ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వానికి ఆహ్వానం

ఆదివాసీ, దళితముస్లిం బహుజన స్త్రీల కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలోకి సంకలనంగా తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం.

నేడు అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా వస్తున్న సాహిత్యాన్ని సంకలనంగా తీసుకురావాలని భావిస్తున్నాము. ఆదివాసీ దళిత, ముస్లిం, బహుజన స్త్రీల సాహిత్యం బలంగా వస్తున్నా కూడా అది అక్కడక్కడ విడి విడిగా వుండడం జరుగుతుంది. ఆ సాహిత్యమునంతా ఒక చోట కూర్చే ప్రయత్నమే యీ కవితా సంకలానికి ఆహ్వానం.
Continue reading →

Share
Posted in ఆహ్వానం | 4 Comments

కవిత్వమై, జీవితమై… ఆమె

– ఎస్. జయ

ఆమెకు శిల్పకళలు, శిఖరాలు, లోయలు, పచ్చిక మైదానాలు అంటే పరవశం. కవిత్వం అంటే పరవశం. ఆకాశమల్లెల్ని పిల్లన గ్రోవిని చేసి, అక్షరాలతో అడుకుంటుంది. కాసేపు బాల్య స్మృతులతో ఆనంద డోలికల్లో వూపుతుందా అంతలోనే, యాభైలోపడి, మెనోపాజ్తో, పరుగుల జీవితం విరామం పొంది ఏకాకితనంలో వేదనాభరిత అనుభూతులు మన గొంతు నరాల్ని సాగదీస్తాయి. ఎంతైనా శిఖరం మీంచి లోయలోకి తోసేసినట్టు ఒక భయంకంపిత విషాదం మనసులో గూడుకట్టుకుంటుంది. విచిత్రమేమిటంటే నిరాశ, నిస్పృహ కలిగించదు. ‘ఆకాశమల్లె’ ఒక ఆలోచనై మనల్ని వెన్నాడుతుంది.
Continue reading →

Share
Posted in కవితలు, వ్యాసాలు | Leave a comment

పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర

– కొండేపూడి నిర్మల

”మొగుడు” కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….” అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం వుండదన్నారు. అబ్బాయి అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడాలన్నాడు. మేడ మీదికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ మాటలు ఇంకా కొనసాగించడం కోసం మొబైలు నంబరు అడిగి తీసుకున్నాడు. మిత్రులకి చూపించడం కోసం ఫోటో సి.డి. అడిగి పుచ్చుకున్నాడు. హమ్మయ్య! మన రాజీ ఒక ఇంటిదయిపోతోంది. అనుకుని అయిన వాళ్ళంతా ఆనందబాష్పాలు కార్చారు.
Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

జీవితం – యుద్ధం

– జి. విజయలక్ష్మి

కుక్క గొడుగు కింద కూర్చొని చకవ్రర్తులమనుకుంటే
కుమ్మరి చక్రం చూసి భూ చకమ్రనుకుంటే ఎలా?
యుద్ధం వేరు జీవితం వేరు కాదు
జీవితం యుద్ధం చేయడానికి
యుద్ధం జీవించటానికి
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గృహ హింస

– పాతూరి అన్నపూర్ణ

గృహ హింసకు వ్యతిరేకంగా చట్టం వచ్చి
నా అస్తిత్వానికి కొత్త రెక్కలు తొడిగింది
ఇన్నేళ్ళ కన్నీళ్ళ సముదాల్రకి
ఓ కాంతి రేఖను చూపించింది
ఎప్పుడూ
సాలెపురుగు బత్రుకే నాది
పడుతున్న కొద్దీ ఎగబాక్రడం
పాకుడు మెట్లపై జారే అడుగులు
పడకూడదని పోరాటం
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆటకెక్కిన అక్షరాలు

– కొత్త పద్మావతి

నా చిట్టి తల్లీ!
నువ్వు నేను కలిసి ఒక పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
మన మాటల్లో మన పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
నీకు నేను, నాకు నీవు
ఒకరికొకరం ఒకే భాషలో ఒకే పప్రంచాన్ని నిర్మించుకొన్నాం
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పెదవుల తాకిడి

– బి. బాలాదేవి

సింధూరపు ఎరుపూ
నీలాకాశాన్నావరించిన నీలమూ
ఎరగ్రులాబీ ఎరుపు దనమూ
పచ్చని ఆకుల పచ్చదనమూ
నీ పెదవుల తాకిడిని గుర్తుకు తెస్తాయి నాలో!
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

– అబ్బూరి ఛాయాదేవి

డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి జరిగింది. సీతాదేవి గారు 60ల నాటికే పేరు పొందిన రచయిత్రి. కథలూ, నవలలూ రాయడంతో పాటు ఆమెకి నాటక రంగంలో కూడా అభిరుచి ఉండేది. హైదరాబాద్లో 1959లో నాట్య విద్యాలయ స్థాపన జరిగిన కొంతకాలం తరువాత సీతాదేవిగారు నాట్య విద్యాలయంలో శిక్షణ పొందటానికి చేరారు. ఆ విధంగా నాట్య విద్యాలయం డైరెక్టర్గా ఉన్న అబ్బూరి రామకృష్ణరావుగారికి శిష్యురాలయారు. మా మరిది అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం అయింది. ‘కన్యాశుల్కం’, ‘మృచ్ఛకటిక’ నాటకాలను ప్రదర్శించడానికి నాట్య విద్యాలయ బృందం ఢిల్లీకి వచ్చినప్పుడు, వారితో పాటు సీతాదేవిగారు కూడా వచ్చారు. అప్పుడు నాకు ఆమెతో ముఖ పరిచయం మాత్రమే. ఆమె రచనలు చదివే అవకాశం కూడా నాకు అప్పట్లో కలగలేదు.
Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

హైదరాబాదీ సంస్కృతికి అద్దం పడతాయి

– వారణాసి నాగలక్ష్మి

డాక్టర్ కె.బి.లక్ష్మి గారి ‘వీక్షణం’ చిటారు కొమ్మ నున్న గూటిలోంచి తలబైటకు పెట్టి లోకాన్ని కలయజూస్తున్న విహంగ వీక్షణమే. కమనీయ కవితా విహాయసంలోకి దూసుకుపోవాలని రెక్కల్లోకి శక్తి పుంజుకుంటున్న కౌజు పిట్ట కుతూహలమే. ‘గమనం’ ప్రారంభించేసరికి ఆ రెక్కల నిండా విశాల గగనంలో ఎంత దూరమైనా అలుపులేక సాగిపోగల శక్తి నిండింది. అది అక్షర శక్తి. అక్షయమైన ఊహాశక్తి. ఏ భావాన్నైనా మనోరంజకంగా, వినూత్నంగా చెప్పగలిగేలా అక్షరాలను పదసమూహాలుగా కూర్చగలిగే శక్తి! Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

శభాష్! ఫరా అజీజ్

– వేములపల్లి సత్యవతి

ఫరా బీహార్లోని భౌనాత్పూర్ అనే చిన్న పట్టణంలో పుట్టింది. ఫరా అమ్మా-నాన్న ఆమెను ఘోషాలో వుంచి, పరదాచాటున పెంచలేదు. వివక్షతలేకుండా ఎంతో స్వేచ్ఛగా పెంచారు. చిన్నప్పుడే ఫరా సైకిల్ మీద పట్టణమంతా తిరిగి వచ్చేది. హైస్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికి ఆలీఘడ్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. యూనిర్శిటీ క్యాంపస్లో నడిచి క్లాసులకు వెళ్లేది. ఒకరోజు మోటార్బైక్ మీద వెళుతున్న యిద్దరు యువకులు నడిచి వెడుతున్న ఫరాదుపట్టా (ఓణీలాంటిది)ను లాగివేశారు. దానికి ఫరా అవమానభారంతో కుతకుత లాడింది. ఆ సంగతిని విధ్యార్థి సంఘానికి ఫిర్యాదుచేసింది. ఆ సంఘంవారు ఆ దురాగతాన్ని ఖండించకపోగా, ”నీకు తగిన శాస్తి బాగానే జరిగిందని” ఎగతాళి చేశారట. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్త్రీల జీవితాల్లోని వాస్తవాలను ప్రతిబింబించని సినిమాలు

– శివలక్ష్మి

2007 మార్చి 23వ తేదీ నుంచి మార్చి 29 వరకూ మన హైదరాబాద్లో సినిమా పండగలు బ్రహ్మాండంగా జరిగాయి. 22వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళాతోరణంలో గౌతమ్ ఘోష్ ”యాత్ర” చిత్రంతో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడు రోజులూ ఉదయం 9 గంటల నుంచి రోజుకి నాలుగు సినిమాలచొప్పున నాలుగు ధియేటర్లలో ఒకే టైముకి ప్రదర్శించారు. సినిమా ప్రేమికులు తమ సమయాన్ని ఎంతగా మానేజ్ చేసుకుని ఇటూ అటూ ఎంత హడావిడి పడి పరుగులు పెట్టినప్పటికీ కొన్ని మంచి సినిమాలను మిస్కాక తప్పలేదు. మొత్తానికి సినీప్రియులందరికీ ఇష్టమైన స్నేహితులతో కలిసి సినిమా చూడడం గొప్ప అనుభూతి నిచ్చింది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కలం దూరమవ్వడం అంటే ఆక్సిజన్ కరువవ్వడమే.

– ఇంటర్వ్యూ: శాంతసుందరి

హిందీ రచయిత్రి, బాధితులైన స్త్రీలకోసం కౌన్సులింగ్ సెంటర్ ముంబైలో నడుపుతున్న, సుధా అరోరా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెతో జరిపిన ఇంటర్యూ

ప్రశ్న : సుధా అరోరాగారు, మీ నేపధ్యం కొద్దిగా చెపుతారా?
సుధ : నేను 1946లో దేశవిభజనకు పూర్యం లాహోర్లో పుట్టాను. మాది చాలా సంప్రదాయమైన కుటుంబం. మా కుటుంబంలో ఎమ్.ఏ. చదువుకున్న మొదటి ఆడపిల్లని. మొదట్నించీ (మంచి మార్కులు తెచ్చుకుంటూ) చదువులో ఫస్ట్గా ఉంటూ (ఉండటం గమనించి) డిగ్రీలో యూనియర్శిటీ టాపర్గా వచ్చిన నన్ను ఎమ్.ఏ. చదివించాలని పోట్లాడి సాధించిన వ్యక్తి మా అమ్మ. మా అమ్మ లాహోర్లోనే పుట్టి పెరిగింది. సాహిత్యరత్న పట్టం పుచ్చుకుంది (అది ఈనాటి ఎమ్.ఏ.తో సమానం) కవిత్వం రాసేది (కానీ ఎక్కడా ప్రచురించలేదు-అలాంటి పరిస్థితులు ఆకాలంలో లేవు)
Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

రచయిత/రచయిత్రులకు విజ్ఞప్తి

కొంతమంది రచయిత్రులు, పాఠకులు అర్ధం కాని చేతిరాతతో తమ రచనలు, ఉత్తరాలు పంపుతున్నారు. దీనివల్ల తప్పులు దొర్లడమే కాక టైపు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచి తమ రచనలనుగాని, ప్రతిస్పందన శీర్షికకు పంపే ఉత్తరాలు, స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా కాగితానికి ఒక వైపునే రాసి పంపించాల్సిందిగా కోరుతున్నాం.

Continue reading →

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

వాల్‌మార్ట్ – కొన్ని వాస్తవాలు !

– డా. చైతన్య

వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు.

  • Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. 2001లో అమెరికా Poverty guidelines ప్రకారం ముగ్గురు సభ్యులున్న కుటుంబానికి $14,630 సంవత్సర ఆదాయం దారిద్ర రేఖగా పరిగణించబడింది. అంటే Walmart లో పనిచేసే ఎక్కువ శాతం ఉద్యోగులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇక సంఖ్యలో సేల్స్ అసోసియేట్స్ తర్వాత వచ్చే కాషియర్ల సంవత్సర ఆదాయం 2003 wage analysis ప్రకారం $11,948 మాత్రమే.
  • Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘మహారాజా లేడిస్క్లబ్, విజయనగరం’ వారి కథా కమామిషు

– డా. సుహాసిని

M.R. లేడీస్క్లబ్ అనగానే మనకు గుర్తువచ్చే పేరు ‘లోపాముద్ర’. సామాజిక, కళా, విద్యా రంగాలకి ఆమె అందిస్తున్న చేయూత చిన్నదికాదు. ఎందరో లబ్ద ప్రతిష్టులను, కళాకారులను, ఏటా సన్మానిస్తు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తూ నేటికీ నిత్యనూతనంగా నడిపిస్తున్న ఘనత శ్రీమతి లోపాముద్ర గారికే చెందుతుంది.

1937లో ఈ క్లబ్ని P.V.G. రాజుగారి తల్లిగారు (అశోక గజపతిరాజ్గారి నాయనమ్మ గారు) స్థాపించారు. అప్పటి ఎస్టేట్ కలెక్టర్ సత్యనాధన్ గారి తల్లిగారు సెక్రటరీగా ఉండేవారట.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చేనేత కార్మికులుగా మారిన బాలికలు

– యస్.వి. శివరంజని, పరిశోధనా సహాయకురాలు

చేనేత విజ్ఞాన విధాన కేంద్రం (చిప్)
పధ్నాలుగు సంవత్సరాలు నిండని వారిని ”బాలలు” అంటారు. ఈ వయసులో పనిచేస్తున్న వారిని బాలకార్మికులంటారు. సాధారణంగా బాలకార్మికులు ఎక్కువగా ఫ్యాక్టరీ పనుల్లో మెకానిక్ పనుల్లో, హోటళ్లలో, బట్టల షాపుల్లో, వ్యవసాయ కూలీలలో కనిపిస్తారు. చేనేతరంగంలో బాలకార్మికులు (బాలికలు) ఉన్నారు.

ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలా? ఊర్లేలాలా?’ అనే ఒక నానుడి సాంప్రదాయపరంగా పెద్దల్లో నాటుకుంది. విద్య, వైద్య, న్యాయ అన్ని రంగాల్లోను మహిళలు తమకు ధీటులేదంటూ ప్రతిభను చాటుతుంటే, ఆడపిల్ల అంటే కేవలం ఇంటిపనికే పరిమితం కావాలి. సాంప్రదాయ కట్టుబాట్లకు విలువ ఇవ్వాలంటూ, చదువుకు దూరం చేసి పనిలో చేర్పిస్తున్నారు. ఇందుకు తల్లిదండ్రుల్లో మారని వైఖరే కారణమని చెప్పవచ్చు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment