పసుపులేటి గీత
‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’
– మలాలా యూసఫ్ జే Continue reading
పసుపులేటి గీత
‘రేపు మగపిల్లల బళ్ళన్నీ తెరవబోతున్నారు. కానీ తాలిబన్లు ఆడపిల్లల చదువును మాత్రం నిషేధించారు. బీరువాలో నా యూనిఫారమ్, పుస్తకాల సంచీ, జామెట్రీ బాక్స్‌ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది…’
– మలాలా యూసఫ్ జే Continue reading
జూపాక సుభద్ర
పత్రికలు, చానల్లు ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టు వాల్లు లొల్లిలొల్లిగున్నయి. ఆ లొల్లిలో బక్రాలవుతున్నది బలైతున్నది దళిత సమూహాలు. బాపనోల్లను కించపరుస్తూ ఏదో సినిమా వచ్చిందనంటే బాపనోల్లకంటే ముందుగా ధర్నాలుచేసి, కలెక్టర్లకు మెమోరాండాలిచ్చి బ్రాహ్మణభక్తిని చాటుకున్నయి దళితసంగాలు. Continue reading
డా. సూరి సువర్ణలక్ష్మి
”దేశమని మెడుదొడ్డ వృక్షము
ప్రేమలనియడి పూలెత్తలెనోయ్”
అని విశ్వజనీనతని వికసింపచేసిన గురజాడ అప్పారావుగారి నూట యాభయ్యవ జయంతి ఉత్సవాల సందర్భంగా మిసెస్ ఏ.వి.యన్. కళాశాల, తెలుగు శాఖ, ఉమెన్ ఇండియన్ అసోసియేషన్, విశాఖపట్నం సంయుక్తంగా నిర్వహించిన ”గురజాడ సాహిత్య స్త్రీ ప్రస్థానం” జాతీయ సదస్సు నవంబరు 9 వ తేదీన విశాఖపట్నంలోని ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ వారి ఆడిటోరియంలో నాలుగు సమావేశాలుగా జరిగింది. Continue reading
డా. నళిని
”బచావో! బచావో! మేరీ బేటీకో బచావో!”
ఏడెనిమిదేళ్ళ పాపని అడ్డంగా చేతలమీద వేసుకుని ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చింది ఓ స్త్రీ. Continue reading
టి. అన్నపూర్ణ
తెలుగు కథానికను సంపద్వంతం చేసినవాళ్ళలో స్త్రీల భాగస్వామ్యం తక్కువేమి కాదు. స్త్రీలు కథలు రాయకుండా ఉండే మానవజీవితంలోని అనేక అనేక పార్శ్వాలు, చీకటికోణాలు సమాజానికి తెలిసేవికావు. మానవసంబంధాలు వ్యక్తి సున్నితస్పందనలు, మనస్తత్వాలు స్త్రీల కథల్లో విశిష్టంగా కన్పిస్తాయి. Continue reading
వన్ బిలియన్ రైసింగ్ – స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనేది స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక ప్రపంచ వ్యాప్త ఉద్యమం. ప్రముఖ రంగస్థలనటి రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త ‘ఈవ్ ఎన్‌స్లర్’ 1985 ఫిబ్రవరి 14 నాడు న్యూయార్క్ నగరంలో వి.డే అనే సంస్థను స్థాపించి స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ”స్త్రీలు, బాలికలపై జరుగుతున్న హింసలు తప్పనిసరిగా ఆగాలి’ అనేది వి.డే లక్ష్యం. తమ సంస్థ 15 వ వార్షికోత్సవం అయిన ఫిబ్రవరి 14 నాడు వన్ బిలియన్ రైసింగ్ స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా శతకోటి ప్రజాగళం అనే ప్రపంచం వ్యాప్త ఉద్యమం చేపట్టాలని ఈవ్ ఎన్‌స్లర్ తలపెట్టారు.దక్షిణాసియాలో ఈ కార్యక్రమానికి ‘సంగట్’ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అస్మిత ఈ ఉద్యమానికి మద్దతు తెల్పుతూ ఫిబ్రవరి 14నాడు వన్ బిలియన్ రైసింగ్ క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయించింది.
ఇటీవల కాలంలో మహిళలపై, ఆడపిల్లలపై అత్యాచారాలు, కిడ్నాపులు, గృహహింస సంఘటనలు, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. గర్భస్థ పిండంగా వున్నప్నటినుండే స్త్రీలపై హింస మొదలై, వారిపై ఆ హింస జీవితాంతం కొనసాగుతూనే వుంది. ప్రతి స్త్రీ తన జీవిత కాలంలో ఏదోక రకమైన హింసను ఎదుర్కొంటూనే వుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఇటీవల ప్రకటించడం వాస్తవం.
2008 నుండి నేను లాడ్లీి మీడియా అవార్డుల కార్యక్రమంతో దగ్గరగా పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం బొంబాయి నుండి వచ్చిన పాప్యులేషన్ ఫస్ట్ డైరక్టర్ శారద హోటల్ తాజ్‌కృష్ణలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాడ్లీ మీడియా అవార్డుల గురించి ప్రకటించింది. Continue reading
పరుచూరి జమున
”నన్ను ఒక ఏడాదంతా గదిలో బంధించారు. బయట ముఖం చూడలేదు. రోజుకి కనీసం 30 మంది మగవాళ్ళని నా దగ్గరకు పంపేవారు. వాళ్ళు చెప్పినట్టే నేను చేయకపోతే నన్ను చితకబాదేవారు. నా వొళ్ళంతా వాళ్ళు పెట్టిన కత్తి గాట్లు అట్టాగే ఉన్నాయి.” Continue reading
కొండవీటి సత్యవతి
చుట్టూ పచ్చటి పొలాల మధ్య వుంది ఆ వృద్ధాశ్రమం. నాట్లు వేసి నెలరోజులైవుంటుంది. ఏపుగా పెరిగిన చేలు.. గట్ల మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు. చక్కటి పరిసరాల్లో, హూందాగా నిలిచివున్న ‘జీవన సంధ్య’ ఆశ్రమం. Continue reading
వసంతలక్ష్మి
నిన్నే ఒక వార్త చదివాను, ”ముస్కాట్ ఎయిర్ పోర్ట్‌లో, పాస్‌పోర్ట్ పోయిన ఒక మహిళ, నాలుగు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే మన ఏంబసీ వారి సహాయం కోసం ఎదురు చూస్తు, గుండె పోటుతో మరణించింది” అని. ఇండియాకి బయలుదేరిన ఆమె ప్రయాణం అర్థాంతరంగా దారిలోనే ముగిసింది. ఎంత హృదయ విదారకం? నిజంగా జనారణ్యంలో నివసిస్తున్నామా? మనం. Continue reading
అప్పుడు నాకు తొమ్మిది సంవత్సరాలు. నా కంటే మూడేళ్ళు పెద్దది మా అక్కయ్య. మా ఫామిలీలో (కుటుంబం) మగ పిల్లలు తక్కువ. పెద్దమ్మకు ఒక్క కొడుకుండేవాడు. Continue reading
కొండేపూడి నిర్మల
ఈ మధ్య మా ఎకెటిపి హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. వేరే ఏదో పనిమీద అక్కడే వున్న నేనూ ఎగురుకుంటూ వెళ్ళాను. Continue reading
ఎం. నాగమణి
నిర్లక్ష్యం నీ ఇంటిపేరా?
లేక నీ ఒంటిపేరా?
నిర్లక్ష్యంతోనే నీ జీవితమంతా
గడచిపోయింది.
నీలో ఉన్న అంతులేని
నిర్లక్ష్యపు వైఖరిని వీడవు
నువ్వే లోకమని,
నువ్వే సర్వస్వమని
నీ వెంట వచ్చిన
నీ సహచరినీ నిర్లక్ష్యం చేస్తావు
శ్రమ జీవుల కష్టాన్ని సైతం
పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్నావు
వారి కోసం పోరాడావు, గెలిచావు
నీవొక అభ్యుదయవాదివి, మేధావివి
అంతేకాదు అహంకారానికి పరాకాష్టవి కూడా
నీ అభ్యదయాన్ని చూసి
తాను గర్విస్తుంది,
నీ మేధాసంపత్తిని చూసి
ఆనందిస్తుంది, మురిసిపోతుంది.
నీ అహంకారాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది
నీ పరుష పదజాలానికి మౌనంగా రోదిస్తుంది.
జ జ జ
నీ అనురాగం కోసం
చకోర క్షిలా ఎదురుచూసే నీ సహచరిని
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు
నీకుండే సహజ నైజంతో నీవు
నిర్లక్ష్యపరిచినా….
వెరువక, బెదరక
తనకంటూ ఒక అభ్యుదయ
ప్రపంచాన్ని ఏర్పరచుకున్న
చైతన్యమూర్తి ఆమె!!
ఎండమావితో దప్పిక తీర్చుకోవాలనుకునే
అజ్ఞానివి నీవైతే
స్వచ్ఛమైన జలపాతపు
తుంపరనే అమృతమని
ఆస్వాదించే జ్ఞాని ఆమె!!
మిణుగురు పురుగుల వెలుగులో
ముందుకు నడవాలనుకునే
పిచ్చి బాటసారివి నీవైతే!
అభ్యుదయపు వెలుగులో
ముందుకు సాగుతూ
ఎప్పటికీ అలసిపోని, ఆగిపోని
నవ చైతన్యమూర్తి ఆమె!!
నీవెన్నటికీ ఒప్పుకోవు
ఆమె ఎదుగుదలను
ఆమె ప్రశాంతపు ప్రపంచంలోకి
తొంగి చూస్తావు అప్పుడప్పుడూ…
ఆ ప్రశాంత సరస్సులో
నీ పరుష పదజాలంతో
ఒక గులకరాయి వేస్తావు
ఆమె మనస్సు కల్లోలమవుతుంది
కానీ అది తాత్కాలికమే!
ఆమె తనదైన
అభ్యుదయ ప్రపంచంలో
సేదదీరుతుంది (రీచార్జ్ అవుతుంది)
అహంకారంతో చెలిమి చేసి
నీవు అశాంతి పాలవుతున్నావు!
ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తూ
విజయ దరహాసాన్ని చిందిస్తోంది. Continue reading
మల్లీశ్వరి
తనొక ‘ఆంధ్ర చెగువెరా’నన్న స్పృహ మనలో కలిగించడానికి నిరంతరం తంటాలు పడే కధానాయకుడు పవన్‌కల్యాణ్, తన తాజా సినిమాలో పలికిన ఒక పాతడైలాగ్ పదే పదే ప్రొమోస్‌లో చూశాం మనం Continue reading