సిస్టర్‌ సోదరి- నీకు ఏజెన్సీ కలదా – అపర్ణ తోట

ఇన్‌స్టా రీల్స్‌లో అమ్మాయిలంతా హ్యాండ్లూమ్‌ చీరలు కట్టుకుని కలిసి నడవడమో, ఒకరి మీద ఒకరు వాలడమో, రోడ్‌ దాటడమో, తలలో పూవులు అలంక రించుకోవడమో, సంభాషణలో నిమగ్నమయి, నవ్వుతూ, టీ తాగుతూ, కొన్నిసార్లు కలిసి మందు కొడుతూ, పుస్తకాలూ తిరగేస్తూ డాన్సులు చేస్తూ, రాత్రంతా పడుకొని కబుర్లు చెప్పుకొంటూ… ఇలా హాయిగా ఉన్న వీడియోలు చూస్తుంటాం. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

క్వియర్‌ (లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌ జెండర్‌) స్త్రీవాదం-ఎ. సునీత

మూడేళ్ళ క్రితం నేను రెండు దశాబ్దాల పాటు పని చేసిన స్త్రీవాద పరిశోధక సంస్థలో కొంత మందిమి క్వియర్‌ సమూహాలలో వ్యక్తులకి (సమలైంగికులు, ట్రాన్సజెండర్‌ వ్యక్తులు, ఇతర క్వియర్‌ వ్యక్తులు) వివిధ రకాల మద్దతు ఇవ్వగలిగే ఒక నిర్మాణానికి రూపునిచ్చే ప్రయత్నం చేసాం. ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళ, ఒక సమలైంగిక వ్యక్తి, నేను మా టీమ్‌ సభ్యులం. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ఆమె అతని ఆలంబన – గిరిజ పైడిమర్రి

వాళ్ళ ఇల్లు ఒక మ్యూజియం. ఆ కళాఖండాల నిలయానికి నీలమ్మ గారే ఆలంబన. అనితరసాధ్యమైన కళాఖండాలను గత నలభై యేళ్ళుగా వాళ్ళిద్దరూ కలిసి సేకరించారు. వాటి విలువ ఈనాడు కోట్లలో ఉంది. ప్రజల నుంచి సేకరించిన వాటిని నిస్వార్థంగా ప్రజలకే అందించాలనే దృఢ నిశ్చయంతో వారు వున్నారు. చరిత్ర అంటే రాజులదే అనే అపోహతో ఉన్న సమాజానికి సామాన్య మానవుల అసాధారణ చరిత్రను వెలికి తీసి చూపించారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పితృస్వామ్య పడగనీడన ప్రేమ కూడా కాటేస్తుంది – కొండవీటి సత్యవతి

ఈ పుస్తకానికి కొంగు చాటు ఆకాశం అని పేరు పెడితే… ఏమోలే రచయిత్రుల ఇష్టం. ఎందుకంటే ఈ నవలలోని నలుగురు నాయికలు ఏదో ఒక దశలో కొంగుల్ని సర్రున చింపేసి ఆకాశం వేపు ఎగరేసిన వాళ్ళే. అణిచివేతల్లోంచి, అవమానాల్లోంచి, వివక్షల్లోంచి గొంగళీ పురుగు సీతాకోకచిలుకలా మారి నీలాకాశంలోకి ఎగిరిన వాళ్ళే. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నీరు, అడవి, ఆభరణాలు – జిఙ్ఞాస మిశ్రా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ఒడిశాలోని గదబ ఆదివాసీ సముదాయానికి చెందిన మహిళలు ధరించే ముక్కు, చెవిపోగులు ఆ మహిళలకు తమ పరిసరాలతో ఉన్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయి
సువాసన వెదజల్లుతూ, మీగడ తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న కఠ్‌గొలాప్‌ (ఫ్రాంజిపానీ లేదా ప్లూమేరియా రుబ్రా – దేవగన్నేరు) పూలతో పొడవైన దండ అల్లుతున్నారు చంద్రమ. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విశ్వజనీన కవిత్వానికి నిలువెత్తు నిదర్శనం – బి.ఎస్‌. రాములు

మహాకవి, దార్శనికుడు డాక్టర్‌ కత్తి పద్మారావు గారి నవ కవితా సంపుటి ‘ప్రేమ కిరీటాలు ధరించండి’. ఈ సంపుటిలో ఎలాంటి కవితలుంటాయో పుస్తకం పేరే చెపుతుంది. కత్తి పద్మారావు గారిది ప్రేమ తత్వం. మానవాళిపై ప్రేమ. మంచితనంపై ప్రేమ. ఈ కవితల్లో మనందరిపై ప్రేమ జల్లులు కురిపిస్తారు. దళిత మహాసభ ఉద్యమ నాయకుడిగా ఆయన ఉగ్రరూపాన్ని ప్రసంగాల్లో, నినాదాల్లో, కవితల్లో, పాటల్లో చూసినవాళ్ళకి కత్తి పద్మారావు బుద్ధిజంలో పరివ్యాప్తమవుతున్న క్రమంలో మలుపు తిరిగిన ఆయన తాత్విక ధార, శైలీ, శిల్పం, కవితావస్తువు పరిణతి పరిణామక్రమం ఇది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆదర్శాల అమ్మ ! పేరిచర్ల లక్ష్మీకాంతమ్మ ! – అనిశెట్టి రజిత

దేశ స్వాతంత్య్రానికి పూర్వం గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంతో ప్రఖ్యాతి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం గ్రామంలో 78 ఏళ్ల క్రితం సంప్రదాయ రాజుల కుటుంబంలో జన్మించిన లక్ష్మీకాంతంకు తన 17వ ఏట తనకన్నా 20 ఏళ్లు పెద్దవాడైన పేరిచర్ల సుబ్బరాజుతో వివాహం కావడంతో పేరిచర్ల లక్ష్మీకాంతంగా మారిపోయి గృహస్థ ధర్మాల నిర్వహణలో ఉండిపోయారు. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లల భూమిక

పరిమళాలు వెదజల్లే పూలు

పరిమళాలు వెదజల్లే పూలు
రకరకాల పూలు
సుగందాలు వెదజల్లే పూలు రంగురంగుల పూలు
పూల నుండి తయారు చేసే రంగులు రంగుల నుండి చేసే రకరకాల వస్తువులు
దేవతలకు అలంకారాలు
మనసును దోచే పూలు
పండుగకు పూల తోరణాలు ప్రకృతిని అందంగా మార్చే పూలు దేవతల యొక్క సింహాసనాలు
మనోహరమైన మందార పూలు ఆకట్టుకునే జాజులు
మురిపించే మల్లెపూలు
ప్రేమకు పతాకం గులాబీ పూలు సూర్యునికి తిరిగే పొద్దు తిరుగుడు పూలు
పూల రైతులకు ఆధారాలు
పూల పేర్లతో రాసే మధురమైన పాటలు
పూలతో చేసే పరిమళ ద్రవ్యాలు ప్రకృతిలో నిమగ్నమై ఉన్న పూలు అందమైన అరుదైన పూలు ఆడవారికి ఎంతో ప్రీతికరమైన పూలు దండగా మారి కురులకు అందాన్ని ఇచ్చే పూలు
వివిధ రుతువుల్లో విరిసేపూలు సంతరించుకున్నవి ఎన్నో విలువలు
– టి. భవ్యశ్రీ, 9 వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

పూలండోయ్‌ పూలు

అందమైన పరిమళాలు వెదజల్లే పుష్పాలు
పూస్తాయి తోటల్లో
కోస్తాము బుట్టలలో Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

సిగ్గు పడలేదు నేను… – అనామక

మా ఇంట్లో సహాయం చేసే ఆమె
‘‘ఇన్ని రోజులలో అస్సలు డుమ్మా కొట్టలేదు కదా..
ఇప్పుడు ఓ రోజు రాలేదని జీతం కట్‌ చేసారు. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చిగురుటాకులు – నాంపల్లి సుజాత

వీళ్ళు నిన్నో మొన్నో
బడిచెట్టుమీద వాలిన చిట్టి పిట్టలు
మిలమిలా మెరుస్తున్న కళ్ళతో Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

జులై 2025

జులై 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ట్రాన్స్‌ కమ్యూనిటీ అంశాల మీద రచనలు రావాలి – కొండవీటి సత్యవతి

ఎనభైలలో తెలుగు సాహిత్యంలోకి ఉధృతమైన వరదలాగా వెల్లువెత్తి వచ్చిన స్త్రీవాదం తెలుగు సమాజం మీద, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేసింది. అప్పటి వరకు పురుష ధృక్కోణంలో మాత్రమే వెలువడిన రచనలు స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తితో వందలాది రచయిత్రులు అప్పటి వరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా ఉన్న అనేకానేక కొత్త అంశాలతో దూసుకొచ్చారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

నమస్కారం.
జూన్‌ 2025 సంచికలో ‘‘వివక్ష’’ కథ చాలా బాగుంది. నిజంగా రిజర్వేషను వల్ల దళితులందరికీ న్యాయం కలుగుతుందా అంటే లేదనే చెబుతాను నేను. చాలా కుటుంబాలను చూసే ఈ నాలుగు మాటలు చెప్పాలనుకొంటున్నాను. నేను చూసిన ఒక యస్‌పి కుటుంబంలో పిల్లలందరూ డాక్టరులే. ఒక కలెక్టరు కుటుంబంలో అందరూ చక్కగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మన లాలూ ప్రసాద్‌గారి కుటుంబం అంతా చాలా బాగు పడ్డారు. Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ప్రతిస్పందన

గౌరవనీయులు భూమిక సంపాదకులు సత్యవతి గారికి నమస్కారం!
భూమిక స్త్రీవాద పత్రికను క్రమం తప్పకుండా ఆసాంతం చదివే పాఠకుల్లో నేనొకడ్ని. గీతారామస్వామి గారి జీవితానుభవాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఆమెకూ, అనువాదకులు ప్రభాకర్‌ గారికి అభినందనలు. Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

సంవేదం – జె. కనకదుర్గ

అత్తగారిని బస్సెక్కించటానికి భర్త వెళ్ళగానే అమ్మయ్య! అని అనుకొంది అనూష. నెల రోజుల నుండి తీరికలేని పని. పని చేయొచ్చుగానీ తనని తన వాళ్ళని అత్త సూటీపోటి మాటలంటుంటే భరించటం కష్టమయింది. అలా అంటుంటే కోడలు పడి ఉండాలి గాని ఎదురు సమాధానం చెబితే ఆయనకు ఫిర్యాదు చేస్తుంది. తనమీద ఆయనకు కోపం తెప్పిస్తుంది. ఆఫీసు నుండి రాగానే తల్లి మాటలు విని భర్త తగాదా పెట్టుకొంటాడు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment