యాంత్రికతని మనమే సృష్టించుకుంటాం – కొండవీటి సత్యవతి

పర్ఫెక్ట్‌ డేస్‌ సినిమా పేరు. ఇది జపనీస్‌ చిత్రం. విన్‌ వెండర్స్‌ దర్శకుడు. హిరయామా అనే ఒక టాయ్లెట్‌ క్లీనర్‌ కధ. కోజి యకుషో అనే నటుడు టాయ్లెట్లు శుభ్రం చేసే పాత్రలో అద్బుతంగా నటించాడు. టాయ్లెట్‌ శుభ్రం చేసే మనిషిని కథానాయకుడుగా పెట్టి విన్‌ వెండర్స్‌ ఓ కళాత్మక చిత్రం తీసాడు. కళాత్మక చిత్రం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది.  Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వర్షాకాలం! – ఆపర్ణ తోట

కాలమ్‌ రాయాలి! రాద్దామని కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ఏం రాయాలా అని ఆలోచిస్తూ స్నేహితురాళ్ళ గుంపులో (అదేనండి వాట్సాప్‌ గ్రూపులో) సలహాలు అడిగాను.  వర్షం గురించి రాయమని రెస్పాన్స్‌. మొదలు పెట్టేశా. మిగిలిన వారు మాట్లాడేలోగా లాప్టాప్‌ కీబోర్డ్‌ మీద నా వేళ్ళు చకచకలాడాయి. Continue reading

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

వ్యాయామంతో ప్రయోజనాలెన్నో .. – వి.శాంతి ప్రబోధ

‘‘గిట్టయితే మా బతుకులేంగాను, మేమెట్ల బతకాలమ్మ’’ బాధ వెళ్లగక్కుకుంటూ వచ్చింది యాదమ్మ.
ఏమైందన్న మా అత్తగారి ప్రశ్నకు జవాబుగా ‘‘ఆ ఉమా మేడం ఒకటో తారీకెల్లి పని బంద్‌ పెట్టమన్నది. కొలువు దిగిపో యింది కద. పనంతా ఆమెనే చేసుకుం టదట’’ దీనంగా చెప్పింది యాదమ్మ. Continue reading

Share
Posted in కిటికీ | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

మా తల్లిదండ్రులు మృదు స్వభావులు. వాళ్లెన్నడూ మాపై చెయ్యెత్తింది లేదు, పల్లెత్తు మాటన్నది లేదు. ఇతరుల పట్ల.. ఇరుగుపొరుగు కావొచ్చు, ఇతర కులాలకు చెందిన పనివారు కావొచ్చు.. ఎవరి పట్లా వాళ్లు తెలిసి నిర్దయగా ప్రవర్తించింది లేదు. అయితే బ్రాహ్మణులుగా తాము ఇతరులందరికంటే అధికులమన్న భావన మాత్రం వారిలో ఉండేది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

చీడ – గొరుసు

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం. Continue reading

Share
Posted in కధలు | Leave a comment

ఆధునికుల మన్ననలందిన నవల ‘‘సిద్ధార్థ’’ – డా. రాయదుర్గం విజయలక్ష్మి

సమాజ దుఃఖ నివారణ మార్గాన్వేషకునిగా ఇల్లు వదలిన గౌతమ సిద్ధార్థుడు, ఆరేళ్ళ అన్వేషణానంతరం, జ్ఞానోదయాన్ని పొంది, బుద్ధుడయ్యాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని, బోధనల ద్వారా మాత్రమే గాక, ఆచరణ ద్వారా కూడా ప్రజలకు అందించాడు. అందుకే బౌద్ధం అంటే మానవులను కరుణార్ద్రచిత్తులుగా తీర్చి దిద్దగలిగిన ధర్మంగా గుర్తింపును పొందింది. నాది, మాది అన్న మాటలను మనది అన్న మాటగా Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

కొండవీటి సత్యవతి కథలు – వైవాహిక జీవితం – ఆవుల రేణుక

కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, అన్ని విషయాలలో ఇరువురు సహకరించుకుంటే ఆ బంధం బాగుంటుంది. పితృస్వామ్య భావజాలంతో భార్యను బానిసగా చూడటం, అధికారం చెలాయించడం, ప్రతిక్షణం అణిచివేయడం సర్వ సాధారణమైంది. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

బ్రతుకు కేన్వాస్‌పై కవయిత్రి అంతరంగ ఆవిష్కరణ! ‘కాలం కేన్వాస్‌ మీద’ ` అనిశెట్టి రజిత కవిత్వం- సింగరాజు రమాదేవి

1984లో గులాబీలు జ్వలిస్తున్నాయి అనే కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఆరు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకూలు, నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనలతో పాటు, అనేక గ్రంథాలకు సంపాదకత్వంతో నేటి వరకూ కొనసాగుతూనే Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహాయాన బౌద్ధ మతంలో మహిళల స్థానం – ఒక విశ్లేషణాత్మక అధ్యయనం డాక్టర్‌ చింతల వెంకట శివసాయి

వ్యాస సంగ్రహము: స్త్రీల పట్ల వివక్ష అనేది ప్రపంచంలో సర్వసాధారణ విషయం. కొన్ని మతాలలో ఆత్మ కేవలం పురుషులలో మాత్రమే ఉంటుందని, స్త్రీలలో ఉండదని భావన. కానీ, గౌతమ బుద్ధుడు తన భిక్కూని సంఘం ద్వారా మొట్టమొదటి ఆధ్యాత్మిక రంగంలో మరియు Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కమల్‌కోశ్‌ పేము చాపలు చెప్పే కథ – శ్రేయ కనోయ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రభాతి ధర్‌ అరటి చెట్లు, నెమళ్ళు వంటి శుభప్రదమైన కళాకృతులతో చాపలను అల్లుతారు. ఒక అరుదైన నైపుణ్యమైన కమల్‌కోశ్‌ అల్లికను ఆమె పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కూచ్‌బిహార్‌ జిల్లాలోని యువతకు అందజేస్తున్నారు. చక్కగా అల్లిన కమల్‌కోశ్‌ చాపను కొద్దిమంది మాత్రమే మెచ్చుకోగలరు.చాలా కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ ఆ చాపను అల్లగలరు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌ జిల్లాలో తయారుచేసే ఈ అత్యంత సవిస్తరమైన పేము చాపలను బిరుసుగా ఉండే సన్నటి పేము చీలికలతో అల్లుతారు. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మీ రాజ్యం మీరేలండి నవలలో సామాజీకత – అయ్యప్ప గారి స్వప్న

మీ రాజ్యం మీరేలండి నవలాకర్త బండి నారాయణ స్వామి. నవలల్లో చాలా వరకూ కల్పనలకే ప్రాధాన్యముండవచ్చును కానీ, సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో వచ్చిన నవలలు వాస్తవిక చిత్రణలకే ఎక్కువ ప్రాతినిథ్యాన్ని కల్పించేయి. సంఘటనాత్మక కథాకథనాలతో ప్రాత్రచిత్రణలతో నవలలు వెలుగుచూస్తూంటాయి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చేనేత పరిశ్రమ – డా.ఎ.కళ్యాణి

ఆధునిక జీవనశైలికి అర్రులు చాస్తూ, చదువు లేకపోయినా, సరైన ఉద్యోగం లేకపోయినా, కూలిపని చేస్తూ అయినా హైదరాబాద్‌ వంటి నగరాలలో నివసించడానికి మొగ్గు చూపుతున్నారు కానీ, సొంత ఊరిలో ఇంటిపట్టున ఉంటూ కులవృత్తిని చేస్తూ జీవనం గడపడానికి నేటి యువత విముఖత వ్యక్తం చేస్తున్నారు. అలా గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎస్వీ కవిత్వంలో స్త్రీవాద దృక్పథం`ఓ పరామర్శ – డాక్టర్‌ కొండపల్లి నీహారణి

కవిత్వం ఒక భావ పరంపర. ఒక నిరంతర ధార.అనంత సంగ్రామాలను, అద్భుత సంద్రాలను తనలో ఇముడ్చుకుంటుంది. ఈ జీవిత ప్రవాహంలో కష్టాల రాళ్లను, సుఖాల నీళ్లను తనతో తీసుకొస్తుంది, తోసుకొస్తుంది. కవి అంతా కవిత్వం అయినా, కవిత్వమే కవి అయినా కానలేని కారణాలేవీ ఉండవు.సమాజం సర్వ సమస్యల నిలయం. కంటికి అందకున్నా మనో నేత్రంతో చూసి ఆలోచనలకు, సంక్లిష్టతలకు అక్షర నెలవయ్యేదే కవిత్వం. జీవితాల్లో సుఖ సంతోషాల పాశాలు ఏవైనా అల్లిబిల్లిగా మనస్సును అల్లుకున్నప్పుడు కవిత్వంగా వచ్చి తీరుతుంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

స్తీ మూర్తి – – షేక్‌. కాశింబి

నా పుట్టిన రోజు వేడుకనేవరు
ఆచరించకున్నా…
నా ఎదుగుదల ఎత్తుల నెవరూ Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

ఆరిపోని లాంతరు దీపం – కార్తీక రాజు

సూర్యుడు నిద్రలేవక ముందే లేచి
బోసిపోయిన వాకిలిని
చుక్కల ఆకాశంలా
చూడముచ్చటగా తీర్చిదిద్ది Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

మాతృత్వం తరగని జీవన సౌరభం – డాక్టర్‌ కత్తి పద్మారావు

ఆ తేయాకు తోట విశాలంగా ఉంది
ఆకులన్నీ సూర్యకిరణాలతో
పరవశిస్తూ నేలకు పచ్చదనాన్ని అద్దాయి. Continue reading

Share
Posted in కవితలు | Leave a comment