”యత్ర నార్యస్తు పూజ్యంతే
రమతే తత్ర దేవతా,
యత్రైతాస్తు న పూజ్యంతే
సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.
”యత్ర నార్యస్తు పూజ్యంతే
రమతే తత్ర దేవతా,
యత్రైతాస్తు న పూజ్యంతే
సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మనుస్మృతి చెప్పింది అంటారు.
యిటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుళ్ళిె అటు ప్రభుత్వాలకు, యిటు పెత్తందారీ కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తలలో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపును పొందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలైన డెభ్బై రెండు సంవత్సరాల వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ. ఆమె తల్లిదండ్రులు పుల్లగూర సువార్తమ్మ, ప్రకాశం. వీరిది గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట పట్టణానికి సమీప గ్రామమైన తిమ్మాపురం. అయితే జయ భాగ్యమ్మ తండ్రి తన అత్తగారి వూరైన పెదగొట్టిపాడు గ్రామానికి యిల్లరికం వొచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆమెకి అదే గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సుబ్బారావుతో వివాహం జరిగింది. సుబ్బారావు, జయ భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం – యిద్దరు మొగపిల్లలు, వొక ఆడ పిల్ల. ఆమెకి చదువులేదు. అటు తల్లిదండ్రులనుంచి గానీ యిటు అత్తమామల నుంచిగానీ కనీసం సెంటు భూమిలేదు. రెక్కల కష్టం మీద బతుకు వెళ్ళదీయడం తప్ప వేరే ఆర్ధిక వనరులు లేని కుటుంబం ఆమెది. పెదగొట్టిపాడు సగటు భారతీయ గ్రామానికి నిలువెత్తు ప్రతినిధి లాంటి వూరు. అక్కడ కుల భూస్వామ్యం బాహాటంగానే బుసలు కొడుతుంది. గుంటూరు మిరపకారం పొగరంతా అక్కడి దొర తనంలో గుప్పుమంటుంది. అయితే ఆ వూరిలో మాలా మాదిగలు కలిసి సుమారు వెయ్యి గడప వుండే దళిత వాడలో యెవరికీ పొలం పుట్రా లేకపోయినా వారి ఆత్మగౌరవానికి మాత్రం కొదవలేదు. దళితులు పాలేరుతనం, భూస్వాముల యిండ్లలో పాచిపనులు చెయ్యడం వంటి ఆత్మ న్యూనతకు గురిచేసే పనులను చాలారోజుల క్రితమే మానివేసి తమ గౌరవానికి భంగం కాని విధంగా కాంట్రాక్ట్ పనికి, ూలికి వెళ్ళి గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడం ఆ గ్రామ దళిత చైతన్యా నికి నిదర్శనం.
రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి అన్నం తిన్నవారే.
స్వేచ్చగా, నిర్భయంగా, ఎటువంటి కట్టడులు లేకుండా, ఆడుతూ పాడుతూ గడిచే కాలం ఎంత నిర్మలంగా ఉంటుంది!
పచ్చటి చెట్లమధ్య, స్వచ్చమైన పచ్చిగాలి పీలుస్తూ, మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ, వాగునీటి సంగీతం వింటూ, సీతాకోకచిలుకల్లా తిరుగుతుంటే జీవితం ఎంత నిమ్మళంగాఉంటుంది!
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ 16 రోజుల యాక్టివిజమ్ పూర్తయిన సందర్భంలో హోటల్ అక్షర గ్రాండ్‌లో భూమిక మిత్రలు, వాలంటీర్లు మరియు సిబిఓ లీడర్లతో కలిసి 10 డిసెంబర్ 2020న సమావేశం నిర్వహించడం జరిగింది. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఛీఫ్ ఫంక్షనరీ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ భూమిక సంస్థ ఎప్పుడు ప్రారంభమయింది, దాని ప్రస్థావం గురించి వివరించారు. తర్వాత 16 రోజుల యాక్టివిజమ్ సందర్భంగా భూమిక సంస్థ నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలుపుతూ కొత్తగా ప్రారంభించిన మొబైల్ లైబ్రరీ గురించి వివరించారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. అలాగే భూమిక సంస్థ అందరూ ఒకచోట చర్చించుకునే అవకాశం కల్పించింది కాబట్టి అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
ఊరూరా ఉండే పుల్లమ్మ, ఎల్లవ్వ, ఎలిజబెత్ అక్కా, నజీర్ బాబాయ్, సుబ్బయ్య తాత… అందరూ ఓ తూరి ఈడకి రాండిరి. నేను మన ‘సొలోమోన్ ఇజియ కుమార్’ రాసిన ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకం గురించి సిన్న సమీచ్చ రాసిన. అందరి మాదిరి చెప్పకుండా మన ఇజియ కుమారుకి జాబు రాసినట్టు చెప్పిన. మీరు గుడా చదవండి.
కాదేదీ కథకనర్హం కథలు
కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలో ముంచి
గంగ నాకు నీళ్ళు ఇచ్చె
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే
తమిళం: ఎస్.రామకృష్ణన్, మైసూరు
కన్నడం: నల్లతంబి
ఆ కారులో ఐదుమంది ఉన్నారు. మంచు మూసుకొన్న దారిలో కారు ముందుకు సాగిపోతోంది. కారులో ఉన్నవారిలో ఇద్దరు భారతీయులు. మిగిలిన ముగ్గురు ఉగాండాకు చెందినవారు. కారు నడుపుతున్నవాడు ఆ ఐదుగురిలో చాలా చిన్నవాడు. అతడి పేరు మువాంగా. అతనికి పద్దెనిమిదేళ్ళ వయసు. కానీ, అతడు మంచి దృఢకాయుడు. ఆరడుగుల కంటే ఎత్తైనవాడు. రాతి శిలవలె గడ్డ కట్టిన ముఖం. అతడు కారు నడుపుతుంటే ఒక యంత్రాన్ని నడుపుతున్నట్లుంది.
ప్రజలారా!
23-12-2020న ధర్మవరం దగ్గర స్నేహలత ప్రేమోన్మాది చేతిలో పాశవికంగా హత్య చేయబడింది. వెంటనే టీవీలలోనూ, వార్తా పత్రికలలోనూ ఈ వార్తను ప్రముఖంగా చూపారు. సామాజిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు పరామర్శ పేరుతో బారులు కట్టి వారి వారి పార్టీల అజెండా ప్రకారం ప్రకటనలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంఘాలు, రాజకీయ సంస్థలు, వ్యక్తులు ఈ రకంగా స్పందించడమన్నది ఆరోగ్యకర పరిణామం. దీన్ని మనమందరం ఆహ్వానించాల్సిందే. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం కూడా స్పందించి చాలా తక్కువ సమయంలోనే బాధిత కుటుంబానికి పరిహారం అందించింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే ఇటువంటి సంఘటనల్లో ప్రభుత్వాలు పరిహారాలు ప్రకటించినంత సులభంగా ప్రభుత్వం నుంచి బాధితులు పొందగలగడం సులభమైన విషయం కాదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారంతా రెండు డిమాండ్లు చేశారు. ఒకటి బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, రెండవది హంతకులకు తీవ్రమైన శిక్ష వేయాలని. ఈ రెండు డిమాండ్లలో ప్రభుత్వం మొదటి డిమాండును అమలు పరిచింది. రెండవ డిమాండుకు సంబంధించి ముద్దాయిని రిమాండును అమలు పర్చింది. శిక్ష సంగతి కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ చర్య రెండవ డిమాండ్‌కు పూర్తి జవాబు కాదు. వ్యక్తులే కాకుండా సామాజిక బాధ్యత కలిగినవారు, రాజకీయ నాయకులు కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలనగా, మరికొంతమంది, నిందితులకు అంగచ్ఛేదనం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రియాంకరెడ్డి విషయంలో అమలు పర్చింది. దానివల్ల నిందితులు గుణపాఠం నేర్చుకోలేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కళ్యాణదుర్గంలో వహీదా హత్య కూడా ఈ కోవకు చెందినదే. వీరు కోరుతున్న ఎన్‌కౌంటర్లు కూడా ఇటువంటి దుర్మార్గాలను ఆపలేనప్పుడు సమాజం బాధ్యత ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు మహిళా రైతుల ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి. ప్రభుత్వం వాటిని రద్దు చేయాలి, రాష్ట్రపతి తిరస్కరించాలి.
నులివెచ్చని ఎండ నా ఎదురుగా ఉన్న గుట్టకు వింత రంగులు పులుముతోంది. గుట్ట మీద సుపరిచితమైన దృశ్యం. కమానుతో కూడిన ద్వారబంధం. అందులోంచి లీలగా కనిపిస్తున్న ఒక స్మారక స్థూపం. పుస్తకాల్లో, సినిమాల్లో, ఆన్‌లైన్లలో చూసిన దృశ్యం. ఇప్పుడు కళ్ళముందు కనపడేసరికి వెన్నులో గగుర్పాటు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన సౌత్ డకోటాలోని ”వూండెడ్ నీ” మెమోరియల్ అది. సరిగ్గా చెప్పాలంటే, లకోట (సూ) ఉప తెగల్లో ఒకటైన ఒగ్లాల లకోట తెగకు చెందిన ఫైన్ రిడ్జ్ రిజర్వేషన్‌లో మారణకాండ జరిగిన చోటు.
బ్రిటిషాంధ్రలో మహిళా చైతన్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరిసింది. పలువురు స్త్రీలు 20వ శతాబ్ది ప్రారంభం నుండి స్పష్టమైన స్త్రీవాద భావజాలంతో రచనలు చేయడం ప్రారంభించారు. 1920ల్లో వీరి రచనలు పదును సంతరించుకున్నాయి. వివిధ స్త్రీల పత్రికల్లో రచనలు చేసిన స్త్రీలు పితృస్వామ్య భావజాలాన్ని సూటిగా ప్రశ్నించి జెండర్ న్యాయాన్ని బలంగా ప్రతిపాదించారు. ఈ విధంగా పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నించి దానికి వెన్నుదన్నుగా ఉంటున్న హిందూ మతాన్ని విమర్శకు పెట్టిన వారిలో ప్రముఖురాలు పూర్తిగా మరుగున పడిన స్త్రీ వాది అయిన శ్రీమతి వి.సరస్వతి.
ఇతరుల దృష్టిలో
ఐటి ఉద్యోగులు
స్వదేశంలోనే
ప్రవాసులు!
ఒకప్పుడు మాటల్లో
ఫోన్ హ్యాంగ్ అయ్యేది
నేడు ఫోన్‌కే హ్యాంగ్ అయ్యారు
ఆమె…
స్వర్గంలో ఉండనీ
నరకంలో ఉండనీ…
ఆకాశంలో ఉండనీ
పాతాళంలో ఉండనీ…
ఆమె…
ఎడారుల్లో ఉండనీ
మైదానాల్లో విహరించనీ…
ఈ కరోనా సమయంలో ఆటలు, పాటలు బాలానందాలు ఏమీ లేవు. అందుకు సంతోషం, ఆనందం మొత్తంగా తగ్గింది. ఇవన్నీ మేము మిస్సయిపోయాము. ఈ కరోనా వల్ల మాకు ఎనిమిది నెలలు బడి ఆగిపోయింది. బాలానందంలో మేము యాంకర్స్‌గా, చిన్నపిల్లలను అందంగా అలంకరించడం, వాళ్ళు ముద్దుముద్దుగా కనిపించడం జరిగేది. ఇప్పుడు అదంతా పోయింది. ఆటల పోటీల్లో బాగా ఆనందంగా స్నేహితులతో కలిసి ఆడుకునేవాళ్ళం. ఈ కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలి, కాబట్టి మేము ఇంటిముందే ఒకరు, ఇద్దరు, ముగ్గురితో కలిసి ఆడుకున్నాం. అదే మాకు కొంత ఆనందాన్ని ఇస్తుండేది. దీంతో ఏ రోజూ మా మనసులో చింత అనేది ఉండేది కాదు అప్పటి రోజుల్లో (కరోనా రాకముందు). ఇప్పుడు బడికి వెళ్తున్నాను కాబట్టి నేను కొంత సంతోంగానే ఉన్నాను.
ఈ సంవత్సరం నేను మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమా లను మిస్సయ్యాను. ఇంకా చిన్న పిల్లలు పాల్గొనే బాలానందంలో మేము చాలా ఎంజాయ్ చేస్తాము, అనేక ప్రదర్శనలలో పాల్గొంటాము. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు సైన్స్ ఫెయిర్, ఇంకా మన మంగళగిరి గ్రంథాలయంలో రచనలు రాశాము. ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా చాలా రకాల వాటిలో పాల్గొన్నాము. ఈ సంవత్సరం ఇవన్నీ లేవు. స్పోర్ట్స్ డే రోజున చాలా ఆనందంగా, సంతోషంగా గెలవాలనే పట్టుదలతో ఎన్నో రకాల ఆటలు ఆడతాము.