-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
July 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
సాయి పద్మ ప్రత్యేకం – కిరణ్ ప్రభ
నిత్య చైతన్యశీలి, స్నేహానికి ప్రతిరూపం, సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం, ద్విభాషా రచయిత్రి. సామాజిక సేవంటే ప్రాణం. పదిహేనేళ్ళకు పైగా పరిచయం. మొదటిసారి వారు అమెరికాలో మా ఊరు వచ్చినప్పుడు కలుసుకున్నాం.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయి పద్మ ప్రత్యేకం – `పసునూరి రవీందర్
జోహార్లు… సాయిపద్మ గారూ! మీ అకాల మరణం మాకు నమ్మశక్యం కాకుండా ఉంది. పదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి సండే సంచికలో మీ కథ చదివి కాల్ చేసినపుడు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాహసి సాయిపద్మ !! – సురేశ్ వెలుగూరి
తక్కువ జీవితకాలం వున్నవాళ్లు ఎక్కువ పనిచేస్తారని, ఆ అవుట్‌పుట్‌కి చాలా వాల్యూ వుంటుందని స్టీఫెన్ హాకింగ్స్ అంటాడు. అంగవైకల్యం మనిషిని మరింత దృఢపరుస్తుందని, అందుకు తానే సజీవ ఉదాహరణ అని కూడా చెప్తాడాయన. సాయిపద్మకీ ఈ సూత్రం వర్తిస్తుంది. పోలియోని ఒక అంగవైకల్యంగా చూడకుండా, దానిని ఒక ‘ఎసెట్’ లాగా మార్చుకుందామె.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయి పద్మ ప్రత్యేకం – శారద సుబ్రహ్మణ్యం
నా ప్రియ శిష్యురాలు శ్రీమతి సాయిపద్మ ఈ లోకంలో ఇక లేదు అని మీ అందరికీ చెప్పటానికి చాలా చింతిస్తున్నాను. తను చేసిన గొప్ప సంఘ సంస్కరణలు ద్వారా తను ఎప్పుడు మన మనుసుల్లో మనతోటే ఉంటుంది. సాయి ఎంత అన్యాయం అమ్మ ఇలా అర్థాంతరంగా అందరిని వదిలేసి వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఆ భగవంతుడికి … Continue reading
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
ప్రేమజ్యోతి, సేవానిరతి సాయిపద్మ – అనిశెట్టి రజిత
జీవితంలో ఇంకా సగం బతుకు మిగిలి ఉండగానే మానవి, స్నేహనిధి, మేధావి, ఎందరో పిల్లలకు ప్రియమైన అమ్మ, సకల జనులకు బాంధవి సాయిపద్మ రెండు రోజులు జ్వరపడి హఠాత్తుగా కుప్పకూలిపోవడం. మనందరికీ అల్విదా అంటూ వెళ్ళిపోవడం అతిపెద్ద విషాదం.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
మా జీవితాలను మార్చిన ‘గ్లోబల్ ఎయిడ్’ – ఎస్. నాగమణి
నా పేరు నాగమణి. నేను ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గ్లోబల్ ఎయిడ్ సహాయ సహకారాలతో చదువుకున్నాను. సాయి పద్మ మేడం, ఆనంద్ సార్ నన్ను వారి ఇంట్లో ఉంచుకుని బ్యూటీషియన్ కోర్సులో చేర్పించారు.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
మా జీవితాలను మార్చిన ‘గ్లోబల్ ఎయిడ్’ – టి.శైలజ
సాయి పద్మ మేడం, ఆనంద్ సార్ కలిసి స్థాపించిన గ్లోబల్ ఎయిడ్ అనే సంస్థ ద్వారా మా జీవితాలనే మార్చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేశారు. అందులో నేనూ ఒక దానిని.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
Partners in Pain – విజయభాను కోటే
Partners in crime”. ఈ మాట చాలాసార్లు విని ఉండవచ్చు మనం.”Partners in PAIN” అని ఎప్పుడైనా విన్నారా? అందరూ ఆమె చేసిన సేవ గురించి మాట్లాడుతారు. ఆమె ధైర్యం గురించి మాట్లాడుతారు, ఆమె చేసిన ఎన్నో పనులను గురించి మాట్లాడుతారు. నిజానికి ఆందోళన లేకుండా ఎవ్వరూ ఉండరు.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
‘ఆయనకు చెప్పాలి’ ` ఎందుకు? – డా.పద్మ మీనాక్షి
‘ఆయనకు చెప్పాలి’ చాలా మంది మహిళలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఇంట్లో భర్తనో లేదా కొడుకునో, పెళ్ళి కాని అమ్మాయిలైతే తండ్రినో, తల్లినో అడిగి చెబుతాం అంటారు. మహిళ సొంతంగా నిర్ణయం తీసుకోలేదా?
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది సాయిపద్మ – దుర్గ డింగరి
సాయి పద్మ 2015లో కాళ్ళకి బ్రేసెస్ తీసుకోవడానికి వచ్చింది. నాకు మీ ఇంటికి రావాలని ఉంది, వచ్చి వెళ్ళొచ్చా అని అడిగింది. ఫిలడెల్ఫియాకి వస్తే ఎక్కడ ఉంటున్నారు, మాకు ఉండడానికి ప్లేస్ లేదు, నిన్ను చూసేసి వెళ్తాం అంటే అదేంటి అలా అంటావు, మా ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండు అని … Continue reading
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
ఎందరికో స్ఫూర్తి సాయి పద్మ – డా.మంథా భానుమతి
మరపురాని, మరువలేని వ్యక్తిత్వం గల సాయిపద్మ, పరిచయమైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ నిలిచి ఉంటుంది. పది సంవత్సరాల పైమాటే… కొందరు మిత్రులం కలిసి ఒక సాహితీ సమావేశానికి విశాఖపట్నం వెళ్ళాము. అప్పటికే ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా పరిచయమైన సాయిపద్మతో ఫోన్‌లో మాట్లాడాను.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయిపద్మ అకవిత్వం ` 26
సున్నితస్తులు మీరు…!! ఓయ్… సున్నితస్తులు ఏంటి చాదస్తులులా అంటారా… వాడేసా… భరించరూ… భలే సున్నితస్తులు మీరు… మీరంటే భలే ఇష్టం అందరికీ,
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయి పద్మ ప్రత్యేకం
డియర్ బంగారం ఒక్కోసారి అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయని అనుకోవడం కూడా మిథ్య అనిపిస్తుంది. మనసు, మైండ్, హృదయం, ఆలోచనలు ఎన్ని రకాలుగా అనుకున్నా లోపల ఉన్న సాఫ్ట్‌వేర్ అంత సులభమైనది ఏమీ కాదు… అది దాని ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఎంత విచిత్రం కదా. ఏది బాగా కావాలనుకుంటామో అది … Continue reading
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
నా దొరసాని ` సాయిపద్మ – పద్మ గోవిందుగారి
సాయి పద్మ గురించి చెప్పమని ఆనంద్ అడిగితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఇలా తన గురించి నేను తను ఉన్నప్పుడు ఎప్పుడూ రాయలేదు. వెళ్ళాక రాయవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
సాయి పద్మ వికసించిన పద్మం – అనుశ్రీ మెండు
గ్లోబల్ ఎయిడ్ ఫౌండర్‌గా, సేవామూర్తిగా, ప్రేమమయిగా, పుస్తకాల పురుగుగా, గానకోకిలగా, న్యాయవాదిగా, ధైర్యం చెప్పే మనిషిగా సాయి పద్మ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలిగాను. ఆమె పోలియో వల్ల నడవలేరు. కానీ, మనిషిని మించిన పనులు చేస్తూ ఉండేవారు. ఆమె ద్వారా చాలామంది మహిళలు సాధికారత పొందారు.
Posted in సాయి పద్మ ప్రత్యేకం
Leave a comment
