగా ఈ అధ్యయనం జరిగింది. వారి రోజు వారీ జీవిత విధానం, వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్ళను వారు ఎలా సంభాళించుకుంటున్నారు, Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి /ఎయిడ్స్ అవగాహన మీద చిన్న సర్వే

– భూమిక టీం

నిఖితా ఖట్ర
నాపేరు నిఖితా ఖట్రా. మేము మార్వాడీస్. మా నాన్నగారికి జువెల్లరీ షాపు వుంది. మేము సాయిరాం నగర్‌లో వుంటున్నాం. ఇక్కడకు దగ్గరలోనే ఒక కాలేజీలో కామర్స్ కోర్స్ చదువుతున్నాను. నా వయసు 17 సంవత్సరాలు. నాకు ఎయిడ్స్ గురించి తెలుసు. అది సెక్స్ వల్ల, రక్తం మార్పిడివల్ల వస్తుందని తెలుసు. టి.విలో చాలాసార్లు చూశాను. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అక్కా! నన్ను ముట్టుకోవూ!!

– మమత, (ఏక్షన్ ఎయిడ్ సౌజన్యంతో) అనువాదం – మాధురి.కె

మాది గుంటూరు జిల్లాలోని వినుకొండ. మా నాన్నగారు వ్యవసాయ కూలి, మా అమ్మ గృహిణి, ఒక అక్క. నాకు 10 సంవత్సరాల వయసులో మా అమ్మ గుండెజబ్బుతో మరణించింది. నన్ను, మా అక్కని పాఠశాల్లోంచి తీసేసి, ఇంటిపని మొదలుపెట్టించారు. కొన్ని సంవత్సరాల తరువాత నేను పెద్ద మనిషినయ్యాను. నాకు 15 సంవత్సరాలొచ్చేసరికి మా పక్క గ్రామంలో ఒకతనితో నా వివాహం జరిగింది.
Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

భారతీయ మహిళలపై హెచ్ఐవి పంజా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నిస్సహాయ మహిళలు, పిల్లలకోసం నడిచే వాసవ్య మహిళా మండలిలో వుంటున్న 23 ఏళ్ళ నాగమణి తన ఐదేళ్ళ కూతుర్ని హత్తుకుని వుంది.

ముఖంపై నవ్వులేదు. తల్లీ కూతుళ్ళు తీవ్ర మనస్తాపంలో వున్నారని డాక్టర్లు చెప్పారు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస

గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

యువతరానికి అందుబాటులో పరిజ్ఞానం

సంస్కృతిపరంగా చూస్తే యువతరం ప్రపంచం మొత్తంమీద ప్రమాదస్థితిలో వున్నారు, అందులో భారతదేశ శాతం మరీ ఎక్కువ. ఎందువల్లనంటే భారతదేశంలో సెక్సు అనేది మాట్లాడకూడని విషయం, అదీకాక యువతరానికి సమాచారం అందుబాట్లో లేకపోవడం. వారి మనసుల్లో మెదిలే చాలా ప్రశ్నల్ని చర్చించే వేదిక లేకపోవడం, వారు తమ నిత్యజీవితాల్లో ఎదుర్కొనే సంకోచాలు, అపోహలు, వారి తల్లితండ్రులతో కాని, ఉపాధ్యాయులతో కాని, కనీసం వారి డాక్టరుతోగాని మాట్లాడలేరు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రజలకు ఎపిఎస్ఎసిఎస్ ‘ధైర్యం’

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరికీ ఆదర్శమయ్యే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 31 వ తేదీన నిర్వహించిన హెచ్ఐవీ పరీక్ష శిబిరంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘ బి బోల్డ్’ (Be Bold) కార్యక్రమానికి ముందుగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

‘పరవశంలో ముంచిన పాపికొండల యాత్ర’ పేరుతో నేను రాసిన వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందన ఫలితమే రెండోయాత్ర. నేననుభవించిన అద్భుత ఆనందాన్ని, ఉల్లాసాన్ని నా మిత్ర రచయిత్రులందరికీ పంచాలనే తపనే నన్నీ సాహసం చేయించింది. లేకపోతే ‘భూమిక’లాంటి బుల్లి సంస్థ ముప్ఫై మందితో మూడురోజుల పర్యటనను ఆర్గనైజ్ చెయ్యగలగడం సాధ్యమయ్యేది కాదు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : మొదటి భాగం

ఏళ్ళ తరబడి హృదయపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయిన ఒక స్వప్నం హఠాత్తుగా సాకారమవుతుందంటే… సుతిమెత్తని రెక్కలు తొడుక్కుని పావురమయి మన కళ్ళముందు ఆవిష్కరింపబడితే ఎవరికయినా ఎలా వుంటుంది….?

సరిగ్గా అలానే అన్పించింది కొండవీటి సత్యవతి “అంతా కలిసి పాపికొండలు చూద్దాం రండోచ్” అంటూ ఉత్తరం వ్రాసినపుడు.

Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒకానొక స్వప్న సాక్షాత్కారం : రెండవ భాగం

చంద్రలత మాట్లాడుతూ ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లకు తెలుగు సాహిత్యం నుండి ప్రతినిధుల్ని పంపేప్పుడు.. తగిన వారిని ఎన్నిక చేయాల్సిన అవసరం వుందనీ… ఇక్కడ్నుండి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా తమగురించి తాము చెప్పుకోడానికే తప్ప మొత్తం మీద తెలుగు సాహిత్యపు ప్రామాణికతను రెప్రెజెంట్ చేయడం లేదనీ, మన సాహిత్యపు ప్రమాణాలను, సంస్కృతినీ భిన్నంగా, ఒక వైవిధ్యంతో వ్యక్తపరచగలిగేటువంటి సమర్థులయిన సాహితీకారులను ఎన్నికచేసి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లకు పంపడం అన్నది ముఖ్యమని అభిప్రాయపడ్డారు… Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment