ఓడిపోను !

– డా. తనువూరు శ్రీనివాసులురెడ

జ్యోతికి చాలా కోపంగా వుంది. ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నప్పుడు రౌడీ మూకతో చాలా గొడవ పడింది. అందరూ పదహారు ఇరవై లోపు వారే! అసమర్థులు.. విచక్షణారహిత శూన్యులు.. మర్యాద మన్నన చూపే రసాన్వేషణ. నీచ నికృష్ట నిర్భాగ్య భావి భారత పౌరులు !! Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

పునర్నిర్మాణము

రమా సుందరి

చెంప మీద చెయ్యి పెట్టి మోచేతిని బల్లకు ఆనించి నా ఎదురుగా కూర్చొని ఉంది మాలతి. ఇరవై తొమ్మిదేళ్ళ యువతి. గడ్డం క్రింద నొక్కు, తడి ఊరే కళ్ళు, సన్నని నవ్వుతోనే వెలిగి పోయే మొహం… ఈ మూడూ మారి ఉంటే నేను ఆమెను గుర్తు పట్టకపోదును. చూసి పన్నెండు ఏళ్ళు అవలా! నేను వచ్చానని తెలుసుకొని హడావుడిగా వచ్చింది. Continue reading →

Share
Posted in moduga poolu | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం

– కాత్యాయని విద్మహే

1990వ దశకం ప్రారంభంలో విద్యా ఉద్యోగాలలో వెనకబడిన వర్గాలకు మండల్‌ కమీషన్‌ చేసిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్స్‌ అమలుచేయాలని వి.పి.సింగ్‌ ప్రభుత్వం తలపెట్టినప్పుడు ప్రతిభకు తావులేకుండా పోతుందని, ప్రతిభావంతులు నష్టపోతారని కొన్ని వర్గాలు దానిని వ్యతిరేకించాయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మేడారం జాతర

– హిమజ

అడివి తల్లీబిడ్డల పండుగకు

గిరిపుత్రులే పెద్దలు

కొండా కోనలే విడిది నెలవులు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

వర్తమాన లేఖ

శిలాలోలిత 

ప్రియమైన ఇందిరా !

ఎలా ఉన్నావ్‌? నీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది. ఏమనుకోకు. ఈ నగరం మమ్మల్ని మనుషుల్లా ఉంచడం లేదు. ఎందుకు పరుగెత్తుతున్నామో ఎటు పరిగెత్తుతున్నామో తెలీకుండానే ఒకటే పరుగు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తున్నాం.

Continue reading →

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

20, 21 ఏప్రిల్‌ ఒంగోలులో జరిగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రెండవ మహాసభ – నివేదిక

  మందరపు హైమవతి

‘మనలో మనం’ అని 2009లో ఒకే వేదిక మీదకు వచ్చిన రచయిత్రులు 2010లో ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’ అనే పేరుతో ఒక సంఘం నిర్మించుకొన్నారు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల రచయిత్రుల సదస్సులు పెట్టి 2010 నుండి వార్షిక సదస్సులు, Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

చాసో కథలు

ఉమా మహేశ్వరి నూతక్కి

జీసస్‌ క్రీస్ట్‌ పేరుతో ఒక శకం మొదలయిందని మనకు తెలుసు. చరిత్రకారులు జీసస్‌ ముందు కాలాన్ని క్రీస్తు పూర్వమనీ తరవాత కాలాన్ని క్రీస్తు శకమనీ అన్నారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి యుగ విభజన చెయ్యవలసి వస్తే ఎవరి పేరు చెప్పుకోవాలి మనం? Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

దళిత మహిళల దేవిపోతలే ‘రాయక్క మాన్యమ్‌’

– కృపాకర్‌ మాదిగ

ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర రాసిన కథల సంపుటి ‘రాయక్క మాన్యమ్‌’ను 12-5-2014 సాయంత్రం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జోగినీ వ్యవస్థ నిర్మూలనా ఉద్యమ నాయకురాలు ఆజమ్మ మాట్లాడుతూ అనాదిగా అంటరానితనం, అణచివేతలకు గురౌతున్న దళిత మహిళల జీవితానుభవాలను కథలుగా రాసినందుకు జూపాక సుభద్ర అభినందనీయురాలు అన్నారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఆడపిల్లల్ని కాపాడుకునే దారేది?

– జూపాక సుభద్ర

ఈ ఐదేండ్లనుంచి ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా టీనేజి అమ్మాయిల మీద విపరీతంగా లైంగిక దాడులు, కిడ్నాపులు, అత్యాచారాలు ఎక్కువైనాయి. Continue reading →

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

స్త్రీ వాదం – చలం – మైదానం

 – డా|| పి. లోకేశ్వరి

ఇరవయ్యవ శతాబ్దానికి కొంత దూరం జరిగి చూస్తే బహుచిత్ర వర్ణక సంశోభితమై కనిపిస్తుంది. ఈ శతాబ్దంలో సాహిత్యంలో అంతకు ముందెన్నడూ రానన్ని ఉద్యమాలు, ధోరణులు కన్పిస్తున్నాయి. ఈ శతాబ్దంలో వచ్చిన సాహిత్య ధోరణులలో దేని విశిష్టత దానిదే అయినా స్త్రీవాద సాహిత్యం ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’

– డా|| రమా మెల్కోటె

వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తు న్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికి తెలిసిందే. కాని, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలు కాదు. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

‘వజ్రాల దుద్దుల జత’

– తంగిరాల వెంకట సుబ్బారావు

కవిమిత్రులు శ్రీ లకుమ బూదేశ్వరరావుగారు ”ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మీ ఫౌండేషన్‌ (యంయస్‌యస్‌యఫ్‌)” ను స్థాపించి, ఆ దివ్యగాయనీమణి గొప్పతనాన్ని తెలుగువారికి చాటి చెపుతూ, 2006లో ”స్మృతి కవిత” అనే 40 పుటల చిన్న గ్రంథాన్ని; 2012లో ”స్వరగంగ” అనే 300 పుటల పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఈ పుస్తకాలను చాలా అందంగా ముద్రించారు. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

ముజఫర్‌నగర్‌ నరమేధం – బాధితుల గోడు

– భండారు విజయ 

పచ్చని చెఱకు తోటలు తియ్యని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆకాశం అప్పుడప్పుడు జల్లెళ్ళతోటి వర్షాన్ని కుమ్మరిస్తోంది. రోడ్లన్ని బురదతో చితుకుచితుకుగా… చిత్తడయి దారి అంతా గుంటలు, రాళ్ళకుప్పలు, గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపినట్లుగా, ఎప్పుడు ఏ పార్టు కారు నుండి విడిపోతుందో తెలియదు. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర

(ముజఫర్‌నగర్‌ మారణకాండ) – అనిశెట్టి రజిత

మతం కన్నా మానవత్వం – కులం కన్నా గుణం

వర్ణం కన్నా వ్యక్తిత్వం – వర్గం కన్నా మనిషితనం గొప్పది.

మతమనేది తనలో తానొక సంపూర్ణ వ్యవస్థ కాదు. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

”ఇంకెన్నాళ్ళీ…?”

– వనజ తాతినేని

పొద్దస్తమానం టీవీతో కాలక్షేపం చేయలేక దానికి కాస్త విశ్రాంతినిచ్చి డాబా పై భాగం కి చేరాను. శీతాకాలం చల్లదనం ఒక్కసారిగా ఒళ్ళంతా తాకింది.. వెంటనే చీర చెంగుని భుజాల చుట్టూ కప్పుకుని చుట్టూరా చూసాను అభివృద్ధి సూచకంగా మా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాలు నియాన్‌ లైట్ల కాంతులలో మెరిసిపోతూ ఉంటే అక్కడక్కడా పురాతనమైన పూరి గుడిసెలు మినుకు మినుకుమంటూ మేమున్నామంటూ ఆ మాత్రం ఉనికిని చూపకపోతే ఎలా? అన్నట్టు ఉన్నాయి. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

అకాల వైధవ్యం బారిన చెంచు యువతులు – విషాదంలో నల్లమల

 – డా|| బెల్లి యాదయ్య

”భారతదేశం ఓ బహుత్వ సమాజం. అది ప్రజాస్వామ్యం, చట్టపాలన, వ్యక్తిగత స్వాతంత్య్రం, సామాజిక సంబంధాలు, (సాంస్కృతిక) వైవిధ్యాలతో అద్భుతాన్ని సృష్టిస్తుంది. బుద్ధిజీవిగా గడపడానికి ఎంత అద్భుత ప్రదేశం!… Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment