పిల్లల భూమిక

అమ్మ అంటే నాకు ఇష్టం

అమ్మ లేకపోతే కష్టం
అమ్మకు నేను ఇష్టం Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మే 2025

మే 2025

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

మహిళల శ్రమ అదృశ్యీకరణ (Invisible) – కొండవీటి సత్యవతి

హైదరాబాద్‌ వుమన్‌ రైటర్స్‌ ఫోరం ఆద్వర్యంలో ‘‘శ్రామిక మహిళలు-శ్రమ దోపిడీ’’ అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. ఎన్నో వృత్తులలో, ఎన్నెన్నో రంగాలలో పనిచేస్తున్న మహిళల అదృశ్యీకరణ (ఇన్విసిబుల్‌) మీద పన్నెండు మంది వివిధ రంగాల నుంచి మాట్లాడారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

5. అత్యవసర పరిస్థితి తర్వాత: మరోచోట మా జీవితాలు
అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత జీవితం మెరుగ్గా ఉండాల్సింది, కానీ మా విషయంలో అలా జరగలేదు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మేం చండీగఢ్‌ నుంచి దిల్లీకి మారాం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీసుల నుంచి మాకు పలాంటి ముప్పు పొంచి వుందో తెలీదు కాబట్టి 1980 వరకూ కూడా మేం ఉత్తరాదిలోనే ఉండిపోయాం. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఈనాటి బంధం ఏ నాటిదో?’ – చల్లా. సరోజినీదేవి

స్టాఫ్‌ మీటింగ్‌లో కొందరి ద్వంద్వ వైఖరి వల్ల సర్ది చెప్పి అందరినీ ఒక్క తాటి పైకి తెచ్చే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది HM హిమజకు.’’ ఛీ, పెత్తనం, పేడ తట్ట ఎత్తుకోవడమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు’’ అని అమ్మమ్మ చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అర్జంట్‌గా ఇంటికి వెళ్ళి, స్ట్రాంగ్‌ కాఫీ త్రాగితే గానీ ఈ తలనొప్పి తగ్గదు.’’ అనుకొంటూ బైక్‌ స్టార్ట్‌ చేసింది ఆమె. పది నిమిషాల్లోనే ఇల్లు చేరింది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

జెండర్‌, కుటుంబం, మగతనం : అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య – ఎ. సునీత

చేతి రాత పొందిగ్గా, కుదురుగా, అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలంటే ఇంకు పెన్ను వాడాలని స్కూల్లో టీచర్లు చెప్తారు. దానితో జాగ్రత్తగా, ఓపిగ్గా రాయాలి. పెన్నుని మరీ అదిమిపెట్టి రాస్తే పేపరు చిరుగుతుంది. పెన్నుతో పాటు ఇంకు సీసా పక్కన పెట్టుకోవటం తప్పనిసరి. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది! – అపర్ణ తోట

రోడ్డు మీదకు వెళ్ళు. మనుషులే మనుషులు. రైల్వే స్టేషన్‌, సిటీ బస్సులు, టూరిస్ట్‌ ప్రదేశాలు, హైకింగ్లు, సెలవలు, సరదాలు. అంతటా పరుచుకున్నదెవరు? ఎవరెవరు? ఎవరబ్బా? Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ఉద్యమ నేపథ్యం కలిగిన వేదమ్మ గారితో ముఖాముఖి – పైడిమర్రి గిరిజ

మూడు సంవత్సరాల కిందట సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ సభలో వేదమ్మ గారు పాడిన పాటలు, ఆమె ఉత్సాహం నన్ను ఉత్తేజపరిచాయి. ఈ వయసులో స్మార్ట్‌ ఫోన్‌్‌తో ఫోటోలు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సంఘం పనుల కోసం అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చురుకుదనానికి ముగ్ధురాలినయ్యాను. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

శ్రామిక మహిళ – అవగాహన సదస్సు – గిరిజ పైడిమర్రి

తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి మహిళ మీద వచ్చినన్ని రచనలు శ్రామిక మహిళ పైన రాలేదనే చెప్పాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని సాహిత్యంలోకి తీసుక వచ్చి పాఠకులకు తెలియపరచవలసిన బాధ్యత రచయితలదే.. అందులో భాగంగా హస్మిత ప్రచురణ సంస్థ ఆ బాధ్యతను తీసుకుంది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సావిత్రిబాయి ఫూలే మహాగ్రంథం – దళిత శ్రీశ్రీ గడ్డం విజయరావు

సావిత్రిబాయి ఫూలే అనే ఈ మహా గ్రంథాన్ని ఐదు సంవత్సరాలుగా పరిశోధించి మహాకవి అభినవ అంబేడ్కర్‌ డా॥కత్తి పద్మారావు గారు వ్రాశారు. ఈ గ్రంథం వ్రాయడానికి సంబంధించిన దృక్పథాన్ని వారు వ్రాసిన పీఠికలో ఇలా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భారతదేశ సాంస్కృతిక విప్లవ పోరాట స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే. స్త్రీ విముక్తి ప్రధాత, మానవాభ్యుదయ వికాస జీవన వ్యవస్థల పునర్‌ నిర్మాణకర్త. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మీ ప్రవర్తన మిమ్మల్ని రక్షించాలి: రోడ్డు భద్రతపై అవగాహన – డా.ఎ.కళ్యాణి, ఎ.వాణి

చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికరణ, నగరీకరణ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్‌) వలన వాహనాల రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

వేదికపై ప్రధాన పాత్రను పోషించే ఐశ్వర్య – పూంగొడి మదియరసు / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

వేలూర్‌ జిల్లాకు చెందిన ఐశ్వర్య ఒక తిరుణంగై (ట్రాన్స్‌మహిళ). సమాజంలో ఆత్మగౌరవంతో, మర్యాదపూర్వకంగా బతకడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో సొంత డ్రామా కంపెనీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఈ కథనం చెబుతోంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బ్రిటిషాంధ్రలో వితంతువుల దుస్థితి: ప్రొఫెసర్‌ మామిడిపూడి వెంకట రంగయ్య మాటల్లో – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ పాలనా కాలం నాటి ఆంధ్రలో బాల్య వివాహ దురాచారం విలయతాండవం చేసేది. దీని ప్రధాన బాధితులు బాలికలు / స్త్రీలు. బాల్య వివాహాలు అనేక అనుషంగిక సమస్యలకు దారి తీసేవి. బాలికల బాల్యానుభవాన్ని హరించి, వారి విద్యావకాశాలకు తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ఈ వివాహాలు, చాలా వరకు అసమ వివాహాలు కూడా. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హిందువంటె ఏంది బిడ్డా! – జూపాక సుభద్ర

నా ప్రమేయం లేకుండనే నా కుల సర్టిఫికట్‌ లోకి ‘హిందుమతం’ అనే పేరు ఎట్లోచ్చిందో తెలువది. మా యింట్ల మా వాడల కూడా ‘హిందూమతం’ అనే మాట వాడుకలో లేదు. మరి నా సర్టిఫికట్లోకి నేను హిందువని ఎట్లా ఎక్కింది? మా కుటుంబం, కులం ఆ హిందూ పదం’ తో ఐడెంటిఫై కాలే. అది అనరు, మాట్లాడరు. మరి ఎక్కడిది ఈ పదం! Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వితంతు ప్రక్రియ ఎంత అమానవీయం – సంయుక్త

‘‘ఊలు దారాలతో గొంతు కురిబిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆడపిల్ల – – ఎం డి.ఖాజామైనద్దీన్‌

ఎదపూసినపువ్వు
ఆత్మీయతను పంచే వెన్నెల
ఆకాశంలో మెరిసే తారక Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment