కళ్ళెర్రజేయవే చెల్లెమ్మా!

– డా. ఎస్వీ సత్యనారాయణ

మాయమాటలు నమ్మి చెల్లెమ్మా! – నువ్వు
మోసపోవద్దింక చెల్లెమ్మా!
పొగుడుతున్నారనీ చెల్లెమ్మా!- నువ్వు
పొంగిపోవద్దింక చెల్లెమ్మా! ||మాయ||
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

బాల్యం బంతాట

– పంతం సుజాత

తనిఖీ కొచ్చిన తాసిల్దారులా వస్తున్న హెడ్మిసెస్ని చూసి
చదువుతున్న వారపతిక్రను తిరగేసి దాచిన జాణతనం
టీచరొస్తున్న అలికిడై గార్డెన్లో కోసిన ముద్దబంతిని
యూనిఫాంలో దాచుకున్న గడుసుతనం ఏమైపోయిందో తెలీదు!… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ప్రకృతిని ప్రేమించే బాలప్రేమికులు

విద్యార్థుల పర్యావరణ కాంగెస్ర్లో
కలిగిందొక వింతైన అనుభూతి
బాలబాలికలే పార్లమెంటు సభ్యులు
ఓ సీతాకోక చిలుక స్పీకరమ్మ అవతారంలో Continue reading →

Share
Posted in కవితలు | 2 Comments

అమ్మ

– రేష్మ, డి.జి.టి మొదటి సంవత్సరం

పెదవులు కలుసుకున్న పత్రిసారీ గుర్తుకొచ్చేది నువ్వే…
కనురెప్పలు మూసుకున్న పత్రిసారీ వినిపించేది నీ జోలపాటలే…
శ్వాసపీల్చుకున్న పత్రిసారీ శాంతతనిచ్చేది నీ కమ్మని మాటలే…
నిజం తెలుసా అమ్మ! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆడదిక్కు

– లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి)

“అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది.

“ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది. Continue reading →

Share
Posted in కథలు | 4 Comments

గ్లోరియా స్టీనమ్

– ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి)

గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల సమావేశానికి బెంగుళూరు వచ్చారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

“కథలాంటి ఒక జీవిత కథ”

– సోమంచి పద్మావతి

ఒకరోజు వాసా ప్రభావతి గారినుండి ఫోను వచ్చింది. “పద్మావతిగారూ! ఇది విన్నారా? మల్లాది సుబ్బమ్మగారు, మంచం మీద నుంచి లేవటం లేదు పడిపోయారు, నేను వెళ్ళి చూసొచ్చేను” అని.

నేనీమధ్య జమ్మూ-కాశ్మీర్, అమృతసర్, పాకిస్థాన్కి, భారత్కి గల “వాఘా” బోర్డర్, చంబాలోయలు, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలు చూసిరావడానికి వెళ్ళేను. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

హుషారుగా జరిగిన రచయితుల్ర సమావేశం

– మంజుల

భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు. Continue reading →

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

‘రీ-చార్జ్’

‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం
కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’
సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన
యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

స్నేహ సంగమం

– శివలక్ష్మి

స్నేహ సౌరభాలు వెదజల్లే
కలయికలు కాంతిపేటికలు
వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు
మనిషిని మనిషి కలవడం Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పతిక్రల్లో స్త్రీల పేజీలు

– టి. దేవకీదేవి

పూర్వకాలంలో రచ్చబండ ద్వారా ప్రజలు వార్తలను తెలుసుకునేవారు. ముద్రణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రపంచంలోని నలుమూలల వార్తలన్నీ ప్రజల అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో మొదట మత పరంగా అటుపై సాహితీ పరంగా వార్తాపత్రికలు వెలువడ్డాయి. ఆ తర్వాత విభిన్న సమాచార విభాగాలు వార్తాపత్రికల్లోకి ప్రవేశించాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రియమైన అమ్మా… నాన్నా…

పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం

ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, పిల్లలకున్న కోరిక. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలా ఇరామ్

షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూ‌ర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఎడిటర్ గారికి

ఎడిటర్ గారికి,
జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం చేసుకున్నట్లనిపిస్తుంది. Continue reading →

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు

-అనామిక

గుండెకి పడ్డ చిల్లులకీ
మాటలతో చీరుకుపోయిన గాయాలకీ
నాకు నేనుగానే లేపనం రాసుకోవాలి.
నాకెన్నడూ పూలు కానుకగా రాలేదు. Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

మాయమవుతున్న మనసు

-డి.విజయకుమారి

(భూమిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

కోటమ్మ బాల్కనీలో కూచుంది, కొన్ని వందల సార్లు అలారమ్ గడియారం వంక చూసుంటది. ఇంకా తెల్లవారుజాము మూడే అయింది. తెల్లవారాలంటే మూడు గంటలయినా ఎదురు చూడాలి. తన గది తలుపులు తెరవాలంటే ఎనిమిది కావలిసిందే, అది తన కొడుకు ఆర్డర్. రోజూ వుండేదే అయినా ఈరోజు ఎందుకో మనసంతా కలతగా వుంది. మధ్య రాత్రినుండి అలా కూర్చునే వుంది. Continue reading →

Share
Posted in కథలు | 3 Comments