పెళ్లి రోజు.. – సహచరి

పెళ్లంటే నూరేళ్ల పంటని../
స్వర్గంలో జరిగే కనీవినీ ఎరుగని/
వీనుల విందు అని విన్న వాళ్ళం../

మనసులు కలవకుండా/ జాతకాలు జ్యోతిష్యాలు, తిధులు నక్షత్రాలు /
కలిస్తే చాలు కలిసి ఉంటారని/ భరోసాతో.. రిసార్టుల్లో జరిగే / హల్దీ మెహందీ సంగీతుల ఆనందాల హరివిల్లుల్లో ..
స్వర్గాన్ని /ఫంక్షన్ హాళ్లల్లో సృష్టించుకుని /
నవరసాలొలికే చిందులు విందులు/ దాండియా నృత్యాల్లో /మనసులు కలవకున్నా../
ఆస్తి అంతస్తుల హృదయంతరాల సవ్వడులువినలేని సందళ్ళ లో /
అంగరంగ వైభవంగా జరిగే /వేడుకలు
తెలియని కాలం..
పెళ్లంటే రెండు మనసుల మానవీయ సమ్మేళనం../
రెండు హృదయాల అద్వితీయ సంగమం అనుకున్నాం ../
వాటికి కులమతాలు ఆస్తి అంతస్తులు/ జ్యోతిష్యాలు జాతకాలు పెట్టుబడులు/ కట్టు కథలు కట్న కానుకలు మంత్రోచ్ఛారనలు/ భాజా భాజంత్రీలు అవసరం లేదనీ /
కులం పునాదుల మీద / ఓ జాతిని గాని నీతిని గాని నిర్మించలేం/ అనుకున్నా
కులం కూలిపోయే గోడేనని /
కట్టుబాట్లు సాంప్రదాయాలు
పేర్చుకున్న పేక మేడ లేనని /
పెళ్లంటే ఇద్దరు మనుషులు
ఆత్మీయంగా స్నేహితులుగా/
కలిసి ఉండే ఓ సామాజిక సహజీవనమని, /
భార్యాభర్తలు పురుషాధిక్యపు సాంప్రదాయ సంకెళ్ల కట్టుబాట్లలో
నలిగే /
మనుషులుగా కాకుండా
స్నేహితులుగా బ్రతికే ఓ అపూర్వ సందర్భంగా.. / పెళ్ళినీ స్నేహితుల సాక్షిగా దండల్లో కూర్చుకున్నాం.
నిరంతరం ఒకరినొకరం ఓర్పుతో తీర్చి దిద్దుకుంటున్నాం..
కానీ ఇప్పుడు పెళ్లికూతురే వరున్నీ ప్రియుడితో గొంతు కోసే కిరాతకాన్ని చూస్తున్నాం.. /
పెళ్లీడు రాని అమ్మాయి అబ్బాయితో కలిసి అమ్మనే కిరాతకంగా గొంతు కోసే కూతుళ్లను చూస్తున్నాం /
కూతురు కులం కాని వారిని చేసుకున్నదని /
కొడుకు తక్కువ కులం అమ్మాయిని పెళ్లాడాడనీ /
సుపారీతో గొంతులు కోసే తల్లిదండ్రులని చూస్తున్నాం. /
కులం కన్నా మతం కన్నా మానవ విలువలే మిన్నని/
మానవీయంగా కలిసి బ్రతుకుదామని/ పెళ్లిళ్లు చేసుకున్న జంటల్ని /
వెంటాడి వేటాడి పరువు హత్యల పేర/ ప్రేమికుల్ని హతమారుస్తున్న కులహంకార హత్యలను చూస్తునామ్../
ఇప్పుడు పెళ్లంటే.. ఇద్దరి మనుషుల మనసుల /అంతరంగాల కలయిక కాదు /
కులాలు మతాలు కట్నాలు కానుకలు/ ఆస్తులు అంతస్తులు గోత్రాలు జాతకాలు కలవడం.. మనసులు కలవకున్నా..
వాళ్ళ మనసుల్లో మరొకరున్నా../
ప్రేమైక లోకంలో వాళ్ళ అంతరంగాల్లో దాగున్న చిత్రపటాలని చిత్రం చేసి/
మరొకరి ముందు తలవంచే ఆత్మవంచనకు వంటి నిండా పొదిగేసుకున్న/
వస్త్రాభరణాల ప్రదర్శనలో /కాలుతున్న అంతరంగాల్ని చూడలేకున్నాం../
పెళ్లి రోజు తలుచుకోవడం అంటే కష్టాలను కన్నీళ్ళను /అంతరాలను అవాంతరాలను /
ఈదుతూ వచ్చిన జీవన ప్రవాహం.. ఇష్టా ఇష్టాలకు కట్టుబాట్లకు /
సంప్రదాయాల పీటల మీద నుండి నడిచిన ఏడు అడుగులు /వేసిన మూడు ముళ్ళు ..
మరో పెళ్లి రోజు రాకుండానే ముగిసిపోతున్నందుకు..
ప్రేమికులు బ్రతకలేక చనిపోతున్నందుకు/
కలిసి బ్రతకాలని జతకలిసినోళ్లకు బ్రతుక నీయని అమానవీయతకు /హృదయం కన్నీళ్ళను పొర్లిస్తున్నది..!
పెళ్లిళ్లు కలిసి బ్రతకడానికి../
బ్రతుకు హతమార్చడానికి /
కాదని గుర్తించడానికి..

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.