ఆమె ఇల్లు – కొండవీటి సత్యవతి

జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ జరుగుతోంది.
రిసోర్స్ పర్సన్ “ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధనం చెప్పండి”.
“అడగండి మేడం” అన్నాడొక వ్యక్తి

మహిళలు కూడా స్పందించాలి
మన సమాజంలో ఆడవాళ్ళకు సొంత ఇల్లుందా?
కాసేపు అందరూ మౌనంగా కూర్చున్నారు
లేదు మేడం అంటూ గట్టిగా చెప్పింది ఒకామె.
ఎందుకు లేదు. పుట్టిల్లు, అత్తారిల్లు అన్నీ వాళ్ళవే కదా” అన్నాడొకాయన.
కాదు ఆడపిల్ల పుట్టి పెరుగుతున్నప్పుడు తండ్రి ఇల్లు, పెళ్ళాయ్యాకా మొగుడి ఇల్లు, ముసలాళ్ళు అయ్యాకా కొడుకు ఇల్లు. పెళ్ళయ్యాకా నీకు ఈ ఇంటితో సంబంధం లేదు అని పుట్టింటి వాళ్ళు అంటారు. ఇది నా ఇల్లు నా ఇష్టమైనట్టు నువ్వుండాలి లేకపోతే పో అని అత్తింటి వాళ్ళు భర్త అంటారు. కొడుక్కి, కోడలికి ఇష్టమైతేనే కొడుకింట్లో ఉండగలుగుతుంది. ఆడవాళ్ళకి ఇల్లెక్కడుంది?” ఒకామె గట్టిగా అరిచింది. అందుకే కదా అర్ధరాత్రి, అపరాత్రి చూడకుండా భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తాడు మొగుడు. ఇది నా ఇల్లు అంటాడు కానీ ఇది మనిల్లు అని ఎవరైనా అనగా విన్నామా?” ఒక పెద్దమె అంది. “ఇదంతా పూర్వకాలంలో జరిగేదేమో ఇప్పడలా ఎక్కడుంది” మగవాళ్ళ వైపు నుండి ఓ కేక.
“అవును మీరు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు” అన్నారు మరొకరు.
క్లాస్‌లో గోలగోలగా మాట్లాడటం మొదలెట్టారు. రిసోర్స్ పర్సన్ కలుగచేసుకుని “సైలెన్స్ ప్లీజ” అన్నాకా సద్దుమణిగింది.
మీలో ఎంత మందికి గృహహింస నిరోధక చట్టం 2005 గురించి తెలుసు.
ఎవ్వరూ మాట్లాడలేదు. చట్టమొచ్చి 20 సంవత్సరాలైంది, అయినా ఎవరికీ తెలియదు. ఈ చట్టం గురించి అందరూ తప్పకుండా తెలుకోవాలి. “ఏముంది మేడం ఆ చట్టంలో” ఒకామె ఉత్సాహంగా అడిగింది.
మన సమాజంలో ఇళ్ళల్లో హింస జరుగుతుందా? అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, తాగొచ్చి భార్యా పిల్లల్ని కొట్టడం, తను సంపాదించినదంతా తన అవసరాలకో, తాగుడుకో వాడుకుంటూ ఇంటి అవసరాలకు ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టడం వీటన్నింటినీ నిరోధించే చట్టం గృహహింస నిరోధక చట్టం.
మగవాళ్ళ వైపు గొడవగా ఉండడంతో సైలెన్స్ అని అరిచింది రిసోర్స్ పర్సన్. ఈ చట్టంలో ఒక ముఖ్యమైన సెక్షన్ గురించి చెప్పాలనే ఈ చర్చంతా మొదలు పెట్టాను. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. మహిళలకు పుట్టిన దగ్గర నుండీ మరణం వరకూ సొంత ఇల్లు ఉండదన్న అంశాన్ని గురించి నేను చెప్పడం కాదు ప్రభుత్వమే అంగీకరించింది. అందుకే ఈ చట్టంలో చాలా ముఖ్యమైన “నివాస హాక్కు” రైట్ టూ రెసిడెన్స్ అనే సెక్షన్‌ని పొందుపరిచింది. భార్యాభర్తలు కలిసి నివసించే ఇల్లు ఇద్దరికీ చెందుతుంది. ఇది నా ఇల్లు బయటకు పో అనే హక్కు భర్తకు లేదు. ఆ ఇంట్లో సగం ఆమెకు చెందుతుందని ఈ చట్టం నిర్దేశించింది.
“నిజమా మేడం. మా ఆయన రోజూ నన్ను నా ఇంట్లోంచి పో అంటూ తిడుతున్నాడు. నేను కేసు వెయ్యొచ్చా” అని అడిగింది ఒకామె. వేసుకోవచ్చు. మనకి అన్ని జిల్లాల్లోను సఖి సెంటర్లున్నాయి. అక్కడికి వెళితే మీ కేసును వాళ్ళే కోర్టులో వేస్తారు.” అంది రిసోర్స్ పర్సన్. మహిళల వైపు నుండి పెద్దగా చప్పట్లు మార్మోగాయి.
మేడం మీరు అన్నీ ఆడవాళ్ళకు సంబంధించినవే చెబుతున్నారు. ఈ క్లాస్‌లో మేమెందుకు ఉండాలి.
ఇది జెండర్ ట్రైనింగ్ అని చెప్పాను కదా. ఇంకా ఆ టాపిక్ మొదలవ్వలేదు. ఇది పరిచయం మాత్రమే. జెండర్ సమానత్వం సాధించాలంటే మీరు కూడా ఈ అంశాలన్ని అర్ధం చేసుకోవాలి. సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాను. కానీ మగవాళ్ళకి వ్యతిరేకంగా కాదు కదా. టీ తాగి రండి జెండర్ క్లాస్ మొదలు పెట్టుకుందాం. అందరూ బిలబిలమంటూ గట్టిగా మాట్లాడుకుంటూ బయటకు నడిచారు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.