నిషిద్ధ రక్తం – నరేష్కుమార

ఔను మిత్రమా….!

నేనిప్పుడు ఆమె నిషిద్ద దుఃఖం

గురించే రాస్తున్నాను

తరతరాలుగా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అలజడులు – నా అంతరంగ ఆవిష్కరణలు- కొండవీటి సత్యవతి

జీవితం కట్టుకొయ్యకు కట్టేసినట్టు అనిపించిందంటే

కనబడని కట్లను విప్పుకోవడం మొదలెట్టాల్సిందే!!

ఎవ్వరూ ఆపకపోయిన నీ దారుల్లో నువ్వెళ్ళలేకపోతున్నా వంటే Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం- కాత్యాయని విద్మహే

ఈ దశకంలో స్త్రీలపై హింస కొత్తరూపాలను తీసుకొన్నది. కుటుంబ హింస, పెత్తందారీ దౌర్జన్యాలు, రాజ్యహింస ముప్పేటలుగా స్త్రీల జీవితాన్ని ఊపిరాడనీయకుండా చేసాయి. కుటుంబంలో వరకట్న హత్యలు, గర్భస్థ ఆడ శిశుహత్యలు యధాతథంగా కొనసాగాయి. యాసిడ్‌ పోసి, తాగించి అత్యంత క్రూరంగా స్త్రీలను హింసించటం కనబడుతుంది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

”సీకటి సుక్కలు జాబిలి మొక్కలు నాటాలె”- వి. ప్రతిమ

కులం పునాదులమీద దేన్నీ నిర్మించలేం… ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం… కులం పునాదిమీద దేన్నయినా నిర్మించడానికి ప్రయత్నించినా అది పగిలి ముక్కలుకాక తప్పదు. అట్టిదేదీ సంపూర్ణ నిర్మాణంగా మనజాలదు… కులాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తేనే తప్ప Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

జయహో ‘పల్లె వెలుగు’ – రమాసుందరి బత్తుల

ఈ బస్సులతో నాకు ఎంత కాలం సాంగత్యం? పదహారేళ్ళ పైగా అవలా? ఇంట్లో వండిన ఘుమఘుమలను టిఫిన్‌ బాక్స్‌లో కుక్కుకొని, పది గంటల బస్సు పట్టుకొని… కిటికీ వార సీటు ఎక్కడ దొరికితే అక్కడికి శరీరాన్ని చేర్చి …. బిగుసుకొని పోయిన అద్దాల్నీ బలం కొద్దీ వెనక్కులాగి …. మురికి చువ్వలపై చేతులు Continue reading →

Share
Posted in moduga poolu | Leave a comment

తెలుగు కథ – రజక మహిళ- ఆచార్య మూలె విజయలక్ష్మి

అనాదిగా కులం వృత్తి ముడిపడి ఉన్న సంబంధం. నేడు ముడిసడలింది. ప్రపంచీకరణ యాంత్రికీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కాని సమాజంలో కులాలస్థిరీకరణ నెలకొని వుంది. కులవృత్తి కూడు పెట్తుందని పెద్దతరం ఆశ. తరతరాలుగా సాగాలని కోరుకుంటారు. పల్లెల్లోవ్యవసాయం, Continue reading →

Share
Posted in వ్యాసం | 2 Comments

వర్తమాన లేఖ

పియమైన పద్మజా!

ఎలా ఉన్నావ్‌? మీ ఆఫీస్‌ వర్క్‌ ఇంకా అలా ఒత్తిడిగానే నడుస్తోందా? ఆడిట్లతో బిజీగా ఉన్నానన్నావ్‌? సిటీలో ఉంటూ కూడా ఒకళ్ళనొకళ్ళం కలుసుకోలేకపోతున్నాం. కనీసం ఫోన్‌క్కూడా కుదరడం లేదు. ‘వారు స్పందించుటలేదు. మీ ఫోన్‌ మాకు విలువైంది. దయచేసి వేచి ఉండండి. ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియాలో ఉన్నారు’ – Continue reading →

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

దశాబ్దాల పోరాట చరిత్రకు చిచ్చు – హైకోర్టు మార్గదర్శకాలు- హేమలలిత

ప్రముఖ మహిళా విప్లవకారిణి క్లారాజెట్కిన్‌తో లెనిన్‌ ఓ మాట అంటారు. ‘చట్టం ప్రాతిపదిక మాత్రమే చట్ట సమానత్వం సంపూర్ణ సమానత్వం కాదని, యిది నూటికి నూరుపాళ్ళు వాస్తవమే’. సమానత్వం కోసం చట్టాల్ని ప్రాతిపదిక చేసుకోవాలని ఆపై సంపూర్ణ సమానత్వం పొందడంలో చట్టం Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

వృద్ధాశ్రమము – రుక్మిణీ గోపాల

ాంతమ్మకు ఎనభై ఏళ్లు నిండాయి. వృద్ధాప్యంలోకి ప్రవేశించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆమె విధవరాలు. పదేళ్లపై నుంచి వైధవ్యాన్ని అనుభవించింది. ఎవరో ఎవరినో అడిగారట, ‘భార్యలకంటె భర్తలే ముందు చనిపోతున్నారు, కారణం ఏమిటని?’ అని భర్త కంటె భార్య తక్కువ వయసునులో ఉంటుంది, Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

అల్లరి చీమకు బుద్ధొచ్చింది

అదో చిట్టడవి. ఒక రోజు మిత్రులైన కుందేలు, ఉడుత ఆట పాటల్లో మునిగిపోయాయి. అంతలో ఓ చీమ వచ్చి ఉడుతను చటుక్కున కుట్టసాగింది. కుందేలు వారించబోతే దానిని కూడా కుట్టి పకపకా నవ్వింది. అది చూసి గాల్లో ఎగురుతున్న ఓ పిచ్చుక కిందకు దిగి ‘ఓ అల్లరి చీమా! ఇతరులను హింసించి వినోదించడం మంచి పని కాదు’ అంది. Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జన్యుమార్పిడి పరీక్షలకు అనుమతులు : జీవావరణ కాలుష్యానికి రాచమార్గం అసాధారణ ప్రభుత్వ నిర్ణయం – – డా|| డి. నరసింహారెడ్డి

జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ వీరప్ప మొయిలీ అనుమతివ్వడం వివాదాస్పదమయింది. దీనికి సుదీర్ఘ నేపథ్యం ఉంది. 2002లో బిటి ప్రత్తి విత్తనాలకు అనుమతివ్వడం దగ్గరినుంచి మనదేశంలో వివాదం మొదలయ్యింది. అప్పటి అనుమతులు క్షేత్ర పరీక్షల ఫలితాల ఆధారంగా చేయలేదని, అసలు క్షేత్ర పరీక్షల సమాచారం, Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

1

Share
Posted in Uncategorized | Leave a comment

నిత్య చైతన్యశీలి మల్లాది సుబ్బమ్మ

నేను1975లో ఒక కుగ్రామం నుంచి బయలుదేరి మహానగరంలో అడుగు పెట్టిన తొలిరోజులు. మా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు కూడా దాటి ఎరగని నేను హైదరాబాదులో గుబులు గుబులుగా గడుపుతున్న కాలం. ఎమర్జన్సీ చీకటి కమ్ముకున్న రోజులు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కళాభిమానుల్ని ఆద్యంతం అలరించిన అమృతలత అపురూప అవార్డ్స్‌-2014 ప్రదానోత్సవం

– తుర్లపాటి లక్ష్మి

అది 11వ తేదీ ఆదివారం. మే నెల. దినమంతా ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరై చల్లబడుతున్న సాయం వేళ – భాగ్యనగర్‌ కళాభిమానులకు, కళాపిపాసకులకు ఒకింత సేద తీర్చి మానసికోల్లాసానికి వేదికై మధురానుభూతులు పంచినరోజు. సాహితీ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళామూర్తులను ‘మదర్స్‌డే’ సందర్భంగా – సగర్వంగా సత్కరించిన ‘అమృతలత – అపురూప పురస్కార ప్రదానోత్సవం – 2014’ కార్యక్రమం. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పెసర సత్తెమ్మ (అడ్డగూడురు)

మా పుట్టిల్లు అ   ఆడ్డగూడురు అయితే మానాయిన మొట్టమొదట కమ్యూనిస్టుల వొచ్చిండు. కమ్యూనిస్టు అనేదప్పుడు దాంట్లే ఈ ప్రజలతోగూడి ఇట్లా అన్యాయాలు జేత్తున్రు. జనమంతా మిది లంచాలు దీస్కోవటం యెట్టిపన్లుజేయటం ఆడోల్లతోని యెట్టిపన్లు జేయించుకోవటం గవుర్నమెంటు యివన్ని పోవాల్నంటే మనం ఈ కష్టంపోవాలంటె, మనందరం ఐక్యతగావాలె పోరాడాలె అనే పద్ధతిల మా నాయిన జెప్పేది.

Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మహిళోద్యమ శిఖరం మల్లాది సుబ్బమ్మ – డ

ా|| కనుపర్తి విజయబక్ష్‌

ఆమె పేరు వినని మహిళోద్యమ కార్యకర్తలు వుండరు. ఆమె ఉపన్యాసం విన్నవాళ్ళందరికీ తెలుసు. ఆమె గొంతెత్తి ఉపన్యసిస్తే అదొక జలపాతం వలె పైనుండి ఎగిసిపడుతు గలగల ప్రవహించవలసిందే! తాను చెప్పదలచుకొన్న అంశాన్ని ఏ రకమైన సంకోచం లేకుండా నిర్భీతిగ చెప్పటం ఆమె అలవాటు. Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment