కరువు – పేద స్త్రీలు – సమస్యలు

– ఆచార్య తోట జ్యోతిరాణి, డా|| హజారీ గిరిజారాణి

కరువు కాటకాలు బీదబిక్కీ జీవితాలను దుర్భరం చేస్తున్న పరిస్థితిపై రోజు రోజుకూ తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒరిస్సా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో కరువు పేదజనాన్ని కాటేస్తున్నది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

”గ్రేవ్‌ ఆఫ్‌ ది పైర్‌ ప్లైస్‌”

– సామాన్య

ఈ కాలమ్‌ కోసమని ”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌” రాయాలనే ఆలోచన నా తలలోకి వచ్చిందో లేదో నా మనసు ఆ ఆలోచనని తీవ్రంగా ఖండించి వేసింది. తెలిసి తెలిసీ ఆ సినిమా మళ్ళీ చూసి దుఃఖాన్ని పునరావృతం చేసుకుంటావా అని నాకో ప్రశ్న కూడా వేసింది. నిజానికి ఆ సినిమాలో దాగున్న దుఃఖాన్ని తలచుకుని నాకూ మనసు మాట వినాలనే అనిపించింది. అయినా ఈ సినిమా పదిమందికి చూపాల్సిన సినిమా అని గట్టిగా అనిపించడం చేత నన్ను నేను దుఃఖపరచుకోవడానికి సిద్దపడ్డాను. అంతటి దుఃఖం వుందీ సినిమాలో. Continue reading →

Share
Posted in సినిమా లోకం | Leave a comment

మరుగునపడిన చరిత్రలు

– ఊర్వశి బుటాలియ

స్త్రీల చరిత్రల గురించి నాకెప్పటి నుంచి అవగాహన కలిగిందనే విషయాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ‘ఎప్పటి నుంచి అవగాహన’ అని ఎందుకంటున్నానంటే, ఈ క్రమం అంతా కూడా ఒక రకంగా ఎన్నో విషయాల కలయికగా వుంటుంది. ఈ కథలన్నీ కూడా నా మనసులో ఇంకుతూ వచ్చా యి. అలా ఒక స్పష్టత వచ్చాక, Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

సాకేత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

– వేములపల్లి సత్యవతి

దామిని, నిర్భయ కల్పిత నామధేయంతో దేశప్రజలందరిని వేదనతో కుదించివేసి విదేశాలలో కూడా చర్చనీయాంశమైన జ్యోతిసింగ్‌ పాండే అత్యాచారకేసులో నేరగాళ్లకు ఉరి శిక్ష విధిస్తూ సాకేత్‌ ఫాస్ట్‌ కోర్టు న్యాయాధీశులు యోగేశ్‌ ఖన్నా 13-9-2013న తీర్పు చెప్పారు. 20 పేజీల నేరగాళ్ల నేర చరితను చదివి వినిపించారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మేం తప్పు చేశాం

– కారుసాల వెంకటేశ్‌

మేం తప్పు చేశాం. మా కూతురి జీవితాన్ని మేమే చేతులారా కాజేశాం. ఒక్కగానొక్క కూతురు. ఈ ఊళ్లో ఏ ఆడపిల్ల పెళ్ళవుతున్నా, పండగనాడు కొత్త బట్టలు కట్టుకొని ఏ అమ్మాయి కనపడినా నా కూతురే గుర్తొస్తుంది. అంటూ కన్నీరు పెట్టుకుంది చంద్రమ్మ. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవటం నేరం

మన సమాజంలో స్త్రీల పట్ల వివక్షత ఉందనటంలో సందేహం లేదు. ఆడవాళ్ళు చదువకోటానికి లేదు, మంచి ఆహారం పెట్టరు, జబ్బు చేస్తే త్వరగా వైద్యం చేయించరు. ఈ వివక్షత జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో స్పష్టంగా కనపడుతుంది. Continue reading →

Share
Posted in ప్రకటనలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం-2002

‘ఆంధ్రప్రదేశ్‌ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం’ 2002లోనే గవర్నర్‌ ఆమోదం పొంది, అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమైనప్పటికి, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ఈ పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు, సాంప్రదాయాలకు వర్తిస్తుంది. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

ఎన్ని ‘ఉరులు’ ఆపగలవు – అనుదిన అత్యాచారాల్ని?

– నంబూరి పరిపూర్ణ

మన ఢిల్లీ రాజధానిలో అత్యంత కిరాతకంగా, హేయంగా జరిగిన లైంగిక హింస,జంటహత్యల దుర్ఘటన జరిగిన పది నెలల తరవాత దానికి కారకులైన నలుగురికీ కఠిన శిక్ష విధింపబడినందుకు – దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగంతో, కసితో, ఉరి ఒక్కటే వాళ్లకు తగిన శిక్ష అని ఆక్రోశిస్తూ ఆనందించింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

రైతక్క

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే వుండేవాడు. నారుమళ్ళు వేయడం, దుక్కిదున్నడం, నాట్లేయడం, కలుపుతీయడం, Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నీల

– రాధ మండువ

కొత్తచీర కట్టి కులుకుతూ వచ్చింది పనికి నీల.

కొత్తచీర కొనిందంటే ఆ తర్వాత రోజే దానిని కడుతుంది.

”అదేమిటి మొన్ననేగా ఒక కొత్తచీర కట్టావు. మళ్ళీ ఇంకోటా ఎన్ని కొంటావే.” అన్నాను. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

– ఆశాలత’

దోజ్‌ హూ డిడ్‌ నాట్‌ డై’ అనే తన పుస్తకంలో రచయిత్రి రంజన పథ పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని మహిళల పై వ్యవసాయ సంక్షోభపు ప్రభావాన్ని వారు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. వ్యవసాయంలో అప్పులు పేరుకుపోయి Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

– పి. సత్యవతి

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థిత ప్రజ్ఞత (జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతో పాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం. అయితే మరొక వార్త దాని పక్కనే ఉంటుంది. రైతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిందని!., ప్రకటించడానికి ఇవ్వడానికీ మధ్య ఉన్న అంతరం తెలీని సామాన్యులం, ”గుడ్డిలో మెల్ల” అనుకుంటాం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

బడకొడితి

సం.వెం.రమేష్‌

జలజల కురిసింది ముంగారువాన. ఎండిన తాటాకుల మీద టపటప తాళమేస్తా కురిసింది. కొండల గుండెల్ని తడివేళ్లతో తడమతా కురిసింది. గురిగింజ పొదలోని గువ్వ గూటిని నిమరతా కురిసింది. లేడవానిట దోగాడుతున్న పసిబిడ్డ బుగ్గమీద చిటికేస్తా కురిసింది. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

”

– షేఖ్‌ . మహబూబ్‌ బాషా, లక్నో.

‘…. నేనెంతటిపనినైనను, సులభముగా జేయగలను. భర్త ప్రీతిచేతనే గదా, ద్రౌపతి ఎన్నో కష్టములకోర్చినది. మనమిరువరము పరస్పరానురాగము గలిగి, తగినట్టు సంసారము నడుపుకొనిన మనలనీ దరిద్రదేవత ఏమి చేయును?’ ఈ సమాధానంతో ‘మిగుల సంతోష’ పడ్డ భర్త ‘ఓ సుందరీ! Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

” ”

టి.శ్రీవల్లీ రాధిక గారి ”తక్కువేమి మనకూ” – డాక్టర్‌ మైథిలి అబ్బరాజు

శ్రీవల్లీ రాధిక గారి కథలు చదువుతూ వుంటే పొగడపూలూ తులసీదళాలూ స్పురించటం యాధృచ్చికం కాదు, రచయిత్రి భావప్రపంచపు పరిమళం అదే. గడిచిన పదిహేను పదహారేళ్లుగా తను చేస్తూ వున్న సాహిత్య ప్రయాణాన్ని గమనించటం మంచి అనుభవం. Continue reading →

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

-సిహెచ్‌ సుజాత

మా ఇంటి వంటల క్యాలండర్‌లో ఓ రోజు

ఆకు పచ్చని తోరణాలతో కళకళలాడుతుంది

ఆ రోజే సుఖశాంతులు కలిసొచ్చిన ఏకాదశి నాకు

ఆ రోజే పని ఒత్తిడి లేనిరోజు కావాలనుకున్నా. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment