దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

‘ఎ’ క్లాసునిచ్చి ఆరు నెలల శిక్ష విధించారామెకు రాయవెల్లూరు విచారణాధికారులు. అలా డెబ్భై, ఎనభై మంది నానా రకాల ఖైదీలతో తనను ఉంచడానికి బాధపడి దుర్గాబాయి జైలు అధికారులను ‘నియమ నిబంధనల మాట అటుంచండి కనీస మానవత్వం దృష్ట్యానైనా ఇంత దారుణంగా ఏర్పాటు చేయవచ్చా జైలు అధికారులు’ అని వాళ్ళను నిలదీసిందంట ఆ ఖైదీలందరి ముందే. దాంతో జైలు అధికారులు, సిబ్బందీ భయపడిపోయారు. మర్నాటి నుంచీ ఖైదీలందరినీ చైతన్యవంతులను చేసి, పురిగొల్పి జైల్లో కూడా ఆందోళన, తిరుగుబాటు సృష్టిస్తుందేమోనని వాళ్ళు వణికిపోయి ఉంటారు. ఆమె గత చరిత్ర వాళ్ళకు తెలియకుండా ఉంటుందా?! మద్రాసు రాష్ట్ర అత్యున్నత హోదాగల పోలీసు అధికారి మేజర్‌ జనరల్‌ కన్నింగ్‌హాం ఆమెను ఆడసింహంగా అభివర్ణించాడు. ఆ సందర్భం ఏంటంటే

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పిలుపు

పండగొచ్చి పోగానే

అప్పటి వరకూ సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు

ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మా..! నాకిప్పుడు ఆకలిగా లేదు!! -సహచరి

అమ్మా నన్ను కన్నందుకు… నువ్వు అనుభవించిన పురిటినొప్పుల బాధ తెలియదు నాకు…

నన్ను పెంచడానికి నువ్వనుభవిస్తున్న

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

నీ కోసం… – శాంతిశ్రీ బెనర్జీ

నిన్ను నిన్నుగా తెలుసుకుని

సాటి మనిషిగా గుర్తించి

నీకు వలచే హృదయం ఉందని

అందుకోవాలనే ఆశలున్నాయని

కళ్ళనిండుగా కలలున్నాయని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

పెద్ద కరోనా – . కార్తీక, ఆరవ తరగతి

కరోనా ! కరోనా ! ఓ పెద్ద కరోనా !

కంటికి కనపడని కరోనా,

వుహాన్‌ లో పుట్టిన కరోనా,

లాక్‌ డౌన్‌ పెట్టిన కరోనా,

మనుషులను చంపుతున్న కరోనా,

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా – కనకదుర్గ., టీచర్‌

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా

అందరి కష్టాలకు కారణమైన కరోనా

అందరి పనులను ఆపుదల చేశావు

రవాణా మార్గాలను నిలుపుదల చేశావు

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కరోనా వైరస్‌ — జు.యశస్వినీ, ఏడవ తరగతి

కరోనా వ్యాధి వచ్చింది,

మానవాళికి వైరస్‌ను తెచ్చింది,

కరోనా ప్రపంచమంతటా విజృంభిస్తోంది,

మానవజాతికి ముప్పునే తెస్తోంది,

Continue reading

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

కోవిడ్‌ బాధితుల పట్ల మానవీయంగా ఉందాం -సత్యవతి

మార్చి 22, 2020 తర్వాత ప్రపంచం కోవిడ్‌-19కి ముందు కోవిడ్‌కు తర్వాత అంటూ రెండుగా విడిపోయింది. ఇంత భయానక పరిస్థితిని మనం బతికున్న రోజుల్లోనే చూడాల్సి వస్తుందని మనమెవరమూ ఊహించలేదు. అసలు ఈ కరోనా వైరస్‌ అంటే ఏమిటి? ఏం చేస్తుంది? అదెలా ఉంటుంది? ఏమీ తెలియదు. ఎక్కడో చైనాలో ఒక పట్టణంలో వచ్చిందట అనే వార్త తప్ప రెండు మూడు నెలల్లోనే గ్లోబ్‌ మొత్తాన్ని గడగడ వణికిస్తుందని ఎవరైనా ఊహించారా? లాక్‌డౌన్‌ అంటే తాళాలేసుకుని ఇంట్లో దాక్కున్నాం. చెంబులు, తపేళాలు మోగించమంటే మోగించాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. పువ్వులు చల్లమంటే చల్లాం. ఏం జరిగింది? కరోనా పలాయనం చిత్తగించిందా? తోకముడిచిందా? లేదు మరింత భయంకరంగా విస్తరించింది. పాజిటివ్‌ కేసులు వందల్లోంచి, వేలల్లోకి, లక్షల్లోకి చేరిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలందరూ భయం గుప్పిట్లో, మానసిక వత్తిళ్ళతో సతమతమైపోతున్నారు. పాజిటివ్‌గా ఉండాలి అనే పదం కోవిడ్‌ పాజిటివ్‌గా మారిపోయి, పాజిటివ్‌ అంటేనే గుండె బేజారైపోయే స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

గౌరవనీయులైన భూమిక సంపాదకురాలు కె.సత్యవతి గారికి,

వి.సరస్వతీ ఆంజనేయులు, హనుమమ్మ బసవయ్య పౌరగ్రంథాలయం, వేములవాడ నుండి హృదయపూర్వక సాహితీ వందనాలు… శుభాకాంక్షలు… శుభాశీస్సులతో…

Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

ఎవరు బాధ్యులు – పి. ప్రశాంతి

”చిట్టచివరికి మూడేళ్ళ నుండి ఎదురు చూసిన రోజు వచ్చింది. నా పంతొమ్మిదో పుట్టినరోజున ఫ్రెండ్సందరికీ చాక్లెట్స్‌ పంచాను. మళ్ళీ వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ చాక్లెట్లు తినే రోజొస్తుందో లేదో అనేది అనుమానమే… పది రోజులు ఆగి రాజీవ్‌తో వెళ్ళిపోయాను. పెళ్ళి చేసుకుని ఏడాదైంది. ఇప్పటికీ రోజూలా ‘మేం చేసిన తప్పేంటి? చట్టపరంగా అర్హత వచ్చాకే పెళ్ళి చేసుకున్నాం. కదా? అని ఆలోచిస్తూనే ఉన్నాం. మరి ఊరూ… వాడా… ఇంటివారు… బైటివారు.. అందరూ ఒకటే మాట… తప్పు చేశారు అని’ ఎందుకిలా?” నవత మాట్లాడుతోంది.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

If man could menstruate …!!! ఉమా నూతక్కి

If I had a hammer I’d smash patriarchy

నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…

”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌ లోని భుజ్‌ పట్టణంలోని స్వామి నారాయణ్‌ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్‌ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.

Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న ప్రశ్నలు… – సుధా కిరణ్‌

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతి సమాజమూ తనవైన బలహీనతలను సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనూ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్థం చేసుకోవడమే!

Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

కరోనా దరి చేరినప్పుడు… శాంతి ప్రబోధ

నిత్యం భయాందోళనలతో కాలం గడిపే వాళ్ళ కోసం నా అనుభవం మీ ముందుకు తెస్తున్నాను.

జూన్‌ పదవ తేదీ మధ్యాహ్నానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. (అంతకు రెండు మూడు రోజుల క్రితమే కరోనా భయంతో రాలిపోతున్న వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం… ప్రజలకు భరోసా కల్గించాల్సిన వ్యవస్థలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని, చేతులెత్తేస్తున్నాయని, నిజంగా ఇది అంత భయపడాల్సిన బూచి కాదని ఇద్దరో ముగ్గురో చనిపోవడం పెద్ద భూతంలా చూపడం, ప్రజలని భయపెట్టడం సరైనది కాదని మేం ఇంట్లో అనుకున్నాం)

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

మొదట చేయాల్సింది టైంకి డాక్టర్‌ని కలవడమే -చైతన్య పింగళి

హెచ్‌ఐవి పాజిటివ్‌ అంటే ఎంత భయం, అపోహలు, వివక్ష ఉన్నాయో కరోనా పాజిటివ్‌ అంటే కూడా ఆ లెవల్లోనే ఉంది. మొత్తానికి నాకు ఇప్పుడు నెగటివ్‌ వచ్చింది కాబట్టి చెప్తున్న.

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

పాజిటివ్‌గా ఉండండి – నెగటివ్‌గా అయిపోతారిలా!! – స్వర్ణ కిలారి

చైనాలో పుట్టి కంటికి కనిపించని జీవి ఒకటున్నదని, దాని వల్ల వేలాదిమంది ప్రాణాల మీదికి వస్తున్నదని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకుంటా పత్రికల్లో చదివాము. కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చి నెల మొదటివారంలో తెలిసింది. తొలుత హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగికి వచ్చిందని కంగారుతో ఆ బిల్డింగ్‌ మొత్తం హుటాహుటిన ఖాళీ చేయించేశారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ అప్షన్‌ కూడా ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. మూడో వారం నుండి లాక్‌డౌన్‌ ప్రారంభమయింది. ఆ రోజు నుండి దిలీప్‌ రోజూ ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ముందు జాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తనకి పని వత్తిడి కూడా రెట్టింపైంది. అదే సమయంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూసి వైజాగ్‌లో ఉన్న మల్లీశ్వరి గారి పిలుపు మేరకు హైదరాబాద్‌లో కొంతమేరకు నాకు తెల్సిన సాయం చేయగలిగాను. అలా కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది. కానీ, త్వరలోనే మన దగ్గరి వాళ్ళకు కూడా వస్తుందని అర్థమయింది.

Continue reading

Share
Posted in కరోనా డైరీస్ | Leave a comment

”ఇది నాటకంలోని డైలాగు కాదు సార్‌!” – వెంకటమణి ఈశ్వర్‌

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)

థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌…

తరగతులు అయిపోయాయి; డిపార్టుమెంటులో విద్యార్థులెవరూ లేరు. ప్రొఫెసర్‌ శంకరరావు ఒక్కరే తన ఛాంబర్‌లో ఏదో పనిలో నిమగ్నమైవున్నారు. అప్పుడప్పుడూ వాచీవైపూ, తలుపువైపు చూస్తున్నాడు. ఇంతలో తలుపుదగ్గర చప్పుడైంది. అతడి కళ్లు ఆశగా విప్పారాయి.

Continue reading

Share
Posted in కథలు | Leave a comment