గంగకి వరదొచ్చింది

గంగ అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్ర లేచింది. కళ్ళల్లో ఇసుక కూరినట్లు మంటగా వుంది. కళ్ళు తెరవలేకపోయింది. మంచం మీద అలాగే కూలబడింది. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటనలు పదే పదే సినిమా రీళ్ళల్లా కళ్ళముందు కదలాడ్డం, అవమానంతో, ఉక్రోషంతో మంచం మీద పడుకోలేక పోయింది. కన్నీళ్ళ చారికలు తెల్లారాక కూడా అలాగే వున్నాయి.
Continue reading →

Share
Posted in కథలు | 1 Comment

మటుక్‌నాథ్‌లూ – మీడియా గమ్మత్తులూ

-సుధా అరోరా (అనువాదం: ఆర్. శాంతసుందరి)

కొన్నాళ్ళ క్రితం ప్రొఫెసర్ మటుక్‌నాథ్ చౌధరి ‘ప్రేమ’ అనే విషయంపై పాట్నాలో ఒక సెమినార్‌ని నిర్వహించాడు. సెమినార్ ముగిసాక శ్రీమతి ఆభా చౌధరి స్టేజెక్కి తన అభ్యంతరాన్ని తెలిపింది. తన భర్త ప్రేమ వ్యవహారాలన్నీ బట్టబయలు చేద్దామని ప్రయత్నించింది. కానీ ఒక్కరు కూడా నోరు విప్పలేదు. మీడియా గాని, వార్తా పత్రికలు గాని ఈ మాటల్ని తమ రిపోర్టులో చేర్చలేదు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

లాభం- నష్టం- మానవ సంబంధాల బలి

-కరుణ

నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో టైపు కూడా నేర్చుకునేదాన్ని. అప్పుడు ఖాళీగా వున్నానూ అంటే నా కాలివేళ్లూ, చేతివేళ్లూ నాకు తెలియకుండానే ‘ఎ, ఎస్,డి,ఎఫ్’లను కొడుతుండేవి. ‘నాకు’ అంటే ‘ఎన్ ఏ ఏ కె యు’ అని ఇలా ఏ పదం గుర్తొస్తే (అది తెలుగైనా, ఇంగ్లీషైనా) ఆ పదాన్ని నా కాలి, చేతి వేళ్లు టైపు చేస్తున్నట్టుగా కదిలేవి. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

ఢిల్లీ నానీలు

-టి. సంపత్ కుమార్; టి. మాధవీలత

ఎప్పటికీ వాడని
తెల్ల కలువ
బహాయ్
రాతి చెమ్మల చలువ Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

లేడీ కండక్టరు

-ఉదయమిత్ర

క్యాష్ బ్యాగ్‌ భుజాన వేసింది మొదలు
క్యాష్ డౌన్ జేసిందాకా
బతుకంతా యుద్ధమే…
…………………….. Continue reading →

Share
Posted in కవితలు | 2 Comments

ఇప్పటికి…

-కె. పుష్పాదేవి

పోయి పదవరోజు
పూసలు తెగాయి
కాదు…
ఉరి రద్దు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

సజీవ కవిత

-శీలా సుభద్రా దేవి

తలపులకి గొళ్ళెం బిగించి
రెప్పలకింద స్వప్నాల్ని కట్టేసి
అలసిపోయిన శరీరాన్ని పక్కపై జారుస్తాను
కాసేపైనా విశ్రాంతి తీసుకొంటానో లేదో Continue reading →

Share
Posted in కవితలు | 3 Comments

నేల రాలిన మొగ్గ

-అంజనా బక్షీ

నా మూగ భాషని
నీకు వినిపించగలిగి వుంటే ఎంత బావుండేది!
నా కోరికల గొంతుని
అప్పుడైతే నొక్కేసి వుండేదానివి కాదేమో! Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

స్త్రీలకొక ప్రాంతీయ అస్తిత్వం వుందా?

నిన్న విశాఖ నుంచి మల్లేశ్వరి అనే లెక్చరర్ ఫోన్ చేసింది.

“కోస్తా ఆంధ్రా స్త్రీల గురించి తెలంగాణా వాదులు ఏదేదో అసహ్యంగా మాట్లాడుతున్నారుట కదా మీ దాకా రాలేదా?” అంది.

“… ఏమో రాలేదు. వచ్చినా ఆశ్చర్యపోను. ఎందుకంటే భారీ ఎత్తున ఒకసారి ఆశ్చర్యపోయి గట్టిగా నాలుగేళ్ళూ కాలేదు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఒక వర్షం-ఒక దుఃఖం

-మూలం: సారా జోసెఫ్ (అనువాదం- డా. దేవరాజు మహారాజు)

మిట్ట మధ్యాహ్నం అనుకోకుండా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. ప్రారంభమే కుండపోతగా వుంది.

ఆమె పడమటి గది తలుపులు గబగబా వేసేసింది. కిటికీ తలుపులు లాగేసింది. ఒక కిటికీ రెక్క మాత్రం తెరచి, వర్షపు ఉధృతాన్ని గమనించసాగింది. దూరంగా పడమటి కొండల్లోంచి ఉరకలెత్తుతున్న నీటి ప్రవాహ వేగం మంద్ర స్థాయిలో వినిపిస్తోంది. Continue reading →

Share
Posted in కథలు | 5 Comments

రెండు దశాబ్దాల స్తీల్ర పయ్రాణం

స్త్రీలంటే శరీరాలు, స్త్రీలంటే పని… స్త్రీలంటే కన్నీళ్ళు, కష్టాలు… స్త్రీలంటే శృంగార సాహిత్య రూపాలు మాత్రమే అయిన సామాజిక సందర్భం నుండి స్త్రీలకి శరీరమూ, హృదయమూ, మెదడూ వున్నాయనీ, వాటికి సరయిన వ్యాయామం యివ్వాలనీ గుర్తించి, పితృస్వామ్య సంస్కృతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లిన మాయాజాలమును బద్దలు కొట్టి స్త్రీవాద భావజాలం తెలుగు పౌర సమాజంలో విస్తరించడానికీ, వేరుచుకొనడానికీ చేసిన పోరాటం, ఆ క్రమంలో సాహిత్యంలో వివిధ కోణాలనుండి బహుముఖీనంగా… Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అసలు నేనెలా వుండాలి?

-బంగార్రాజు

‘నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి’ ఈ కవితని తెలుగులో ఇటీవలే చదివాను. ఇంతకు ముందు ఇంటర్‌నెట్‌లో ఎవరో మెయిల్‌గా పంపితే చదివాను కాని తెలుగులో చదివినపుడు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర కమ్మింది. గుండెను పిండేయడం అంటే ఇదేనేమో! గృహ హింస విశ్వరూపాన్ని ఆవిష్కరించిన ఈ కవిత రాసిందెవరో తెలియకపోవడం ఎంత దురదృష్టం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కరుణ కాదు – కర్తవ్యం ముఖ్యం

-డా. మానేపల్లి

స్త్రీలు ఇంటా బయటా కష్టాలనెదుర్కొని, అభివృద్ధి సాధించి, ఇతరులకు కూడా ఉపయోగపడటం చాలా కష్ట సాధ్యం. పదహారేళ్ళ వయసులో-శాశ్వత అంగవైకల్యానికి గురయి – భయంకర బాధలు అనుభవించి, తట్టుకుని నిలబడినా, చివరికి నడుం కిందభాగం అంతా నిరుపయోగం కావడం- ఇక ఎప్పటికీ చక్రాల కుర్చీలో గడపవలసి రావడం- ఊహించడానికే బాధగా, భయంగా వుంటుంది. అంత జరిగినా సంకల్ప బలంతో, పట్టుదలతో కృషి – తనవంటి వికలాంగుల కోసం ఒక సంస్థ ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తుండటం చాలా అరుదయిన విషయం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ప్రవేశం, ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్యం

-కృపాకర్ మాదిగ

రిజర్వేషన్లపై చర్చ, రిజర్వేషన్ల వర్గీకరణ మీద చర్చ ఇప్పుడు ఆసక్తిదాయకంగా జరుగుతోంది. మహిళలకోసం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ల బిల్లులో ఆయా సామాజిక వర్గాల మహిళలకు కోటాలు విధించిన అనంతరమే పార్లమెంటు ఆమోదించాలని మాయావతి, ములాయం సింగ్‌ తదితరులు డిమాండు చేస్తున్నారు. దళిత, ఆదివాసీ, ఓబీసి, మైనారిటీ మహిళల హక్కుల్ని గౌరవించేవారు ఈ డిమాండును బలపరుస్తున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 4 Comments

గృహ హింస చట్టం 2005 – ఒక పరిశీలన

-లక్కిరెడ్డి సత్తయ్య, గోడిశాల చంద్రమౌళి, గుగులోతు జాంబు

కొన్ని శతాబ్దాలుగా భారత సమాజంలో స్త్రీలకు, పురుషులకు సమానమైన అంతస్థు, హక్కులు లభించడం లేదు. పురుషులకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్య్రాలు స్త్రీలకు లోపించడమే కాకుండా, స్త్రీలు వారి జీవితంలో గృహ కృత్యాలకు మాత్రమే అంకితమైనది. అంతేకాక భారత స్త్రీలు అనేక అన్యాయాలకు, అరాచకాలకు గురి అయ్యారు. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్లే పారిశ్రామికాభివృద్ధి జరిగి స్త్రీలు, పురుషులతో పాటు సమానంగా ప్రబలడం కొరకు, స్త్రీలకూ సామాజిక న్యాయాన్ని చేకూర్చడం కోసం సరియైన అంతస్థు ప్రసాదించడం కోసం గత 150 సంవత్సరాల నుండి కృషి జరుగుతూనే వుంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

భూమిక: ఫిబ్రవరి 2007 సంచిక

Share
Posted in భూమిక సూచిక | Leave a comment