ఆర్దరాత్రి ఆదురుతున్న గుండెలతో
ముచ్చమటలతో తడిచి ముద్దై భర్త ఒడిలో కరుచుకుపోతుంది
పీడకల దుస్వప్నం అంటూ జోకొడతాడు…
భయంకర స్వప్నం… ఏవో చెడు సంకేతాలు వణికిపోతుంది
“హాష్ లోషన” ఎవరో తన కూతురును తడుపుతున్నారు
నోటిని గుప్పిట్లో బిగించి ఏవో ద్రవాలు గొంతులో నింపుతున్నారు
ఏవేవో ఇంజెక్ట్ చేస్తూ… పైశాచికానందంలో మునిగి తేలుతూ… మత్తులో పొర్టుతున్న
బిడ్డను చిత్రాలు తీసి డ్రగ్స్‌కు బానిసంటూ సాక్షాలు స్రుష్టిస్తున్నారు
ఆడదాని హింసల్లో మరో ప్రయోగం మారకద్రవ్యాలు…
హత్యలు, అత్యాచారాలు కాల్చడం కూల్చడం చాలక
డ్రగ్స్ బెదిరింపులు… అలవాటు చేయ వేటు…
కన్న హృదయాలు బోరుబోరుమంటున్నాయి
వారికి డబ్బు కావాలి… ఆస్తులు రావాలి… చెప్పుల క్రింద నలగాలి
పుట్టిల్లు ఊడ్చుకుపోవాలి… డ్రగ్స్ … డ్రగ్స్ యల్ యస్ డి కొకాయిన్
హెరాయిన్, ఒడిపియా ఇలా ఎన్నెన్నో… కానుల పంటల దొంగ రవాణాలు
అల్లారు ముద్దు బిడ్డ, అందాల తల్లి, ఇంటి ఇల్లాలని చూడకుండా బలిచేస్తారు
ఉపేక్షిస్తే కాకులు గద్దలు చిదిమేస్తాయి. అపనిందల పాలు జేస్తారు…
డ్రగ్స్ వాడికి మత్తులో సలిపే అకృత్య ఆయుధాలు…
అలసిస్తే మన బిడ్డ మనకు దక్కుదు. బిడ్డ బ్రతుకు అర్ధాంతరంగా ముగియకూడదు
రాత్రికి రాత్రే ప్రయాణం… కూతురుతో కలిసి తిరుగు ముఖంలో
ఆగిపోయిన చదువు కొనసాగించాలని, చెదిరిన బ్రతుకు పునర్మించాలని
కలలు కంటూ ప్రభాత సంధ్య కిరణాలలో నూతన కాంతులై
ఇల్లు చేరుకుంటున్న అంతలోనే… వారి మరో బిడ్డ చదువుల రాణి…
అరుగుపై ఎవరు తోశారో… వాంతుల మండుగులో దుర్గంధ సెగలలో చొంగకార్చుతూ
మత్తుగా దొర్లుతూ… వణుకుతూ… కంపిస్తూ… పట్టు తప్పిన నరాల పిడికిలి నేలకు బాదుతూ
పబ్బులు పడగొట్టండి… పార్టీలు నిషేదించండి డ్రగ్స్ మాఫియా తరిమి కొట్టండి…
స్మగ్లర్లను కటకటాలలో నెట్టుదాం… డ్రగ్స్ … డ్ర… గ్స్… ర… వా… ణా కట్టడి… కై… పో.రా.డు.దాం
తడబడుతూ గొణుగుతూ… హీనస్వరంతో అరుస్తూ స్పృహ కోల్పోతూ… సర్వం కోల్పోతున్య యువత
ఒక అనుభవం సత్వర దిద్దుబాటు… మరో ఆవేదన… ఆవేశం… ఒక… అంకురార్పణ
సమాజాన్ని కూల్చివేస్తున్న అమానవీయ ఉత్పత్తులు
ఆడపిల్లనే కాదు, యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తున్న ఎందరెందరో ఎన్నెన్నో అనుభవాలు
డ్రగ్స్ శవపేటిక సర్వజనుల బలిపీఠిక
