ఉత్సాహంగా జరిగిన హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు

భూమిక హెల్ప్‌‌లైన్‌ ప్రారంభించి సంవత్సరం గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రివ్యూ మీటింగు పెట్టాలనుకున్నాం. సంవత్సర కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొంది ఎందరో బాధిత మహిళలకు బాసటగా నిలిచిన హెల్ప్‌లైన్‌ విజయం వెనుక ఎందరో మిత్రుల సహాయ, సహకారాలున్నాయి. వారందరిని ఆహ్వానించి మా కృతజ్ఞతలను ఈ రివ్యూ మీటింగు ద్వారా వ్యక్తం చెయ్యాలనుకున్నాం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూమి పుత్రికలు

పుప్పొడి చిట్లి
ఒక్కసారిగా వెదజల్లిన
పసుపు చినుకుల్లా
చిరునవ్వుల కేరింతలతో
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఊబి

– తురగా జానకీరాణి

చిత్ర పరుగెత్తుతోంది. భుజాన పుస్తకాల సంచీ బరువుగా ఉంది. వగరుస్తూ పరుగెడు తోంది. ‘అమ్మో, టీచరు చంపేస్తుంది? అనుకుంటోంది. అల్లా పరుగెత్తి రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగింది. అది వూరికి చివర. రైలు ఆగివుంది. మెట్లు ఎత్తుగా వున్నాయి రైలు పెట్టెకి. ఐనా, సంచీ గట్టిగా పట్టుకొని ఎక్కేసింది. ఎంతో కష్టమైంది. అయాసం వచ్చింది. ఆ తలుపుమూల నక్కి కూచుంది. రైలు కదిలింది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

వీధిబాలల వికాసం- స్వచ్ఛందసంస్థల పాత్ర-ఒక పరిశీలన

– టి.మనోహర స్వామి, టి.సదయ్య

పరిచయం

నేటి బాలలే రేపటి పౌరులు, బాలలు మన జాతీయ సంపద, వారిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం సమాజం మీద ఉందని భారత రాజ్యాంగం చెపుతుంది. అయితే నేడు సమాజంలో బాలల బ్రతుకు తీరుతెన్నులు చూస్తే తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్నవి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫెమినిస్ట్‌ పెస్ర్‌ డైరెక్టర్‌ – ఫ్లారెన్స్‌ హావ్‌

– కె. సత్యవతి, డా.సమత

(ఫ్లారెన్స్‌ హావ్‌ న్యూయార్క్‌లోని గ్రాడ్యుయేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద సిటి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా పని చేసారు. ది ఫెమినిస్ట్‌ ప్రెస్‌ పబ్లిషర్‌/ డైరెక్టరుగా వున్నారు. ఆమె డజను కన్నా ఎక్కువ పుస్తకాలను వంద కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించారు. ఆమె ఎన్నో గౌరవ హోదాలను ఆరు గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇటీవల ఆమె మాడిసన్‌ లోని విస్కాన్‌ సిన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఫోనులో… సాంత్వన !

Bhumika Help Line, Kodaveeti Satyavathi

జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.
Continue reading →

Share
Posted in భూమిక సూచిక | 1 Comment

రండి చేనేతను ప్రేమిద్దాం చేనేతను ధరిద్దాం

మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా ఆదరణ కరువై, చేసిన ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర లేక సరైన ప్రభుత్వ సహకారం, విధాన నిర్ణయం కరువై వీరు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వున్నారు.
Continue reading →

Share
Posted in సంపాదకీయం | 2 Comments

ప్రతిస్పందన

ఏప్రిల్ 07 లో రాసిన సంపాదకీయం ‘ఫ్రెష్ మార్కెట్ల వెనుక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి” అనేది నేడు ఎంతో కీలకమైన సమస్య. గత కొద్ది మాసాలుగా, ముఖ్యంగా ఈ విశాఖ పట్నంవంటి మహా పట్టణాల్లో వెలుస్తున్న ‘సూపర్’ ‘డాపర్’ తాజా మార్కెట్లు చూస్తున్నప్పుడల్లా, మనసులో ఏదో ఒక బాధ, భయం తొలిచేస్తున్నాయి. అసలు సామాన్యుడు ఈ దేశంలో కనీస జీవనోపాధినైనా పొందగలిగే అవకాశం, ఆ ఆదాయ మార్గం ఇంకా ఏమైనా మిగిలి ఉంటుందా?? ఇన్ని వేల మంది చిన్న చిన్న వ్యాపారులు, చిల్లర దుకాణాలు, అంగళ్ళు, సంతలోని మధ్యతరగతికి చెందిన చిల్లర వర్తకుల బ్రతుకులు ఏమి కావాలి? అన్న ప్రశ్నలు బాధిస్తున్నాయి. Continue reading →

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

స్త్రీల పదాలు – ప్రపంచాలు

విమెన్స్ వరల్డ్ ఇండియా యేర్పడిన తర్వాత ముఖ్యంగా జరగవలసింది దక్షిణాసియా దేశాల రచయిత్రుల సమావేశమని అనుకున్నాం. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల రచయిత్రులతో కలిసి రచయిత్రులపై జరిగే సెన్సార్షిప్ ను చర్చకు పెడితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనుకున్నాం. ఐదు దేశాలలోనూ భిన్న రాజకీయ, సాంఘిక నేపధ్యాలున్నా స్త్రీల అణచివేత, రచయిత్రులను చూసే దృష్టి ఒకే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భిన్న నేపధ్యాల మధ్య ఉన్న సామ్యత ఎలాంటిది? వైవిధ్యం ఎలా ఉంది? తమవైన వాతావరణాలలో రచయిత్రులు ఎలా ఊపిరి తీసుకుంటున్నారు? ఎలా సృజన చేస్తున్నారు? ఎలాంటి నిర్బంధాలనెదుర్కుంటున్నారు? ఈ అనుభవాలను పంచుకుని భవిష్యత్తులో పరస్పర సహకారానికి పునాదులు వేసుకుని, ఒకరి నుంచి ఒకరం ఉత్సాహాన్నీ, బలాన్నీ, పోరాటపటిమనూ అందిపుచ్చుకోవచ్చనే ఆలోచన ఆచరణలోకి రావటానికి సంవత్సరం పైగానే పట్టింది. పొరుగు దేశమైనా వచ్చి పోవడానికి ఎన్ని ఆంక్షలున్నాయో అందరికీ తెలిసిందే. ‘వీసా’ లు క్లియర్ అవటానికి వారాల తరబడి రితూమీనన్ ఢిల్లీలో శ్రమ పడితే గాని పాకిస్తాన్ నుంచి రావలసిన రచయిత్రులకు అనుమతి దొరకలేదు.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దాడుల నేపధ్యంలో రాయటమంటే

– ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా)

నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా ఉన్న గుప్తానగర్కి మధ్య సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నాదొక్కటే యూదుల ఇల్లు. 2002 నుంచి నేను పరస్పరం ద్వేషించుకునే రెండు కమ్యూనిటీల మధ్య చిక్కుకుపోయాయని అనిపించసాగింది.
Continue reading →

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

సరిగ్గా ఇక్కడ మనుషులు జీవించే వారు!

– చంద్రలత

పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడంలో – ఎంతో ఘర్షణ ఉంది. ఎవరైనా అలాంటి నిర్ణయానికి రావడానికి ముందు వారు ఎంతో సంఘర్షణ పడి ఉండాలి. అందుకు ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. సామూహికంగా, వ్యక్తిగతంగా ఎదురుపడే ఇలాంటి సందర్భాలు మనం చరిత్ర పొడవునా వింటూనే ఉన్నాం.

పుట్టిన నేలను విడిచి వెళ్ళడంలోని దుఃఖం, ఆవేదన, ఆర్తి – కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొత్త జీవన మార్గాలను ఆవిష్కరించుకోవడం – ఆ నిర్వాసిత క్షోభ, పునరావాస క్రమం రచయితలను స్పందింపజేస్తూనే ఉంది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దోపిడీ

– టి. సంపత్ కుమార్

”ఏంటీ?… ఈ సంబంధంకూడా క్యాన్సలయ్యిందా?…” ఆదుర్దాగా, ఆశ్చర్యంగా అడిగాను.

ఆఫీసునుండి వస్తూనే నేను మొదట చేసేపని నా బ్రీఫ్కేస్ని స్టడీరూములో దానికి కేటాయించిన చోటపెట్టి, కారు తాళం చేతుల్ని కీబోర్డుకి తగిలించి, డ్రాయింగ్ రూములో ఉన్న సోఫాలో కూచోని నెమ్మదిగా షూస్ విప్పి ర్యాక్లో పెడతాను. ఆరోజువచ్చిన పోస్టును ఓసారి గమనిస్తాను. విషయం ప్రాముఖ్యతని బట్టి కొన్నింటిని విప్పిచూస్తాను. ఆ తరువాత బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని లుంగీ-అంగీలోకి మారేలోపల మా ఆవిడ నేను పొద్దున ఆఫీసు వెళ్ళివచ్చాక-అంటే సమారుగా పదుకొండుగంటల్లో జరిగిన విషయాలన్నింటిని క్లుప్తంగా ‘ఆన్’ చేస్తుంది. అవి కొత్త సినిమాల రిలీజుకు ముందు ఊహించే సీనుల మాదిరిగా ఉంటాయి. ఒక్కొక్కసారి వార్తల ముందటి మఖ్యాంశాల మాదిరిగానో ఉంటాయి. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

సెక్సువల్ పాలిటిక్స్

– పి. సత్యవతి

స్త్రీవాద ఉద్యమ రెండవ ప్రభంజనం లోని సంచలనాత్మక గ్రంధం కేట్ మిల్లెట్ వ్రాసిన ”సెక్సువల్ పాలిటిక్స్”. 1968 లో దీనిని తన పరిశోధనా పత్రంగా సమర్పించి 1970లో గ్రంధంగా వెలువరించినప్పుడు అమెరికాలోనూ ఇంగ్లండ్లోనూ కూడా సంచలనం సృష్టించింది. లైంగిక రాజకీయాల స్వరూప స్వభావాలని స్త్రీవాద ధృక్పధంలో నించీ విస్తృతంగా చర్చించిన ఈ పుస్తకానికి అప్పట్లో విమర్శలూ ప్రసంశలూ సమానంగా వచ్చినా ఇప్పుడు ఒక చారిత్రాత్మక గ్రంధంగా Ground breaking book గా శ్లాంఘిస్తున్నాం. మార్క్సిష్ట్ విమర్శకురాలు ఎవ్లీన్ రీడ్ కూడా జెర్మేన్ వ్రాసిన ఫీమేల్ యూనక్ కన్న మిల్లేట్ పుస్తకమే వాస్తవిక విశ్లేషణతో కూడినదని ప్రశంసించింది.
Continue reading →

Share
Posted in వ్యాసాలు | 1 Comment

ఢిల్లీలో గ్లోరియా స్టీనమ్

– డాక్టర్ జె. భాగ్యలక్ష్మి

Gloria Steinem in Delhiఅమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను స్త్రీవాదంతో పూర్తిగా ఒకతరం స్త్రీలను ప్రభావితం చేసిన గ్లోరియా స్టీనమ్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఢిల్లీకి కూడా వచ్చారు. ఇక్కడ కొన్ని సంస్థలను, వారి ద్వారా జరిగే పనులను కూడా చూశారు. మురికివాడల్లో స్త్రీలతో ముఖాముఖీ మాట్లాడారు.

ఇండియన్ ఉమెన్స్ ప్రెస్కోర్లో మహిళా జర్నలిస్టులతో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలు చర్చించారు. స్త్రీలతో కొనసాగించే వ్యాపారాన్ని నిరసిస్తూ, ”బానిసలకాలంలో ఉన్నదానికంటే ఎక్కువగా ప్రపంచంలో మనుషుల వ్యాపారం జరుగుతోంద”ని అన్నారు. న్యూయార్క్‌లో ఈ వ్యాపారానికి వ్యతిరేకంగా ఏ చట్టాలూ లేవన్నారు. వ్యభిచారంలో ఉన్నవారిని ”సెక్స్ వర్కర్స్” అంటూ గ్లామరైజ్ చేస్తూ అదేదో మంచిపని అన్నభావన కల్పిస్తున్నారన్నారు. ”గర్భనిరోధక పద్ధతులు, కండోమ్లు అంటూ ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చు పెడ్తోంది. అదే డబ్బుతో వీరికి విద్య, వృత్తి శిక్షణ కల్పిస్తే ఇటువంటి పరిస్థితేరాదు.”
Continue reading →

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే

– ఇంటర్వ్యూ : డా. సుహాసిని

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు.

భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల ఆయా ప్రాంతాల గ్రామీణ సామాజిక ఆర్థిక స్థితి గతులను అవగాహన చేసుకోగలిగారు. ఆ స్త్రీల స్థితిగతులను విశ్లేషిస్తూ తన రచనా వ్యాసంగాన్ని 1958 లోనే ప్రారంభించి కథలు కథానికలు, గేయాలు, నవలికలు లేఖాసాహిత్యం ఇలా విభిన్న ప్రక్రియలలో సాహిత్యాన్ని రచించారు. అవి విభిన్న పక్షమాసదిన పత్రికలలో వెలువడ్డాయి. ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు. పెక్కు వేదికల మీదనుంచి తన కవితా పఠనాన్ని ప్రసంగాలని వినిపించారు.
Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నల్లదుప్పటి కప్పుకున్న ఆత్మ

– దోర్నాదుల సుబ్బమ్మ

ప్రవాహమై దొర్లుతూ ఉంది
ఒక్కో జ్ఞాపకం ఒక్కోచోట
ఒకే గాయం… ఒకే హృదయం
గాయాలు అనేక మయినా లేపనం ఒకటే అయినట్లు
మనసు మాతం ఒంటరిదే…
పాటలూ లేవూ… పల్లవుల ఆత్మఘోషాలేదు
పువ్వులూ లేవు… పూల సుగంధాలు అంతకంటే లేవు
Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment