కల్లోల కడలిలో యువత – పి. ప్రశాంతి

రమ ఓ సామాజిక కార్యకర్త. మహిళలపై హింసకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలో ఫీల్డ్‌ కో`ఆర్డినేటర్‌గా నారాయణపేట జిల్లాలో పనిచేస్తోంది. ముగ్గురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో తనే వ్యవసాయం చూసుకుంటూ పిల్లల్ని చదివించింది. ఐదో తరగతితో బడి మానేసిన రమకి చదువంటే మహా ఇష్టం. హైస్కూల్‌కి Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మొదటి గ్రామీణ రేడియో జాకీ జనరల్‌ -వి.శాంతి ప్రబోధ

‘‘సంఘం రేడియో వింటున్న మీ అందరికీ నమస్తే… అందరూ బాగు న్నారా? ఏం జేస్తున్నరు?
పొద్దుబోయింది. పొద్దంతా చేన్లల్ల పనులన్నీ ముగించుకొని ఇంటికొచ్చిన్రు గదా…పిల్లలను జూసుకొంటూ, రొట్టె కూర జేసుకుంట సంగం రేడియో తట్టు ఒక చెవి పెట్టుకుంటే మంచిగుంటదని కోరుతున్న’’ Continue reading →

Share
Posted in కిటికి | Leave a comment

ఆడదాన్ని నమ్మితే సొమ్ము ` నమ్మకుంటే దుమ్మే -ఎండపల్లి భారతి

తెల్లారి గుడ్లన్నీ ఉతికి ఆరేద్దామని మిద్ది మిందకు పోతి. మా ఇంటి ఉత్తరం పక్క నా మరదలు వాల్లిల్లుంది. నేను మిద్ది మీద గుడ్లు అరేసేది నా మరదలు చూసి,
‘‘ఓ వొదినా సరస నిన్న అలిగి పుట్టింటికి పోయిందంటనే’’ అనె. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

గమనమే గమ్యం -ఓల్గా

‘‘కష్టాలు కాక ఏముంది? అందరి ఆడపిల్లల్లా లేను గదా నేను. నా వల్ల ఎన్నో మాటలు పడ్డావు. మామూలు ఆడపిల్లనై ఉంటే ఈపాటికి నలుగురు మనవ సంతానంతో హాయిగా ఆడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో పిల్లల్ని కంటానా లేదా అని దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నేనొక మామూలు ఆడపిల్లనయితే…’’ సుబ్బమ్మ శారద నోరు మూసేసింది. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

చెట్లు నాటిన మనిషి -జాఁ జియోనో

మానవ ప్రవర్తన యొక్క అరుదైన సుగుణాలు వెల్లడి కావాలంటే దాని పని తీరును అనేక ఏళ్ళపాటు పరిశీలించే అదృష్టం ఉండాలి. ఈ పనితీరు ఏ మాత్రం అహంకారం లేనిదైనట్లయితే, దీనికి ప్రేరణ అసమానమైన ఔదార్యం అయినట్లయితే, ఇది ప్రతిఫలాపేక్ష లేనిదని ధృవపడినట్లయితే, వీటన్నిటికీ తోడు ఇది ఈ భూమి మీద తన ప్రత్యక్ష ముద్ర వేసినట్లయితే అప్పుడు పొరబాటనేది ఉండజాలదు. Continue reading →

Share
Posted in నవలిక | Leave a comment

స్త్రీలు గుర్తించిన స్త్రీలు – రాడికలెస్బియన్స్‌ అనువాదం: – ఎ.సునీత

లెస్బియన్‌ అంటే ఏంటి? బద్దలయ్యేంత వరకూ అదిమిపెట్టిన స్త్రీలందరి ఆగ్రహం. పసి వయసు నుండి సమాజం విధించిన పరిమితులను అధిగమించి, ఒక సంపూర్ణ, స్వేచ్ఛాయుత మనిషిగా జీవించాలనే తన లోపలి తపనననుసరించి జీవించే స్త్రీ. ఈ తపన, అది నిర్దేశించే Continue reading →

Share
Posted in కరపత్రం | Leave a comment

సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం ‘లతా మంగేష్కర్‌’ -కస్తూరి మురళీకృష్ణ

జహా జహా చలేగా
మేరా సాయా సాథ్‌ హోగా!
మన నీడ కూడా మనల్ని వదలి పోవచ్చునేమో కానీ లతా మంగేష్కర్‌ పాట మాత్రం మనల్ని వదలి పోదు. భౌతికంగా లతా మంగేష్కర్‌ అనే శరీరం వడలిపోయి ఉండవచ్చు గానీ, సరస్వతి వీణాస్వరం లాంటి లతా మంగేష్కర్‌ సరసస్వరసురరaరీ తరంగాలు, తరతరాలుగా Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఐక్యతారాగం -` రమావత్‌ లక్ష్మి

ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్నియల్లో
ఐక్యతారాగం ఎన్నియల్లో
ఆడపిల్ల పుడితే ఎన్నియల్లో
ఇంటికి భారమంట ఎన్నియల్లో ॥ఎన్నియల్లో॥ Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

ఐక్యతారాగం తర్వాత నాలో వచ్చిన మార్పు `- ఓ.మంజుల

ఐక్యతారాగం శిక్షణ తీసుకున్న తర్వాత నాలో చాలా ధైర్యమొచ్చింది. బస్తీకి వెళ్ళినపుడు బస్తీవాసులతో మాట్లాడే క్రమంలో వేరే వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళు నాకు చెప్పినపుడు ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కాదు, మౌనంగా Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

‘ఐక్యతారాగం’లో నా అనుభవం -` కె.నీలిమ

ఈ శిక్షణకి ముందు నాకు జెండర్‌/సెక్స్‌, లింగ ఆధారిత వివక్ష మరియు ూGదీుూIA గురించి కొంత తెలుసు. శిక్షణలో పాల్గొన్న తర్వాత వాటిపై పూర్తి అవగాహన వచ్చింది. ఇంతకుముందు లింగ ఆధారిత వివక్ష స్త్రీలపై మాత్రమే Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి నేర్చుకున్నాను -` సౌమ్య

నేను ఐక్యతారాగం శిక్షణా కార్యక్రమంలో సామాజిక గుర్తింపుల ఆధారిత వివక్ష గురించి బాగా నేర్చుకున్నాను. దీనిలో కులం, మతం, జెండర్‌, లైంగికత, జాతీయత, ప్రాంతం, వర్గం లాంటి అంశాల్లో వివక్ష అనేది సమాజంలో ఎలా Continue reading →

Share
Posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక | Leave a comment

హార్మోన్‌ మాత్రలు ` ఓ.సి.పిల్స్‌ -రొంపిచర్ల భార్గవి

డాక్టర్‌ గారూ మా అమ్మాయి పెళ్ళి వచ్చే వారం, ఏదయినా ఇంజక్షన్‌ చేసి రేపటికల్లా పీరియడ్‌ వచ్చేట్టు చూడండి మీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళి టైముకి ఆ కాస్తా అడ్డు పడకుండా చూడండి ప్లీజ్‌ అంటున్న మాటలు విన్న డాక్టరమ్మ ‘‘చూడమ్మా విమలా పీరియడ్స్‌ని Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆమె మాటే తుపాకీ తూటా!-ఎస్‌.పుణ్యవతి

ఆమె బందూకు ఎక్కుపెడితే నిజాం సామ్రాజ్యం గడగడలాడిరది…
ఆమె మాట వినబడితే దొరల గడి గజగజా వణికిపోయింది…
ఆమె అండగా నిలబడితే శ్రామిక దండు ఆనందంతో పులకించిపోయింది…
ఆమె మాట రజాకార్ల పెత్తనంపై ఎక్కుపెట్టిన తూటా… Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

‘నా గర్భసంచిని తొలగించిన తర్వాత ఇదంతా మొదలయింది’- జ్యోతి షినోలి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
బీడ్‌ జిల్లాలో, పెద్ద సంఖ్యలో గర్భాశయ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళా చెరకు కార్మికులు శస్త్రచికిత్స అనంతర ఆందోళన, నిరాశ, శారీరక రుగ్మతలు, దెబ్బతింటోన్న వైవాహిక సంబంధాలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ`శాంతి ర్యాలీ

హైదరాబాద్‌ నడిబొడ్డున వందలాది మంది ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం. మేము మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం’’.
` రాజ్యాంగాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తూ అన్ని వర్గాల వాళ్ళ నుంచి భాగస్వామ్యం ` ర్యాలీ తర్వాత, ‘‘తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ’’ మత సామరస్య ప్రచారం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

నేలమ్మా సంఘం నుండి మేకలు తీసుకున్న సభ్యురాలి కేస్‌ స్టడీ – సామల్ల శ్వేత

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన గట్కకుండ సంతోష వయసు 38 సంవత్సరాలు, భర్త కనుకయ్య 42 సంవత్సరాలు. కూతురు హారిక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, కొడుకు అభిలాష్‌ 6వ తరగతి చదువుతున్నారు. సంతోషకు 1.20 ఎకరాల భూమి ఉంది. అందులో ఎకరం వరి, అర ఎకరం పల్లి (వేరుశనగ) పంటలు సాగు Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment