ప్లాస్టిక్ మరియు పేపర్ కప్పులకు ముగింపు పలికే జగిత్యాల యువతి వినూత్న ఆవిష్కరణ – మనూష

“టీ తాగండి… కప్పు తినండి” కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన శ్రీ లక్ష్మీ మిల్లెట్ బిస్కెట్ టీ కప్స్
ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే చిన్న చిన్న వస్తువులే ప్రకృతిపై పెద్ద భారం మోపుతున్నాయి.

ముఖ్యంగా టీ స్టాల్స్, కేఫేలు, ఫంక్షన్లు, ఆఫీసులు, ఈవెంట్లలో విపరీతంగా ఉపయోగించే పేపర్ మరియు ప్లాస్టిక్ కప్పులు పర్యావరణానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయి. “use and throw” సంస్కృతి పెరిగిన తరువాత ప్రతి రోజు లక్షల సంఖ్యలో పేపర్ మరియు ప్లాస్టిక్ కప్పులు చెత్తగా మారి కాలువలు, రోడ్లు, చెత్తకుప్పలు, నీటి వనరుల్లో చేరుతున్నాయి. ప్లాస్టిక్ పూర్తిగా కరిగిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ఈలోపు అది నేల, నీరు, గాలి అన్నింటినీ కలుషితం చేస్తూ జీవజాలానికి ముప్పుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన యువతి మనూష ఊరే ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, విద్యార్థి దశ నుంచే సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న ఆలోచన చేయాలనే కల ఆమెకు ఉండేది. డిగ్రీ చదువుతున్న సమయంలో ఆమె “Health & Nutrition” సబ్జెక్ట్‌ను అభ్యసించారు. ఆ సమయంలో విద్యార్థుల్లో రక్తహీనత (Anemia) ఎక్కువగా ఉందని గుర్తించిన NIN (National Institute of Nutrition) ఆధ్వర్యంలో మిల్లెట్స్ ఆధారంగా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ నిర్వహించారు. ఆ ప్రాజెక్ట్‌లో మనూష కూడా పాల్గొన్నారు. మిల్లెట్స్ ఆధారంగా చేసిన ఆ ప్రాజెక్ట్ మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపింది. ఇదే అనుభవం ఆమె ఆలోచనలకు కొత్త దారితీసింది.
“మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేయగలిగితే… అదే మిల్లెట్స్‌తో టీ కప్పులు తయారు చేస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచనతో ముందుకు వచ్చినదే – “శ్రీ లక్ష్మీ మిల్లెట్ బిస్కెట్ టీ కప్స్.” ఈ ఆలోచన కేవలం ఒక వ్యాపార ఆలోచన మాత్రమే కాదు… ఆరోగ్యాన్ని మరియు ప్రకృతిని కాపాడాలనే బాధ్యతతో ప్రారంభమైన ఒక సామాజిక ప్రయోగం. సాధారణంగా ఒక పేపర్‌ను నీళ్లలో ముంచితే వెంటనే నానిపోయి చినిగిపోతుంది. కానీ అదే పేపర్ కప్పులో వేడివేడి టీ పోసినా ఎందుకు చినిగిపోదో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం పేపర్ కప్పుల లోపల ఉండే ప్లాస్టిక్ కోటింగ్. ఆ ప్లాస్టిక్ లేయర్ వల్లే కప్పు లీక్ కాకుండా ఉంటుంది. కానీ వేడి టీ లేదా కాఫీ పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ పొరలోని సూక్ష్మ కణాలు కరిగి మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, వేడివేడి పానీయాలను పేపర్ కప్పుల్లో తాగడం వల్ల సుమారు 25 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉందని వెల్లడైంది. “మనము టీ తాగుతున్నామనుకుంటున్నాం… కానీ తెలియకుండానే ప్లాస్టిక్ కణాలను కూడా తాగుతున్నాం” అని మనూష చెబుతున్నారు. ప్రతి రోజు ఉపయోగించే ప్లాస్టిక్ మరియు పేపర్ కప్పులు కొన్ని నిమిషాల్లోనే చెత్తగా మారిపోతున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో వాడబడుతున్న ఈ కప్పులు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కాలువలు మూసుకుపోవడం, నేల కలుషితం కావడం, జంతువులు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోవడం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టీ, కాఫీ లాంటి వేడి పానీయాలను ప్లాస్టిక్ మరియు పేపర్ కప్పుల్లో తాగడం వల్ల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మనూష కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా రీసర్చ్ చేసి మిల్లెట్స్‌తో బిస్కెట్ టీ కప్పులు తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం జగిత్యాలలో ప్రత్యేకంగా Biscuit Tea Cups Manufacturing Unit ను ప్రారంభించారు.
మిల్లెట్స్ మరియు సహజ పదార్థాలతో తయారయ్యే ఈ బిస్కెట్ టీ కప్పుల్లో వేడివేడి టీ తాగవచ్చు. టీ తాగిన తర్వాత కప్పునే తినేయొచ్చు. దీనివల్ల ఎలాంటి చెత్త మిగలదు. ఈ వినూత్న ఉత్పత్తి ద్వారా ప్లాస్టిక్ మరియు పేపర్ కప్పులకు కేవలం ప్రత్యామ్నాయం ఇవ్వడం మాత్రమే కాదు, వాటిని పూర్తిగా రీప్లేస్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం టీ స్టాల్స్, ఫుడ్ ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్లు, కేఫేలు మరియు పలు ఈవెంట్లలో ఈ బిస్కెట్ టీ కప్పులకు మంచి ఆదరణ లభిస్తోంది. “టీ తాగండి… కప్పు తినండి…” అనే వినూత్న కాన్సెప్ట్ ప్రజలను ఆకర్షిస్తోంది. “ప్రకృతి కోసం ఒక చిన్న అడుగు… భవిష్యత్తు కోసం ఒక పెద్ద మార్పు” అనే నినాదంతో ఈ యువతి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలంటే కేవలం ప్రభుత్వాల చర్యలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని మనూష చెబుతున్నారు. ఒక చిన్న కప్పు ద్వారా పెద్ద మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జగిత్యాల నుంచి ప్రారంభమైన ఈ ప్రయత్నం భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆశిస్తున్నారు. టీ తాగుతూ ప్రకృతిని కాపాడే ఈ కొత్త అనుభూతిని ఆస్వాదించాలనుకుంటే సంప్రదించండి. టీ మాత్రమే కాదు “టీ తాగండి… కప్పు తినండి…”
ఫోన్ నంబర్: 96185 11810, ఇన్స్టాగ్రామ్: Biscuit Tea Cups Jagtial సంప్రదించండి. https://www.instagram.com/biscuit_tea_cups_jagtial/

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.