ఆమె
కుటుంబ సంగీతవీణ
ఆమె ఉంటే పూరిపాకైనా
హరివిల్లు
త్యాగానికి ప్రతిరూపం
సహన క్రమశిక్షణకు దర్పణం
ధైర్యంగా నిలబడే పోరాటశీలి
సొంతింటి కలను సాకారం చేసుకుంటూ మెట్టినింటి గౌరవాన్ని నిలబెట్టి
కాపురం చేసే కార్యశీలి
భార్యగా, తల్లిగా, కోడలిగా
ఏరూపమైనా
ఆమెకు ఆమెనే సాటి
ఆత్మీయత అనుబంధాల
సంపదతో గృహిణిగా
విశ్వరూపం చూపిస్తుంది
ఆమెకు ఆమెనే సాటి
ఆమెను గౌరవిస్తే ప్రేమిస్తే
బతుకు ఆనంద సాగరమే!
ప్రముఖ కవి, జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సాహితి,
