ఎవరూ ఆమెనా…?
మొగుడు చచ్చిపోయిండుగా…?
ఈ మాటల తూటాలు కొన్ని కోట్లాదిమంది Continue reading
నిన్న రాత్రి హెల్ప్‌లైన్‌కి ఒక కాల్ వచ్చింది. ఒక వర్కింగ్ ఉమన్ హాస్టల్‌లో ఉంటున్న ఒకమ్మాయి ఇలా చెప్పింది. ”మేము ఆఫీసులు ముగించుకుని హాస్టల్‌కి వచ్చేసరికి 6 గంటలు, ఒక్కోసారి ఇంకా ఆలస్యమవుతుంది. బస్సులు దొరక్క, ట్రాఫిక్ జాంలు… ఇలా చాలా Continue reading
భూమిక ఎడిటర్ గారికి,
నాగావళి తీరాన మెలుకువతో నా కోసం అక్కలాగా లాపంలా సాగింది కవనభూమిక. నన్ను నేను తీర్చి దిద్దుకునేలా చేసిన కవితలకు కవిత్వధారతో ఋణం తీర్చుకుంటాను. కాశింబి గారు అమ్మని అమ్మలాగే కవిత్వీకరించారు. అటువంటప్పుడు ఫెమినిజాన్ని తూచడానికి రాళ్ళెక్కడ! సుజాతక్క ఈ మధ్య జరుగుతున్న సంఘటనల బండారాన్ని చాలా జాగ్రత్తగా బయట పెడుతున్న విధానానికి నవ్వు వస్తుంది. బాధ్యత మరిచిన భావితరాల పట్ల భాదగా కూడా ఉంది అందుకేమోఈ ‘నన్ను బ్రతకనివ్వండి’. మరొక కవిత నీలోనే… అంటూ డా|| సిరి జగమంత కుటుంబాన్ని జగమంత మనస్సుతో లాలించి, దీవించి చివరకు నీ ప్రయత్నమే కదా! ప్రపంచజ్ఞానం అనేంత వరకు వచ్చారు, తెచ్చారు. ఆ జ్ఞానాన్ని సమాజంలో నిజాయితీగా ఎన్నో తరాలనుండి పోగు చేస్తున్న మానవాళికి చెందుతున్నదా అన్నదే ప్రశ్న కదా! ఆ ప్రశ్నని కూడా జవాబుగా మలుచుకుంటూ డా|| సిరిగారి ఆచరణతో, ఆలోచనలో మమేకమవుదాం. ”కన్నీళ్ళరుచి”లో కరిగిపోయి పుటం పెట్టేలా నిన్ను నీవు వర్షించుకుని ఆ వర్షం సాక్షిగా వర్షధారగా ప్రపంచం ముందు నీదైన నిజాయితీతో ప్రియురాళి రోధన సాక్షిగా ఆవిష్కరించడం. చాలా గుండెనిబ్బరాన్ని కలిగించింది. అందుకే నా కలాన్ని కాగితంలా ఎగరేస్తున్నా! పారిశ్రామికీకరణ కార్మిక స్థితిగతులు అన్న వ్యాసం చరిత్ర మూలాల్లోకెల్లి మన కార్మికుల్లో లేని స్పృహకు అసలు కారణం వాళ్ళు కార్మికులుగా ఎప్పటికీ ఉండాలనుకోవడం, భూస్వామ్య రైతు సంబంధాల్లోనే వారిని వారు నిరూపించుకోవాలనుకోవడంలోనే ఉంది అని చెప్పడం ఒక కవి విశ్లేషణలో లోటుపాటులను తెలియజెప్పింది. సుభాష్ నగర్ స్థితి గతులను చక్కగా వివరించారు. ఈ మధ్య మేడ్చల్‌లో కూడా రియాక్టర్ పేలడం వలన బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మరణించారు. చుట్టు పక్కల ఉన్న కంపెనీలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. అందులోని మిషనరీ ఎగిరి గాలిలో విమానంలా, ఒక స్కూటీమీద పడడం మూలంగా అది పూర్తిగా దెబ్బతింది. అక్కడ వాచ్‌మెన్ అయితే సార్ నా మెడను పక్కకు అనడం వలన నేను బతికి పోయాను లేకుంటే నేను చనిపోయేవాడిని అని చెప్పడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఇంత చేస్తే ఆ కంపెనీ రిజిష్టర్ అవ్వలేదు. అక్కడ టి.ఆర్.ఎస్. లీడర్ ఆధ్వర్యంలో నడుస్తూంది. అందులో తయారయ్యే పొడి కూడా ఏంటో అక్కడి వారు చెప్పలేకపోయారు. ఇలా రియాక్టర్లు పేలడం సర్వ సాధరణం. పేలినప్పుడు ఎంతో కొంత నష్టాన్ని ఇచ్చి వాళ్ళ శవాలను వాళ్ళ సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆ రియాక్టర్లను కంట్రోల్ చేసే ఉద్యోగులకు సరియైన ఉద్యోగ అర్హత లేకపోవడం, నాసిరకం రియాక్టర్ల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. పేలకముందే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే నేను ఈ వ్యాసం వ్రాసే సమయానికి మరల రియాక్టర్ పేలి 10 మంది కార్మికులు మృతి అని పేపర్లో వచ్చినా ఆశ్చర్య పోవడం నావంతు అవుతుందేమో అందుకే భూమిక దృష్టికి తెస్తున్న.
‘నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది. కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టించ బడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫల ప్రదాతను, ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. Continue reading
చైతన్యవంతమైన పరిసరాలు… రాగ యుక్తంగా తెలుగు పద్యాలు చదువుతున్న పిల్లలు… పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరిస్తున్న లెక్కల మాస్టారి కంచు కంఠం… పిల్లలకి మధ్యాహ్న భోజనం వండిపెట్టే గ్రూప్ లీడర్ ఈరవ్వ పురమా యింపులు… స్కూల్ వాతావరణం చైతన్య Continue reading
మిట్టమధ్యాహ్నపు నీడ… చల్లని స్పర్శల నలుపు కాదు చిత్తడి రొచ్చుల తెలుపు…
పట్టపగటి ఎండ కాదు… గుడ్లగూబల రాత్రి కార్చే రసి…
గుడ్డు చిదిపిన పాము పాకి వెగటు జిగటల గిజురు Continue reading
బుద్ధుడు తనకు తాను ‘తథాగతుడు’ అని సంబోధిస్తాడు. తథాగతుడు అంటే ఆది, అంతం లేనివాడని అర్థం. అభయముద్రతో ధ్యానముద్రలో చెట్టు కింద కూర్చున్న బుద్ధుడి బొమ్మ ఎవరికైనా గుర్తుకొస్తుంది. చరిత్ర పాఠాలలో క్రీ.పూ.563లో గౌతమబుద్ధుడు జన్మించాడని, యజ్ఞయాగాదులు, యుద్ధాల వల్ల జరుగుతున్న హింసను నివారించడానికి బౌద్ధ మతాన్ని, Continue reading
సినిమాల్లో బయోపిక్‌ల హోరు సాగుతోందిప్పుడు. ఆయన ఛాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్ కాలేదు కానీ రెండోసారి కూడా ఆయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల Continue reading
ఇటలీ దేశం నుంచి, ఇటాలియన్ భాషలో (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) వచ్చిన అపురూపమైన ఆవిష్కరణ ”రోమ్ ఓపెన్ సిటీ”. ఇది ఇటాలియన్ నియోరియలిస్ట్ డ్రామా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు ”రాబర్ట్ రోస్సెల్లిని”. దీని నిడివి 125 నిమిషాలు. Continue reading
ఓల్గా సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ‘ఓల్గా సాహిత్యం-సాన్నిహిత్యం ఏ 50’ కార్యక్రమం డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడాలో ఉన్న రెడ్డి ఉమెన్స్ కాలేజి ఆడిటోరియంలో జరిగింది. ఎంతోమంది రచయితలు, మేధావులు, Continue reading
(కిందటి సంచిక తరువాయి)
నయా ఉదారవాదం తెచ్చిన వ్యవస్థీకృత మార్పుల్లో…
మొదటిది: ప్రైవేటీకరణ వల్ల జరిగిన ప్రజల విస్థాపన: ఆ విస్థాపన, విధ్వంసం మధ్యలో రూపుదిద్దుకుంటున్న వ్యక్తిగతం, వ్యక్తులు Continue reading
పెట్టుబడికి కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలున్నాయి. దానికి దర్శనీయత (ఙఱరఱపఱశ్రీఱ్‌వ) చాలా ఎక్కువ. అది ఎక్కడున్నా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని మనుగడకు హేతుబద్ధమయిన అకౌంటింగ్ అవసరం కాబట్టి అది తన ఉనికిని తాను గణాంకాల యుక్తంగా Continue reading