దీర్ఘాయువు గుట్టు చెప్పిన అక్క

– రాజేశ్వరి దివాకర్ల

వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, భర్తనూ వదిలి ఇల్లు విడిచి ఒంటరిగా బయలుదేరింది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

– పంతం సుజాత

ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది.

మూడు ప్రాంతాల భాషల మీద మంచి పట్టు ఉందని నిరూపించుకున్న రచయిత. ఓ పక్క తెలంగాణా భాష, మరో పక్క శ్రీకాకుళం యాస, కథకుడి మనసులో గోదావరి ఘోష.
Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ

తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్‌ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్‌. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా ఎదిగినందుకు హర్షాన్ని వ్యక్తపరిచారు. Continue reading →

Share
Posted in పుస్తకావిష్కరణ | Leave a comment

సన్నజీవాల సణుగుడు

– దీప్తి

సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్‌ చూస్తోంది.

ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ మాటలు చెవులోంచి మెదడుకు చేరుతున్నాయి.
Continue reading →

Share
Posted in కథలు | 1 Comment

భూమిక: ఏప్రిల్ 2007 సంచిక

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి

ప్రతిస్పందన

పునరుజ్జీవనం – చల్లపల్లి స్వరూపరాణి

సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం – శిఖామణి

చిలుక జోస్యం – ఎల్‌. మల్లిక్‌

నేను మనుషుల్ని ప్రేమిస్తాను – రోష్ని
Continue reading →

Share
Posted in భూమిక సూచిక | Leave a comment

మార్చి ఎనిమిది మార్గంలో…

సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం ఈ దేశంలోని ఆడవాళ్ళందరి సమస్యలను హాంఫట్ మని ఊదేయగలిగితే బాగానే వుంటుంది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

అభినందనలతో వ్రాయునది జనవరి-07 పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలోని స్త్రీ పాత్రలు – ఎలసాని వేదవతిగారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఒక్కొక్క కథలోని స్త్రీ పాత్రల విశ్లేషణ వేదవతిగారు బాగా చేశారు. లిడియో శాఖో గురించి ఆలోచించండి – ఓల్గాగారి రిపోర్టు చాలా బాగుంది. Continue reading →

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

2006లో వినిపించిన కవయితుల్ర గుండె చప్పుళ్ళు

– శీలాసుభద్రాదేవి

 
ఒకప్పుడు ఏడాదికి అతి తక్కువ సంఖ్యలో కవితా సంపుటాలు వెలువడేవి. అందులోనూ కవయిత్రుల పుస్తకాలు మరీ తక్కువ. ఇటీవల ఏడాదికి కవయిత్రుల పుస్తకాలే అయిదారుకు తక్కువ కాకుండా వస్తున్నాయి.

కవయిత్రుల కవిత్వం పట్ల చూపుతున్న ఆసక్తినీ, సృజనాత్మకతనీ, పోటీపడి ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొంటూ సమాజంలోని అనేక సమస్యల పట్ల తమ స్పందననీ తెలియజేస్తూ కవిత్వ రంగంలో ముందుకు దూసుకురావటం సంతోషకరమైన విషయం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

సరికొత్త దృశ్యం

– నంబూరి పరిపూర్ణ

బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు.

అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే.

తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు. Continue reading →

Share
Posted in కథలు | 5 Comments

సూర్యచందుల్న్రి మమేకం చేసిన కాంతిగోళం

ఆమె మార్గంలో నడుద్దాం- సావితిబ్రాయి ఫూలే

– కత్తి పద్మారావు

ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు పోరాట వీరులకు బాసటగా నిలచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలేది అద్వితీయ చరిత్ర. మార్క్స్కు జన్నీ ఎంతో సహకారాన్ని అందించింది. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రిబాయి ఫూలే మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫీమెల్ యూనక్

– పి. సత్యవతి

“ఏప్రిల్ యాష్లే” పుట్టింది మగ పుట్టుకే. అతని శరీర నిర్మాణం అంతా పురుష శరీర నిర్మాణమే. అయితే వచ్చిన చిక్కేమిటంటే అతనికి పురుషుడిగా వుండడం ఇష్టం లేదు. స్త్రీగా బ్రతకాలని చచ్చేంత కోరిక. అట్లా అని స్త్రీల పట్ల వ్యామోహమూ లేదు. పోనీ స్వలింగ ప్రేమ అంతకన్నా లేదు. అతని గోలంతా ఏమిటంటే తను స్త్రీ కావాలి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మానవీయ విలువల మంచుముత్యాల పతాకం

“పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించవచ్చు”- సరిగ్గా ఈ మాట ‘అంబికా అనంత్’ రాసిన ‘మంచుముత్యాలు’ (కథాసంపుటి) కు వర్తిస్తుంది. ఇందులో 14 కథలున్నాయి. ఇది పధ్నాలుగు జీవిత పార్శ్వాలు. ఏ ఒక్క కథా మరో కథలా వుండదు. విభిన్న కోణాలతో రచనా దృష్టిని చేస్తూ మానవీయ దృక్పథమే ప్రధానంగా ఈ రచయిత్రి దృష్టి కోణంలో నిలిచింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆగమ్మ

– ఇంటర్వ్యూ: జె. సుభద్ర

(వరంగల్ జిల్లాలో సర్పంచిగా పనిచేస్తున్న దళితురాలు ఆగమ్మ. పేరుకి ఆమె సర్పంచిగాని అధికారమంతా ఆమె కొడుకుదే. ఆగమ్మతో సుభద జరిపిన ఇంటర్వ్యూ.)

ప్రః చెప్పమ్మా ఎప్పుడు ఎన్నికయ్యావు నువ్వు, ఎవరు నిల్చోబెట్టారు, మీ పంచాయితీ గురించి చెప్పు…?
పంచాయితీ సంగతి కొడుక్కి తెలుసు గద నాకేం దెలుత్తది నన్ను నిలబెట్టుకున్నడు నేను మండలంబోత ఒత్త ఇంక ఏడికన్న తీస్కపోతె పోత అత్త. ఫొటోలు దించుకున్నరు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments

నా సంతోషం సొరకాయకూర వండడంలో లేదు సూర్యోదయంలో వుంది

వంట చెయ్యడమంటే నాకు పరమ చిరాకు.

దాన్నొక వృత్తిగా మలచి విశ్వవిద్యాలయాలు నడిపిస్తూ ఏటేటా వేలాది మంది సంస్థాపరమైన వంట నిపుణుల్ని దిగుమతి చేస్తున్నా సరే అవి నాకేమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. మూడు తరాల ఆడపిల్లలు కలలు కన్న ఎయిర్ హోస్టెస్ (గగన సఖి) ఉద్యోగం కూడా వంటకి అనుబంధమైన వడ్డన వుండటం వల్లనే అనాకర్షణీయంగా కనిపిస్తుంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 2 Comments

హెచ్.ఐ.వి హైకూలు

మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా!
నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది

కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు
ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

విడి విడి ఆకులు

– ఆర్.వి.ఎం.ఆర్.రత్నా రావు, పిఠాపురం

బోల్ తలాక్ తలాక్ తలాక్
ఇద్దరి విరసపు చరమాంకంలో చెరొక దారికై తలొక ఆకు
బేక్ర్ ది లాక్, టు షేక్ ది లా, ఇవ్వొక షాక్
ఇది బానిస బత్రుకు నుంచి బైటకు వనిత చేసే వాక్ Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment