పశుల కాపరి నుండి .. ప్రజా కవిగా….. – డాక్టర్‌ కోయి కొటేశ్వర రావు

అందెశ్రీ అసాధారణ జీవన ప్రస్థానం…
ఆధునిక తెలుగు కవిత్వంలో అందెశ్రీ సహజ కవి. అపార ప్రతిభా సంపన్నుడు . జాతిని జాగృతం చేసే పాటల జాతరలా నిత్యం ప్రతిధ్వనించాడు. మబ్బు గుండె నుండి వాన చినుకు రాలిపడినట్లు, మట్టిని చీల్చుకొని మొక్క దూసుకొచ్చినట్లు అందెశ్రీ గుండెల్లో నుండి పాట అలవోకగా ఉబికి వచ్చింది.వెదురు ముక్కవేణువై వేన వేల రాగాలు పలికి నట్లు, తాపీ మేస్త్రి ఒక తత్త్వకవిగా పరిణామం చెంది ప్రజా విముక్తి గీతాలను ఆలపించాడు. Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

పాటకి నిర్వచనం ఆమె – రావు బాలసరస్వతిదేవి

ఇంటర్వ్యూ సేకరణ: కొండవీటి సత్యవతి
నమస్కారం బాల సరస్వతి గారూ! మీ గురించి, మీ సినిమాల గురించి, మీ పాటల గురించి వివరంగా చెపుతారా!
ఆ రోజుల్లో ఆడవాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు కారు. చాలా చిన్న ఫ్యామిలీస్‌లోని ఆడవాళ్లు అది డ్రామాలు పనిచేసే వాళ్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లు. మంచి ఫ్యామిలీ నుంచైతే అసలు రారు. నేను ఎప్పుడు స్టేజి మీద నటించలేదు. 1934లో అంటే నా నాలుగో ఏట నుండి కపిలవాయి రామనాథ శాస్త్రి గారి పాటలు అవి వినేదాన్ని. ఇంట్లో గ్రామ్‌ ఫోన్‌ ఉండేది. పాటలు పెట్టుకుని విని వెంటనే వాటిని పాడుతుండే దాన్ని. అట్లా పాడటం కూడా మా ఇంట్లో ఎవరికీ రాదు. నేను సంగీతం నేర్చుకోలేదు. వేరేవాళ్లు పాడే పాటలు విని పాడుతున్నప్పుడు మా నాన్న విని తన ఫ్రెండ్‌ కొప్పరపు సుబ్బారావు గారిని ఎచ్‌ ఎం వి రికార్డింగ్‌ మేనేజరు ఆయన నా పాట గురించి అడిగితే గ్రామ్‌ఫోన్లో విని అనుకరించి పడతానని చెప్పారట. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ట్రాన్స్‌జెండర్‌ సముదాయం: వివక్షను దాటి, గౌరవం వైపు – అర్చన రావు మానుకొండ

ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్‌ అనే పదం టీవీలో, సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. సాధారణంగా వాడుకలో వీరిని హిజ్రా, కొజ్జా, చెక్కా, మాడ, తేడా, పాయింట్‌ ఫైవ్‌, వన్‌ బై టూ, నపుంసకులు వంటి పదాలతో సంబోధిస్తూ ఉంటాం. ఇది, సమాజంలో అంగీకారం లేకపోవడం, మీడియా-సినిమాల్లో వీరిని ఎక్కువగా కామెడీ లేదా విలన్‌ పాత్రలుగా చూపించడం వల్ల ఏర్పడిన అపోహలే. ఒకప్పుడు ఈ సముదాయానికి చెందిన వ్యక్తులు సంవత్సరానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే కనిపించేవారు. Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

శీలా సుభద్రాదేవి – పరిశోధన – గిరిజ పైడిమర్రి

‘‘నా సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. నేను రాస్తూ రాస్తూనే ఉంటాను. నేను అలసిపోలేదు. నా కలం ఇంకిపోలేదు. కవిత్వం నా శ్వాస. నిరంతర అధ్యయనం నా ఊపిరి’’ అంటూ తన డెబ్బై అయిదేళ్ళ వయసులో సాహిత్య సేవ చేస్తున్న.. మృదు స్వభావి శీలా సుభద్రగారు నేటి రచయితలకే కాదు, యువతరానికి స్ఫూర్తి ప్రదాత. ఆమె జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే కొనసాగిస్తున్న తన జీవన, సాహితీ ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

విరుదాచలంలో: మట్టిలోంచి పుట్టిన కళ – ఎమ్‌. పళని కుమార్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి
తమిళనాడులోని విరుదాచలంలో ఉండే బంకమన్ను కళాకారులు పింగాణీ బొమ్మలను, మట్టి దీపాలను తయారుచేస్తారు. అయితే, అంతకుముందులా ఈ పని వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్నీ, తగిన గుర్తింపునూ తీసుకురావడం లేదు. అయినప్పటికీ, ఇక్కడి కళాకారులు ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళ చేతులు మట్టి నుండి కళాత్మక వస్తువులను సృష్టిస్తూనే ఉన్నాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నవంబర్ 2025

నవంబర్ 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

లింగాధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల ప్రచారోద్యమం – కొండవీటి సత్యవతి

ప్రతి సంవత్సరం నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీల పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలై అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తుంది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నేనోడిపోను – డా. మజ్జి భారతి

ఒంటరితనం మనుషులను చంపెయ్యగలదని యిప్పటికే అనుభవంలోకి వచ్చింది సుమిత్రకు. అది బ్రతకడానికి కావలసిన ఆశల చమురును హరిస్తుందని, నెల్లాళ్లుగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పద్దెనిమిదేళ్ల సుమిత్రకు తెలిసి వస్తుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని దినపత్రికలలో చదివినప్పుడు, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం చెయ్యగలిగిన వాళ్ళు బ్రతకడానికెందుకు ధైర్యం చెయ్యలేక పోతారు? ఏది చెయ్యాలన్నా ముందు ప్రాణాలతో వుండాలి కదా! అని అనుకునేది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

(గత సంచిక తరువాయి…)
10. పని ఎక్కువ ` జీతం తక్కువ
నేను ఇబ్రహీంపట్నంలో వున్నప్పుడు నా స్నేహితులకూ, రాడికల్‌ రాజకీయాలు, పుస్తకాలు, సంస్కృతి గురించి వారితో జరిపే ఎడతెరిపిలేని చర్చలకూ దూరమైపోయాను. ఇక్కడి రోజువారీ విశేషాలను వారితో ఎప్పుడెప్పుడు పంచుకోవాలా అని తహతహగా వుండేది. వారం రోజుల కంటే ఎక్కువ కాలం వాటిని నాలో దాచుకోవాలంటే కష్టంగా అనిపించేది. అందుకే ఇబ్రహీంపట్నం సంగతులపై ‘మెయిన్‌ స్ట్రీమ్‌’ అనే ఇంగ్లీష్‌ వార పత్రికకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వయసువాటం – అపర్ణ తోట

వయసును మనం పట్టించుకోక పోయినా అది మనలను పట్టించు కుంటుంది. ఎన్ని కసరత్తులు చేసినా ఈ శరీరం పుట్టి పెరిగి కొన్ని పనులు చేసి పండి, వడలి, చివరకు రాలిపోతుంది. ఇదంతా వేదాంతామని అనిపించొచ్చు, కానీ అనాదిగా సాగిపోతున్న నిజమిదే. ఎంత విర్రవీగినా వయసును తప్పించుకు తిరగడం కష్టం. ఇక ఆడవారిలో అయితే లేత తమలపాకు వంటి యవ్వనం నుండి మెనోపాజ్‌ చేరే వరకు శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అనవసరపు గర్భాశయ ఆపరేషన్లూ కానరాని హింసే – పి. ప్రశాంతి

‘‘అత్తా.. అత్తా..’’ లోగొంతుకతో పిలుస్తూ గుమ్మంలో నిలబడి లోపలికి తొంగి చూసింది అనిత. కిటికీలోంచి పడుతున్న కొద్ది వెలుతురులో మంచం మీద ముడుచుకు పడుకున్న మల్లమ్మను చూసి ‘‘ఏమైందత్తా’’ అంటూ లోపలికొచ్చింది. ‘మూడు దినాలుగా దినమంతా నిల్సొని పత్తి పీకుడయితాంది. కాళ్ళు, నడుము ఒకటే గుంజుడు, లేవనీకి కావట్లేదు. ఒకటే నీరసం.. వయసైతాన్దిగా బిడ్డా!! సరేగాని, ఏందో అచ్చినవు?’ ప్రశ్నార్ధకంగా అడిగింది 40 ఏళ్ళైనా నిండని మల్లమ్మ. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మగస్వామ్యంలో కొత్త ఆకర్షణీయ ధోరణులు: ట్రాడ్‌ వైవ్స్‌ – ఎ. సునీత

కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీవాద మిత్రురాలు ట్రాడ్‌ వైవ్స్‌ గురించి ఫేస్బుక్‌లో ఆందోళన చెందే పరిణామమని పోస్టు రాస్తే వీళ్ళెవరూ అని ఈ తరం స్త్రీవాది మా అమ్మాయిని అడిగాను. ‘ఇదంతా ఇంస్టాగ్రామ్‌లో ఒక లేటెస్ట్‌ ట్రెండ్‌ అమ్మా, అంతకంటే ఏమీ లేదు’, అని తేల్చేసింది. గూగుల్‌ సహాయంతో దొరికిందంతా చదివాను. ట్రాడ్‌ వైవ్స్‌ అన్నది ట్రెడిషనల్‌ వైవ్స్‌కి పొట్టి పదం. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

‘‘చిట్టి చిలకమ్మ’’ బల్ల సరస్వతి ఇంటర్వ్యూ – గిరిజ పైడిమర్రి

‘‘చిట్టి చిలకమ్మా! / చిన్నీ చిలకమ్మా!
అమ్మ కొట్టిందా?/ తోట్లోకెళ్లావా?
పండు తెచ్చావా?/ పాపాయికిచ్చావా? Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తెలుగు కథ విస్తృతి, వైవిద్యం, పరిధి – అబ్బూరి ఛాయదేవి

1998 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు భూమిక అన్వేషి కలిసి ఒక కథ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం ప్రారంభ సభకి అబ్బూరి ఛాయాదేవి అధ్యక్షత వహించారు. డాక్టర్‌ కాత్యాయని విద్మహే తెలుగు కథ విస్తృతి, వైవిధ్యం, పరిధిపై ప్రసంగించారు. ఇప్పుడు సాహిత్య విమర్శకురాలిగా పేరుపొందిన అధ్యాపకురాలు డాక్టర్‌ కాత్యాయని కూడా చిన్నతనంలో కథలు, కవితలు రాసిన వారే. Continue reading →

Share
Posted in వర్క్ షాప్ | Leave a comment

దేశ రాజధానిలో గడ్డి రొట్టె మీద సాగే జీవనం – సంధ్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం – సుధామయి సత్తెనపల్లి

బీహార్‌ నుంచి వలస వచ్చిన రీతా కుటుంబం యమునా నది వరద మైదానాల్లో తాత్కాలికంగా కట్టుకున్న గుడిసెలో నివసిస్తోంది. పరీక్షలకు నిలయంగా కనిపిస్తోన్న ఈ ప్రదేశంలో వారి జీవనోపాధి ఏనుగు గడ్డిని అమ్మడం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఇదా నవయుగము! ఒక అభాగిని – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

సంపాదక మహాశయా!
నా యీ కష్టాలను ‘గృహలక్ష్మి’ ద్వారా ప్రచురించుకుందామనే ఆశ చాలా కాలాన్నుంచి యుండేది. దాని వెంటనే పత్రికా భాష వ్రాయనేర్వని నాబోటి వాళ్లు వ్రాసిన అవకతవక భాషను ప్రచురించుతారా అనే శంక హృదయంలో తట్టి నిరుత్సాహపడుతూ వుండేదాన్ని. ఐనా ప్రత్యేకం స్త్రీల పాలిట కల్పతరువైన ‘గృహలక్ష్మి’యే నా యధార్ధ కష్టాలను ఆలింపక నిరాకరించిన ఇక ఆదరించే వారెవరు? అనే ధైర్యంతో వ్రాయబూనితిని. నేను, అదిగాక పైగా ఈ కాస్త విజ్ఞానం గూడా ‘గృహలక్ష్మి’ ద్వారా సేకరించితిని గాన మా పత్రికయనే అహంభావముతో వ్రాయబూనితిని. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment