గృహహింస బాధితులకోసం నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌

కె. సత్యవతి

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అంతర్జాతీయంగా స్త్రీల పరంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. నవంబరు 25ని స్త్రీల మీద హింసకు వ్యతిరేక దినంగా పాటిస్తే, డిసెంబరు 10 ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరపడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. దీనిని పదహారు రోజుల కార్యాచరణగా (16 రోజుల ఆక్టివిజమ్‌) కూడా పిలుస్తున్నారు. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సబ్‌ప్లాన్‌ చట్టంలో జెండర్‌ కోటాలేవి?

జూపాక సుభద్ర

యునైటేడ్‌ నేషన్స్‌ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదాకా మహిళా సాధికారత గురించి, జెండర్‌ బడ్జెట్‌ గురించి మాట్లాడ్తున్నరు. అట్లనే రాజకీయ పార్టీలు ఉద్యమ సంఘాలు, ఎన్‌జివోలు డిమాండ్‌ చేస్తున్నయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

జాషువా – స్త్రీ జనాభ్యుదయ దృక్పథం

కోలా జగన్‌

ఈనాడు బాగా ప్రచురితమవుతున్న స్త్రీవాదానికి సహకరించే ఎన్నో లోతైన భావాలు ‘మహాకవి’ జాషువా కవిత్వంలో కనిపిస్తాయి. కేవలం స్త్రీల దుస్థితికి జాలిపడటం, వారి అభివృద్ధిని కాంక్షించడం మాత్రమే కాదు. ఈనాడు ప్రచారంలో వున్న భావాలకి దగ్గరగా జాషువా భావాలు కనిపించడం ఆశ్యర్యకరం. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

పుస్తకమే మస్తకం

ఆర్‌.వి. రామారావు

(అనుభవజ్ఞులైన పాత్రికేయులు, పాత్రికేయ అధ్యాపకులు, రచయిత, అనువాదకులు అయిన రామారావు గారు వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు వెలుగు” సెప్టెంబర్‌ 2012 సంచికలో ప్రచురించబడింది. వ్యాసాన్ని పుస్తకం నెట్లో ఉంచేందుకు అనుమతించిన రామారావు గారికి, అలాగే దీన్ని అందజేసిన సూరంపూడి పవన్‌ సంతోష్‌కు మా ధన్యవాదాలు – పుస్తకం నెట్‌)

‘చిరిగిన చొక్కా, అయినా తొడుక్కో… మంచి పుస్తకం కొనుక్కో’ Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

బాల్య వివాహాలు – ఒక పరిశీలన

ఎస్‌. రమేష్‌, ఎం. రాజేందర్‌ రెడ్డి

బాల్య వివాహాలు చాలా పాతకాలం మాట. అయినా ఈ నాటికి కూడా కొనసాగుతున్నాయి. మనిషి జీవితంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కాని తల్లిఒడిలో ఉండగానే పెళ్ళిల్లు జరగడం బాధాకరమైన విషయం. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి.

Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

సీనియర్‌ కమ్యూనిస్టు నాయకురాలు మహిళా ఉద్యమ నేత శ్రీమతి మర్ల వెంకట రమణమ్మ మృతి

ఆమె 16-2-1929 న కర్ణాటకలోని హోస్‌పేటలో జన్మించారు. 1945లో డా|| మర్ల కాశీ విశ్వనాధం గారితో వివాహం జరిగింది. Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

రయికముడి ఎరగని బతుకు

స.వెం.రమేశ్‌
‘చుక్క పొడిచేసింది లెయ్యండమ్మో’ అంటూ గొంతు చించుకొనింది పుంజుకోడి. ఆ అరుపువిని ఉలిక్కిపడి లేచినాను నేను. నామీద వెచ్చంగా పండుకొని ఉండిన ఎర్రకుక్క లేచి, ఒక్క నీలుగు నీలిగి, చెవులు టపటప తాటించుకొంటూ అవతలకు పోయింది. సర్రుసర్రుమనే సద్దుతో పొరక ఒకటి నా పక్కనుంచే పోయింది. Continue reading →

Share
Posted in కథలు | 2 Comments

Share
Posted in Uncategorized | Leave a comment

పదహారు రోజులు కాదు… మూడొందల అరవై ఐదు రోజుల ఉద్యమం కావాలిప్పుడు

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలుపెట్టి అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చిల్లర వర్తకంలో చొరబడ్డ ‘బడా’ దొంగలు

ఎన్‌. హేమలలిత

తెలతెలవారుతుండగానే చిన్నప్పుడు అమ్మ మేలుకొలువు తర్వాత వినిపించే కేక మా రాములమ్మది. నలుపు తెలుపుల కలయిక జుట్టుని ముడివేసి, అలిసి సొలసిన శరీరానికి చీరలాంటి ఓ పొడవాటి గుడ్డముక్కను చుట్టేసి, కొంగుచాటున దాచేసిన దు:ఖాన్ని ఎవరికి కంటపడనీయక సంసారభారాన్ని గంపనెత్తుకొని ప్రతి ఇంటికివెళ్ళి తాజా కూరగాయాలు అమ్మేది. కూరలు డబ్బులకు అమ్మితే కరివేపాకు, కొత్తిమీర, మిర్చికోసం యింత బియ్యం పెట్టించుకొనేది. ఆ అమ్మే ప్రక్రియలో ఎన్నెన్ని కబుర్లు.. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

అప్పటి మధురవాణి – ఇప్పటి నళినీ జమీలా

డా|| వాడ్రేవు వీరలక్ష్మీదేవి

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలోని మరపురాని పాత్ర మధురవాణి. ఆమె పందొమ్మిదో శతాబ్దపు వేశ్య. నళినీ జమీలా సజీవ వ్యక్తి. ఈమె ఇరవయ్యొకటవ శతాబ్దపు వేశ్య. వేశ్య అనే పేరు చుట్టూ వున్న భావజాలాన్ని తిరస్కరించి తాము చేస్తున్న పనిని ఒక ఉద్యోగంగా భావించే సెక్స్‌వర్కర్‌. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

అమ్మతనం ముక్కలవుతున్నది

బి.కళాగోపాల్‌

దేహంపై లేచిన పుండ్లలా

మాతృత్వం చుట్టూ అల్లుకొంటున్న విషవలయాలు! Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

నాగరికతకి మనం ఎంత దూరంలో వున్నాం…?

కొండేపూడి నిర్మల

తుపాకి గుండు శరీరంలోకి దూసుకుపోయినప్పుడు అది వెంటనే తీసేస్తేనే ప్రాణం దక్కుతుంది. ప్రమాదవశాత్తూ కాలికో చేతికో దెబ్బతగిలి గాయం విషమిస్తే ఆ భాగాన్ని కోతపెట్టడమే వైద్యం అవుతుంది. గర్భంలోనే విచ్ఛిన్నమయిన పిండాన్ని సురక్షితంగా తొలగించి తల్లి ప్రాణాన్ని రక్షించడానికి ఒక దేశమూ, మతమూ, చట్టమూ, వైద్యము నిరాకరిస్తున్నాయంటే అక్కడ మహిళలకున్న మానవహక్కుల పరిస్థితి ఏమిటి..? Continue reading →

Share
Posted in మృదంగం | 2 Comments

అరుణ కవితలలో తాత్త్వికత

ఓల్గా

అరుణ కవితా మౌనం వదిలి మాట్లాడటం మొదలై ఎనిమిదేళ్ళయింది. ఈ ఎనిమిదేళ్ళలో ఐదు కవితా సంకలనాలు, ఒక నానీల సంపుటి వచ్చాయి. మౌనం మాటల్లో పలికించగల నేర్పు పట్టుబడిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది అరుణ. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అసంఖ్యాక పాఠక ‘జనవారథి’

మల్లీశ్వరి

కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు. Continue reading →

Share
Posted in లోగిలి | Leave a comment

గురజాడ వారి బుచ్చమ్మ

అయ్యగారి సీతారత్నం

కన్యాశుల్కంలోని బుచ్చమ్మ అనకుండా గురజాడ వారి బుచ్చమ్మ గురించి మాట్లాడమన్నారు, రాజాం సభలో రామినాయుడు గారు. బహుశా కన్యాశుల్కం అంటే ‘కన్యాశుల్కం’ సినిమాలోని బుచ్చమ్మ అనుకొంటారేమోనని అయివుంటుంది. నిజానికి గురజాడ భావజాల స్థాయిని ఏమాత్రం అందుకోలేకపోయింది తెలుగు సినిమా. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment