“యుద్ధం పై యుద్ధం పక్రటిద్దామా! శాంతి బాకా ఊదేద్దామా!” – గిరిధర్

అదిగో… ఎంతెంత భారీ భేరీ శబ్దాలు!
ఇదిగో..ఎన్నెన్ని యుద్ధ విమానాల స్వైర విహారాలు!!
హమ్మో.. ఇన్నిన్ని కళాత్మక హింసా విన్యాసాలు!!! Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఐకమత్యం – డా. బండారి సుజాత

నాడు రాజ్యాల నేలిన రాజుల నుండి
నేటి ప్రజా ప్రభుత్వాల వరకు
కవులను గౌరవిస్తూ, కవిత్వాన్ని ఆస్వాదిస్తూ…. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

జీవనది వేదన..! – నాంపల్లి సుజాత

నేనో జలప్రవాహాన్ని
ఎచ్చోట ఆవిర్భవించితినో
మరెచ్చోట ఐక్యమైతనో ఎరుగకనే Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మార్చి 2026

మార్చి 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేదు … సంఘీభావం లేకుండా స్వేచ్ఛ లేదు – కొండవీటి సత్యవతి

మహిళలపై హింస కేవలం శారీరకమే కాదు… ఆర్థిక నియంత్రణ, భావ వ్యక్తీకరణ పై ఆంక్షలు, స్వేచ్ఛను నిరాకరించడం, కుల–మత–వర్గ వివక్షలు… ఇవన్నీ హింస రూపాలే. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

భూమిక సంపాదకులు కె సత్యవతి గారికి నమస్కారం!
భూమిక ఫిబ్రవరి 2026 సంచిక అక్షరాక్షరం చదివాను. ప్రతి శీర్షిక (సంపాదకీయంతో సహా) ఎంతో ఆలోచనత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. మీకు, భూమిక పరివారానికి అభినందనలు. Continue reading →

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్ మందార
(గత సంచిక తరువాయి…)
వెట్టి చాకిరీపై యాచారంలో మేం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తెలుస్తుండేవి. పత్రికల ద్వారా కాకుండా ఒకరినుంచి మరొకరికి మౌఖికంగా తెలిసేవి. ఇక్కడి జనాలకు అన్ని ఊళ్లల్ల్లో బంధువులుండేవారు. అందువల్ల అనేక ప్రాంతాల నుంచి జనం మా యాచారం కార్యాలయానికి వచ్చి చర్చలు జరిపేవారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కొత్తిమీర తేల్చేసింది – డా. తాడేపల్లి రామలక్ష్మి

“మేడమ్ గారు ఇవ్వాళ కాలేజ్‌కి డుమ్మా కొట్టేయకూడదూ!” తయారవుతున్న అనుపమను దుప్పటి సందులో నుండి చూస్తూ అడిగాడు గౌతమ్.
“ఓీVA, తమరికి ఈ రోజు ఆఫ్ అనా! అమ్మో! ఈ రోజు మానేస్తే ఆ కచ్చతో సెలవుల్లో కూడా ప్రశాంతంగా ఉండనీకుండా నాకు హెడ్ ఏక్ తెప్పిస్తుంది మా హెడ్.” అంది అనుపమ. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

ఏది మార్గం??? – పి. ప్రశాంతి

పాతికెకరాల మాగాణి, ఏడెకరాల మెట్ట సాగుతో పాటు పాడి పశువులు, ఎడ్లు ఉన్న ఆసామి రంగయ్య. ఊర్లో అందరూ గౌరవించే పెద్దమనిషి. ఎవరికీ హానిచేయని మనస్తత్వం. ఆయనకి సరిజోడి జానకమ్మ. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆది దంపతుల్లా ఉన్నారంటారు చూసినవాళ్ళంతా. వాళ్ళకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ కుసుమ. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

గ్లోబల్ అధికార విశ్వరూపంలో ‘ది ట్రాఫిక్ ఇన్ విమెన’ పాత్ర – ఎ. సునీత

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి స్త్రీవాద ఉద్యమం మధ్యన 1975లో కొంతమంది మహిళా మానవ శాస్త్రజ్ఞులు (ఆంత్రోపాలజిస్టులు) ప్రచురించిన ‘మహిళా మానవ శాస్త్రం వైపు’ (టువార్డ్ యాన్ ఆంత్రోపాలోజి అఫ్ విమేన్) అనే పుస్తకంలో (ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో దొరుకుతుంది) గెయిల్ రూబిన్ ‘ది ట్రాఫిక్ ఇన్ విమేన్: టువార్డ్ ఎ పొలిటికల్ ఎకానమీ అఫ్ సెక్స’ అనే ఆసక్తికరమైన వ్యాసం రాస్తూ మహిళల రవాణా పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటులో ప్రధాన పునాది అనే ప్రతిపాదన చేశారు. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

సమాజ అంచుల నుండి గౌరవప్రదమైన జీవనానికి: ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర అందరిలా కాదు. అది కుటుంబ అంగీకారం నుండి నిరాకరణ వరకు, ఆశ్రయం నుండి అసురక్షితత్వం వరకు, ఆత్మగౌరవం నుండి అవమానం వరకు విస్తరించే సంక్లిష్ట అనుభవాల సమాహారం. వారు ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వారి జీవనోపాధిని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తాయి. Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

“హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.

హం హైదరాబాదీ. హమేషా హైదరాబాదీ రహతీహు, మా చిన్నప్పుడు మేము, హిందూస్ అందరం కలిసి ఆడేవాళ్ళం.
బోనాలు పండుగలు, దసరా పండుగలకి బొమ్మలు తీసుకురావడం, మిఠాయిలు తీసుకురావడం మేము కూడా ఆ పిల్లలతో కలిసి వెళ్లేవాళ్ళం. బోనాలు సమయంలో మేకల్ని బలివ్వడం, పూజలు చేయడం నా చిన్నతనంలో చూసేదాన్ని. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

వాళ్ళిద్దరివీ రెండు మార్గాలు. ఒకరు పౌరహక్కుల ఉద్యమానికి జీవితం అంకితం చేస్తే మరొకరు మహిళా హక్కుల కొరకు ఉద్యమించారు. వాళ్ళే వసంత, కన్నాబిరన్‌లు. పౌరహక్కుల నేతకు సహచరిగా, ఉద్యోగిగా, ముగ్గురు పిల్లలకు తల్లిగా, అన్నిటికీ మించి మహిళా హక్కుల కొరకు అహర్నిశలు పనిచేసిన మహిళగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా పలు సవాళ్ళను వసంత తన జీవితంలో ఎదుర్కొన్న తీరు నాటి తరంలో నా లాంటి వాళ్ళకు ఎందరికో మార్గదర్శకమైంది. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

బింఝ్వార్ ఆదివాసీ సముదాయానికి చెందిన మంగలీ బాయి తన జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడతారు, కానీ ఆమె అడవిని ఒక వనరు కంటే ఎక్కువగా చూస్తారు. అడవితో ఆమెకున్న అనుబంధం గురించిన కథనం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి

అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి, ‘భౌద్ధ మతం’ గురించి, బౌద్ధ మతంపై జరిగిన ‘ప్రతీఘాతుక విప్లవం’ గురించి ‘బ్రాహ్మణ మత విజయం’ గురించి రాసిన సందర్భాలను అధ్యయనం చేస్తే వాటి ఆధారంగా భారత సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి అంబేడ్కర్ ఉపయోగించిన ప్రాతిపదికలను, స్త్రీల పరిస్థితులను గురించి రాసిన విషయాలను అర్థం చేసుకోవచ్చు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి

‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో! భగ్గున మండిందిరో’ అంటూ ఉరిమే మేఘమై, ఉరికే ఉప్పెనై, ఊరూ వాడా ఏకమై సాధించుకున్న తెలంగాణలో, ‘సాహిత్యానికి’ ఉన్న పాత్ర చాలా విశిష్టమైనది.
అంతకుముందు వరకు తెలంగాణ భాషను, యాసను కేవలం విలనిజానికి, ఒకరకంగా అవమానించే రకంగా మాట్లాడే పద్ధతికి మాత్రమే ఎన్నుకున్న తరుణంలో జరిగిన, ‘తెలంగాణ ఆవిర్భావం’ తెలంగాణ భాష, యాస మాధుర్యాన్ని అందరికీ చవిచూపించింది. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment