నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా ఫర్వాలేదు దాన్ని పోగేయడాన్ని మాత్రమే విజయంగా భావిస్తూ, నేను బాగుంటే చాలు ప్రపంచం ఏమైనా ఫర్వాలేదని భావిస్తూ భద్రలోకాల్లో విహరిస్తున్న మధ్యతరగతిని ఛెళ్ళున కొట్టి లేపిన సంఘటనలు ఇవి. రెండు సంఘటనల్లోనూ అత్యాచారానికి గురయినవాళ్ళు మధ్యతరగతికి చెందినవాళ్ళు కావడంతో అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటనలతో ఈ రెండు వర్గాలు సహానుభూతి చెందాయి. అప్పటిదాకా దళితుల మీద, మైనారిటీల మీద జరిగిన అత్యాచారాలకు, పోలీస్‌స్టేషన్లలో, మిలిటరీ ఉన్న ప్రాంతాలలో ఇంతే దారుణంగానో, ఇంతకన్నా దారుణంగానో జరిగిన సంఘటనల మీద ఎప్పుడూ గొంతెత్తని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు.
Continue reading →