‘ఎలా వచ్చారు?’ అడిగాను. ‘ఆటోమేటిగ్గా’ అన్నారు. తర్వాత తెలిసింది ఆటోలో వచ్చారని.
ఃఔశీఎaఅఃర బజూశ్రీఱట్‌ఎవఅ్‌ః అంటే ఇది కాదేమో? స్త్రీల సాధికారత గురించిన సదస్సు రెండో అంతస్తులో జరుగుతుంటే లిఫ్టులో పైకొస్తూ అనుమానపడ్డారు ఇంకో సందర్భంలో. Continue reading
‘ఎలా వచ్చారు?’ అడిగాను. ‘ఆటోమేటిగ్గా’ అన్నారు. తర్వాత తెలిసింది ఆటోలో వచ్చారని.
ఃఔశీఎaఅఃర బజూశ్రీఱట్‌ఎవఅ్‌ః అంటే ఇది కాదేమో? స్త్రీల సాధికారత గురించిన సదస్సు రెండో అంతస్తులో జరుగుతుంటే లిఫ్టులో పైకొస్తూ అనుమానపడ్డారు ఇంకో సందర్భంలో. Continue reading
అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ, ఆవిడకి, ఆవిడ సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను (మీతో పంచుకోవాలనుకుంటున్నాను). Continue reading
అబ్బూరి ఛాయాదేవి గారిని కాకతాళీయంగా కొండాపూర్ ఆశ్రమానికి వెళ్ళినపుడు కలవడం జరిగింది. నేను వెళ్ళేటప్పటికి ఆమె ఒక స్టూల్ మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వారించి దేనికి అని అడిగితే కర్టెన్ మార్చాలన్నారు. అతి బలవంతం మీద ఆమెను ఒప్పించి Continue reading
నమస్తే!
నాకు అబ్బూరి ఛాయాదేవి గారి కథలన్నా, ఆమె వ్యక్తిత్వం అన్నా… చాలా అభిమానం, గౌరవం. ఇష్టమైన రచయిత్రుల లిస్టులో ముందు ఉండేవారు. పరిచయం లేదు కానీ ఆమె కథల వలన బాగా దగ్గరైన భావన మనసులో ఎప్పుడూ ఉండేది. ఆమె గురించిన సాహిత్య వ్యాసాలలోను, సాహితీకారుల చర్చలలోనూ, సమీక్షలోను తెలుసుకున్నదే ఎక్కువ. అలా నేను ఆమె అభిమానినయ్యాను. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన విషయం, బోన్సాయ్ కథ గురించి ఒకసారి విశాఖపట్నం ఎఫ్.ఎమ్.వాళ్ళు మీ ఇష్టమైన రచయిత్రి గురించి చెప్పమన్నప్పుడు చెప్పాను. ఒకసారి అనుకోకుండా ఆమెను చూసే అవకాశం కలిగింది. హైదరాబాద్ తెలుగు యూనివర్విటీలో కార్యక్రమం చూడడానికి వెళ్ళినప్పుడు బయట కనిపించారు. గుర్తుపట్టి ఎగిరి గంతేసినంత ఆనందంగా వెళ్ళి పలకరించాను. ఇంతలో ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు వచ్చారు. అదే ఆమెను మొదటిసారి చూడడం. పలకరింతలు, నవ్వులు అయ్యాక… ఇలా ఈ ఫోటో తీయించుకున్నాను. ఇంతలో ప్రముఖ హాస్యమధురానుభూతిని మిగిల్చిన ఈ చిత్రాన్ని ఇలా ఆమె లేనప్పుడు జ్ఞాపకంగా పంచుకోవడానికి పంపాల్సి రావడం అత్యంత బాధాకరంగా ఉంది. అబ్బూరి ఛాయాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలనీ ప్రార్ధిస్తున్నాను.
ఛాయాదేవి గారితో తమ పరిచయం గురించి ఆత్మీయులందరూ సంతృప్తిగా వివరించగలరు. ఆ గౌరవం ఎంతమందికి దక్కుతుంది? ముప్పయ్యేళ్ళ నుండి హైదరాబాద్‌లో ఉన్న చాలామంది రచయిత్రులకి ఆమె సన్నిహితురాలే, స్నేహితురాలే. ఆమె మానసిక పరిధి చాలా విశాలమైనది. చాలామంది ఆచరించలేని విలువలని చాలా సాత్వికంగా, సునాయాసంగా ఆమె Continue reading
ప్రఖ్యాత తెలుగు రచయిత్రి అబ్బూరి చాయాదేవి నేనూ ఉస్మానియా యూనివర్సిటీలో 1954 జర్నలిజం మొదటి బ్యాచ్‌లో సహాధ్యాయులం. ఇల్లిందల సరస్వతీ దేవి. లలితాసింగ్ ూడా మాతోనే చదివారు. అప్పుడు క్లాసులో ఆడవాళ్లు వేరుగా మగవాళ్ళు వేరుగా ూర్చునే వాళ్ళం. Continue reading
28 జూన్‌న హైదరాబాద్‌లో కన్నుమూసిన అబ్బూరి ఛాయాదేవి లోకమెరిగిన రచయిత్రి. తెలుగులో స్త్రీ వాదం పాదుకొనక ముందే ఆ చైతన్యంతో గొప్ప రచనలు చేసిన కవయిత్రి, ఆమెకు ముందు తరువాత వచ్చిన రచయిత్రులు అటు పుట్టింటి పేరునూ, ఇటు అత్తింటి Continue reading
నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది. Continue reading
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి సంతాపం
ప్రముఖ కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి మృతికి సాహితీస్రవంతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. తెలుగు సాహిత్యంలో విలక్షణ రచయిత్రిగా అబ్బూరి ఛాయాదేవి పేరు Continue reading
ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతూ వరద రాజేశ్వరరావుగారు షేవ్ చేసుకుని అరిగిపోయిన బ్రష్‌తో కూడా ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. Continue reading
మంచి తెలుగు కథ, మంచి వ్యక్తి అనగానే నాకు ముందు జ్ఞాపకం వచ్చే పేరు అబ్బూరి ఛాయాదేవి గారిదే. స్త్రీ వాదం అనే పదం తెలుగు సాహిత్యంలో వినపడని రోజుల్లోనే ఆ ముద్ర లేకుండా ఆమె రచించిన చాలా కథలు స్త్రీ వాదానికి గౌరవం తెచ్చిపెట్టిన కథలే. అప్పటికే Continue reading
ఆశ్రమం నుంచి ఆప్యాయంగా వినవచ్చే ఆ పిలుపు ఆగిపోయింది. నెమ్మదిగా, కొంచెం హస్కీగా అయినా దృఢంగా, ప్రేమగా పలకరించే ఆ గొంతు మరింక వినిపించదు అంటే గుండె నిండా బాధ గుబగుబలాడుతోంది. Continue reading
తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల Continue reading
”యురేనియం” అంటే ఏమిటి? జూలై 27వ తేదీన మేమందరం నల్లమల అడవి ప్రాంతంలోని మన్ననూరు, ఆమ్రాబాద్ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ పదే పదే యురేనియం పదాన్ని వాడుతున్నప్పుడు నా ప్రక్కన కూర్చున్న ఒకమ్మాయి నన్నడిగింది. Continue reading
శ్రీమతి సత్యవతి గారికి,
నేను నెలనెలా భూమిక చదువుతున్నాను. ఏమిటి అందున్న ఆకర్షణ! కాశీ మజిలీ కథల్లేవు. స్త్రీ పురుషుల అర్థనగ్న చిత్రాల్లేవు. ఆడా మగా వెండి తెర వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు లేవు. ముఖానికిది రాసుకో తలకిది రుద్దుకో అప్సరవైపోతావన్న నర్మగర్భ ప్రకటనలు లేవు.
శ్రావణ మాసం… ఆహ్లాదంగా ఉంది. ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం వల్ల చెట్లన్నీ పచ్చబడి కొత్త చిగుళ్లు, పూల గుత్తులతో అందంగా ఉన్నాయి. అమెరికాలో ఉండే నీల వాళ్ళ పిన్నిగారబ్బాయి పెళ్ళికని సెలవుపెట్టి పిల్లల్ని తీసుకుని వచ్చేసింది Continue reading