విరబూయని జీవితాలు-విసిరేసిన మందారాలు

– డా. కె. పద్మ, ఎన్. అలివేలుమంగ

ఆడపిల్లే ఇంటికి వెలుగు-వీధిబాలికల జీవితాలలో వెన్నెల విరబూయిద్దాం

కాజీపేట్ రైల్వేజంక్షన్లో ఉదయం 8.30 ని||కు కృష్ణా ఎక్స్ప్రెస్ భాగ్యనగరం నుండి వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణీకులతోపాటు కొంతమంది బాలికలు చేతిలో వేరుశెనగకాయలు అమ్మే బుట్టలతో రైలు నుండి గుంపుగా క్రిందికి దిగి నడిచివస్తున్నారు.

వీరంతా ఎవరు? ఎటువైపు వెళ్తున్నారు? ఏమి చేస్తారు? గమనించాలి అనే ఆసక్తి మాకు పెరిగింది. మెల్లగా రైలుకూతవేస్తూ కదిలి వెళ్ళిపోయిన తరువాత వారిదగ్గరకు వెళ్ళి వారి పేర్లు అడిగి తెలుసుకొన్నాము. రమణి, రజిత, సరిత, అమ్మణ్ణి అనే పేర్లు గల నలుగురు బాలికల (వీధిపిల్లలు)ను అనుసరించి వారిని సంభాషణలోకి దింపి అనేక విషయాలను తెలుసుకొన్నాము. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ హిపోకస్రీని వదిలేద్దాం

– బంగార్రాజు

నిన్న నేనొక మీటింగ్కి హాజరయ్యాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నిరోధక చట్టం 2005 మీద కొన్ని స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన సమావేశమది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

గృహహింస అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హింసకు గురైన స్త్రీ ఎవరిని సంప్రదించాలి ఇలాంటి విషయాల మీద చాలా మంది మాట్లాడారు. ఒకావిడ ఇంటర్ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సమాచారం చదివి విన్పించారు. అది వింటుంటే నాకు దిమ్మ తిరిగినట్టయింది. ఒక స్త్రీ తన రోజు వారీ జీవితంలో ఎన్ని రకరకాలైన హింసల్ని భరిస్తోందో వివరంగా అందులో వుంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు, సాహిత్య వార్తలు | Leave a comment

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి

పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్‌ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్‌ బజార్లు వచ్చి ఫుడ్‌ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్‌” సూపర్‌ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముకుని బతికే వాళ్ళ పొట్టల మీద చావుదెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్‌ దుకాణాల్లో ఎ.సిలు పెట్టి, తూచుడు మెషీన్లు పెట్టి తక్కువ ధరలకే కూరలు, పండ్లు అనే ప్రకటనలు గుపించడంతో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళి పోతున్నారు. ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబోతున్నాయి. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని ప్రార్థిస్తున్నాము. మాపై కరుణ చూపి జైళ్ళలో మగ్గుతున్న మమ్నల్ని విడుదల చేయించి, మా కుటుంబాలలో వెలుగులు నింపవలసిందిగా తమరిని ప్రార్ధిస్తున్నాము.

– ‘జీవిత ఖైదీలు’ కేంద్ర కారాగారం, కడప

Continue reading →

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

పునరుజ్జీవనం

– చల్లపల్లి స్వరూపరాణి

సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి అలవాటు. స్కూలుకి సంక్రాంతి సెలవులు యివ్వగానే సిటీలో తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి బట్టలు తీసుకుని చిన్నపాటి షాపింగు ముగించుకొని వుదయం పదిగంటలకంతా హైదరాబాదు ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లో కర్నూలు బస్‌ ఎక్కింది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం

– శిఖామణి

హేమలతాలవణం. తెలుగు వారికి చిరపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్‌ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. ఇటు సామాజికులకు సంఘ సంస్కర్త గోరాగారి కోడలిగా, సర్వోదయనాయకులు లవణంగారి అర్ధాంగిగా తెలుసు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో, సొంత ముద్రతో నిలిచిన హేమలతాలవణం సామాజికరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ తో సత్కరించడం అభినందనీయం. ఇది తెలుగు నాట సంస్కరణరంగంలో పని చేస్తున్న ఎందరికో స్ఫూర్తిదాయకమైన సంఘటన.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చిలుక జోస్యం

– ఎల్‌. మల్లిక్‌

(అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం మొదలుపెట్టాయి.)

పెంటి చిలుక: ఏమి మామా! బాగున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగాను! అసలు నిన్ను చూస్తాననే అనుకోలేదు. ఇటు ఎలా వచ్చావు?

పోతు చిలుక: ఏమి బాగులే! ఎంతైనా పంజరం బ్రతుకులే కదా!
Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

నేను మనుషుల్ని ప్రేమిస్తాను

– రోష్ని

పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను
రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు
నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని
Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

నానీలు

– కందేపి రాణీప్రసాద్‌

కుటుంబానికి
కేందబ్రిందువు
పేరు హౌస్‌ వైఫ్‌
గుర్తింపు లేని జాబ్‌
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అద్దం

– సుజాతా చౌదరి

ఎవరన్నారు
సీతకి
అద్దం చాలా అవసరమని?
అద్దం లేకుండా
ఆమె బతకలేదని?
Continue reading →

Share
Posted in అనువాదాలు, కవితలు | Leave a comment

దృశ్యా దృశ్యం

– తమ్మెర రాధిక

సంకురుమయ్య దేనిమీదొచ్చాడు?
ఎంతో క్యాజువల్‌ పశ్న్ర
జవాబూ అంతే.. అలవోక..
ఇప్పుడో?
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఎలా

– సత్యభాస్కర్‌

మనలో ఒకరిని
వెలివేసి వెలయాలంటే ఎలా!?
పుట్టుకతో
అందరం శరీరాలమే!
సంఘం సృష్టించిన
చకబ్రంధంలో చిక్కి
శల్యమవుతోన్న శవాలమే!
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

దీప భ్రమర న్యాయం

– డి. కామేశ్వరి

పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను
నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను
నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్‌ మహల్‌ కట్టిస్తాననను
నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం

– కె. సత్యవతి

లయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన స్త్రీలతో జరుగుతుందని ఆయన చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నాతో పాటు డాక్టర్‌ సమత రోష్ని, పంతం సుజాత, భూమికలో పనిచేసే లక్ష్మి కూడా బయలు దేరారు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్‌ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్‌ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.
Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పదునెక్కిన పద శక్తి

(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు)
ఓల్గా విమెన్స్‌ వరల్డ్‌ (ఇండియా)
మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు.

ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, దేశ బహిష్కారాలు, బెదిరింపులవంటి బహిరంగ నిషేధాలను ఎదుర్కునేవారు కొందరైతే, కుటుంబం, సమాజం, ప్రచురణరంగాలు సాహిత్య పీఠాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధించే నిషేధాలకు గురవుతున్నవారు మరి కొందరు.
Continue reading →

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment