ఇద్దరు విశిష్ట స్త్రీల జీవన గమనం – కె. శోభాదేవి

“గెట్ అవుట్ ఫ్రం మై కార” “గెట్ అవుట్ ఫ్రం మై హోమ” ఈ రెండు వాక్యాలు ఈ మధ్య ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అరుంధతి రాయ్, తన తల్లి మేరీరాయ్ స్మృతిలో రాసిన “మదర్ మేరీ కమ్స్ టు మి” అన్న పుస్తకంలోవి కూతురు అరుంధతిరాయ్ నుద్దేశించి ఆదేశాలు.

ఆ రెండు ఆదేశాలు దేనికి చలించని మేరీరాయ్‌కి అణకువ గల అరుంధతిరాయ్‌కి అద్థం పడతాయి.
“లెట్ ఇట్ బి” (బీటిల్స్) అనే పాట నుంచి అరుంధతిరాయ్ ఎంచుకున్న శీర్షిక ‘మదర్ మేరీ కమ్స్ టు మీ’ పుస్తకాన్ని అతికినట్లు సరిపోయే శీర్షిక ఇది.
‘గాడ్స్ ఓన్ కంట్రీ’గా పిలవబడే పచ్చని ప్రకృతి దృశ్యాలు కనువిందు చేసే కేరళ రాష్ట్రంలో కొట్టాయం జిల్లాలోని అయామినం అనే పల్లెలో సిరియన్ క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన మేరీరాయ్ 2022వ సంవత్సరం అల్పాహారం ముగించుకొని చాలా నిశ్శబ్దంగా తన పడకగదిలో పడుకొని ప్రశాంతంగా కన్ను మూసింది. సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత (2025) హావభావాలకి, సెంటిమెంట్లకు అతీతంగా ఆమె జీవిత చరిత్రని ఎంతో నిజాయితీగా లిఖించింది కూతురు అరుంధతిరాయ్. తల్లుల గురించి బిడ్డలు రాయడం అసాధారణమేమీ కాదు కానీ జీవిత చరిత్రల సాధారణ సూత్రాల కతీతంగా, ఒక బయట వ్యక్తిగా తల్లిని పరిశీలించి రాసిన రచన ఇది. తల్లి వ్యక్తిత్వాన్ని యధాతధంగా చిత్రించడానికి అంతర్గతంగా ఆమె తీవ్ర ఘర్షణకి గురైనదన్నది వాస్తవం. అందుకు కారణాలు పుస్తకంలోనే దొరుకుతాయి. చదివి ముగించిన ఉద్విగ్న క్షణాల్లో దాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న తపనే నన్నీ పరిచయ వ్యాసరచనకి పూరికొల్పింది.
మేరీరాయ్!! చండశాసనుడైన తండ్రి దగ్గర దెబ్బలు, హింస అనుభవించిన మేరీరాయ్ అతడిని తప్పించుకోడానికి మొదటిసారి వచ్చిన వివాహ ప్రతిపాదనని అంగీకరిస్తుంది. అతనితో అస్సాం టీ ఎస్టేట్‌కి వెళ్ళిపోయాక అతని తాగుడు, ఏ పని చేయకపోవడం (నథింగ్ మాన్) ఈమె జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. బ్రతుకు పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ చందమయ్యింది. ఆమె మూడేళ్ల అరుంధతి, అన్న లలిత్ కుమార్ క్రిస్టఫర్‌రాయ్ (ఎల్ కే సి) ని తీసుకుని ఊటీ చేరడంతో ఒంటరి జీవన పోరాటం ప్రారంభం.
ఊటీలో అన్న జి ఐజక్‌కి చెందిన ఇంటిలో ఒక భాగంలో ఆశ్రయం తీసుకుంటుంది మేరీరాయ్. ఊటీ చలి తీవ్ర ఆస్థమాతో సతమతమయ్యే మేరీని మరింత కృంగదీసింది. ఇనుప మంచం మీద రజాయి కప్పుకొని ఊపిరి అందక అమ్మ పడే బాధ చూస్తున్న అరుంధతి, ఎల్ కె సి ఆమె చచ్చిపోతున్నదని భావించి తదేకంగా ఆమెని చూసేవారు. వారినలా చూడడం ఇష్టం లేని మేరీ అక్కడి నుంచి వెళ్లిపొమ్మని పిల్లలను కసిరేది. ఈ కష్ట సమయంలో ఆమె అన్న జి ఐసక్ తన ఇల్లు ఖాళీ చేసి పొమ్మనడం మేరీరాయ్ కష్టాలకి పరాకాష్ట, రాత్రికి రాత్రి మేరీ ఇద్దరు పిల్లలతో లాయర్‌ని వెతుక్కుంటూ బయలుదేరి వారసత్వ హక్కుల చట్టాన్ని ఆకలింపు చేసుకుంది. ఆ అవగాహనే తర్వాతి కాలంలో కూతుళ్ళకి కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కులు సంక్రమించేందుకు పోరాడి విజయం సాధించేట్టు చేసింది. ఇది కేవలం మేరీ రాయి స్వీయ విజయమే (Travancore christian Succession Act) అంతిమంగా కేరళ కూతుళ్ళకు తండ్రి ఆస్తి నుంచి కొడుకులతోపాటు సమాన హక్కులు ప్రాప్తించాయి.
ఒక్కో మెట్టు ఎక్కుతూ మేరీరాయ్ సాధించిన విజయపరంపరని వర్ణిస్తూనే ఆమ కఠిన ప్రవృత్తిని కూడా ఎన్నో సంఘటనల ద్వారా నమోదు చేసింది అరుంధతిరాయ్. రెండు విభిన్న ప్రవృత్తులు సమ్మిళితమైన మేరీరాయ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో లోతుగా ఆలోచించి ఆమెని ఆమెగానే చిత్రించడానికి చాలా ప్రయత్నించింది ఆమె. వారిద్దరి మధ్య ఉన్న సంబంధ సంక్లిష్టతని, వైరుధ్యాన్ని ఆయా సందర్భాల్లో వర్ణించేటప్పుడు అరుంధతి కలం అలవోకగా పొదిగిన ఎన్నో వాక్యాల అల్లిక సొగసు చదివి తీరాల్సిందే.
మేరీరాయ్ ఒంటి చేత్తో అట్టడుగు నుంచి ఒక్కో ఇటుక పేర్చి లారీ బేకర్ భవన నిర్మాణ శైలిలో నిర్మించిన గొప్ప బడే ‘పల్లికూడం’ దాని నిర్మాణ విషయమై బేకర్ని కలిసి తిరుగు ప్రయాణంలో కూతురు అరుంధతిని ‘గెట్ అవుట్ ఫ్రమ్ మై కార’ అన్నప్పుడు అరుంధతి దిగిపోయి ఆ హైవేలో ఏం చేయాలో తోచక ఒక మైలురాయి మీద దీనంగా కూర్చోవడం మనసునే కలిసి వేసే సందర్భం. ఆమెకు అది 15 సంవత్సరాల తొలి యవ్వన దశ అంకురిస్తున్న తరణం. జెసి (బేకర్ వద్ద సహాయకునిగా చదువులో భాగంగా వచ్చినవాడు) పట్ల ఆకర్షితురాలై తల్లి హుంకారంతో చల్లబడిపోయిన స్థితి ఆమెది. ఇలాంటి సంఘటనలెన్నో చదువుతున్నంత సేపు మనసుని గిలిగింతలు పెడతాయి. బడి నిర్వహణలో మేరీరాయ్ తెగువ, క్రమశిక్షణ అమలుపరిచే విధానం ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. ఒకసారి అబ్బాయిలు బాలికల లోదుస్తులైన ‘బ్రా’ ల విషయంగా వారినేడిపిస్తున్నరన్న విషయం మేరీ దృష్టికి వస్తుంది. వెంటనే ఆమె ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ కుర్రవాన్ని పిలిచి తన గది అలమరలోని తన ‘బ్రా’ని తెమ్మని ఆజ్ఞాపిస్తుంది. తెచ్చిన ఆ ‘బ్రా’ని అందరి ముందు ప్రదర్శిస్తే ‘దీన్ని బ్రా అంటారు. స్త్రీలు, మీ అమ్మలు, అక్క చెల్లెలు దీన్ని ధరిస్తారు. ఇది మిమ్మల్ని అత్యుత్సాహపరిస్తే దీన్ని మీరు ఉంచుకోవచ్చు’ అని ప్రకటిస్తుంది. ఆ చర్య అబ్బాయిల ప్రవర్తనలో మార్పుని కాక బాలబాలికల మధ్య వైషమ్యాలను శాశ్వతంగా నిర్మూలించగలిగింది. బాలురలోని ఆదిక్య భావాన్ని బాలికలలోని న్యూనతాభావాన్ని తొలగించి స్వచ్ఛమైన స్నేహ సంబంధాలను నెలకొల్పి భవిష్యత్తులో సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా నిలబెట్టగలిగింది. తన స్కూలు విద్యార్థుల్లో, ఇంతటి నైపుణ్యాన్ని నిర్వహణ దక్షతని చూపగల మేరీరాయ్ కూతురు అరుంధతిని ‘నువ్వు నా మెడ చుట్టూ ఒక గుదిబండవి (మిల్‌స్ట్టోన్) పుట్టిన వెంటనే ఏ అనాధాశ్రమంలోనూ పడేసి ఉండవలసింది అనడం మింగుడుపడని అంశం.
కేవలం అత్తెసరు మార్కులు తెచ్చుకున్నాడని ప్రోగ్రెస్ కార్డు అందినప్పుడు ఎల్ కె సిని పక్క గదిలోకి తీసుకెళ్లి స్కేలు విరిగేటట్టు కొట్టడం, మర్నాడు మంచి ప్రోగ్రామ్స్ చూపిన అరుంధతిని హత్తుకోవడం అరుంధతిరాయ్‌లో ఆనందాన్ని కలిగించకపోగా అన్న ఎల్ కె సి పట్ల అపారమైన జాలి, ప్రేమ కలిగి తనకి లభిస్తున్న ఏ విజయానికి ఆనందపడనివ్వక వెంటాడింది. ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స’ నవలకి ‘బుకర్ బహుమతి’ లభించినప్పుడు ఈమె మనసుని అన్న హింసింపబడిన బాల్య స్మృతి వీడక వెంటాడింది.
తల్లికి ఎదురు తిరిగితే ఆమె ఉబ్బసాన్ని పెంచిన దాన్ని అవుతానని భావించే అరుంధతి ఆమెకే మాత్రం ఎదురు చెప్పక ఘాటైన ఆమె తిట్లని బిచ్ రాసి రాస్టిట్యూట్ సైతం మౌనంగా భరిస్తుంది అమ్మ కోసం ఆమె బాహ్య ఊపిరితిత్తిగా మారి గాలి ఆమె కోసమే పిలుస్తున్నానని తనని తాను ఆమె బాహి రావయమ్మంగా భావిస్తుంది.
ఢిల్లీలో ‘స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర’ లో చేరినప్పుడు మాత్రమే తనను తానుగా ఊపిరి పీల్చి గలుగుతున్నానని భావించి స్వతంత్రంగా జీవించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని పొందుతుంది.
ఢిల్లీలో ‘ఆర్కిటెక్చర’ స్కూల్లో గోలక్ పరిచయం స్నేహం తనకి సీనియర్ అయినా జెసికి దగ్గర అవడం, ప్రేమించడం క్రమంగా అరుంధతిని స్వతంత్ర జీవిగా మార్చింది. తన స్వశక్తితో జీవించగలనన్న నమ్మకంతో డబ్బులు పంపవద్దని అమ్మ మేరీ రాయికి చెబుతుంది. తన 16వ ఏట తల్లిని వదిలిన అరుంధతి ఏడు సంవత్సరాల పాటు తల్లిని కలవదు. మేరీరాయ్ కూడా కూతురు ఎలా ఉన్నదని కానీ, ఎట్లా జీవిస్తున్నావు అన్నది కానీ పట్టించుకోదు. తెలుసుకుందామన్న ఆసక్తి ఆమెకి లేదు. భౌతికంగా సంవత్సరాలపాటు దూరంలో ఉన్నప్పటికీ తల్లి పట్ల అరుంధతికి ఆపారమైన ప్రేమ. ఆమె మీద ప్రేమ వల్లనే దూరంగా ఉంటున్నానని కూడా ఒక సందర్భంలో అంటుంది. తన కోర్సు పూర్తి అవ్వగానే రెండు గదులు అద్దెకి తీసుకొని చాలీచాలని జీవితంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్న రోజుల్లో హఠాత్తుగా తల్లి ఢిల్లీ రావడం తటస్టించినప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత అమ్మని చూడబోతున్నానన్న ఉత్సాహంతో ఎదురుచూస్తున్న అరుంధతి ఆమె కనపడగానే గుర్తించి ఆ లింగనం చేసుకున్నప్పుడు, భౌతిక సామీప్యాన్ని ఇష్టపడని మేరీ సున్నితంగా తన చేతులతో దూరం జరుపుతుంది. ఆమె వచ్చింది సుప్రీంకోర్టులో తన వారసత్వ కేసు విషయమై తప్ప కూతురుని చూడాలని కాదు.
తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మేరీరాయ్ అరుంధతి గదికి వచ్చి ఆమె ఇంటి వద్ద వదిలి వచ్చిన టైప్ రైటర్ని తెచ్చి ఇవ్వడం రచనలు చేయడానికి తనని ప్రోత్సహించడంగానే అరుంధతి భావిస్తుంది. ఢిల్లీ వడగాల్పుల్లో, సదుపాయాలు లేని రెండు గదుల ఇంటిలో కూతురికి ఒక ఫ్రిడ్జ్ కొనిపెట్టి వెళ్లడం తన పట్ల ఆమె ‘ప్రేమ’ అని గ్రహిస్తుంది. అయితే ఆ ఫ్రిడ్జ్‌ని ఆమె పుస్తకాలు, బట్టలు పెట్టుకునే బీరువాగా వాడిందన్నది వేరే విషయం.
మదర్ మేరీ పుస్తకంలో అరుంధతిరాయ్ జీవన ప్రయాణమే చాలా బాగాన్నాక్రమించింది. డైరెక్టర్ ప్రదీప్ క్రిషన్ పరిచయం అతని సినిమా ‘మెస్సె సాహిబ’లో నటించడం, స్క్రిప్ట్ రైటింగ్, ఛానల్ 4 కి రాయడం, ప్రదీప్‌తో ప్రేమ, అతనిలో కలిసి చేసిన సుదీర్ఘ ప్రయాణం అరుంధతిరాయ్‌ది. భార్య దూరమైన ప్రదీప్‌ని చట్టబద్ధంగా వివాహం చేసుకుంటుంది అరుంధతి. అతని కూతుళ్ళకి తల్లిగా వ్యవహరిస్తూ అదే సమయంలో ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స’ రచనని కొనసాగించి నాలుగు సంవత్సరాలలో పూర్తి చేసింది. సాహిత్యం, భాష సృజనాత్మకత వంటి విలువైన విషయాలను పుస్తకంలో చర్చించింది. ఆమె భాష, వాక్య విన్యాసం ఆమెకే ప్రత్యేకం కథకి సంబంధించి వివిధ సన్నివేశాలు క్రమపద్ధతిననుసరింపక ఫ్లాష్‌బ్యాక్ పద్ధతిలో నడుపుతూ రాసే శైలి ఆమెకే ప్రత్యేకం. మదర్ మేరీ…లో ఈ పద్ధతిలో విరివిగా వాడిందామె. పుస్తక ప్రారంభమే మేరీరాయ్ మరణంతో మొదలవుతుంది. ఆయా సందర్భాలకు తగినట్లు హాస్యం కూడా తొంగి చూస్తుంటుంది. తల్లికి తెలియకుండా తండ్రి మిక్కిరాయ్‌ని అన్నాచెల్లెళ్ళు కలిసే సందర్భం వినోదభరితం.
‘బుకర్ ప్రైజ’ పొందిన వార్తని వేడుక జరుగుతున్న సమయంలో ఒక్క తల్లితోనే పంచుకుంటుంది. తనని ఒక రైటర్‌గా చూడాలన్న కోర్కె తల్లి మనసులో ఉన్నదని అరుంధతికి తెలుసు. తల్లి నిద్రిస్తూ ఉండవచ్చనుకుంటూనే (భారత్‌లో రాత్రి రెండు గంటలు) ఫోన్ చేన్తుంది. ఆ సమయంలో మేరీరాయ్ మేలుకొని టీవీ చూస్తుంటుంది. “వెల్డన్ బేబీ గర్ల” అన్నది ఆమె ప్రశంస.
సంపద, కీర్తి రెండు అరుంధతిని భయపడతాయి. ఆ చట్రంలో అడిగుపెడితే, ఇరుక్కుపోతే స్వేచ్ఛని కోల్పోతానంటుందామె. ఆ గొప్ప విజయం వెనుక మరో గదిలో ఎల్‌కెసి¾ దెబ్బలకి గురవుతున్నాడు అన్న చిన్ననాటి జ్ఞాపకం ఆమెను చుట్టుముడుతుంది.
అది 1974 పోక్రాన్ న్యూక్లియర్ పరీక్షలు మొదటిగా జరిపిన సంవత్సరం, 1998 రెండవసారి భారత న్యూక్లియర్ పరీక్షలు జరిపింది. దేశం గర్వంతోనో, హైందవ జాతీయ వేడుకలలో తలమునకలు అవుతుంది. బుకర్ విజయోత్సాహం ఆ వేడుకల్లో భాగంగా కలగలిసిపోవడం ఏమాత్రం నచ్చని అరుంధతి మౌనంగా ఉండదలచలేదు. అప్పుడు రాసిన వ్యాసమే ‘ఊహలు అంతరిస్తున్న వేళ’ (ది ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్) ఆమె వ్యాసాలు అవుట్ లుక్, ఫ్రంట్ లైన్ ఆంగ్ల పత్రికల్లో ముఖపత్ర కథనాలుగా ప్రచురింపబడ్డాయి. భారత్లో ప్రకంపనలు! ఆమె భారత్ వదిలి పొమ్మన్న ప్రకటనలు, పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్న బెదిరింపులు…
ఆమె తగినంత క్రిస్టియన్ కాదు, తగినంత హిందువు కాదు, తగినంత కమ్యూనిస్టు కాదు, తగినంత… కాదు అంటూ చిత్రించడం ఆమెని సంతోష పెట్టింది. దేశాన్ని అర్థం చేసుకునే క్రమంలో దేశం నలుమూలల పర్యటించిందామె.
నర్మదా బచావో ఆందోళనలో రైతుల నిరసన ప్రదర్శనలో కాశ్మీరీయుల స్వతంత్ర పోరాటంలో భాగస్వామి కాగలిగింది. ప్రభుత్వం దృష్టిలో పడిన అరుంధతిరాయ్‌పై నేరారూపణ అనివార్యమయ్యింది. దేశంలోని రాజకీయ పరిణామాలన్నీ ఆమె వ్యాసాల్లో ప్రతిఫలించాయి.
మరోవైపు ఆమె ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వచ్చి పడుతున్న కీర్తి ప్రతిష్టల ఊహాత్మక బోనుని బద్దలు చేసుకోవడంలో ఆమె స్వాతంత్య్రాభిలాష ఇమిడి ఉంది. తల్లి మేరీరాయ్ అదృశ్యంగా అందించిన స్వేచ్ఛని ఆకలింపు చేసుకుని తనని తాను అర్థం చేసుకుంటూ ప్రయాణం కొనసాగించింది. తాను జీవించదలుచుకున్న స్వతంత్ర పద్ధతిలోనే సర్వస్వతంత్రురాలుగా జీవించింది. జేసీతో కానీ, ప్రదీప్‌తో కానీ తనలో కలిగిన ఆప్యాయతానురాగాలు సైతం తనని బంధించి ఉంచలేకపోయాయి. అందుకు ఎవరు బాధపడక అర్థం చేసుకోగలిగిన ఉదార స్వభావులే అందరు. విడిపోవడమÖ తీయని చర్యే అని వారి భావన. ఈ స్వేచ్ఛాజీవి, స్వతంత్ర జీవన శైలిని అర్థం చేసుకున్న వారే వారు. చివరిగా అరుంధతిరాయ్ మాటల్లోనే… “ఈపుటల్లో మా అమ్మ నా గ్యాంగ్స్టర్స్ జీవిస్తుంది. ఆమె నా ఆశ్రయం నా తుఫాను”.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.