లలితా రాందాస్ జీవన ప్రస్థానం – గిరిజ పైడిమర్రి

ఎనభై ఆరేళ్ళ లలితా రాందాస్ జీవన ప్రస్థానంలో.. రాజకీయంగా, సామాజికంగా, విద్యావ్యవస్థలో వచ్చిన పరిణామాలు పాఠకులకు అవగాహనకు వస్తాయి. బాల్యంలో సహచరులిద్దరి జీవితాలలో జరిగిన సశీఘటనలు.. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ దేశాల శాంతి సయోధ్యకు పనిచేసేలా చేసాయి. ఇండియన్ నేవీ కుటుంబాలకు ఉండే హై సెక్యూరిటీ సిస్టం పెట్టని కోటగోడ లాంటిది. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

16 రోజుల కార్యాచరణ – భూమిక టీం

స్త్రీలు బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణను భూమిక సంస్థ పనిచేస్తున్న అన్ని బస్తీలలో నిర్వహించాము. గత రెండు సంవత్సరములుగా రకరకాల అంశాలపై అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్స్ నిర్వహించడం, హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ సంస్థల యొక్క సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

ఆదర్శపాఠకురాలి ‘పఠనాత్మకథ’ – మృణాళిని

నిన్నటి తరం రచయితలు మరోసారి తమ పఠనాప్రయాణాన్ని గుర్తు చేసుకోడానికీ, ఈ తరం పాఠకులు, రచయితలు ఏ రచయితలను విధిగా చదివి తీరాలో తెలుసుకోడానికీ ఎంతో ఉపకరించే రచన ఇది. చంద ‘మామ’ నుంచి సోమర్సెట్ ‘మామ’ వరకూ భార్గవి తన పఠనానుభవాన్ని ఒక రసగుళికగా మార్చి రాసిన అందమైన పుస్తకం ‘నా చదువు కథ’. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కొన్యాక్ పచ్చబొట్లు: జ్ఞాపకాల పటాలు – సర్వజయ భట్టాచార్య / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

నాగాలాండ్‌కు చెందిన కొన్యాక్ ఆదివాసీ సముదాయపు సంస్కృతిలో పచ్చబొట్ట్లు ఒక విడదీయరాని భాగంగా ఉండేవి. ఆ పచ్చబొట్లను మహిళలే వేసేవారు. 1970లలో వాటిని నిషేధించిన తర్వాత, వాటిని వేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే మిగిలారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

జనవరి 2026

జనవరి 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

జెండర్‌ లెన్స్‌ అంటే… – కొండవీటి సత్యవతి

ట్రైనింగ్‌ హాల్లో 230 మంది ఉన్నారు. వీరంతా శిక్షణలో ఉన్న ఐ పీ ఎస్‌ లు. అందులో కొందరు విదేశీ పోలీస్‌ అధికారులు ఉన్నారు. ఈ నెల 11న సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో జరిగిన ట్రైనింగ్‌ ప్రోగ్రాంకి రిసోర్స్‌ పర్సన్‌గా వెళ్ళాను. జెండర్‌, పనిచేసే చోట లైంగిక నిరోధక చట్టం 2013 మీద సెషన్‌ తీసుకున్నాను. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

గురుజాడ సాహిత్యం .. స్త్రీ అభ్యుదయ దృక్పథం – మమత వేపాడ

కవి శేఖర బిరుదాంకితుడు ఉత్తరాంధ్రకే కాకుండా యావత్‌ ఆధునిక తెలుగు సాహిత్యానికే యుగకర్తగా నిలిచినవాడు గురజాడ. గురజాడ తన రచనలు అభ్యుదయ కాంక్షతో చేసినవే. సమాజంలోని పేరుకుపోయిన రుగ్మతలను వేలెత్తి చూపిన వాడు గురజాడ అప్పారావు. ‘అభ్యుదయం’ అనే పేరు గురజాడ తర్వాత కాలరచనల్లో ఏర్పడిరది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్‌ మందార

1985 జూన్‌ నాటికి మా ఐటీవీసీఎస్‌లో ఫుల్‌టైమర్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. శంకరయ్య, బుగ్గయ్య, రాములు, నేను. మిగతా ముగ్గురికి సంఘం నెలకు రూ.450లు (వాటితో పాటు వాస్తవిక ప్రయాణ ఖర్చులు కూడా) చెల్లిస్తుండేది. నాకు నెలకు రూ.500ల ‘శృతి ఫెలోషిప్‌’ లభిస్తుండేది. శృతి అనేది 1983 నుంచి దిల్లీ కేంద్రంగా, లాభాపేక్ష లేకుండా నడుస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పొంగల్‌

తమిళ మూలం: భామ
అనువాదం: డా॥ జిల్లెళ్ళ మెర్సీ విజేత
సంక్రాంతి తర్వాత మరో సంక్రాంతి పండుగ వచ్చింది. ఏటేటా సంప్రదాయం ప్రకారం మదసామి, తన భూసామిని దర్శించుకొని తన సంపాదనలోంచి భూసామికి కొంత ఇచ్చి తన గౌరవాన్ని చూపేవాడు. ఈసారి కూడా సంక్రాంతి పండుగకు తనకు కలిగిన వాటిలో కొన్నిటిని సర్దుకొని భూసామి దగ్గరకి బయలుదేరాడు. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

నా గమ్యం వేరు… నా గమనం వేరు… – పి. ప్రశాంతి

పదినేనేళ్ళ రవళికి లోకమంతా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తోంది. ధనుర్మాసపు మంచుతెరలు ప్రకృతికి వేసిన మేలిముసుగులా అనిపిస్తోంది. బంతి, చామంతి, ముళ్ళగోరింట, డిసెంబరు పూలు, అరవిచ్చిన గులాబీలు లేత ఎండలో సొగసులొలికిస్తున్నాయనిపిస్తోంది. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

From the intersectional lens of Kimberle Crenshaw

మనలను సోషయానిమల్‌ అని పిలుచు కున్నాం. కొన్నివేల ఏళ్లుగా రూపాంతరం చెందు తూనే ఉన్నాం. నాగరికతను వీలున్నంతంగా చాటు కున్నాం. బృందాలు, సమూహాలుగా ఏర్పడ్డాం. దానిని బట్టి మన ఉనికిని చాటుకున్నాం. రాజ్యాలు, దేశాలు, ప్రాంతాలు, మతాలూ, కులాలు, సంస్కృతి, భాష ఇలా వర్గవర్గాలుగా ఖండఖండాలుగా కోసేసుకుని ఎవరి ప్రత్యేకతను వారు చాటుకునే బాదరబందీలోకి ఏనాడో వచ్చేశాం. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

అసలు సిసలయిన భారతీయ విషమయ (టాక్సిక్‌) మగతనం – ఎ. సునీత

మగవాళ్ళంటే దూకుడుగా, హింసాత్మకంగా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, కోపం, ఉద్రేకం, పోటీతత్త్వం తప్ప ఇతర భావోద్వేగాల్ని పైకి కనపర్చకుండా ఉండాలనే అత్యంత మూసపోసిన ధోరణిని విషమయ మగతనంగా స్త్రీవాద చర్చల్లో వర్ణిస్తున్నారు. ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలలో వివిధ దేశాల్లో మగ వాళ్ళ హక్కుల ఉద్యమాల నుండి పుట్టిన ఈ ధోరణిలో ఆడవాళ్ళ, అణచివేతకు గురయ్యే కుల, జాతి సమూహాల పట్ల, సమలైంగికులు, ట్రాన్స్‌ వ్యక్తుల పట్ల అత్యంత చులకనా భావం ఉంటుంది. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ట్రాన్స్‌ సాధికారతకి తొలి మెట్టు-కుటుంబం – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్‌ వ్యక్తులు అట్టడుగున ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చట్టం, సమాజంలో వ్యతిరేకత, వివక్ష, పితృస్వామ్యం లేదా మగస్వామ్యం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ట్రాన్స్‌ వ్యక్తులు తమ లైంగిక పరిస్థితిని గుర్తించినప్పటి నుండి భయం, సిగ్గు, వివక్ష, చిన్నచూపు వంటి భావాలు ఉచితంగా ఒక బంపర్‌ ఆఫర్‌లా వచ్చేస్తాయి. ఇవన్నీ మొదలయ్యేది కుటుంబంలోనే! Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

వనమాల జీవన సంఘర్షణ – గిరిజ పైడిమర్రి

నేను చేస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా వనమాలగారిని సంప్రదించినప్పుడు… ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నావు? ఈ సందర్భంలో ఇలా నన్ను అడిగిన మొదటి వ్యక్తి ఆమె. హరగోపాల్‌ గారి సహచరిగా కాకుండా మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్న తీరు మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అది పాఠకులకు తెలియవలసిన అవసరం ఉందని భావించి వచ్చానని చెప్పాను. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

తిరగరాసిన అలనాటి స్త్రీ చరిత్ర ! – గౌరవ్‌

ఏటికెదురీదిన ధిక్కార స్వరాలు !! తెలుగు మహిళావాద పత్రికలు !!!
సుమారు 160 ఏళ్ల క్రితం, 1862లో, సామినేని ముద్దు నరసింహం తెలుగులో ‘‘హితసూచిని’’ అనే తొలి వైజ్ఞానిక, హేతువాద గ్రంథం రచించి ప్రచురించాడు. అందులో మొదటి వాక్యం, ‘స్త్రీలకు విద్యలు సాధకములౌచున్నవి’ అదేదో ఊరికే రాసింది కాదు. అప్పుడప్పుడే స్త్రీలలో వికసిస్తున్న చైతన్యాన్ని దూరదృష్టితో మదింపు వేసిన ఒక ఆలోచనపరుడు, ఇంకా చెప్పాలంటే దార్శనికుడు, మాత్రమే ఊహించి రాయగల విలువైన మాటలవి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డూయార్స్‌లోని ఒక పుస్తకాల గది – సిమ్రన్‌ ఉరావ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
తరతరాలుగా జల్‌పాయ్‌గురిలోని ఒక తేయాకు తోటలో పనిచేస్తోన్న ఉరాఁవ్‌ ఆదివాసులకు ఇప్పుడు తమకంటూ ఒక సొంత చోటు లభించింది – అదే వారి సముదాయానికే చెందిన ఒక విద్యార్థి ఏర్పాటు చేసిన గ్రంథాలయం.
‘‘దీదీ (అక్కా), మేమిక్కడ నిజంగానే మన సొంత భాషను చదువుకోవచ్చా?’’ తన చేతుల్లో ఒక కుడుఖ్‌ పుస్తకాన్ని పట్టుకొని వున్న 15 ఏళ్ళ అంశ్‌ ఉరాఁవ్‌ నన్నడిగాడు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment