నేను.. తిరగ రాస్తాను.. – అరుణ గోగులమండ

యెవరెవరో..
ఏమేమో…
చెప్తూనే ఉన్నారు.. Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

Bhumika 2016

April 2016 title

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

One Billion Rising – Photos

Cover Inner 1

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

One Billion Rising Pamphlet

Cover Inner 2

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Beti bacho beti padao

Cover back

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

భూమిక మిత్రులకు,

నమస్తే !

మార్చి 2016 సంచిక చూసి చాలా ఆశ్చర్య పోయాను. ప్రభుత్వంలోని ఒక ప్రణాళికా విభాగం, నూరుగురు

ఉద్యోగులతో చేయగలిగిన పని, ఏదో కాస్తంత సహానుభూతి, సహకారం తప్ప, ఎటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిర్మాణ వ్యవస్థాలేని భూమిక నిర్వహించడం! అందునా ఆడవాళ్ళు నిర్వహించే పత్రిక… సంపాదక, సలహా సభ్యులలో మచ్చుకైనా మగ నాకొడుకు లేని పత్రిక నిర్వహించడం..! చాల గొప్ప విషయమే కాదు, రికార్డుల కెక్కవలసిన విషయం. సంపాదకురాలు సత్యవతి తల్లి మాత్రమే కాదు, అమ్మ తల్లి అంటాను నేను. ఈ పుస్తకాన్నే భూమిక ప్రచురణగా మంచి కాలికో బౌండ్‌ చేసి ప్రచురిస్తే అన్ని లా కాలేజీలకూ, లా బుక్‌ హవుస్‌లకూ కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ యివ్వగలిగిన సమగ్ర దృక్పథం కలిగిన రిపోర్టు ఇది. ఇందుకు తోడ్పడిన వారందరికీ నా నిండు కృతజ్ఞతలు, స్సలాములు. ఈసారి వివిధ మత చట్టాల గురించి వాటిలోని లోటుపాట్ల గురించి ప్రత్యేక సంచిక, వివిధ కేసుల వివరాలతో యివ్వండి.

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఇది విభిన్న కోణాల నిర్వచనం – దేవి, సాంస్కృతిక కార్యకర్త.

”దేశమును ప్రేమించుమన్నా” అంటే ”ఏ దేశాన్ని” అని అడిగితే నీవు పుట్టిన దేశాన్ని అనే జవాబు తేలికే కాని పుట్టింది అమెరికా, తల్లిదండ్రులు భారతీయులు. లేదా పుట్టింది ఈ దేశంలో కాని స్థిరపడింది వేరే దేశంలో… రెండు దేశాలకు విభేదం వస్తే ఎటు పక్షం వహించాలి? వాళ్ళంటారు తినేది మా సొమ్ము, విశ్వాసం అటువైపా? అని. వీరంటారు నీ రక్తంలో గంగానది ఉందని. సంక్లిష్టతల్లో గుర్తింపు కోసం తపనలో విదేశాల్లో మైనారిటీలయిన తక్కువ చూపు చూడబడే భారతీయులు ఇక్కడా అక్కడా నిరంతరం దేశభక్తిని నిరూపించుకుంటూ ఉండాల్సిందే. గుర్తింపు కోసం కాలం చెల్లిన క్రతువులను వైభవోపేతంగా నిలబెట్టుకుని సాంస్క ృతిక ఆధిపత్యం కోసం పెనుగులాడ్డం తప్పనిసరే. దేశాన్ని సరిహద్దుల కాలమానంతో ప్రేమించాలా? దేశాల సరిహద్దులు మారాయి, మారుతున్నాయి. మారుతూనే ఉంటాయి. Continue reading

Share
Posted in గౌరవ సంపాదకీయం | 1 Comment

సమ్మక్క జాతరంటే ఆదివాసీల ప్రతిఘటనోత్సవమే – జూపాక సుభద్ర

జాతర్లంటే అన్ని జాతర్లు వేరు సమ్మక్క సారక్క జాతర వేరు. యీ జాతర ఆడవాల్ల జాతర, అడవి బిడ్డల జాతర. అడవి రాణులైన సమ్మక్క సారక్క జాతర. అది అడవి వరకే పరిమితమై తర్వాత పల్లెల్ని కలుపుకున్నది. ఆదివాసులైన సమ్మక్క సారక్కలు తమ సమాజాల సమూహాల ఆత్మ గౌరవం కోసం, అడివి అస్తిత్వం కోసం, జల్‌ జంగల్‌ జమీన్‌లపై ఆధిపత్యాలు నెరపే ఆగడాల మీద సమరం జేసిన చరిత్ర వారిది. అందికే వారి మగసమాజాలక్కూడ వారి శక్తుల్ని, చైతన్యాల్ని, పోరాట స్ఫూర్తి ముందటి తరాల మహిళలకు అందించేందుకు యీ జాతరలు నిర్వహించడం తప్పని సరైంది. సమరాలు నడిపిన సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ పల్లె జనమంత అందులో బహుజన కులాల జనం విపరీతంగా పోయేవారు. Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | 1 Comment

తాతమ్మ విజన్‌ నుంచి… పి . ప్రశాంతి

 

చెరువు మీదగా గాలిలో తేలి వస్తున్న తడి వాసన శాంతిని మైమరపింప చేస్తోంది. ఊర్లో బస్సాగగానే బ్యాగ్‌ తీసుకుని బస్సులోనించి దూకినట్టే దిగేసి తాతగారింటివైపు గబగబా నడిచింది. వీధి గుమ్మంలోనే ఎదురొచ్చిన బేబమ్మని ”అమ్మమ్మా…” అంటూ చుట్టేసింది. ”ఏమ్మా ప్రయాణం బాగా సాగిందా? కాలేజీ చదువు ఎలా ఉంది?” అంటూ కుశల ప్రశ్నలేస్తున్న అమ్మమ్మకి సమాధానం చెప్తూనే వరండాలో రాశులుగా పోసిన పసుపు కొమ్ముల్ని దోసిట్లోకి తీసుకుంటూ ”ఇంకా పసుపు ఉడకబెట్ట లేదా అమ్మమ్మా… ఐనా ఊరికి మైలు దూరం వరకు కమ్మటి వాసనొస్తోంది…” అంటూ ముఖానికి దగ్గరగా పెట్టుకుని బుగ్గలకానించుకుంది. Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియాతి ప్రియమైన పసుపులేటి గీతా! ఎలా ఉన్నావ్‌?

మొన్న రాత్రి ఓ కల వచ్చింది. నవ్వుతూ సముద్రతీరం నుండి పక్షిలా ఎగురుతూ నావైపే వస్తున్నావ్‌? ఎంత బాగున్నావో తెల్సా? నీ చిరునవ్వు ఇంకా విన్పిస్తూనే వుంది. మెలకువరాగానే నువ్వు లేవు. అందుకే ఈ అక్షరాల గులకరాళ్ళను పేర్చుతూ, నీతో కాస్సేపు మాట్లాడదామని మొదలు పెట్టాను. గీతా నీకు గుర్తుందా? నీ తొలి కవిత ‘నీడలు’ 95′ లో అనుకుంటా ‘జ్యోతి’ లో వచ్చింది కదూ! శ్రీకాళహస్తిలో పుట్టి, డిగ్రీ వరకూ చదివి, పద్మావతి యూనివర్సిటీలో యం.సి.జె. చేశావ్‌ కదా! Continue reading

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

డాక్టర్‌ ఆనందీబాయి జోశి (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ

గీ. తనసిరే వేల్పులందధి రత్నముల చేత

వెరచిరే ఘోర కాకోల విషము చేత

విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక

నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. Continue reading

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

బాణాలు – గుల్లేళ్ళు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను ఆసుపత్రి నుండే కుజూలో ‘కాంట్రాక్టులని రద్దు చెయ్యండి’ – అనే నినాదం మొదలుపెట్టి రాబోయే ఉద్యమానికి నాంది పలికాను. నా విరిగిన చేతులతో కళ్ళాన్ని సంబాళించాను. ఆసుపత్రిలో ఉండికూడా రెండు నెలలు ప్రచారం చేయించాను. ఈ యుద్ధంలో తాము వెనుకబడకూడదు అన్న ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ సింహ్‌, రామానంద్‌ తివారి, జసరాజ్‌ సింహ్‌ ముందుకు నడిచారు. నిజానికి తులసీ సింహ్‌ కేవలం కార్మికుల పార్టీ హితం కోరి ఈ యుద్ధంలో దుమికారు. మా ఉద్యమానికి ప్రణబ్‌ చటర్జీ సమర్ధత ఉంది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

స్వాప్నికుడి మరణం – ఉమా నూతక్కి

2016, జనవరి, 17… జీవనదిలా ప్రవహించిన 26 సం||ల రోహిత్‌ వేముల ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన రోజు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధిగా కంటే కులవివక్ష బాధితుడిగా, బహిష్క ృతుడిగా, హతుడిగా దేశానికి, ప్రపంచానికి తెలిసిన ఒక సున్నిత హృదయుడు. తన మరణంతో ఈ దేశపు ముఖాన వంద ప్రశ్నార్థకాలను లోతుగా చెక్కిపోయిన ఒక స్వాప్నికుడు. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్తీ సహనం – ఎ. అభినయ, 7వ తరగతి

అమ్మాయికి మారు పేరు అమ్మ

అమ్మకుంది శక్తి

ఆ శక్తికి తోడైయ్యింది భక్తి

జన్మనిచ్చే అమ్మకు భక్తి దేవుడిపై

ఉంచాడు అమ్మను మహిపై తనకు మారుగా

అమ్మ కుంటాయి కష్టాలు Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఇల్లాలు – ఎన్‌. లక్ష్మి లహరి, 7 తరగతి

స్త్రీ అంటే దేవుడి రూపం,

మగవాడికి ఒక వరం,

స్త్రీ శక్తి, అంటే శివుడికి భక్తి,

స్త్రీ అంటే ఒక ధైర్యం,

స్త్రీ పక్క నుంటే మగాడి బలం. Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

స్తీ శక్తి – జి. యామిని, 7వ తరగతి

లెక్కలేని శక్తి ఉండే స్త్రీ,

లెక్కలేని పనుల్లో ఉండే స్త్రీ,

లెక్కలేని నొప్పులను భరించే స్త్రీ,

ఓ ఇల్లాలుగా, అక్కలా, కూతురుగా, అమ్మగా ఉండే స్త్రీ Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment