`స్పందన -డి.జి.మాధవి

భూమిక’ ఆ పేరు నాకు పరిచయమై 10 సంవత్సరాలయింది. మొదటిసారిగా స్త్రీల కోసం ప్రత్యేకమైన మాస పత్రిక ఉందని, దానిలో అన్ని అంశాలు కూడా స్త్రీలను ఉద్దేశించి రాస్తారు అని భూమికలో చేరాక తెలుసుకున్నాను. ఇంతకు ముందు వరకు ఏ పత్రికలో కానీ, పేపర్‌లో కానీ Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సీతామహాలక్ష్మి

భూమికకు ప్రేమతో,
శుభాభినందనలు. ముప్ఫయ్యేళ్ళ కృషి ఫలించి మహిళలకు తోడు నీడగా నిలిచినందుకు, స్త్రీవాదంలో పట్టా పుచ్చుకున్న శుభ సందర్భంలో. మనం పాలిచ్చి పెంచిన లోకంలో సగం మనలను పాలిస్తోందని బాధపడడం కాదు, మనలను మనమే పాలించకుందాం. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -భవానీదేవి

నమస్తే,
నేను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగినిగా ఉన్నప్పుడు సత్యవతిగారితో పరిచయం జరిగింది. ఎ.పి.ఎన్జీఓస్‌ అసోసియేషన్‌ విమెన్‌ వింగ్‌లో ఆమె చైతన్యం చూశాను. తర్వాతి Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -అత్తలూరి విజయలక్ష్మి

‘‘భూమిక’’తో పెనవేసుకున్న భూమిక
‘‘భూమిక’’ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం కొండవీటి సత్యవతి గారు, ఆమె మిత్రబృందంతో కలిసి ఒక స్త్రీ వాద పత్రిక తీసుకురావాలన్న తన అభిలాష గురించి చెప్పారు. అప్పటికి పత్రిక గురించిన స్పష్టమైన కార్యాచరణ, డిజైన్‌, పత్రిక పేరు… ఇవేమీ అనుకోలేదు. కేవలం తన కోరిక మాత్రం చెప్పడం జరిగింది. అప్పటికి స్త్రీవాద పత్రికల సంఖ్యా వేళ్ళమీద లెక్కబెట్టదగినదిగా మాత్రమే ఉంది. ఆ పరిస్థితుల్లో స్త్రీలకు వారి స్వరం వినిపించడానికి ఒక వేదిక ఉండాలన్న వాంఛ మా అందరిలోనూ అంతర్గతంగా ఉండడంతో ఆమె ప్రపోజల్‌ ఆనందంగా స్వాగతించాము. అన్నట్లే అనూహ్యంగా కొద్దిరోజుల్లోనే ‘భూమిక’ అనే పేరుతో పత్రిక మొదటి సంచిక వచ్చింది. పేరే ఎంతో అందంగా, క్యాచీగా అనిపించింది.
చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. కొందరు మాత్రమే తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా, దృఢంగా అడుగులు వేసి, సాధించగలుగుతారు. వారిని సమర్థులు అంటాము. సమర్థత, శక్తి, పట్టుదల, ప్రతిభ అన్నీ సమకూడితే ఆ విజయానికి ఎల్లలు ఉండవని నిరూపించారు ‘భూమిక’ సంపాదకులు, నిర్వాహకులు అందరూ కలిసి. పత్రికను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి సత్యవతి గారు చేసిన కృషి నేను మర్చిపోను. చెదరని చిరునవ్వుతో, మొక్కవోని దైర్యంతో ఆమె ఎందరో మహిళలను కూడగట్టుకుని ముందుకు సాగిపోవడం నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కొంతకాలం ఆమె అడుగుల వెంట నడిచాను కాబట్టి.
‘‘భూమిక’’ కేవలం ఒక పత్రిక కాదు. కథలు, కవిత్వాలు, వ్యాసాలు ప్రచురిస్తూ ఒక రెగ్యులర్‌ పత్రికలా కాకుండా మహిళల చేత, మహిళల కోసం నడపబడుతూ అనేకమంది మహిళల సమస్యలకు పరిష్కారం చెబుతూ ఆ మహిళలకు అండగా ఉన్న సంస్థ. బాగ్‌లింగంపల్లిలోని భూమిక ఆఫీస్‌లో అనేక సమావేశాలు జరుపుతూ ‘‘ఉమెన్‌ ఫోరం’’ ఏర్పాటు చేసి ఆపదల్లో ఉన్న స్త్రీలకు తమ సేవలు అందించే విధంగా ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఇచ్చి ఎందరో నిస్సహాయ స్త్రీలకు కొండంత అండగా ఉన్న కొండవీటి సత్యవతి వ్యక్తిగా కాక శక్తిగా తనని తాను మలచుకున్నారు.
నిజానికి ఆధునిక మహిళలు చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఇతర అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినట్లు కనిపిస్తూ ఉన్నా, ఇంకా కొందరి జీవితాల్లో ఎవరికీ తెలియని విషాదాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల సాంఘిక, కుటుంబ పరిస్థితుల్లో అనేక అసమానతలు, అణచివేతలు కొనసాగుతూ ఉంటాయి. భర్త లేదా తండ్రి అనే పురుషుల చేతుల్లో వారు అస్తిత్వాన్ని కోల్పోయి యంత్రాల్లా జీవిస్తూ ఉన్నారు. అలాంటి స్త్రీల జీవితాల్లో ఉన్న చీకటి కోణాలను వెలుగులోకి తెస్తూ, వారిలో చైతన్యం నింపడం ద్వారా వారిని ఎడ్యుకేట్‌ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం వయసు, వావి తేడాల్లేకుండా పాశవికంగా జరుగుతున్న అత్యాచారాల పట్ల కూడా ఈ సంస్థ స్పందిస్తూ, అందిస్తున్న చేయూత సామాన్యం కాదు.
‘భూమిక’ పత్రికల్లో ప్రచురించే కథలు, వ్యాసాలు, కవితలు అన్నీ ఎంతో బాగుంటున్నాయి. నా కథలు కూడా కొన్ని ఈ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. అనివార్య కారణాల వల్ల ఇటీవల కొంతకాలంగా భూమికకు దూరమైనా, మాది అని అనుకుంటున్న ఈ సంస్థతో అనుబంధం మాత్రం ఎన్నటికీ ఇలానే ఉంటుంది. ఈ పత్రికకు రాసే రచయిత్రులందరూ కూడా ప్రొగ్రెసివ్‌ భావాలు ఉన్నవారే. స్త్రీ చైతన్యాన్ని, అభ్యుదయాన్ని కాంక్షించేవారే. తన, పర అనే తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఒకే భావజాలంతో ముందుకు నడుస్తూ ఉన్న భూమిక సంపాదక వర్గానికి, సంస్థ నిర్వాహకులకు, రచయిత్రులకు, కవయిత్రులకు, ముఖ్యంగా సత్యవతి గారికి అందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
` అత్తలూరి విజయలక్ష్మి, రచయిత్రి

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – శాంతిశ్రీ బెనర్జి 

ముప్ఫై సంవత్సరాలు నిండిన మగువ ‘భూమిక’. స్త్రీల ఆలోచనలను, భావజాలాలను, సమస్యలను, సంఘర్షణలను, అంతర్మథనాలను తనలో ఇముడ్చుకున్న పరిణీత ‘భూమిక. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -కావూరి శారద

భూమిక స్త్రీ వాద తెలుగు మాసపత్రికను గత 30 సంవత్సరాలుగా నిరవధికంగా పాఠక మిత్రులకు అందిస్తున్న యాజమాన్యానికి, సంపాదక, కార్యవర్గ సభ్యులకు, సిబ్బందికి శుభాభినందనలు. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -తమ్మెర రాధిక,

అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయాయా అన్పిస్తోంది భూమిక గురించి ఆలోచిస్తోంటే. దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శ్రీలలిత

30 సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కొనసాగాలని, కొనసాగుతుందని ఆశిస్తున్నాను. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -శాంతిప్రియ ఆర్‌.

భూమిక స్త్త్రీవాద పత్రికను మనం ఎందుకు చదవాలి అని నన్ను నేను నిజాయితీగా ప్రశ్నించుకున్నప్పుడు నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపం ఇది. స్త్రీలు పెద్ద సంఖ్యలో చదువుకుంటూ ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేస్తున్న కాలం ఇది. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -ఎ.శ్రీలత

భూమిక పత్రికా సంపాదకులకు నమస్కారం. పత్రిక తన 30 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరాఘాటంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఇంకా మున్ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -అమరజ్యోతి

‘‘సౌందర్య లహరి’’లో…
‘‘భూమిక’’ స్త్రీల మాసపత్రికను నేను ‘‘మనలో మనం’’గా ప్రారంభమైన ‘‘ప్రజాస్వామిక రచయిత్రుల’’ వేదిక కార్యక్రమం అనకాపల్లిలో జరిగినప్పుడు చూశాను. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన -కృష్ణ కుమారి

భూమిక అనే ఈ శబ్ధం ఒక్కోక్కరిలో ఒకో విధంగా ఆలోచింపచేస్తది, ఆహ్వానిస్తుంది, భయపెడుతుంది. ఓదార్పునిస్తుంది. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన కాత్యాయనీ విద్మహే

భూమికతో నా ప్రయాణం
ఈ మధ్య కొన్ని సందర్భాలు నా సాహిత్య సామాజిక ప్రయాణం మొదలై ముప్పయ్‌ నలభై ఏళ్ళయిందని గుర్తు చేస్తే అప్పుడే అన్నేళ్లు గడిచిపోయాయా!? అని అశ్చర్యపోయా.. ఆ ప్రయాణంలో నా నేస్తాలు పత్రికలు పుస్తకాలే కదా! అలా నాకు లభించిన ఒక నేస్తం భూమిక Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన Rama melkote

Wishing Bhumika all the best. In appreciation of its support to the women’s movement, being a part of the human rights movement, Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పద్మ వంగపలి

ఒక జర్నలిస్ట్‌ గా, మహిళలకు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, భూమిక పత్రిక నాకు మొదటి వరుసలో కనిపించేది. భూమికలో ప్రచురితమయ్యే అనేక ఆర్టికల్స్‌ అనేక సందర్భాల్లో, నా వృత్తి జీవితంలో నాకు ఉపయోగపడుతూ ఉండేవి. అలా నాకు భూమికతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సునీత ఏ

భూమిక తో నా ప్రయాణం 1990 ల మధ్యలో ప్రారంభమయింది. విద్యార్ధినిగా అన్వేషి లైబ్రరీకి వస్తున్న క్రమంలో భూమిక ని చదవటం ప్రారంభించాను. అప్పటి వరకూ ఇంగ్లీషులోనే పరిచయమయిన స్త్రీవాద ఆలోచనా రీతులను తెలుగులో చదవటం కొత్తగా, ఉద్వేగ భరితంగా ఉండేది. భార్గవి ధావర్‌ స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి, కె. లలిత ఇంటి పని గురించి, మాధవి అసంఘటిత స్త్రీల సమస్యల గురించి రాసినవి నాకు ఇప్పటికీ లీలగా గుర్తున్నాయి. నా డాక్టరల్‌ పరిశోధన నుండి నేను రాసిన వ్యాసం భూమికలో రావటం నాకు సంతోషం కలిగించిన విషయం.
భూమిక నాకు అర్ధమయినంత వరకూ తెలుగులో స్త్రీవాద ఆలోచనకు ఒక మంచి వేదికగా ఉంటూ వచ్చింది. అవి పరిశోధన నుండి వచ్చినవి కావచ్చు, రచనా వ్యాసంగం నుండి వచ్చినవి కావచ్చు, సామాజిక ఉద్యమ నేపధ్యం నుండి వచ్చినవి కావచ్చు. ఈ రకమైన వైవిధ్యం ఇతర పత్రికల్లో, స్త్రీవాద పత్రికలూ అయినా, కాకపోయినా, తక్కువగా కన్పిస్తుంది. ఈ రకమైన విషయ వైవిధ్యాన్ని నిలుపుకుంటూ పత్రికని నడిపించటం చాలా కష్టమైన విషయం. రచనల్లోని కాక, రచనలు చేసే వారిలో వైవిధ్యాన్ని కూడా ఆహ్వానించటం కూడా భూమికలో కనిపిస్తుంది. జూపాక సుభద్ర కాలం, కొంత కాలం క్రితం నుండి మొహమ్మద్‌ భాషా గారు వలస పాలనా కాలంలో స్త్రీల పత్రికల గురించి రాస్తున్న కాలం దీనికి మంచి ఉదాహరణలు. రచనా వ్యాసంగంలో వున్న వారికి బలమైన ఊతమిచ్చిన భూమిక స్త్రీవాద రాజకీయాల చర్చలని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పటికీ వుంది. దేశ రాజకీయాల లాగే, స్త్రీవాద రాజకీయాలు కూడా మరింత సంక్లిష్టం గా మారిన ఈ చారిత్రిక సందర్భంలో భూమిక మరిన్ని రకాల స్త్రీవాద రచనల్ని, సమకాలీన స్త్రీల సమస్యల గురించిన విశ్లేషణని, అలాగే పరిశోధనని అందించాలని నా కోరిక.
మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భూమిక టీవ్‌ు అందరికీ శుభాకాంక్షలతో…
` సునీత ఏ

Share
Posted in స్పందన | Leave a comment