ఛలోనా…. కరోనా !
సరిహద్దులు దాటి వచ్చావ్ కరోనా ,
బయలుదేరావా ఇకనైనా
అందరూ నీ దాటికి హైరానా,
మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.
ఛలోనా…. కరోనా !
సరిహద్దులు దాటి వచ్చావ్ కరోనా ,
బయలుదేరావా ఇకనైనా
అందరూ నీ దాటికి హైరానా,
మాకు లేదా విముక్తి ఇప్పుడైనా.
ఓ కరోనా
2019 లో వచ్చావ్
2020 నీ ముంచావ్
ప్రపంచాన్ని గడగడలాడించావ్
ఎన్నడూ లేని లాక్‌డౌన్ పద్ధతిని తీసుకొచ్చావ్
దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్ పీరియడ్. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు చేసిన లాంటి పరిస్థితన్నమాట. కరోనా వైరస్ గురించిన వార్తలు, విమానాశ్రయాలు, విదేశాల్నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే వింటున్నాం అప్పుడు. అలాంటిది ఎలాంటి హెచ్చరికలూ లేకుండా 130 కోట్లమంది జనం రేపటినుండి ఇంట్లో కూర్చోండి అంటే ప్రతిరోజు పనిచేస్తేనే గానీ పూట గడవని పేద ప్రజలు 80% ఉన్న దేశంలో అలా ఇంట్లో కూర్చోవడం ఎలా సాధ్యమౌతుంది? కనీసం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఉరమని పిడుగులా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేసిన లాక్‌డౌన్ పాడుకాలం.
తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.
సుధామూర్తి గారు తన ”ఓల్డ్ మాన్ అండ్ హిజ్ గాడ్” పుస్తకంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.
ఒక చిన్న ఉపోద్ఘాతం
ఈ మహమ్మారి విజృంభణ కాలంలో ప్రజల ఆరోగ్యపు హక్కు, వారి జీవితంలోని అన్ని అంశాలపైన దాని ప్రభావం ఇందులో ప్రస్తావించాము. ప్రజల ఆరోగ్యం అనే అంశాన్ని అనేక సంక్లిష్ట విషయాల సమాహారంగా భావించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్ణయించే రాజకీయ, సాంఘిక అంశాలు, అంటే పేదరికం, ఉపాధి, లైంగికత వారి శారీరక వైకల్యాలు మొదలైనవి. ఈ విషయాలన్నీ చాలా సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించే సంస్థలు చర్చిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ హక్కుల గురించిన భాషణలో భాగాలే. కులం, వర్గం, జెండర్, మతం, లైంగికత మొదలైన విషయాలలో ఎదురవుతున్న వివక్ష, అప్రధానీకరణను ముందు పోగొడితే కానీ ఆరోగ్యపు హక్కు సాధించడం కుదరదు. సాంఘిక స్థాయి వలన, స్థానికత వలన వాళ్ళు ఎలా ఒక పద్ధతిలో బలైపోతున్నారో కోవిడ్-19 విజృంభణ అర్థం చేయించింది.
ఇతివృత్తానికి ప్రవేశిక:
చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
ఇతివృత్తానికి ప్రవేశిక:
చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్ వ్యాప్తి గురించి, వైరస్ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా ఉండడానికి ఏం టీకా వేయాలి, ఏం మందులు వాడాలనే దానిపైన అన్ని రకాల మీడియా మాధ్యమాలలో ‘అంతులేని కథ’లా కొనసాగుతోంది. అందరూ వైద్యులే, అందరూ సలహాలిచ్చేవాళ్ళే. అందులో పనిలో పనిగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ, సర్కారు ఆసుపత్రి అసహాయత కలిసి అసలు ప్రజలే వారి జబ్బుని వాళ్ళే అనుకుని, వాళ్ళే వైద్యం చేసుకునేదాకా వచ్చింది.
కరోనా సోకితే ఇక కాటికే దారి అన్న దురభిప్రాయం సభ్యసమాజంలో బలంగా వేళ్ళూనుకున్నవేళ… నేను ఆ వైరస్ బారిన పడ్డాను. చెప్పొద్దూ, ఒకింత కలవరపాటు కలిగిన మాట వాస్తవం. కానీ భయపడలేదు. డీలాపడలేదు. నిస్పృహకి గురికాలేదు. కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలని పరిపరి గుర్తుచేసుకుని పాటించాను. చివరకు ఆ వైరస్ నుంచి బయటపడ్డాను. నేను తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తే కొందరికైనా ఊరటగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నాలుగు ముక్కలు మీతో పంచుకుంటున్నాను.
ఒక తల్లిని నమ్మనివాళ్ళు ఎవరుంటారు? అది తెచ్చిపెట్టుకున్న నమ్మకం కాదు, ఎవరో చెబితే ఏర్పరచుకున్నదీ కాదు. అదే భావనతో గౌరి కూడా తల్లిలాంటి దేశాన్ని మొదట నమ్మింది. చివరివరకూ నమ్మింది. కానీ ఆమె ఆ నమ్మకంలో ఉండగానే బలైపోయింది. గౌరీ లంకేష్ ప్రజాస్వామ్య వ్యవస్థనూ నమ్మింది. తన కళ్ళముందు ప్రజాస్వామ్యం అడుగడుగునా వంచన పాలవుతున్నా ఇంకా ఇంకా సన్నని ఆశ రెపరెపలాడుతుంటే ఆమె ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉంటుందనీ నమ్మింది. కానీ ఆ నమ్ముకమూ దారుణంగా వమ్మయింది.
పదిహేనేళ్ళ ఒక అమ్మాయి ఒకరోజు కాలేజి నుంచి ఇంటికి వస్తూ వర్షంలో చిక్కుకుపోతుంది. బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ఆమెకు కారులో వెళ్తున్న ఒక యువకుడు లిఫ్ట్ ఇస్తాడు. ఆధునికమైన ఆ కార్‌ని, అందులో హంగులను విభ్రాంతిగా చూస్తున్న ఆమెపై అందులోంచి తేరుకోకముందే అఘాయిత్యం జరుగుతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి భోరుమంటుంది. కానీ కాసేపే… వెంటనే తేరుకున్న తల్లి తన కూతుర్ని తలారా స్నానం చేసి రమ్మంటుంది. జరిగిన సంఘటన ఆమె శరీరానికి అంటిన మలినం లాంటిదేనని… తలస్నానం చేయడంతోనే ఆ మలినం పోయిందని కూతురికి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఆ కూతురు ఎప్పుడూ కార్‌వైపు తొంగి చూడలేదంటూ ముగిస్తాడు రచయిత. 1967లో జయకాంతన్ అగ్నిప్రవేశం అనే పేరుతో రాసిన కథ ఇది.
”మీరు పంక్చువాలిటీని స్ట్రిక్టుగా పాటిస్తారు కదా! ఈ రోజు లేటయ్యారేమిటి?” హడావిడిగా హెడ్మాస్టర్ రూమ్‌లో ప్రవేశించి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వాసంతితో అన్నాడు నిరంజన్.
బచ్చే పౌచ్…!
భండారు విజయ
సుడులు తిరుగుతున్న గాలి దుమారాన్ని ఛేదించుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది రాజవ్వ. తన జీవితంలాగే ఈ గాలిదుమారం కూడా ఆమె మనసును అతలాకుతలం చేస్తోంది. పొద్దుననగా ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్ళిన పిల్లలు ఏమయ్యారో అన్న బాధ ఒకవైపు ఉంటే, మరోపక్క పక్కింటి శంకరయ్య వికారపు చూపులన్నీ తన గుడిసెవైపే ఉండడం మరో బాధ. నోట్లోకి, కళ్ళలోకి కొట్టుకొచ్చిన దుమ్మును ఆరు బయటున్న కుండలోంచి చెంబుడు నీళ్ళను తీసుకుని ముఖం కడుక్కొంది. మిగిలిన నీళ్ళను నోట్లో పోసుకుని కాండ్రించి ఉమ్మేసింది. తడిక తలుపును తోస్కుంటూ లోపలికికెళ్ళి చూసింది.
బస్తీలోని ఆ మురికివాడను ఒక విరోధాబాస ఆక్రమించింది. మొదటిది దారి చెప్పులు తొడుక్కొని నడిచెల్లిన తమ వాళ్ళలో కొందరిని కరోనా పురుగు కరిచిందని… రెండోది క్లిష్ట సమయంలో ప్రతికూలతపై గెలుపు జెండా ఎగరేసిన మహిళా స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం.. మహిళలంతా అదే చెట్లకింద సమావేశమై ఉండగా… అందరి కళ్ళల్లో ఒక విచారం, మరొక ఆనందం.. వాటికి కారణమైన కొద్దినెలల క్రితంలోకి వెళ్ళారందరూ…