-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Daily Archives: August 7, 2026
ఆమె ఇల్లు – కొండవీటి సత్యవతి
జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ జరుగుతోంది. రిసోర్స్ పర్సన్ “ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధనం చెప్పండి”. “అడగండి మేడం” అన్నాడొక వ్యక్తి
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్ మందార దేవల్ షివ్జీ ట్రస్టీల వద్ద వున్న దేవాలయ భూములకు సంబంధించిన పత్రాలనూ, దేవాదాయ శాఖ, మండల్ రెవెన్యూ కార్యాలయాల రికార్డులనూ సంఘం సభ్యులూ, జంగయ్యా, బాల్‌రాజ్‌లు కలసికట్టుగా పరిశీలించి అవన్నీ దేవాలయానికి చెందిన భూములే అన్న నిర్ధారణకు వచ్చారు.
Posted in జీవితానుభవాలు
Leave a comment
మట్టి మనుషులు – బి ఎస్ రాములు
రాత్రి కురిసిన వానకు నేలంతా పచ్చిగా ఉంది. తెల్లవారుజామున ఐదు గంటలకే యశోద లేచింది. కాసేపు పడుకుందామని చూసింది. నిద్ర రాలేదు. రాత్రి కూడా నిద్ర సరిగా పట్టలేదు. ఇక నిద్ర రాదు అని తేల్చుకుని మంచం నుండి లేచింది. లైటు వేసి ఇంటి వెనక వైపు నడిచింది. మొహం మీద నీళ్లు చల్లుకొని బాత్‌రూంలోని … Continue reading
Posted in కథలు
Leave a comment
స్త్రీవాదం అర్ధం చెప్పే మెంటర్స్ అవసరం ఇప్పుడు – పి. ప్రశాంతి
ఆ గంటన్నర్రలో రమణికి ప్రకృతిలోని రంగులన్నీ కలిసిన ఒక భావచిత్రం తన ముందు ఆవిష్కృతం అయినట్లు అనిపించింది. పనిప్రదేశం సురక్షితమైనదైతే మహిళలందరూ ఉద్యోగాలకు సిద్ధమే అనుకున్న తను ఆ ఆలోచన తప్పని, అంతకన్నా ఎక్కువగా సురక్షితమైన వాతావరణం ఇంటి నుండే కోరుకుంటారని కొంచెం కొంచెంగా అర్ధం అవుతోంది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
కమలాసోహానీ సైన్స్ ఉన్నత విద్యలో వివక్షనెదిరించిన తొలి పి.హెచ్.డి.శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్
ఇప్పుడు మనకు చాలా విషయాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి, కానీ అటువంటి పరిస్థితి రావడానికి జరిగిన కృషి ఎంతో అధ్యయనం చేస్తే గానీ అవగతం కాదు. కేవలం తొమ్మిది దశాబ్దాల క్రితం విజ్ఞాన శాస్త్రంలో ఎం ఎస్సీ చేయాలని ఒక యువతి చిన్నపాటి ఉద్యమం చేశారు.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
శివశక్తులు: బోనాల సంస్కృతిలో ట్రాన్స్ ఆధ్యాత్మికత, జీవన విధానం – అర్చనరావు మానుకొండ
ఆషాడమాసం అంటే తెలంగాణలో బోనాల పండుగ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం రంగురంగుల బోనాలు, అమ్మవారి ఊరేగింపులు, సిగం, కొలుపు, నైవేద్యాలు, బలి వంటి సంప్రదాయాలతో కళకళలాడుతుంది. ఈ పండుగ కోసం వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు.
Posted in ప్రతిబింబం
Leave a comment
మాడభూషి లలితాదేవితో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
“వివాహం విద్య నాశాయ” అనే నానుడిని తిరగరాస్తూ పెళ్ళి అయి, నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన ఉన్నత విద్యను ప్రారంభించి, చదువుతో ఆగిపోకుండా ఉద్యోగం చేసి 2011లో పదవీ విరమణ పొంది, “విశ్రాంతి తీసుకుందాం” అని ఆలోచించకుండా డెబ్భై తొమ్మిదేళ్ళ వయస్సులో నిర్విరామంగా తెలుగు సాహిత్యంలో కథను, బాలసాహిత్యంలో కథను తమ కార్యక్రమాల ద్వారా … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
“ఫర్హా” – పాలస్తీనియన్ చిత్రం – శివలక్ష్మి
“ఫర్హా” అనే పాలస్తీనియన్ చిత్రం అంతర్జాతీయంగా జోర్డాన్, స్వీడన్, సౌదీ అరేబియా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో అరబిక్, ఇంగ్లీష్, హిబ్రూ భాషలలో, 1921లో నిర్మించారు. ఈ చారిత్రక డ్రామా చిత్రానికి దర్శకురాలు డారిన్ జె. సల్లామ్ (Darin J. Sallam). ఆమె దీనికి స్క్రిప్ట్ రచయితగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా నిడివి 92 నిమిషాలు.
Posted in సినిమా సమీక్ష
Leave a comment
పలమనేరు కథలు ‘ఎరుకల’ కథలు మాత్రమే కావు ‘ఎరుక’ చెప్పే కథలు కూడా! – శిరంశెట్టి కాంతారావు
పలమనేరు బాలాజి గారికిది నాలుగవ కథా సంపుటి. కథావరణంలో ఈ సంపుటి దాకా నడిచి వచ్చిన తరువాతనే తన సామాజిక నేపథ్యంతో పాటు తన ప్రాంత నైసర్గిక నేపథ్యాన్ని కూడా మొత్తం తెలుగు సమాజానికి సరికొత్తగా తెలపాలన్న ఉద్ధేశ్యంతో వ్రాసిన కథలు కూడా. పలమనేరు అనేది సముద్ర రహిత ద్వీపకల్పం అంటాన్నేను.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
చేతుల నుంచి చరిత్రకు ఒక మహిళా సాధికారత కథ – డాక్టర్ ఎస్.రమేశ్
నేలకొండపల్లి మండలంలోని చిన్న గ్రామం చెరువు మాదారం. కొండలు, పంటచేలు, మట్టివాసనతో నిండిన ఆ ఊరు బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపించినా, ఆ ప్రశాంతత వెనుక ఎందరో ఆడవాళ్ల మౌన వేదనలు దాగి ఉండేవి. ఆ ఊర్లో పుట్టిన ఒక సాధారణ మహిళ పేరు సీతమ్మ. సీతమ్మ పుట్టినప్పుడు ఎవ్వరూ సంబరాలు చేసుకోలేదు.
Posted in వ్యాసాలు
Leave a comment
గిన్నెలు కడిగే ఎడారి ఇసుక – రాహుల్ ఎం / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
రాజస్థాన్, థార్ ఎడారిలోని ఒక గ్రామంలో ఒక మేఘ్వాల్ కుటుంబాన్ని సందర్శించిన ఈ విలేఖరి, ఆ గ్రామ సంక్షిప్త చిత్రాన్ని మనకు అందించడమే కాకుండా, ఆ ప్రదేశంలో మారుతోన్న నీటి, వాతావరణ పరిస్థితులను కూడా చిత్రీకరించారు.
Posted in వ్యాసాలు
Leave a comment
భారతీయ గ్రామీణ కుటుంబాల – పోపుల డబ్బా ఆర్థిక విధానం! -డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో “పోపుల డబ్బా” అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన ఒక సామాజిక-ఆర్థిక వ్యవస్థ. నేడు బ్యాంకులు, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆధునిక ఆర్థిక … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఆత్మగౌరవమే తత్వశాస్త్రానికి పునాదిగా! – కేశవకుమార్
ఈ రోజు అణచివేయబడిన జాతులు, దళితులు, స్త్రీలు, చిన్న ప్రజా సమూహాలు, అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యమంటూ ముందుకొచ్చాయి. ఆత్మగౌరవమంటే ఆధిపత్యాన్ని సహించలేనితనం. అణిచివేతని అడ్డుకోవటం. అమానవీయాన్ని కడిగెయ్యటం. అన్యాయాన్ని ప్రశ్నించడం. బానిసత్వం మీద బలహీనులు ఎగరేసిన జెండా. అది స్వేచ్ఛ కోసం జరిపే పోరాటం. సూటిగా చెప్పాలంటే నిండు మనిషిగా ధైర్యంగా తలెత్తుకుని నిలబడటం.
Posted in వ్యాసాలు
Leave a comment
పెళ్లి రోజు.. – సహచరి
Posted in కవితలు
Leave a comment
ఆమె – ఎండి. ఖాజామైనుద్దీన్
Posted in కవితలు
Leave a comment
