బిడ్డను మింగిన తండ్రి – యమ్‌. అనిత, 8వ తరగతి, సమతా నిలయం, వర్ణి.

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొదలతో పచ్చని చెట్లతో నిండి ఉన్నది. ఆ ఊరి పేరు రామంపేట్‌. ఆ గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారి ఇద్దరి పేర్లు రమణ, వెంకటేష్‌. వాళ్ళకి ఒక కొడుకు కూతురు. ఇద్దరు చదువుకొనేవారు. వాళ్ళ పేర్లు అనూష, పవన్‌. వెంకటేష్‌ వాళ్ళకి కొద్దిగా పొలం ఉండేది. పొలం పనికి వెళ్ళేవాడు. రమణ ఇంట్లోనే పని చేసుకుంటూ బీడీలు చేస్తూ ఉండేది. ఒక రోజు అనూష వాళ్ళ అమ్మకి జ్వరం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

ఆ తప్పిపోయిన పిల్లడు… మళ్ళీ దొరికాడు! – అపర్ణ తోట

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం… మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని ప్రేమగా ఇస్తే!! Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

అల్లూరయ్య మైసూర్‌ పాక్‌ – రమాసుందరి బత్తుల

1 జులై, 1991
జీతాలు వచ్చాయి. ఆఫీసులో సందడి మొదలియ్యింది. కొలీగ్‌ దగ్గర రెవెన్యూ స్టాంప్‌ అడుక్కొని, నోటితో తడిచేసి అంటించి కేషియర్‌ దగ్గర సంతకం పెట్టి డబ్బులు తీసుకొన్నాను. ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టుకొన్నాను. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఆ పందొనిమిది వందల యాభై ఆరు రూపాయలే. భద్రంగా పర్సులో దాచుకొని బస్‌ ఎక్కాను. ఒంగోల్లో దిగాక అల్లురయ్య కొట్టుకి వెళ్ళి అరకేజీ మైసూర్‌ పాకు అరిటాకులో ప్యాక్‌ చేయించుకొని పాతిక Continue reading →

Share
Posted in moduga poolu | Leave a comment

శ్రీమతి ఝాన్సీ కె.వి. కుమారి అం’తరంగం’ – డా|| సి. భవానీదేవి

ప్రముఖ రచయిత్రి ఝాన్సీ కె.వి. కుమారి మానస సముద్రం లోంచి ఎగిసిన తరంగాలు ఈ కాలమ్‌ వ్యాసాలు. నాలుగేళ్ళు వార్త ‘చెలి’ పేజీలో ధారావాహికగా వెలువడిన ఈ వ్యాఖ్యాన పరంపర అనేక సామాజికాంశాలపై విల్లెక్కుపెట్టి పదునైన బాణాలను సంధించింది. బలమైన తార్కికశక్తితో భాషామాధుర్యం భావపటుత్వం, విశ్లేషణా వైశిత్యం, సుకుమార చమత్కారం, విసిరే వ్యంగ్యాస్త్రాలతో హేతుబద్ధంగా పాఠకుల్ని ఆలోచింపచేయగల సత్యాన్వేషణాంత Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

భూమిక – బి. గోవర్ధన

నేనొస్తూ!
వసంతాన్ని మూటగట్టి తెస్తాను
ప్రేమ పుష్పాన్ని.. పండు వెన్నెల్ని
సుగంధ పరిమళాన్ని.. పచ్చదనాన్ని
ఎడారిలో నీటి చెలమను.. సప్తవర్ణాల స్వప్నాన్ని తోడ్కొనివస్తాను-
– ఇంకా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

స్కార్ఫ్‌ – నాంపల్లి సుజాత

అది మా నాయనమ్మ అరికట్లమే
అందంగా ‘స్కార్ఫ్‌’ అంటున్నారీ అమ్మాయిలు.
ముద్దబంతి ముఖాలకు బిగించిన పరదాలు
బాండేజీ కట్లల్లోంచి మిటకరించే రెండు గుడ్లు
బందిపోటు రాణియో, బందూకు ధారిణియో అనిపిస్తుంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గాయాలెన్నయినా…! – పొద్దుటూరి మాధవీలత

చీకటికి భయపడి సూర్యుడు
ఉదయించడం మానేస్తాడా…?
నలుపురంగు పులిమాడని
కోయిల పాడటం మానేసిందా…! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

‘వెలుగుపూలు’ – ఝాన్సీ కె.వి. కుమారి

నువ్వు రంగురంగుల
సీతాకోక చిలుకలా
ఆడుతూ పాడుతుండడం
వాడు సహించలేడు
నీ రెక్కల విన్యాసాన్ని
వాడి గుండె ఓర్వలేదు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పేమ్ర పప్రంచం – జె. రాజు, 10వ తరగతి, సమతా నిలయం.

సినిమా సీరియళ్ళు
నా కళ్ళను రక్షణ కవచంలా చేసుకునే
కనురెప్ప కొట్టకుండా
టి.వి. ముందు వాలిపొయ్యా
నా మనస్సులో ఆకర్షణ మొలకలు ఉదయిస్తూ Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

టివి – ముళ్ళకంచె- సాయితేజ, 10వ తరగతి సమతా నిలయం.

రే చిన్నా ……… ఎంచేస్తున్నవురా…?
గంటలు గంటలు టివి చూస్తున్నవా
అదినీ బాల్యాన్ని మింగేస్తుందిరా
అదినీ తెలివి తేటల్ని నాశనం చేస్తుంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నీకు నువ్వే – యు.హెచ్‌. వేదన

నీకు నువ్వే ధైర్యం
నీకు నువ్వే సైన్యం
ఎవరైనా ఎప్పుడూ వెనకవుండి నడిపించరు
తల్లైనా, తండ్రైనా ఎవరైనా…
నీకు నువ్వే స్థైర్యం
నీకు నువ్వే చైతన్యం
ఎవరైనా ఎప్పుడూ మన ముందు వుండి దారి చూపరు
అన్నైనా, అక్కైనా ఎవరైనా….
నీకు నువ్వే బలం
నీకు నువ్వే బలగం
ఎవరైనా ఎప్పుడూ మన పక్కనుండి అడుగు వేయించరు
హితులైనా, స్నేహితులైనా ఎవరైనా….
నీకు నువ్వే స్నేహం
నీకు నువ్వే ‘మనం’.
మనసు దుఃఖభరితమైనప్పుడు
గుండె పగిలి పొగిలినపుడు
హృదయం విచలితమైనపుడు
హత్తుకొని సేదతీర్చాల్సిన హస్తాలు కరువైన చోట
నీకు నువ్వే ఓదార్పు
నీకు నువ్వే సాంత్వన
దుఃఖ చెలమను మధించి
గుండెను దృఢంగ మలచి
హృదయ వేదన మరల్చి
బ్రతుకు పోరున నిల్చిన
నీకు నువ్వే ధైర్యం
నీకు నువ్వే సైన్యం

Share
Posted in కవితలు | Leave a comment

వర్తమాన లేఖ- శిలాలోలిత

ప్రియమైన హిమజా,

ఏం చేస్తున్నావ్‌? ఆ మధ్య కలిసిన ప్పుడు ‘కాలు’ సహాయ నిరాకరణోద్యమం చేస్తుందన్నావ్‌? ఇప్పుడెలా వుంది? మనసు నిండిన శరీరమే మనదనుకుంటాం గానీ, అప్పుడప్పుడు ఆకాశమల్లెల్ని ఇలా నేలమీదికి లాక్కొచ్చి, నేనున్నాను చూడండంటూ శరీరం గుర్తు చేస్తూ వుంటుంది. Continue reading →

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

చాప్టర్‌ – 16
స్త్రీలపై అత్యాచారాలకు కుల మత రాజకీయాలు, తత్ఫలితమైన సంఘర్షణలు రాజ్యాధికార ప్రయోగాలు, కారణం కావటం మరొక వాస్తవం. గుజరాత్‌లో 2002 ఫిబ్రవరి 27న గోదా రైల్వే స్టేషన్‌ దగ్గర సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌ను స్థానిక ముస్లిం గుంపు తగలబెట్టి 58 మంది సజీవ దహనానికి పాల్పడ్డదన్న నెపంతో ఫిబ్రవరి 28 నుండి గుజరాత్‌లోని 18 జిల్లాలలో అనేకచోట్ల ముస్లిం ప్రజానీకంపై జరిగిన మూకుమ్మడి దాడులలో Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకు లేవు? – జూపాక సుభద్ర

నాకు పాకి పని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూడుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరిదారి యింట్ల కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమ న్నడట. సెయ్యనంటె వూడిసే పని పోతదో ఏమో! ఎట్ల బత్కాలె, పాకామె గూడనా అసోంటి ఆడమనిషే గద ఆమె  జేసినపుడు నేంగూడ జేత్తనుకున్నది. ముక్కుకు Continue reading →

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన – గ్రామీణ మహిళలకు శిక్షణ – మహిళా సమత సొసైటి

_DSC3825 copy _DSC4022 copyగ్రామీణ స్త్రీల జీవితాలపై ఎలాంటి విషయాలు ప్రభావం చూపుతున్నాయి మరియు స్త్రీల స్థితి, పరిస్థితులు వారికున్న అవకాశాలను గురించి వారు ఆలోచించు కునే మార్గాలను / వేదికలను ఏర్పాటు చేయుటకు కావలసిన అనుకూల వాతావర ణాన్ని కల్పించుటకు మహిళా సమత సొసైటి ‘గ్రామీణ పేద స్త్రీలను విద్య ద్వారా స్వశక్తి వంతులను’ చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 1993 నుండి మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మా పసలపూడి కథలు – వంశీ – ఉమామహేశ్వరి నూతక్కి

యాంత్రికమైన జీవితం… రణగొణ ధ్వనులు… మనస్సుల్లోనూ… మనుష్యుల మధ్యా పెరిగిన కాలుష్యం… వీటి నుంచి దూరంగా పచ్చటి పొలాలు… స్వచ్ఛమైన మనుష్యులు… మధురమైన మట్టి వాసన… ఇవి ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. జీవితం మీద మళ్ళీ ఆశ చిగురిస్తుంది కదూ! ఇలాంటి మధురానుభూతుల్ని మనకందించే పుస్తకం వంశీ వ్రాసిన ‘మా పసలపూడి కథలు’. వంశీ చిత్రాలు మనకు అందరికీ పరిచయమే. వెన్నెల్లో హాయ్‌, హాయ్‌, Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment